రాయపూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు భద్రత దళాలను లక్ష్యంగా చేసుకుని వేర్వేరు ప్రాంతాలలో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా ఫండ్రీ గ్రామ సమీపంలో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ జవాన్లు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయాని గమనించిన మావోయిస్టులు అప్పటికే ఆ ప్రాంతంలో అమర్చిన బాంబులు పేల్చారు.
అలాగే ఫండ్రీ హీల్స్ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రత దళాలే లక్ష్యంగా బాంబు పేల్చేరు. ఈ రెండు ఘటనలో 199వ బెటాలియన్కు చెందిన ఎస్ఐ బి.బి.ఆయ్, కానిస్టేబుల్ రవి హరి పాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. సహచరులు వెంటనే వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని హెలికాప్టర్లో రాయ్పూర్ తరలించారు. అయితే మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు బీజాపూర్ ఏఎస్పీ ఇంద్ర కల్యాణ్ వెల్లడించారు.