హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేసిన సీఐడీ
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును అభ్యర్థించింది. ఈమేరకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్‌పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు.
వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టును సీఐడీ కోరింది. కుక్కల విద్యాసాగర్‌తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్‌ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు సైతం పాలుపంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2న చేపట్టనుంది.
విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దు..
జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సీఐడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment