వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీలో నియామకాలు | ysrcp nominates tenagana committe members | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీలో నియామకాలు

Published Wed, Aug 17 2016 1:53 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీలో నియామకాలు - Sakshi

వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీలో నియామకాలు

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీలో భాగంగా ఉన్న రాష్ర్ట ట్రేడ్ యూనియన్ సెల్‌లో పలు నియమకాలు చేపట్టారు. ఈ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యలమంద నాయక్, కార్యదర్శులుగా రాచకొండ సత్తిరాజు, కె.అప్పారావు, సాంబయ్యగౌడ్, జి.భాస్కరరావు, సుదర్శన్, ప్రచార కార్యదర్శులుగా డాన్సి చంద్రశేఖర్, ఎండీ అక్రం పాషా, రామ్‌దాస్, జీవితయ్య, సి. చంద్రశేఖరరెడ్డి దామోదర్‌రావులను నియమించారు.

రంగారెడ్డి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మురళీకృష్ణ, మెదక్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పి.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్ర భిక్షపతి వారిని నియమించినట్లు పార్టీ కార్యాలయం పేర్కొంది. కాగా, పార్టీ రాష్ట్ర ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్ల ఫోరం అధ్యక్షుడిగా పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement