జంట బాంబు పేలుళ్లు, 10 మందికిపైగా మృతి | More than 10 dead in twin blasts in Somalia | Sakshi

జంట బాంబు పేలుళ్లు, 10 మందికిపైగా మృతి

Published Sun, Aug 21 2016 6:09 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

సొమాలియాలో ఆదివారం సంభవించిన జంట బాంబుపేలుళ్ల ఘటనలో పదిమందికి పైగా మరణించారు.

మొగదిషు: సొమాలియాలో ఆదివారం సంభవించిన జంట బాంబుపేలుళ్ల ఘటనలో పదిమందికి పైగా మరణించారు. గాల్కయో పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని రెండు కారు బాంబులను పేల్చారు. దాడి చేసింది తామేనని షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

దాడి జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 12 మృతదేహాలను చూసినట్టు స్థానికుడు చెప్పాడు. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సొమాలియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ, పౌరులను లక్ష్యంగా చేసుకుని షబాబ్ ఉగ్రవాద సంస్థ నిత్యం దాడులు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement