raghuveer reddy
-
రఘువీర్‌రెడ్డి రికార్డు మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు నమోదైంది. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డికి 7,84,337 ఓట్లురాగా.. సమీప బీజే పీ అభ్యర్థి సైదిరెడ్డికి 2,24,431 ఓట్లు వచ్చాయి. అంటే రఘువీర్‌రెడ్డి 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ. ఇంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు 3,97,029 ఓట్ల మెజారిటీ లభించింది. అయి తే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ గెలిచిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక అదే ఎన్నికల్లో వరంగల్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (బీఆర్ఎస్) 3,92,574 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా విజ యం సాధించిన పసునూరి దయాకర్‌కు 3,50,298 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేస్తూ రఘువీర్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ.. ఉమ్మడి రాష్ట్రంలో పరిశీలిస్తే.. అత్యధిక మెజారిటీ మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నర్సింహారావు పేరిట ఉంది. 1991 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీచేసి 5,80,297 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత 2011 కడప లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 5,45,672 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. -
నల్గొండ: కాంగ్రెస్ అభ్యర్తి రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం
సాక్షి,నల్గొండ: నల్లగొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కందూరు రఘవీర్‌రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తి కాగా.. 5,52,659 ఓట్లతో భారీ ఆధిక్యంతో రఘువీర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డికి ఇప్పటివరకు 1,59,864 పైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.మరో పార్టీ బీఆర్ఎస్ అభ్యర్తి కంచర్ల కృష్ణారెడ్డికి 219605 ఓట్లు వచ్చాయి. తండ్రి జానా రెడ్డి అండదండలతో బరిలో దిగిన రఘువీర్ రెడ్డి తొలి ఎన్నికల పోటీలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీతో భారి గెలుపును నమోదు చేయటం గమనార్హం. -
నల్లగొండ..నెగ్గేదెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని సాగునీటి కోసం బ్యాలెట్ యుద్ధం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్‌చారి ఇలా.. ఎందులో చూసినా నల్లగొండ జిల్లాది ప్రత్యేకస్థానం. 1940లోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, 1952 తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికైన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్ భవనాన్నే ప్రారంభించారు.అలాంటి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు కమ్యూనిస్టు పార్టీ, రెండుసార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి, పీడీఎఫ్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించగా, భీంరెడ్డి నర్సింహారెడ్డి రద్దయిన మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన సూదిని జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు.సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండపై క్రమంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే నల్లగొండలో గెలుపొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2014, 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుందూరు రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.నాలుగోసారి కూడా తామే నల్లగొండలో పాగా వేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్చార్జ్గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేసిందంటూ విమర్శిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.బోణీ కొట్టేందుకు బీఆర్ఎస్బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా 2014, 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినా, ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అడ్డు కోలేకపోయింది. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్య ర్థులే విజయం సాధించారు. అదే తరహాలో ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ముందుకు సాగుతోంది.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 పథ కాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో భారీ సభ నిర్వహించడం, ఆ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల్లోనూ ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఇటీవల మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నీ తానై ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారు.మోదీ చరిష్మా, పాలకుల వైఫల్యాలే గెలిపిస్తాయంటున్న బీజేపీనల్లగొండ పార్లమెంట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు. అప్పట్లో ఓరుగంటి రాములు ఎంపీగా పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి లాంటి పెద్ద నాయకులు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం దేశంలో మోదీ చరిష్మా కొనసాగుతోంది. రామమందిర నిర్మాణం చేపట్టడం, అక్కడ తలంబ్రాల బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం హిందువుల్లో బీజేపీ వైపు మళ్లారన్న ధీమాతో బీజేపీ ఉంది.ప్రధానంగా యువత అంతా మోదీ ఆకర్షణలో ఉన్నారని, ఆ మోదీ చరి ష్మాతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజ యం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్లగొండలో ప్రచారం చేయబోతున్నారు.ముగ్గురూ కొత్త వారే..నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి ముగ్గురు కొత్త అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆయన తండ్రి, మాజీ మంత్రి జానారెడ్డి అండదండలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ కూడా కొత్త అభ్యర్థినే పోటీలోకి దింపింది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈయన కూడా ఎక్కడా పోటీ చేయలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన 2018లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ప్రభావితం చేసే అంశాలు∗ రైతులు, సాగునీరు, ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు∗ ఎంపీ సెగ్మెంట్లో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఓట్లే కీలకం∗ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు∗ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేయకపోవడం∗ నెల్లికల్లు లిఫ్ట్, బ్రాహ్మణవెల్లెంల, డిండి తదితర పెండింగ్ ప్రాజెక్టులు2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లునలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) 5,26,028 (44.73 శాతం)వేమిరెడ్డి నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 5,00,346 (42.55 శాతం)గార్లపాటి జితేంద్రకుమార్ (బీజేపీ) 52,709 (4.48 శాతం)అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు ఇలా..నియోజకవర్గం పురుషులు స్త్రీలుదేవరకొండ(ఎస్టీ) 1,31,659 1,30,392 నాగార్జునసాగర్ 1,15,710 1,20,464 మిర్యాలగూడ 1,15,543 1,20,299హుజూర్నగర్ 1,21,667 1,29,164 కోదాడ 1,19,068 1,25,878 సూర్యాపేట 1,18,770 1,24,893నల్లగొండ 1,21,079 1,27,766మొత్తం 8,43,496 8,78,856 -
కుందూరు రఘువీర్‌రెడ్డి ఆస్తులు రూ.32 కోట్లు
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా.. తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రఘువీర్‌రెడ్డి వివిద బ్యాంకుల్లో రూ.17,41,50,500 అప్పు తీసుకున్నట్లు చూపగా.. భార్య పేరున రూ.25,29,000 అప్పులు ఉన్నట్లుగా చూపించారు. -
రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం
రామగిరి (నల్లగొండ): తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పారీ్టలో గ్రూపుల్లేవనీ, ఏక్నాథ్ షిండేలూ లేరని వ్యాఖ్యానించారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో కలసి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఎవరెన్ని మాటలు చెప్పినా రేవంత్‌రెడ్డి ఇంకోసారి సీఎంగా కొనసాగుతారన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐదు గ్రూపులు ఉన్నాయంటూ హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సీనియర్ నాయకుల సలహాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కటిగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంకోసారి అలా మాట్లాడొద్దు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాల గురించి కానీ, గ్రూపులు ఉన్నాయని కానీ ఇంకోసారి మాట్లాడొద్దని హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. అలానే అకారణ విషయాల్లో తన పేరు ప్రస్తావించొద్దని సూచించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతున్న బీజేపీ, బీఆర్ఎస్లు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలవాలని సవాల్ విసిరారు. షిండేల సృష్టి బీజేపీ పనే కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని మహేశ్వర్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందనీ... మహారాష్ట్రలో అధికారం కోసం ఏక్నాథ్ షిండేలను సృష్టించిన ఘనత బీజేపీదేనని ఆయన నిందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించి కిషన్‌రెడ్డిని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కులమతాల మధ్య ఘర్షణలు పెట్టి 370 నుంచి 400 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ కలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎంపీగా కుందూరు రఘువీర్‌రెడ్డిని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. -
పటేల్ రమేష్‌రెడ్డికి హామీ ఇచ్చినా.. కుందూరు రఘువీర్‌రెడ్డికే టికెట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేసింది. కుందూరు రఘువీర్‌రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో నల్లగొండ అభ్యర్థి పేరును కూడా వెల్లడించింది. భువనగిరి ఎంపీ సీటు విషయాన్ని పెండింగ్‌లో పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిత్వాల విషయంలో నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జానారెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పించుకున్నారు. జయవీర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత జానారెడ్డి లేదా రఘువీర్రెడ్డిలలో ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం సాగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ కోసం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి పోటీపడ్డారు. అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో రమేష్‌రెడ్డి అలకబూనగా ఎంపీ టికెట్ ఇస్తామని మల్లు రవితోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా అప్పుడు హామీ ఇచ్చారు. అయితే, పటేల్ రమేష్‌రెడ్డికి టికెట్ ఇస్తారని భావించినా ఆ తరువాత జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి పేర్లే తెరపైకి వచ్చాయి. వీరితో పాటు పలువురు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డికి జానారెడ్డి, అయన కుమారులతో మంచి సంబంధాలు ఉండటంతో అధిష్టానం రఘువీర్‌రెడ్డి అభ్యర్థితాన్ని ఖరారు చేసింది. జానారెడ్డి తాను అనుకున్నట్లుగా పెద్ద కుమారుడికి నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఇప్పించుకోవడం ద్వారా తన ఇరువురు కుమారులకు రాజకీయంగా బాటలు వేసినట్లయింది. పెండింగ్‌లో భువనగిరి అభ్యర్థి పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. దానిని ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. కోమటిరెడ్డి సోదరులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేశారు. కోమటిరెడ్డి సూర్యపవన్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి పోటీచేస్తారన్న చర్చ సాగింది. ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదని ప్రకటించారు. దీంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు టీపీసీసీ నాయకుడు పున్నా కై లాష్ నేత, చెవిటి వెంకన్న, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజేపీ అక్కడ బీసీ అభ్యర్థి, గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఆలోచనల్లో పడ్డాయి. అక్కడ బీసీ అభ్యర్థిని పోటీలో నిలుపాలా.. ఓసీ అభ్యర్థిని నిలపాలా అన్న ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది. పేరు: కుందూరు రఘువీర్ రెడ్డి తండ్రి: కుందూరు జానారెడ్డి వయస్సు: 44 (02–01–1980) విద్యార్హత: డిగ్రీ, వృత్తి: వ్యాపారం భార్య పేరు: లక్ష్మి పిల్లలు: ఈశాన్వి, గౌతమ్‌రెడ్డి పార్టీ పదవులు : 2009లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యుడు 2014, 2018లో పీసీసీ సభ్యుడు 2021లో పీసీసీ జనరల్ సెక్రటరీ -
ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీ దుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2021లో రాజమండ్రి ఇంటలిజెన్స్ విభాగంలో ఉత్తమ సేవలను అందించిన ఎస్పీని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం మెడల్ అందజేసి అభినందించారు. ఎస్పీ సర్వీసులో కొన్ని ముఖ్యమైన అంశాలు ► సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై లోతైన విచారణ చేశారు. 2019లో మంటూరు (దేవీపట్నం) పడవ ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విశ్లేషణ, ఉదాసీనత కలిగిన ప్రభుత్వోద్యోగులు, ప్రమాదం సంభవించకుండా ఉండుటలో ప్రధాన పాత్ర పోషించారు. ► గోదావరి జిల్లాల్లోని పేదలకు, రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజనులకు వైద్య, ఆరోగ్య సదుపాయాలపై విశ్లేషణ, మెడికల్ కాలేజీ, మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు ఆవశ్యకతపై చర్యలను ప్రభుత్వానికి సూచించారు. ► అన్నవరం దేవస్థానం పాలనాపరమైన ఆరోపణలపై విచారణ చేశారు. ► గోదావరి జిల్లాల్లో జరుగుతున్న నకిలీ పాస్‌పోర్టు మోసాలపై కొన్ని ఆధారాలతో పాటు ఆధారాలతో అప్రమత్తం చేశారు. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్ల్లో ఇసుక రవాణా ప్రధాన సమస్య. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి, పారదర్శకతను కొనసాగించడానికి, ఇసుక రవాణాపై నిశిత నిఘా ఉంచారు. -
మెనిస్కస్ బ్యాంకు అంటే..? మన ఇండియాలో ఎందుకు లేవు
-
సాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఇది కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ తరఫున బరిలో నిలబడి విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ జానా రెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన తనయుడు రఘువీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘సాగర్’లో పోటీకి.. నన్నెవరూ అడగలేదు) ఈ నేపథ్యంలో నేడు జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు. అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ప్రకటించారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: కుందూరు రఘువీర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు.. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై రఘువీర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇక దీనిలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానా రెడ్డి కుమారుడిగా తాను అందరికి సుపరిచితుడనని.. తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల వారు గెలుపు పై రకరకాలుగా విషప్రచారానికి తెర తీస్తున్నారు. ఇది చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతగా తాను కోరేది ఒక్కటే అని.. నోముల నర్సింహయ్య సంతాప దినాలు పూర్తయ్యేవరకు రాజకీయాలు పక్కకు పెట్టాలని రఘువీర్ రెడ్డి సూచించారు. (చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!) తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని మండి పడ్డారు. సోషల్ మీడియాలో, మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలను ఏ ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విలువలు కల్గిన రాజకీయాలతో ప్రజలతోనే తన జీవిత ప్రయాణమని తెలియజేశారు రఘువీర్ రెడ్డి. -
రాహుల్ గాంధీని కలిసిన జానారెడ్డి కుమారుడు
సాక్షి, న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న స్థానాలకు టికెట్ ఆశిస్తున్న పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్, అద్దంకి దయాకర్లతో పాటు ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు ఉన్నారు. రాహుల్ వీరితో పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకరిపై ఒకరు పోటీకి దిగవద్దని రాహుల్ వారికి సూచించారు. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేయాలని కోరారు. మరోవైపు ఇప్పటికే రెండు జాబితాల్లో 75 స్థానాలకు టికెట్లను ప్రకటించిన కాంగ్రెస్.. శనివారం మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. ‘ఆదిలాబాద్, ఖమ్మం జిలాల్ల అభ్యర్థులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇవ్వనున్నట్టు రాహుల్ తెలిపారు. ఇల్లందు, తుంగతుర్తి, హుజురాబాద్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సంబంధించి రాహుల్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. గెలిచే అవకాశాలు, అక్కడి స్థానిక పరిస్థితుల గురించి నాయకులతో చర్చించారు. రేపు మిగతా స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామ’ని తెలిపారు. -
రాహుల్ గాంధీని పోరాడమంటాం: రఘువీరా
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా వస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హైదరాబాద్ నుంచి రాహల్ గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ విజయవాడలో రైల్వే స్టేషన్ నుంచి జింకానా గ్రౌండ్స్ వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి రఘువీరారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, ఏపీలో కూడా అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దుకు డిమాండ్ చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, సీపీఎస్ నిర్బంధంగా అమలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. అక్టోబర్ 2 లోపు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ఉద్యోగులతో పాటు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పోరాటం చెయ్యాలని కోరతామని వెల్లడించారు. -
అనంతలో ప్రారంభమై.. అంతటా విస్తరించి..
- పేద కూలీలకు పట్టెడన్నం పెట్టిన ఉపాధి హామీ పథకానికి పదేళ్లు - మహానేత వైఎస్సార్ చొరవతో కరువుసీమ అనంతలో ప్రారంభం.. ఆపై దేశమంతటా అమలు - ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏను నీరుకార్చుతోందన్న కాంగ్రెస్ - ఫిబ్రవరి 2న బండ్లపల్లికి రాహుల్ గాంధీ: పీసీసీ చీఫ్ రఘువీరా వెల్లడి 2004.. పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతూ తెలుగు ప్రజలు మహానేత వైఎస్సార్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అప్పటికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు. అందులో ప్రధానమైనది రాయలసీమలో ఆకలిచావులు. ఏ ఒక్కరూ ఆకలితో బాధ పడకూడదనే తన ఆశయాన్ని కేంద్రానికి వివరించిన వైఎస్సార్.. ప్రతిష్ఠాత్మక ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదట రాయలసీమలోనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. 2005, ఫిబ్రవరి 2.. భారతదేశ చరిత్రలో పేరెన్నికగల పథకాల్లో అగ్రభాగాన నిలిచే ఉపాధి హామీ పథకం ప్రారంభమైనరోజు. వైఎస్సార్ అభ్యర్థన మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి(బండమీదపల్లి)లో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉపాధిహామీ దేశమంతటా విస్తరించింది. మహానేత కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ఏపీలోనే పథకం విజయవంతంగా నడిచింది. పేద కూలీలకు పట్టెడన్నం దొరికినట్టైంది. ఏపీలో ఈ పథకం జోరు చూసిన తర్వాతే ఉపాధి హామీని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మహానేత అకాలమరణంతో పేదవాడికి కూడుపెట్టే ఈ పథకం క్రమంగా నిర్వీర్యమవుతూవచ్చింది. ప్రస్తుతం అధికారంలోఉన్న టీడీపీ సర్కారు ఉపాధి హామీపై కించిత్ శ్రద్ధయినా చూపకపోవడంతో మళ్లీ అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో ఆకలిచావులు నమోదవుతున్నాయి. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరైతే ఏకంగా ఉపాధి హామీ పథకాన్నే ఎత్తేస్తారేమోననేంత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లికి రానున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆ పథకాన్ని నేటి ఎన్డీఏ సర్కార్ నీరుగార్చుతున్నదని, భవిష్యత్తులో కూడా ఉపాధి హామీ చట్టం అమలయ్యేందుకు పోరాటాలు చేస్తామని రాహుల్.. కూలీలకు ధైర్యం చెబుతారని రఘువీరా వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 6000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపునకు గురైయ్యారని, జాబ్ కార్డులు ఉండీ, పనులు అడిగినవారికి ఉపాధి చూపించడంలేదని ఆ కారణంగా మళ్లీ వసలు ప్రారంభమయ్యాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 4 లక్షల మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోయారని రఘువీరా చెప్పారు. బండ్లపల్లిలో నిర్వహించే సభకు రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి కూడా కూలీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌లో భారీ నియామకాలు
జాబితాను విడుదల చేసిన ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధిష్టానం కొత్త నియామకాలు చేపట్టింది. ప్రధాన కార్యదర్శులుగా 26 మందికి, 12 జిల్లాలకు అధ్యక్షులనూ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరో 12 మంది నియమితులయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదించిన జాబితాను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం విడుదల చేశారు. ప్రధాన కార్యదర్శులు వీరే.. కిల్లి రామ్మోహన్ రావు, యడ్ల రమణ మూర్తి, ద్రోణంరాజు శ్రీనివాసరావు, గిడుగు రుద్రరాజు, జంగా గౌతం, పంతం నానాజి(వేంకటేశ్వరరావు), ఎస్.ఎన్.రాజ, మార్టిన్ లూథర్, ఎన్.రాజీవ్ రతన్, ఎన్.నరసింహారావు, ఆకుల శ్రీనివాసకుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, కె.రమాదేవి, వై.వేంకటేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, సూరిబాబు, కాసు మహేశ్వరరెడ్డి, మోపిదేవి శ్రీనివాసరావు, నేదురమల్లి రామ్ కుమార్‌రెడ్డి, పనబాక క్రిష్ణయ్య, నందిమండలం భాను శ్రీ, ఎ.సుజాతమ్మ, షహజాన్ బాష, వి.ఎస్.ఎస్.ఇందిర, ప్రభాకర్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.టి.సుబ్బిరామిరెడ్డిని కోశాధికారిగా నియమించారు. 12 జిల్లాలకు కొత్త డీసీసీలు కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులుగా డి.జగన్మోహన్రావు(శ్రీకాకుళం), పి.విజయకుమార్(విజయనగరం), పసుపులేటి బాలరాజు(విశాఖపట్నం), కందుల దుర్గేష్(తూర్పు గోదావరి), రఫీహుల్లా బేగ్(పశ్చిమ గోదావరి), కడియాల బుచ్చిబాబు(కృష్ణా), ఎం.మల్లికార్జునరావు(గుంటూరు), ఎం.ఉగ్రనరసింహారెడ్డి(ప్రకాశం), బి.వై.రామయ్య(కర్నూలు), నజీర్ అహ్మద్(కడప), కోటా సత్యనారాయణ(అనంతపురం), కె.వేణుగోపాల్‌రెడ్డి(చిత్తూరు)లను నియమించారు.నెల్లూరుకు ప్రస్తుత ఇన్చార్జి ధనుంజయరెడ్డిని కొనసాగించనున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు.: సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బెహరా భాస్కరరావు(విశాఖపట్నం), కంపర రమేష్(కాకినాడ), ఎన్.వి.శ్రీనివాస్(రాజమండ్రి), రాజనాల రామ్మోహనరావు(ఏలూరు), మల్లాది విష్ణువర్ధన్(విజయవాడ), ఎస్.కె.మస్తాన్ వలి(గుంటూరు), టి.శ్రీపతిప్రకాశ్(ఒంగోలు), ఎ.సి.సుబ్బారెడ్డి (నెల్లూరు), బండి జక్రయ్య(కడప), ఎం.సుధాకర బాబు(కర్నూలు), షాలి దాదా గాంధీ(అనంతపురం), ఎం.నరసింహులునాయుడు (చిత్తూరు)ను నియమించారు. -
50 మందితో ఏపీ పీసీసీ తొలిజాబితా
నేడు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీలో చర్చ హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ (సీమాంధ్ర) ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పీసీసీ సిద్ధం చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు సంబంధించి దాదాపు 50 మంది పేర్లతో తొలి జాబితాను ఒకటి రెండురోజుల్లోనే విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి ఈ సమావే శంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. 32 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలతో పాటు గతంలో పోటీచేసి ఓడిపోయినవారిలో సీనియర్ల పేర్లను కూడా తొలిజాబితాలో ప్రకటించవచ్చని చెబుతున్నారు. తొలి జాబితాలో 8 మంది ఎంపీలు: సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిదింటికి ప్రస్తుత ఎంపీల పేర్లనే పార్టీ అధిష్టానం ఖరారు చేయవచ్చంటున్నారు. పీసీసీ నుంచి ఆ స్థానాలకు ఒక్కొక్కరి పేర్లు సూచించింది. కిల్లి కృపారాణి (శ్రీకాకుళం), బొత్స ఝాన్సీ (విజయనగరం), వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ (అరకు), పళ్లంరాజు (కాకినాడ), కనుమూరి బాపిరాజు (నర్సాపురం), పనబాక లక్ష్మి (బాపట్ల), కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (కర్నూలు), చింతామోహన్ (తిరుపతి)ల పేర్లను తొలిజాబితాలో ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లు సిద్ధంగానే ఉన్నా తొలిజాబితాలో ఈ 8మంది పేర్లే ఉండనున్నాయి. -
ఫిబ్రవరిలో రెవెన్యూ సదస్సులు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: ఫిబ్రవరిలో చేపట్టబోయే రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు మంత్రి, సీసీఎల్ఏ కమిషనర్ కృష్ణరావుతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సదస్సుల్లో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. సదస్సు నిర్వహణ షెడ్యుల్ ఈనెల 31లోగా తయారు చేయాలని సూచించారు. సదస్సుల నిర్వహణకు ముందు గ్రామాల్లో ప్రచారం కల్పించాలన్నారు. కరపత్రాలు పంపిణీ చేసి సదస్సుల నిర్వహణ గురించి తెలియజేయాలన్నారు. సదస్సులు ప్రారంభం రోజున మంత్రులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న వీఆర్ఏ, వీఆర్వో పరీక్షలకు పోలీసు బందోబస్తు పకడ్బందీంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో శ్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. వీఆర్ఏ, వీఆర్వో అభ్యర్థుల సమస్యలు పరిష్కరించండి.. జిల్లాలో వీఆర్ఏ, వీఆర్వో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లాలోని పది ప్రాంతాల్లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశామని కలెక్టర్ అహ్మద్‌బాబు మంత్రికి వివరించారు. కాగా అభ్యర్థులకు వీఆర్వో పరీక్ష ఓ ప్రాంతంలో, వీఆర్ఏ పరీక్ష మరో ప్రాంతంలో హాల్టికేట్లు జారీ చేసినందున దాదాపు 100 మంది మధ్యాహ్నం జరిగే పరీక్ష రాయలేకపోతున్నారని, వీటిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనికి స్పందించిన సీసీఎల్ఏ కమిషనర్ అలాంటి అభ్యర్థుల వివరాలు సేకరించి పంపించాలని, అలాంటి వారికి ఒకేచోట పరీక్ష రాసేవిధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీఆర్ఏ, వీఆర్వో పరీక్ష కేంద్రాలు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించబడిన అభ్యర్థులు జనవరి 25లోగా జిల్లా రెవెన్యూ అధికారికి వివరాలు సమర్పించాలని అభ్యర్థులకు కలెక్టర్ తెలిపారు. వీఆర్ఏ, వీఆర్వో పరీక్ష రాసే అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోగ్రఫీలు పరీక్ష కేంద్రాల్లో సేకరిచబడుతాయన్నారు. ఈ సమావేశంలో ఓఎస్డీ పనసారెడ్డి, డీఆర్ఓ ఎస్ఎస్ రాజు, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, ఎన్నికల తహశీల్దార్ కిషన్, కలెక్టరేట్ ఏవో సంజయ పాల్గొన్నారు. -
రేసు గుర్రం... ఎవరు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలే గడువు ఉన్న నేపథ్యంలో జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో రోజురోజుకూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి నియోజకవర్గాల్లో వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నా.. ఈ చర్చ జరగడం విశేషం. ప్రత్యేకించి నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశమే ఎక్కువగా ప్రచారంలో ఉంది. వాస్తవానికి నల్లగొండ సీటు అధికార కాంగ్రెస్ చేతిలోనే ఉంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా, ఈసారి ఎవరు పోటీచేస్తారన్న వార్త ప్రచారంలోకి రావడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి శాసనసభకు వెళ్లాలన్న వ్యూహంతో ఉన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో బలంగా ముద్ర వేసేందుకు సహకార ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను బాగానే వాడుకున్నారు. ఆయన ప్రయత్నాలను గమనించిన ఎవరైనా ఈసారి ఎమ్మెల్యే పదవికే పోటీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి రేసులో ఉండేది ఎవరన్న ప్రశ్నకు.. జిల్లా కాంగ్రెస్ వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుఖేందర్‌రెడ్డి పోటీ చేయని పక్షంలో, మంత్రి జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, జానారెడ్డి తయుడు రఘువీర్‌రెడ్డి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ వర్గాలు సరైన విశ్లేషణనే ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే పక్షంలో సీఎం పోస్టు రేసులో ఉన్న మంత్రి జానారెడ్డి కచ్చితంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీచేస్తారని చెబుతున్నారు. అపుడు, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీచేయడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు. జానారెడ్డి నాగార్జున సాగర్ , సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే, నల్లగొండ ఎంపీ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఈసారి జానారెడ్డి పార్లమెంటుకు వెళ్లేందుకు నల్లగొండ లోక్‌సభా స్థానాన్ని ఎంచుకోవచ్చని, అపుడు ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ పరిణామాలేవీ జరగకుండా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ స్థానం బరిలోనే ఉంటే, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి పోటీ ఉంటుందని అంటున్నారు. కొన్ని సంవ త్సరాలుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి జానారెడ్డి తన అనుయాయులకే ఇప్పించుకుంటున్నారు. ఈసారి అదే జరిగితే ఆయన తనయుడి వైపు మొగ్గు చూపుతారా..? లేక, పార్టీలోని మరెవరైనా సీనియర్‌ను ఎంచుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితినే ఎదుర్కునే అవకాశాలే ఎక్కువగా ఉన్నందున తెలంగాణ ప్రాంతంలోని ఒక్కో ఎంపీ సీటు ఎంతో కీలకమవుతుందని, అలాంటప్పుడు ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ బరిలోకి దింపుతుందని కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి నల్లగొండ ఎంపీ సీటు విషయం ఇపుడు కాంగ్రెస్‌లో రక రకాల వార్తల ప్రచారానికి కారణమవుతోంది. -
సంక్రాంతి కోడిపందాలపై ప్రత్యేక దృష్టి
నరసాపురం రూరల్ , న్యూస్‌లైన్ : రానున్న సంక్రాంతి పర్వదినాల్లో కోడిపందాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. ఇందుకోసం గ్రామాల వారీ బీట్ కు కానిస్టేబుళ్లను నియమిస్తామన్నారు. ఆదివారం నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీకి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడిపందాలను నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, రాత్రివేళల్లో కానిస్టేబుళ్ల బీట్లు ముమ్మరం చేశామన్నారు. తొలుత ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. విలేజ్ విజిటింగ్‌పై దృష్టి సారించి రానున్న రోజుల్లో నేరాలు అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందిని కూడా పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందుతున్న 150 మంది ఎస్సైలు జనవరిలో విధుల్లో చేరతారన్నారు. దొంగనోట్ల చలామణిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీఐజీ సమాధానమిస్తూ ఈ వ్యవహారం ఏలూరు రేంజ్ పరిధికి మాత్రమే సంబంధించింది కాదని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే కొంత వరకు సమాచారం లభించిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి నకిలీ కరెన్సీ వస్తోందన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే ఇక్కడకు వచ్చానని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కేసులను పరీశీలించేందుకు సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. మెరైన్ పోలీస్ స్టేషన్ విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని, కృష్ణాజిల్లా పాలకాయతిప్ప గ్రామంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఒకటి నిర్మాణంలో ఉందన్నారు. ఆయన వెంట డీఎస్పీ రఘువీర్‌రెడ్డి, సీఐ నాగమురళి, రూరల్ ఎస్సై గుజ్జర్లపూ డి దాసు, మొగల్తూరు ఎస్సై ఆకుల రఘు ఉన్నారు.