దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
ఢిల్లీ : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్‌సుఖ్‌నగర్ కేసులో ఇప్పటిదాకా రియాజ్ మినహా మిగతా వారంతా అరెస్ట్ అయ్యారు. యాసిన్ భత్కల్ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు.
కాగా 2013 ఫిబ్రవరి 21 దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్‌లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది.
భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్‌ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు.