పాట్నా పేలుళ్ల నిందితుడి మృతి
బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ఆదివారం సాయంత్రం వరకు ఐదుగురు మరణించినట్టు వార్తలు రాగా.. పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు అమరుస్తున్న సమయంలో పేలుడుకు తీవ్రంగా గాయపడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి అదే రోజు రాత్రి మరణించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ పేలుళ్లో మరో 83 మంది గాయపడ్డారు. వీరిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొన్న ర్యాలీ ఆరంభానికి ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్లో ఓ బాంబు పేలగా, ర్యాలీ వేదిక గాంధీ మైదాన్ సమీపంలో మరో ఆరు బాంబులు పేలాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మరో ఆరు బాంబులను నిర్వీర్యం చేశారు.