సాక్షి, హైదరాబాద్ : శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Shocked at the malicious terrorist attacks in Srilanka. Strongly condemn this heinous act, & stand in solidarity with Srilanka at this distressing time. My prayers for the bereaved families and those injured in the blasts.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 21 April 2019
కాగా కొలంబోలో జరిగిన వరుస బాంబు దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. అయితే శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లలో 207మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటన చేసింది. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు శ్రీలంకలో పేలుళ్ల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఘటనపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ నేత శశిథరూర్ సహా పలువురు పేలుళ్లను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. శ్రీలంకలో ఉగ్రఘాతుకాన్ని తీవ్రస్థాయిలో ఖండించిన ప్రధాని మోదీ.. మృతులకు సంతాపం ప్రకటించారు. లంకకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment