
సింధు సంచలనం
రియో డి జెనీరో: విమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఇహాన్ ను మట్టికరిపించి సంచల విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఇహాన్ తో తలపడిన సింధు 22-20, 21-19 లతో వరుస సెట్లలో విజయాన్ని సాధించింది.
మొదటి సెట్ ప్రారంభంలో కొద్దిగా తడబాటుకు గురైన సింధు వేగంగా పుంజుకుని సెట్ ను గెలుచుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న రెండో సెట్ లో సింధు ఆది నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్ ను కోల్పొయిన వాంగ్ రెండో సెట్ లో టెంపర్ మెంట్ ను కోల్పొయినట్లు అనిపించింది. వరుసగా సింధుకి అవకాశాలిచ్చిన వాంగ్ రెండో సెట్ లో సగం వరకూ రెండు పాయింట్ల వెనకంజలోనే ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సింధు పత్యర్ధిని మట్టికరిపించి సెమీ ఫైనల్ లోకి ప్రవేశించింది.