రాంచీ : నరేంద్ర మోడీ టార్గెట్‌గా జరిగిన పాట్నా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 27 బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ హుంకార్ ర్యాలీ నిర్వహించింది. మోడీ ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రధాన వక్తగా హాజరైన విషయం తెలిసిందే.
ఈ సందర్బంగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించిన అనుమానితులుగా భావిస్తున్న హైదర్ అలీ, నుమస్, తౌఫిక్, ముజిబుల్లాను అరెస్ట్ చేశారు.