ఐదేళ్ల కిందట ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో జరిగిన బాంబు పేలుళ్లకు ముందు వాటికి బాధ్యత వహిస్తూ ఈమెయిల్స్ పంపిన కేసులో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన వారుగా అనుమానిస్తున్న 23 మందిపై ఇక్కడి కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీంతో వీరిపై విచారణకు మార్గం సుగమమైంది. వీరు పేలుళ్లకు ముందే ముంబై నుంచి మీడియా సంస్థలకు, ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపినట్లు ఆరోపణలున్నాయి. ముంబై పోలీసులు అరెస్టు చేసిన వీరితోపాటు, పరారీలో ఉన్న రియాజ్, ఇక్బాల్ భత్కల్ సహా ఐదుగురిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం కోర్టు జడ్జి ‘దేశంపై యుద్ధం’ తదితర 29 నేరాల కింద అభియోగాలు నమోదు చేశారు.