
రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తన భర్త లొంగిపోయిన కారణంగా ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ యాకూబ్ భార్య రహీన్ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో యాకూబ్ ఉరిశిక్ష అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30న అతడికి ఉరిశిక్ష వేయాలని కోర్టు గతంలోనే తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.