ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వినాయక చవితి' ప్రారంభం కానుంది. మరి కొన్ని రోజులు దేశం మొత్తం వాడవాడల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా గణేష్ ఉత్సవాల్లో మునిగి తేలుతారు. గత ఏడాది ఈ పండుగ సందర్భంగా రూ. 300 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది ఎంత బిజినెస్ జరగవచ్చు? ఎలాంటి వస్తువుల వ్యాపారం ఎక్కువగా ఉంటుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సిఏఐటి రిపోర్ట్..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అందించిన సమాచారం ప్రకారం.. ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహాల బిజినెస్ రూ. 20 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. గతంలో చైనా నుంచి విగ్రహాలు దిగుమతయ్యేవి, కానీ క్రమంగా వీటి దిగుమతి భాగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో బిజినెస్ ఊపందుకుంది.
ప్రస్తుతం మన దేశంలో పర్యావరణాన్ని కలుషితం చేయకూడదనే ఉద్దేశ్యంతో మట్టి, ఆవు పేడతో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి నిమజ్జనం కూడా చాలా సులభంగా ఉంటుంది. విగ్రహాలు తయారు చేసేవారు సంవత్సరం పొడువునా.. లేదా కొన్ని నెలలు అదేపనిలో నిమగ్నమైపోతారు. అయితే వినాయక చవితి ప్రారంభానికి ముందే దేశంలో బిజినెస్ మొదలైపోతుంది.
ఇదీ చదవండి: మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు.. హోండా, కేటీఎమ్, కవాసకి
ఈ ఏడాది కూడా అప్పుడే పండుగ శోభ మొదలైపోయింది.. హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసిన వినాయక విగ్రహాలు ఏర్పాటు వేగంగా జరుగుతోంది. కేవలం విగ్రహాలు మాత్రమే కాకుండా పూజా సామగ్రి, అలంకార వస్తువుల వ్యాపారం కూడా బాగా ఊపందుకుంటాయి. కొంతమంది బంగారం కొనుగోలు చేయడం కూడా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా గణేష్ చతుర్థి సందర్భంగా కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ ఏడాది గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment