yalamanda nayak
-
అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!
సాక్షి, గుంటూరు: చట్ట ప్రకారమే యలమంద నాయక్‌ను అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులపై నిరాధార ఆరోపణలు చేశారని.. యలమంద నాయక్ మద్యం కేసులో అరెస్టయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘‘ నాయక్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారనేది అవాస్తవం. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే అరెస్టు చేశాం. నిందితుడిని పోలీసులు వేధిస్తే న్యాయమూర్తికి చెప్పుకునేవారు కదా. ‘50 సీఆర్పీసీ’ కింద కుటుంబ సభ్యులకు ముందుగానే నోటీసులిచ్చాం. రాజకీయ మైలేజీ కోసం మాపై దుష్ప్రచారం చేయొద్దు. (చదవండి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు) ఇలాంటి ఆరోపణలు వల్ల పోలీసులపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. సీఆర్పీసీ యాక్టు ప్రకారమే మేము పని చేస్తున్నాం. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని’’ ఎస్పీ స్పష్టం చేశారు. అరెస్టయిన 15 రోజుల తర్వాత నిందితుడు ఆరోపించడం సరికాదన్నారు. పని తీరు సరిగ్గా లేకే గురజాల డీఎస్పీ, సీఐ సస్పెన్షన్ చేశామని తెలిపారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో సరైన పురోగతి లేనందునే చర్యలు తీసుకున్నామని, వీరిద్దరి సస్పెన్షన్‌లో వేరే ఎలాంటి కోణం లేదని ఎస్పీ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. (చదవండి: ‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’) -
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీలో నియామకాలు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీలో భాగంగా ఉన్న రాష్ర్ట ట్రేడ్ యూనియన్ సెల్లో పలు నియమకాలు చేపట్టారు. ఈ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యలమంద నాయక్, కార్యదర్శులుగా రాచకొండ సత్తిరాజు, కె.అప్పారావు, సాంబయ్యగౌడ్, జి.భాస్కరరావు, సుదర్శన్, ప్రచార కార్యదర్శులుగా డాన్సి చంద్రశేఖర్, ఎండీ అక్రం పాషా, రామ్‌దాస్, జీవితయ్య, సి. చంద్రశేఖరరెడ్డి దామోదర్రావులను నియమించారు. రంగారెడ్డి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మురళీకృష్ణ, మెదక్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పి.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్ర భిక్షపతి వారిని నియమించినట్లు పార్టీ కార్యాలయం పేర్కొంది. కాగా, పార్టీ రాష్ట్ర ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్ల ఫోరం అధ్యక్షుడిగా పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డిని నియమించారు.