ఇత్తడి ఆభరణాలపై బంగారపు పూత పూసి అమ్ముతున్న ఓ ముఠాను అరెస్ట్ చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈస్ట్‌జోన్ జోన్ డీసీపీ.
హైదరాబాద్ : ఇత్తడి ఆభరణాలపై బంగారపు పూత పూసి అమ్ముతున్న ఓ ముఠాను అరెస్ట్ చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈస్ట్‌జోన్ జోన్ డీసీపీ. ఈ ఘటనకు సంబంధమున్న 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.3.9 లక్షల నగదు, 15 కేజీల బంగారపు పూత నగలను, 11 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మరో దొంగతనం కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, వారి నుంచి రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.