విమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఇహాన్ ను మట్టికరిపించి సంచల విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఇహాన్ తో తలపడిన సింధు 22-20, 21-19 లతో వరుస సెట్లలో విజయాన్ని సాధించింది.