ఇంటి అలంకరణలో హస్తకళల శోభే వేరు! ఆ జాబితాలో ‘సుజానీ’నీ చేర్చొచ్చు. అత్యంత లగ్జూరియస్ ఆర్ట్‌గా భావించే ఈ కళ ఆల్‌టైమ్ హోమ్ డెకర్‌గా పేరొందింది. ముఖ్యంగా సోఫా కుషన్స్, బెడ్ స్ప్రెడ్స్ మీద సుజానీ అమితంగా ఆకట్టుకుంటుంది.
మధ్య ఆసియాలోని శతాబ్దాల కిందటి ఎంబ్రాయిడరీ కళే ‘సుజానీ’. సుజానీ అంటే పార్శీలో ‘సూది’ అని అర్థం. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల సంచార తెగలలో పుట్టిన కళ ఇది. అక్కడి సంప్రదాయ వస్త్రాలపైన ఈ కళను చూస్తాం.
ఒక బెడ్ స్ప్రెడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ పూర్తి చేయడానికి కనీసం 40 గంటల సమయం పడుతుంది. కళాకారుల నైపుణ్యం, అంకితభావం ఈ డిజైన్లలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. గతకాలపు కథలతో.. గొప్పదైన వారసత్వంతో.. ముచ్చటగొలిపే ఈ ఎంబ్రాయిడరీ వస్త్రాలను సుజానీ రెట్రో కలెక్షన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.
ఇవి చదవండి: ప్లాస్టిక్ ట్యూబ్స్ డిస్పెన్సర్ హోల్డర్..
Comments
Please login to add a commentAdd a comment