
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నర్వాల్‌లో శనివారం ఉదయం జంట పేలుళ్లు జరిగాయి. ట్రాన్స్‌పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. వరుస పేలుళ్లలో ఆరుగుగు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ పేలుళ్లు బాంబుల వల్ల జరిగాయా? లేక ఇతర కారణాలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు దీన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. నర్వాల్ ప్రాంతాన్ని దిగ్భంధించి తనిఖీలు చేపట్టారు.
నర్వాల్ ఏరియా రోజంతా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాహనాల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. కార్ల విడి భాగాలు, రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం వాహనదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఓ వైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లోనే కొనసాగుతున్న తరుణంలో ఈ పేలుడు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.
చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై బీర్ తాగుతూ బిల్డప్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
Comments
Please login to add a commentAdd a comment