తూచ్.. బంగారం కాదు | brass.. not gold | Sakshi
Sakshi News home page

తూచ్.. బంగారం కాదు

Published Fri, Feb 6 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

తూచ్.. బంగారం కాదు

తూచ్.. బంగారం కాదు

 ఈ ఫొటోను చూడండి.. ఏదో జరిగినట్లు జనం రోడ్డు మీద గుంపులు..గుంపులుగా ఉన్నారు కదూ..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లి, తిప్పర్తి మండలాల పరిధిలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై గురువారం పలువురు వాహనదారులు, స్థానికులు బంగారు పూత పూసిన ముక్కలను సేకరిస్తూ ఇలా కనిపించారు. ఆ ముక్కలను కొందరు స్థానిక బంగారు నగల తయారీదారుడి వద్దకు తీసుకెళ్లారు. వాటిని పరీక్షించిన సదరు దుకాణదారుడు బంగారం కాదు.. ఇత్తడి ముక్కలని చెప్పడంతో అవాక్కయ్యారు. ఆ ముక్కలు ఇళ్ల ఫ్లోరింగ్‌లో మెరుపు కోసం వాడతారని తెలియడంతో పెదవి విరుచుకుంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.   
  - మిర్యాలగూడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement