ఇరాక్ రాజధాని బాగ్దాద్లో శుక్రవారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న రెండు బాంబులు శుక్రవారం నాడు సఫారర్త్ జిల్లాలోని అలీ మసీదు సమీపంలో పేలాయి. పశ్చిమ బాగ్దాద్లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉంటారని, పోలీసులు తెలిపారు.
శుక్రవారం నాడు ఇమాం అలీ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సున్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ బాంబుదాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇరాక్లో హింసాత్మక సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన సంఘటనలలో ఏడు వేల మంది ఇరాకీలు మరణించగా 16 వేల మందికి పైగా గాయపడ్డారు.
బాగ్దాద్లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి
Published Fri, Nov 8 2013 7:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement