twin blasts
-
భద్రత మధ్య జోడో యాత్ర
సాంబా (జమ్మూకశ్మీర్): జమ్ములో జంటపేలుళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆదివారం ఉదయం కథువా నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మధ్యాహ్నానికి సాంబా జిల్లాలోని చక్ నానక్‌కు చేరుకుంది. షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది.సోమవారం మధ్యాహ్నానికి రాహుల్ గాంధీ జమ్ము చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. రాహుల్ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న ఆయన ఈ యాత్రతో బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. విద్వేషాలు సృష్టిస్తున్నారు: రాజ్‌నాథ్ రాహుల్ గాంధీ అధికారం కోసం ప్రజల్లో విద్వేషాలను సృష్టిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. రాహుల్ వల్ల అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు. ఆదివారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ప్రజాభిమానం, నమ్మకం పొందడం ద్వారానే అధికారం లభిస్తుందని ఆయన అన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు.. ఆరుగురు పౌరులకు గాయాలు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నర్వాల్‌లో శనివారం ఉదయం జంట పేలుళ్లు జరిగాయి. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. వరుస పేలుళ్లలో ఆరుగుగు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుళ్లు బాంబుల వల్ల జరిగాయా? లేక ఇతర కారణాలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు దీన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. నర్వాల్ ప్రాంతాన్ని దిగ్భంధించి తనిఖీలు చేపట్టారు. నర్వాల్ ఏరియా రోజంతా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాహనాల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. కార్ల విడి భాగాలు, రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఓ వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లోనే కొనసాగుతున్న తరుణంలో ఈ పేలుడు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో నిఘా పెంచారు. చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బీర్ తాగుతూ బిల్డప్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. -
ఇద్దరికి ఉరిశిక్ష..ఒకరికి యావజ్జీవం
-
ఇద్దరికి ఉరి.. ఒకరికి యావజ్జీవం
సాక్షి, హైదరాబాద్ : లుంబినీపార్క్, గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలిగొన్న అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులైన వీరిద్దరినీ గత వారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, సోమవారం హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం వంటి నేరాల కింద ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే ఒక్కొక్కరికీ రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాక హత్యయత్నం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, కుట్ర కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, పేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చట్టం కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దోషులది ఆవేశపూరిత చర్య ఎంత మాత్రం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని న్యాయస్థానం స్పష్టం చేసింది. భారీగా ప్రజల ప్రాణాలు తీసి దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని తెలిపింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న లక్ష్యంతో కుట్రపూరితంగా వ్యవహరించారనేందుకు సైతం ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలను చూపగలిగిందని స్పష్టం చేసింది. దోషులు అత్యంత హేయమని చర్యలకు పాల్పడ్డారని, అందువల్ల ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా భావిస్తూ దోషులిద్దరికీ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు సంస్థ తమను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించిందన్న దోషుల వాదనకు ఆధారాలు లేవని తేల్చింది. అలాగే ఈ దోషులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్‌ను సైతం దోషిగా నిర్ధారిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్ధోషులుగా తేల్చిన షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్‌కు బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రియాజ్ బత్కల్, ఇక్బాల్ బత్కల్, అమీర్ రజాఖాన్ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిపై ఉన్న కేసును విడగొట్టి మిగిలిన వారిపై న్యాయస్థానం విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన 11 ఏళ్ల తరువాత కేసులో తీర్పు వెలువడటం విశేషం. తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అలాగే తీర్పు వెలువరించిన జడ్జి శ్రీనివాసరావు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేశారు. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని నిందితుల తరుఫు న్యాయవాది గందం గురుమూర్తి పేర్కొన్నారు. ఉరిశిక్షపై హైకోర్టు నిర్ణయం... అనీక్, ఇస్మాయిల్ చౌదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసేంత వరకు ఉరిశిక్ష అమలుకు అవకాశమే లేదు. ఉరిశిక్ష తీర్పు వెలువరించిన జడ్జి తానిచ్చిన తీర్పుతో పాటు ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను హైకోర్టుకు పంపుతారు. ఉరిశిక్ష వ్యవహారాల్లో తన ముందుకు వచ్చిన కేసులపై హైకోర్టు విచారణ జరుపుతుంది. దీనిని రెఫర్ ట్రయిల్ అంటారు. అలాగే కింది కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. రెఫర్ ట్రయిల్‌తో పాటు దోషులు దాఖలు చేసే అప్పీళ్లపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జరుపుతుంది. తెలిసి చేయలేదు.. రోబోల్లా పనిచేశారు... శిక్ష ఖరారుకు ముందు అనీక్, ఇస్మాయిల్ చౌదరిల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వీరిద్దరూ తెలిసి బాంబు పేలుళ్లకు పాల్పడలేదని, రోబోల్లా తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఈ వాదనను జడ్జి తోసిపుచ్చారు. ఈ వాదన ద్వారా దోషులు తమ నేరాన్ని అంగీకరించినట్లయిందన్నారు. దోషులిద్దరూ రోబోలైతే, వారిని ఎవరు నడిపించారో వారి వివరాలిస్తే సరిపోతుందన్నారు. అనంతరం దోషులు కూడా వ్యక్తిగతంగా తమ వాదనను కోర్టు ముందుంచారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని అనీక్ తెలిపాడు. పేలుళ్లతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నాడు. ఇస్మాయిల్ చౌదరి స్పందిస్తూ.. తనకు భార్య, బిడ్డలు ఉన్నారని, తన తల్లి కేన్సర్‌తో బాధపడుతోందని తెలిపాడు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని నివేదించాడు. గత పదేళ్లుగా జైలులో ఉన్నానని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తనపై కరుణ చూపాలని కోర్టును అభ్యర్థించాడు. వీరి వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి... అంతకు ముందు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.సురేంద్ర వాదనలు వినిపిస్తూ, దోషుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. 44 కుటుంబాలు విచ్ఛినమయ్యాయన్నారు. బాంబు పేలుళ్ల వల్ల గాయపడిన వారు ఇప్పటికీ కోలుకోలేదని, బాధను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కట్టుకథలు చెబుతున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఒకరిని హత్య చేస్తేనే న్యాయస్థానాలు ఉరిశిక్ష విధిస్తున్నాయని, 44 మందిని పొట్టనపెట్టుకున్న దోషులకూ అదే సరైన శిక్షని ఆయన విన్నవించారు. ఇదీ జరిగింది... 2007, డిసెంబర్ 25న లుంబనీ పార్క్, గోకుల్ చాట్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేల్చేందుకు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద పెట్టిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబినీ పార్క్ పేలుడులో 12 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. గోకుల్‌చాట్‌లో జరిగిన పేలుళ్లలో 32 మంది మృతి చెందగా, 47 మంది గాయాలపాలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు 1,195 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నిందితులకు సహాయ సహకారాలు అందించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్ పాత్రపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. లుంబినీపార్క్ కేసులో 98 మందిని, గోకుల్‌చాట్ కేసులో 147 మంది, దిల్సుఖ్నగర్ కేసులో 46 మందిని సాకు‡్ష్యలుగా చూపారు. -
కాబూల్‌ను వణికించిన జంటపేలుళ్లు, పలువురి మృతి
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో సుమారు 50 మందికి పైగా మరణించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాల్లో చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ దాడులు తామే చేసినట్లు అఫ్ఘాన్ తాలిబన్లు ప్రకటించుకున్నారు. అఫ్ఘానిస్థాన్ ప్రధాన నిఘా సంస్థ అయిన ఎన్డీఎస్ నుంచి సిబ్బందితో వెళ్తున్న మినీబస్సు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దాంతో 50 మందికి పైగా మరణించగా ఇంకా చాలామంది గాయపడ్డారని అంటున్నారు. చాలా కాలం నుంచి ప్రశాంతంగా ఉంటున్న అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉన్నట్టుండి జరిగిన ఈ దాడితో.. ఒక్కసారిగా కలకలం రేగింది. అందులోనూ బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్నే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. కార్మికులంతా ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దారుల్ అమన్ ప్రాంతంలో ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు చెప్పారు. అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు భవన నిర్మాణానికి భారతదేశమే సాయం చేసిన విషయం తెలిసిందే. మొదటి పేలుడు జరిగిన తర్వాత కొద్దిసేపటికే మరో కారు బాంబు పేలింది. -
జంట బాంబు పేలుళ్లు, 10 మందికిపైగా మృతి
మొగదిషు: సొమాలియాలో ఆదివారం సంభవించిన జంట బాంబుపేలుళ్ల ఘటనలో పదిమందికి పైగా మరణించారు. గాల్కయో పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని రెండు కారు బాంబులను పేల్చారు. దాడి చేసింది తామేనని షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దాడి జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 12 మృతదేహాలను చూసినట్టు స్థానికుడు చెప్పాడు. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సొమాలియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ, పౌరులను లక్ష్యంగా చేసుకుని షబాబ్ ఉగ్రవాద సంస్థ నిత్యం దాడులు చేస్తోంది. -
శాంతి కోసం వెళ్లి శవాలుగా మారారు..
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 95కు చేరింది. ఈ పేలుళ్ల దుర్ఘటనలో మరో 246 మంది గాయపడగా, ఇందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరగడంతో శాంతి కోరుకోవాలంటూ ర్యాలీలో పాల్గొన్న చాలా మంది శవాలుగా మిగిలారు. కానీ, మరణించిన వారి శవాల మధ్య 'శాంతి, ప్రజాస్వామ్యం కావాలి' అని ర్యాలీ కోసం వచ్చిన వారు తీసుకొచ్చిన ప్లకార్డులు పడి ఉండటం చూపరులను కంటతడి పెట్టించక మానదు. శాంతి, ప్రజాస్వామ్యం దేశానికి ఎంతో అవసరమని పేర్కొంటూ తలపెట్టిన ర్యాలీలో పేలుళ్లు జరిగి బీతావహ వాతావరణం నెలకొనడం గమనార్హం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఘటనలో మృతిచెందిన వారి పట్ల సంతాపం ప్రకటించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. -
బాగ్దాద్‌లో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న రెండు బాంబులు శుక్రవారం నాడు సఫారర్త్ జిల్లాలోని అలీ మసీదు సమీపంలో పేలాయి. పశ్చిమ బాగ్దాద్‌లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉంటారని, పోలీసులు తెలిపారు. శుక్రవారం నాడు ఇమాం అలీ మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సున్నీ ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఈ బాంబుదాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇరాక్‌లో హింసాత్మక సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన సంఘటనలలో ఏడు వేల మంది ఇరాకీలు మరణించగా 16 వేల మందికి పైగా గాయపడ్డారు. -
వేగవంతమైన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లపై విచారణ
హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’లు పోలీసులకు పట్టు బడటంతో దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల విచారణ వేగవంతమైంది. పేలుళ్ల సూత్రదారి అసదుల్లా అఖ్తర్‌ను అర్ధరాత్రి పోలీసులు హైదరాబాద్ తరలించారు. పేలుళ్లకు ముందు తాను షెల్టర్ తీసుకొన్న ఇంటిని సోదాచేసి పలు కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం ఉదయాన్నే డిల్లీ తరలించారు. పిటి వారెంట్‌పై పట్టబడిన నిందితులను హైదరాబాద్ తరలించేందుకు రాష్ట్ర పోలీసులు కోర్టును కోరనున్నారు. ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు.