CM Jagan Good Gesture at Vijayawada Independence Day Celebrations - Sakshi
Sakshi News home page

వీడియో: గౌరవం చేతల్లోనూ.. కిందపడిపోతే స్వయంగా అందించిన సీఎం జగన్‌

Published Tue, Aug 15 2023 3:32 PM | Last Updated on Tue, Aug 15 2023 3:45 PM

CM Jagan Good Gesture At Vijayawada Independence Day Celebrations - Sakshi

సాక్షి, కృష్ణా: ఎదుటివారిని వాళ్ల వాళ్ల అర్హతను బట్టి గౌరవించడం, ప్రేమించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రత్యేకత. మాటల్లోనే కాదు.. ఒక్కోసారి చేతల్లోనూ అది చూపిస్తుంటారాయన. అందుకోసం తన స్థాయిని పక్కనపెట్టి మరీ ఆయన ఓ మెట్టు కిందకు దిగుతుంటారు కూడా.  తాజాగా.. 

మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ పలువురు పోలీసు సిబ్బందికి పోలీస్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్‌ అధికారికి మెడల్‌ కిందపడిపోయింది. అది గమనించకుండా ఆయన వెళ్లిపోసాగాడు. అయితే.. 

సీఎం జగన్‌ అది గమనించి ఆయన్ని ఆపారు. కిందకు దిగి ఆపి మరీ ఆ పోలీసుకు మెడల్‌ను తీసి మళ్లీ  ఆ అధికారి గుండెలకు అంటించారు. ప్రస్తుతం ఈ వీడియో జగనన్న అభిమానుల నుంచి విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement