దరా: తిరుగుబాటుదారుల అధీనంలోని దక్షిణ సిరియా వైమానిక దాడులతో దద్దరిల్లింది. రెండు వారాలుగా కొనసాగుతున్న దాడులను ప్రభుత్వ అనుకూల బలగాలు గురువారం తీవ్రతరం చేశాయి. రష్యా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలు బుధవారం విఫలమయ్యాయి. ఫలితంగా జరిగిన తాజా దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని, వేల మంది స్వస్థలాలు విడిచి వెళ్తున్నారని వార్తలు వెలువడ్డాయి. సాయిదా పట్టణంలో మహిళ, నలుగురు పిల్లలు సహా ఆరుగురు మృతిచెందినట్లు తెలి సింది. సిరియా, రష్యా బలగాలు ఉమ్మడిగా ఈ ఆప రేషన్‌ను నిర్వహిస్తున్నాయి. దరా ప్రావిన్స్‌లోని టఫా స్, జోర్డాన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో బుధ వారం రాత్రి నుంచి శక్తిమంతమైన క్షిపణులు, క్రూడ్ బ్యారె ల్ బాంబులతో దాడులు చేస్తున్నారని సిరియా లో సేవలందిస్తున్న మానవ హక్కుల సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment