పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్
Published Mon, Oct 28 2013 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల సూత్రధారిని పోలీసులు గుర్తించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన తెహసీన్ అక్తర్ ఈ పేలుళ్ళకు ప్రధాన సూత్రధారని తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. పేలుళ్ళకు ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ వాడారు. ప్రతి బాంబులోనూ అరకేజీ పేలుడు పదార్ధాలు ఉపయోగించారు.
అటు పేలుళ్ళ మృతుల సంఖ్య ఆరుకు చేరింది. పేలుళ్ళ ఘటనలో గాయపడ్డ అనుమానితుడు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు సంబంధించి ముందే అప్రమత్తం చేశామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మరోవైపు నిన్న అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఇక బీహార్ పోలీసులు పేలుళ్లపై ఆరా తీస్తున్నారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
Advertisement