Tehseen Akhtar
-
పాట్నా పేలుళ్ల అనుమానితులు అరెస్ట్
రాంచీ : నరేంద్ర మోడీ టార్గెట్‌గా జరిగిన పాట్నా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 27 బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ హుంకార్ ర్యాలీ నిర్వహించింది. మోడీ ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రధాన వక్తగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించిన అనుమానితులుగా భావిస్తున్న హైదర్ అలీ, నుమస్, తౌఫిక్, ముజిబుల్లాను అరెస్ట్ చేశారు. -
తహ్సీన్ అక్తర్‌కు ఏప్రిల్ 2 వరకు రిమాండ్
ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది తహ్సీన్ అక్తర్ అలియాస్ మోనును ఏప్రిల్ 2వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని ఢిల్లీ కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. దేశంలోని వివిధ నగరాలలో బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న తహ్సీన్ అక్తర్‌ను నిన్న ఇండో-నేపాల్ సరిహద్దు డార్జిలింగ్ జిల్లాలోని కకర్విట్టా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహ్సీన్ ను దేశ రాజధాని తరలించారు. బుధవారం ఉదయం అతడిని పోలీసులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో అతడికి వచ్చే నెల 2వ తేదీ వరకు న్యాయమూర్తి పోలీసు రిమాండ్ విధించారు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లతో సంబంధాలున్న తహ్సీన్ ను ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో అక్తర్ మూడో నిందితుడిగా ఉన్న విషయం విదితమే. ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌తోపాటు మరోకరిని దేశ సరిహద్దుల్లో గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
ఢిల్లీ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్సుఖ్నగర్ కేసులో ఇప్పటిదాకా రియాజ్ మినహా మిగతా వారంతా అరెస్ట్ అయ్యారు. యాసిన్ భత్కల్ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు. -
దిల్సుఖ్నగర్ పాత్రధారే పాట్నా సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో పాత్రధారిగా ఉన్న తెహసీన్ అక్తర్.. అక్టోబర్ 27 నాటికి పాట్నా పేలుళ్లలో సూత్రధారిగా మారాడు! ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ వాసిమ్ అక్తర్ షేక్ అలియాస్ మోను అలియాస్ హసన్ (23) స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఉన్న మనియార్పూర్ గ్రామం. కంప్యూటర్ విద్యను అభ్యసించిన మోను గతంలో నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)లో కీలకపాత్ర పోషించాడు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ ద్వారా ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతడి ఆదేశాల మేరకే అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (గత ఆగస్టులో యాసీన్ భత్కల్‌తో పాటు బీహార్‌లో అరెస్టయిన ఉగ్రవాది)తో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్సుఖ్నగర్ పేలుళ్లకు రంగంలోకి దిగాడు. హడ్డీ, వఖాస్‌లతో కలిసి నగరంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫిబ్రవరి 21న సైకిల్‌పై పెట్టుకున్న బాంబును ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద వదిలి వెళ్లాడు. 2011లో ముంబై వరుస పేలుళ్లు, వారణాసి పేలుళ్ల కేసులో కూడా తెహసీన్ నిందితుడు. ఆయా కేసులకు సంబంధించి ఎన్ఐఏ గత కొన్ని నెలల్లో పదిసార్లకు పైగా అతడి స్వగ్రామంలో గాలింపు చేపట్టింది. అతడిపై అరెస్ట్ వారంట్ జారీచేసిన ఎన్ఐఏ.. ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల బహుమతి కూడా ప్రకటించింది. అయినా ఫలితం దక్కలేదు. -
పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల సూత్రధారిని పోలీసులు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన తెహసీన్ అక్తర్ ఈ పేలుళ్ళకు ప్రధాన సూత్రధారని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. పేలుళ్ళకు ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ వాడారు. ప్రతి బాంబులోనూ అరకేజీ పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. అటు పేలుళ్ళ మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుళ్ళ ఘటనలో గాయపడ్డ అనుమానితుడు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు సంబంధించి ముందే అప్రమత్తం చేశామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మరోవైపు నిన్న అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఇక బీహార్ పోలీసులు పేలుళ్లపై ఆరా తీస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.