నల్గొండ: భారీ లీడింగ్‌లో రఘువీర్‌ రెడ్డి | Congress Candidate Raghuveer Reddy Leads In Nalgonda Lok Sabha Seat Updates | Sakshi
Sakshi News home page

నల్గొండ: కాంగ్రెస్‌ అభ్యర్తి రఘువీర్‌ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం

Published Tue, Jun 4 2024 12:32 PM | Last Updated on Tue, Jun 4 2024 3:07 PM

Congress Candidate Raghuveer Reddy Leads In Nalgonda Lok Sabha Seat Updates

సాక్షి,నల్గొండ: నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కందూరు రఘవీర్‌రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్‌ పూర్తి కాగా.. 5,52,659 ఓట్లతో భారీ ఆధిక్యంతో రఘువీర్‌ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డికి ఇప్పటివరకు 1,59,864 పైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

మరో పార్టీ బీఆర్ఎస్ అభ్యర్తి కంచర్ల కృష్ణారెడ్డికి 219605 ఓట్లు వచ్చాయి. తండ్రి జానా రెడ్డి అండదండలతో బరిలో దిగిన రఘువీర్‌ రెడ్డి తొలి ఎన్నికల పోటీలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీతో భారి గెలుపును నమోదు చేయటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement