సాక్షి, గుంటూరు: చట్ట ప్రకారమే యలమంద నాయక్‌ను అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులపై నిరాధార ఆరోపణలు చేశారని.. యలమంద నాయక్ మద్యం కేసులో అరెస్టయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘‘ నాయక్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారనేది అవాస్తవం. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే అరెస్టు చేశాం. నిందితుడిని పోలీసులు వేధిస్తే న్యాయమూర్తికి చెప్పుకునేవారు కదా. ‘50 సీఆర్పీసీ’ కింద కుటుంబ సభ్యులకు ముందుగానే నోటీసులిచ్చాం. రాజకీయ మైలేజీ కోసం మాపై దుష్ప్రచారం చేయొద్దు. (చదవండి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు)
ఇలాంటి ఆరోపణలు వల్ల పోలీసులపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. సీఆర్పీసీ యాక్టు ప్రకారమే మేము పని చేస్తున్నాం. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని’’ ఎస్పీ స్పష్టం చేశారు. అరెస్టయిన 15 రోజుల తర్వాత నిందితుడు ఆరోపించడం సరికాదన్నారు. పని తీరు సరిగ్గా లేకే గురజాల డీఎస్పీ, సీఐ సస్పెన్షన్ చేశామని తెలిపారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో సరైన పురోగతి లేనందునే చర్యలు తీసుకున్నామని, వీరిద్దరి సస్పెన్షన్లో వేరే ఎలాంటి కోణం లేదని ఎస్పీ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. (చదవండి: ‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment