జత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులకు ముందస్తు బెయిల్‌ | Anticipatory Bail Granted For IPS Officers In Kadambari Jatwani Case, More Details Inside | Sakshi
Sakshi News home page

జత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులకు ముందస్తు బెయిల్‌

Published Tue, Jan 7 2025 10:47 AM | Last Updated on Tue, Jan 7 2025 11:39 AM

IPS Officer Granted Anticipatory Bail in Kadambari Jatwani Case

సాక్షి, అమరావతి:  సినీ నటి జత్వానీ (kadambari jethwani) కేసులో ఐపీఎస్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులకు హైకోర్టు (andhra pradesh high court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐపీఎస్ కాంతి రాణా టాటా, విశాల్ గున్నితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు అధికారులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు (anticipatory bail) చేస్తూ తీర్పు వెల్లడించింది.

మంగళవారం జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ,న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 

గత విచారణలో  
కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్‌ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే వివరించారు.

జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌ కుమార్‌ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు.

విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?

జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. 

కాదంబరి జత్వానీ కేసులో.. ఐపీఎస్ లకు ఊరట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement