నా గన్‌ లైసెన్స్‌ ఎప్పుడో రద్దయింది | must come with gold medal | Sakshi
Sakshi News home page

నా గన్‌ లైసెన్స్‌ ఎప్పుడో రద్దయింది

Sep 29 2016 1:54 AM | Updated on Sep 4 2017 3:24 PM

నా గన్‌ లైసెన్స్‌ ఎప్పుడో రద్దయింది

నా గన్‌ లైసెన్స్‌ ఎప్పుడో రద్దయింది

ఆత్మరక్షణ కోసం నేను కొనుగోలు చేసిన గన్‌ను ప్రభుత్వానికి ఎప్పుడో సరెండర్‌ చేశాను.



నయీమ్‌ కేసుకు గన్‌ లైసెన్స్‌ రద్ధుకు ఎలాంటి సంబంధం లేదు
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నయీమ్‌తో సంబంధాలు వెలుగులోకి వస్తాయి
నా పై హత్యకు కుట్ర పన్నారు  
 దుబ్బాక నర్సింహారెడ్డి
నల్లగొండ: ‘ఆత్మరక్షణ కోసం నేను కొనుగోలు చేసిన గన్‌ను ప్రభుత్వానికి ఎప్పుడో సరెండర్‌ చేశాను. నా గన్‌ లైసెన్స్‌ ఎప్పుడో రద్దు అయింది. నయీమ్‌ కేసుకు నా గన్‌ లైసెన్స్‌ రద్దుకావడానికి ఎలాంటి సంబంధం లేదు’ అని టీఆర్‌ఎస్‌ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుబ్బాక నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీమ్‌తో సంబంధాలు కలిగిఉన్నట్లు ఆ కారణంగానే ప్రభుత్వం నా గన్‌ లైసెన్స్‌ రద్దు చేసినట్లు’ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను హత్య చేయించడానికి కోమటరెడ్డి బ్రదర్స్‌ పథకం పన్నారని దాంతో ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం నుంచి గన్‌లైసెన్స్‌ పొందినట్లు దుబ్బాక పేర్కొన్నారు. నయీమ్‌తో సంబంధాలు కలిగినట్లు విచారణలో తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో నయీమ్‌ భౌతికంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గెలుపునకు పనిచేశారని, నల్లగొండను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేశారాని ఆరో పించారు. నయీమ్‌ అనుచరుడు యూసుఫ్‌ సహకారంతో టీఆర్‌ఎస్‌ నాయకులను బెదిరింపులకు పాల్పపడ్డారని, ముస్లింసోదరులను చంపుతామని బెదిరించాడని తెలిపారు. నయీమ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సంబంధాలు ఉన్నాయని సిట్‌విచారణలోత్వరలోనే అవన్నీ వెలు గులోకి వస్తాయన్నారు. మంత్రి జగదీష్‌ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపడుతున్నందున ఓర్వలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నైతికదెబ్బతీసేందుకే తన పై దుష్ప్రచారం చేస్తున్నారని దుబ్బాక విమర్శించారు. నయీమ్‌ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం ఉన్నా బాధితులు తన పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అబ్బగోనిరమేష్‌ గౌడ్, బషీర్, పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement