రియో ఒలింపిక్స్‌లో పతకాల కోసం భారతీయులు కళ్లు కాయలు గాచేలా ఎదురుచూస్తే.. ఇద్దరు అమ్మాయిలు ఆ లోటును తీర్చారు. మొదట రెజ్లర్ సాక్షి మాలిక్ గొప్ప పోరాటపటిమతో కాంస్య పతకాన్ని సాధిస్తే.. ఆ తర్వాత షట్లర్ పీవీ సింధు స్ఫూర్తిదాయక పోరాటంతో రజతాన్ని కైవసం చేసుకుంది.