Yakub Memon
-
యాకూబ్ మెమన్ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం
ముంబై: ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒక నిందితుడి సమాధిని సుందరీకరించడంపై పెనువివాదం చెలరేగింది. ఈ విషయమై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముంబై పోలీసులను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై సత్వరమే విచారణ చేసి నివేదికను కూడా సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ...పాక్ ఆదేశానుసారం ఉగ్రవాది యాకూబ్ మెమన్ 1993లో ముంబైలో పేలుళ్లును అమలు చేశాడు. అలాంటి వ్యక్తి సమాధిని ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే మజార్‌గా మార్చారని ఆరోపణలు చేశారు. ఇదేనా ఆయనకు ముంబైపై ఉన్న ప్రేమ, దేశభక్తి అని ప్రశ్నించారు. దీనికి థాక్రే క్షమాపణలు చెప్పలంటూ డిమాండ్ చేశారు. అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని కోరారు. వాస్తవానికి మార్చి12, 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సుమారు 257 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసులో యాకుబ్ మెమన్‌కి ఉరిశిక్ష పడింది కూడా. (చదవండి: అమిత్ షాపై ట్రోల్స్... 'ఇండియా బిగ్గెస్ట్ పప్పు' అంటూ...) -
అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : దేశ విచ్ఛిన్నానికి యత్నించిన వ్యక్తులకు మేధావులు మద్ధతు ఇవ్వటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేసే శక్తులకు అండగా నిలుస్తూ.. సొంత సైన్యంపైనే సదరు మేధావులు పోరాటాలు చేయటం దారుణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) మాజీ డైరెక్టర్ జనరల్(తొలి) రాధా వినోద్ రాజు సంస్మరణ సభలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘అసమ్మతికి ఈ దేశంలో చోటు ఉంటుంది. కానీ, దేశ విచ్ఛిన్నాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. అఫ్జల్ గురు, యాకుబ్ మెమోన్ లాంటి వాళ్ల పుట్టిన రోజులు జరపాల్సిన అవసరం మనకు ఏంటి? ఈ విషయంలో కొందరు మేధావుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న అల్లర్లకు రెచ్చగొడుతున్న కొందరు వేర్పాటువాదుల నిజ స్వరూపాన్ని ఎన్ఐఏ బయటపెట్టిందని వెంకయ్య ప్రశంసలు కురిపించారు. అయితే పక్కా ఆధారాలతో వేర్పాటువాదులు పట్టుబడుతున్నప్పటికీ వారికి మద్ధతుగా మేధావులు పోరాటాలు చేస్తున్నారని.. కానీ, సామాన్యుల ప్రాణాలు పోతున్నప్పుడు మాత్రం వాళ్లు కనీసం నోరు కూడా మెదపరని ఆయన తెలిపారు. పైగా దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల మీద, సైన్యం మీద ఆరోపణలు చేస్తూ కాలం గుడుపుతున్నారని.. అయినప్పటికీ ప్రజల నైతిక మద్ధతు మాత్రం సైన్యానికే ఉంటుందన్న విషయాన్ని వాళ్లు(మేధావులు) గుర్తుంచుకుంటే మంచిదని వెంకయ్య సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎన్ఐఏ కీలక అధికారులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం అన్న హత్య
వరంగల్: ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత అన్ననే కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్‌జిల్లా సంగెం మండలం షాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యండీ యాకూబ్(45)ను తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాకూబ్ కేసులో చానళ్లు ‘లక్ష్మణ రేఖ’ దాటాయి: కేంద్రం
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరితీత కేసు కవరేజ్‌లో కొన్ని వార్తా చానళ్లు హద్దులు మీరాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించకుండా వారే స్వీయ నియంత్రణ పాటించాలని బుధవారమిక్కడ ఓ సదస్సులో పేర్కొన్నారు. ఇటీవల పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని తమ శాఖ చేసిన సూచనలను కొన్ని చానళ్లు పెడచెవిన పెట్టాయన్నారు. యాకూబ్ ఉరితీత కేసు కవరేజిలో కొన్ని చానళ్లు లక్ష్మణ రేఖను దాటాయని, టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చోటా షకీల్ (మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు)తో మాట్లాడించాయని అన్నారు. -
‘అధికారుల’ నోళ్లకు తాళాలేవి?
జాతిహితం ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా ఉండిపోకుండా చూడటం ముఖ్యం. రహస్యాలను వెల్లడించడాలు, పునర్విమర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. పరిణతి చెందిన ప్రజాస్వామ్యాలు సైతం వీటికి సంబంధించి నిబంధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతావ్యవస్థలోని ఉన్నతాధికారుల విషయంలో మరీ అవసరం. లేకపోతే భద్రతా అధికారులు వివేచనారాహిత్యంతో అన్నీ బయట పెట్టేయడమనే వైరస్ ప్రబలి అదుపు చేయలేనిదిగా మారే ప్రమాదం ఉంది. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని రామన్ అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీంకోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. ఆయుర్వేదం, యోగ, నయం చేయలేని జీవనశైలి సంబంధమైన వ్యాధు లేవీ లేవని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. ఆయుష్ (ఆయుర్వేదం, యోగ, ప్రకృతి వైద్యం, యునానీ, సిద్ధ, హోమియోపతి) శాఖ సహాయ మం త్రియైన ఆయన ఢిల్లీలో ఈ నెల 14న జరిగిన భారత మహిళా పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. వేదకాలం నుంచి మనకు వార సత్వంగా సంక్రమించిన ఈ అద్భుత చికిత్సలను, స్వస్థతను చేకూర్చగల శక్తు లను ధిక్కరించగల వ్యాధి ఒకటి ఉన్నదని ఆయనకు సూచించాలని ఉబలా టంగా ఉంది. అది మాటల అతి విరేచన వ్యాధి. నేను మాట్లాడేది నానా విధాలైన కాషాయ యోధుల గురించిగానీ, ఎవరో ఓ సాధు లేదా సాధ్వి గురించిగానీ కాదు. కనీసం విచక్షణా రహితంగా నోరు పారేసుకుని మనకు కావాల్సినంత వినోదాన్ని, ప్రధానికి కొంత చికా కును కలిగించే ఓ మంత్రివర్యుల గురించైనా కాదు. తోటి భారతీయుల కంటే మరింత గురుతరమైన, సున్నితమైన పనులను నిర్వహించే బాధ్యతలను నిర్వహించిన వారి గురించి. కీలక రంగాలలో వ్యక్తిగత బాధ్యతతో నిర్వహిం చాల్సిన విధులకు జీవితకాలపు వివేచనాపరత్వం ఆవశ్యకం. అలాంటి విధు లను నిర్వర్తించిన వారే ఈ మాటల అతి విరేచన వ్యాధిగ్రస్తులైతే... అది రేకె త్తించే మహా దుర్భరమైన కంపు మీ నాసికలను, మనస్థితినే కాదు, స్థూలంగా అందరి ప్రయోజనాలను సైత ం పాడుచే సేస్తుందని తెలిసీ అనాగరి కమైన ఇలాంటి భాష వాడుతున్నందుకు మన్నించాలి. పైగా ఈ వ్యాధి, ఆ ముగ్గురూ తమ వృత్తి జీవితాన్ని ఏ ఆశయాలకు అంకితం చేశారో వాటికి సైతం చెరుపు చేసేది. ‘పెద్ద మనుషులు’ కాని ఆ ముగ్గురు ఇక మనం స్వీయాభిప్రాయ సహిత పాత్రికేయ వృత్తిలో రాణించడానికి సంబంధించిన మూడు ప్రాథమిక సూత్రాలకు తిరిగి వచ్చి ఈ తాజా ఉదం తాలను చూద్దాం. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ సభ్యుడు ఆర్కే సింగ్ వ్యవహారాన్ని, ఆ తదుపరి భారత గూఢచార సంస్థ ‘రా’ మాజీ అధిపతి, కశ్మీర్ సమస్యపై మధ్యవర్తులలో ఒకరైన ఏఎస్ దౌలత్, ‘రా’ లోనే కీలక బాధ్యతలను నిర్వహించిన సీనియర్ అధికారి దివంగత బీ రామ న్ల ఉదంతాలను పరిశీలిద్దాం. భద్రతా సంస్థలలో పనిచేసిన ఉన్నతాధికారి పదవీ విరమణానంతరం, ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన వెంటనే ఎలా ప్రవర్తించాలనే విషయానికి సంబంధించి ఈ ముగ్గురూ అతి చెడ్డ ఉదాహర ణలుగా నిలిచారని చెప్పడానికి విచారంగా ఉంది. ‘‘అధికారియైనా పెద్ద మనిషే’’ అనే నానుడి మరీ పాతది. ఆ ముగ్గురు అధికారుల గురించి చర్చిం చేటప్పుడు దాన్ని ప్రయోగించకుండా ఉండటం కోసమే నేను ‘‘అధికారి- పెద్దమనిషి’’ అంటూ ఉద్దేశపూర్వకంగానే రెండు పదాల మధ్య హైఫన్ను ఉంచుతూ కొత్త నానుడిని తయారు చేశాను. ఇది భద్రతా వ్యవస్థలో కీలక బాధ్యతను నిర్వహించిన పోలీసు, సైనిక అధికారులు సహా సీనియర్ ప్రభు త్వాధికారులను కూడా అభివర్ణించేది. ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ, నైతిక బాధ్యతతో తమ జీవితాన్ని అంకితం చేసిన వృత్తికే హాని కలగజేసేలా వంతుల వారీగా బహిరంగంగా మాట్లాడారు. వారలా మాట్లాడటంలో స్థాయి, పద్ధతులకు సంబంధించి తేడాలున్నా అదో ఉన్మాదం కాదనగలిగింది ఏదీ లేదు. అది... గప్పాలు కొడుతూ, వివేకరహితంగా పతాక శీర్షికల కోసం పాకులాడటమే కావచ్చు (సింగ్), మరి కొన్ని కాపీలు అమ్ముకోవడం కోసం కొంత వివాదాన్ని కూడా జోడించమని ప్రచురణకర్తలు తెచ్చిన ఒత్తిడే కావచ్చు (దౌలత్) లేదా పెడదోవబట్టిన అపరాధ భావనతో మానసికంగా ముడుచుకుపోయే వారిలో కనిపించే ‘లీమా సిండ్రోమ్’గా పిలిచే బందీల పట్ల సానుభూతే (రామన్) కావచ్చు. బందీ తనను బంధించిన వ్యక్తితో ప్రేమలో పడటమనే పరిస్థితిని సూచించే ‘స్టాక్‌హోమ్ సిండ్రోమ్’కు సరిగ్గా విరుద్ధమైన పరిస్థితికి ఇటీవలే ఈ ‘లీమా సిండ్రోమ్’ భావనను ప్రవేశపెట్టారు. దీనికి గురైతే మీరు మీ ఖైదీపట్ల సానుభూతిని ప్రదర్శించడం మొదలవుతుంది. వివేక రాహిత్యంతోనే అతి వాగుడు వివేకరాహిత్యపు కొలబద్ధతో ఈ మూడింటినీ కొలవాల్సిన అవసర మేమీలేదు. అలాగే, మాజీ భద్రతా అధికారులు ఇలా బహిరంగంగా రహస్యా లను రచ్చకెక్కించడం ఇదే మొదలనీ కాదు. కాకపోతే ఈ ముగ్గురూ అతి తక్కువ కాలంలోనే, అదీ కూడా ఒకరి కంటే మరొకరు మరింత ఎక్కువగా భారత ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వరుసగా మాట్లాడటంలోని నిజా న్ని రాబట్టడంకోసం అధికారిక రహస్యాలను బట్టబయలు చేసే కృషి కొంత అవసరం. ప్రత్యేకించి నేను ఏమంత జాగ్రత్తగా వ్యవహరించని వ్యాఖ్యాతను. అయినా ఈ విషయంలో ఇతరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రశ్నిస్తున్నట్టుగా కనిపించినా లెక్కచేయను. ఇక కాలక్రమానుసారంగా వెనక్కు తిరిగి చూద్దాం. పాకిస్తాన్‌కు వ్యతి రేకంగా ఇటీవల సింగ్ చేస్తున్న రభస ఎంత యుద్ధోన్మాదభరితంగా ఉందం టే... బహుశా అది శాశ్వత ఆగ్రహోదగ్రులైన వార్తా చానళ్ల తెల్ల మీసాల ఆసా ములలో అభద్రతాభావాన్ని కలిగించి ఉంటుంది. సింగ్ తాజాగా గత వారం ‘‘ఇండియా టుడే టీవీ’’కి చెందిన రాహుల్క న్వల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ... ఆయన ప్రలాపాలన్నిటిలోకీ విభిన్నమైనది. టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా ఆయన 2005లో దావూద్ ఇబ్రహీంను దుబాయ్‌లో హత్య చేయడానికి వేసిన పథకాన్ని ‘‘వెల్లడి చేశారు.’’ దుబాయ్‌లో జరిగే దావూద్ ఇబ్రహీం కుమార్తె మహ్రుఖ్, పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాం దాద్ కుమారుడు జానాయిద్ల వివాహానికి వచ్చినప్పుడు చేయాలని తల పెట్టిన ఈ పథకం అమలుకు పదవీ విరమణ చేసిన అజిత్ దోవల్‌ను రప్పించారని ఆయన తెలిపారు. దోవల్ యూపీఏ హయాంలో 2004-05 మధ్య మన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా పనిచేశారు. ముంబై చీకటి ప్రపంచంలో ‘‘ముస్లిం’’ దావూద్ ఇబ్రహీంకు బద్ధ శత్రువైన ‘‘హిం దూ’’ ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్లు (గురి తప్ప కుండా కాల్చగల నిపుణులు) దుబాయ్‌లో పొంచి ఉండేలా చేయాలని పథకం. బహుశా ఆ పెళ్లి వద్దే దావూద్‌ను అతన్ని పుట్టించిన ఆ పైవాడి దగ్గరకు పంపేయాలనుకున్నారు. సింగ్ కథనం ప్రకారం, ఛోటా షకీల్ ముఠాకు చెందిన ఆ ఇద్దరు షార్ప్ షూటర్లు ఢిల్లీలో ఉన్న విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి వచ్చి వారిని అరెస్టు చేయడంతో ఆ పథకం విఫలమైంది. షకీల్ మనుషుల గురించి ముంబై పోలీసులకు ఎవరో ‘‘ఉప్పందించి’’, వారిని అరెస్టు చేయిం చారని ఆయన వాదన. మన గూఢచారి సంస్థ రచించిన పథకానికి ముంబై పోలీసులు వెన్నుపోటు పొడిచారా, లేదా? దావూద్ ఇబ్రహీం తన శత్రువుకు చెందిన షార్ప్ షూటర్ల జాడను కనిపెట్టి, ముంబై పోలీసులలోని తన మిత్రు లను హెచ్చరించాడా, లేదా? లేకపోతే జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ట్టుగా... కుడి చెయ్యి ఏం చేయనున్నదో ఎడమ చేతికి తెలియకపోవడమే దీనికి కారణమా? ఇక మీరే చర్చించుకోవచ్చు. ఏదేమైనా సింగ్ ప్రలాపనల వల్ల భిన్న స్థాయిల్లో జరగాల్సిన నష్టం జరగనే జరిగిపోయింది. వివేచనే గూఢచార సంస్థలకు ప్రాణం భారత్ తన సొంత పౌరులను విదేశాల్లో హత్యలు చేయించడానికి సైతం వెనుకాడదని ఆయన ప్రపంచానికి చాటారు. దావూద్ కోసం హృదయం ద్రవీ భవించిపోతుండగా భుజానికి సంచీ వేలాడేసుకుతిరిగే విప్లవకారుడివంటూ నన్ను దుమ్మెత్తిపోయడానికి ముందు మీరు ‘‘ద వే ఆఫ్ లైప్’’ పుస్తకాన్ని తిర గేయండి. అది ‘‘న్యూయార్క్ టైమ్స్’’ గూఢచార వ్యవహారాల విలేకరి మార్క్ మాజెట్టీ రచించిన అద్భుతమైన పుస్తకం. అందులో ఆయన అమెరికాకు చెందిన సీఐఏ ఒక గూఢచార సంస్థ నుంచి హత్యా యంత్రంగా పరివర్తన చెందిన వైనాన్ని చిత్రించారు. అయినా ఆ సంస్థ యెమెన్‌లోని అల్ కాయిదా కీలక నేత అన్వర్ అల్ వకీల్‌పై ద్రోన్ దాడికి వచ్చేసరికి... అతగాడు ఆమెరికన్ పౌరుడైనందున అత్యున్నత స్థాయిలో (అధ్యక్షస్థాయి) లోతుగా ఆలోచించి తీసుకునే నిర్ణయం కావాలనుకోవడం విశేష ప్రాముఖ్యం గల విషయం. భారత గూఢచార వ్యవస్థ ఒక మాఫియా ముఠాకు వ్యతిరేకంగా మరో దాన్ని చేరదీస్తుందనే వాస్తవం తెలిసిందే. అయినా ఆ విషయాన్ని ఇంతవరకు ఎన్నడూ లాంఛనంగా అంగీకరించింది లేదు. సింగ్ ఆ పని కూడా చేసేశారు. మంచి లేదా చెడ్డ ఉగ్రవాదులు అంటూ ఉండరని మనం ఎప్పుడూ అంటూ ఉంటాం. అయినా చీకటి ప్రపంచంలో మాత్రం మంచి, చెడ్డా ఉంటాయని ఎలా అనగలం? మూడోది, మీ భూభాగంలో మేం చట్టవిరుద్ధమైన హత్యలకు పథకం పన్నామని చెప్పడం... అప్పుడు యునెటైడ్ ఎమిరేట్స్‌లోనే ఉన్న ప్రధానిని, ఆయన మిత్రులను పూర్తి సంకటస్థితికి నెట్టేసింది. అందుకోసం మనం చీకటి ప్రపంచానికి చెందిన హంతకులను వాడుకోవాలనుకోవడం అతి సులువుగా విదేశీ ఉగ్రవాద చర్య అనిపించుకుంటుంది. సింగ్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా లేదా అనేది నేను ఇదమిత్థంగా చెప్పలేను. నాలుగు, ఆయన ముంబై పోలీసులకు దావూద్ డబ్బు సంచులు అందు తున్నాయని ఆరోపించారు. ఐదు, దోవల్ భారతదేశం తరఫున అత్యంత నమ్మకంగా ఆపరేషన్స్‌ను చేపట్టే వ్యక్తి అని బయటపెట్టారు. తద్వారా సింగ్ నేరుగా ‘‘దోవల్ భారత హమీద్ గుల్’’ (పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతి) అని పనిగట్టుకు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ప్రచార యంత్రాం గానికి తోడ్పడ్డారు. ఆయన తప్పులకు లెక్కలేదు ఆయన వివేకరహితంగా చేసిన పనులను ఎన్నైనా ఇలా లెక్కిస్తూ పోగలం. దీనికి సంబంధంలేనిదే అయినా ఆయనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. నిర్భయ ఘటనపై నిరసన ప్రదర్శల మధ్య ఆయన ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ పోలీసులు ఆందో ళనకారులతో వ్యవహరిస్తున్న తీరును గట్టిగా సమర్థించారు. నిజానికి ఆనాటి ఢిల్లీ పోలీసుల తీరు నేడు వారు మాజీ సైనికాధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు ముందస్తు కసరత్తు మాత్రమే. సింగ్ యూపీఏలో ఉన్నారా లేదా ఎన్డీఏలో ఉన్నారా అనేదానితో నిమిత్తం లేదు. పంజాబీలో అనేట్టుగా లాహోర్‌లో వినాశకారకుడైన వాడు పెషావర్లోనైనా వినాశకారకుడే అవుతాడు. మిగతా ఇద్దరి వ్యవహారానికి వచ్చేసరికి వారికి అనుకూలంగానైనా, ప్రతికూలంగానైనా కూడా వాదించవచ్చు. దౌలత్ కశ్మీర్ చేదు వాస్తవాన్ని బయటపెట్టడం మాత్రమే చేస్తున్నారు, హురియత్ నేతలు దాదాపు అంతా కిరాయికి పనిచేస్తున్నవారే అనే ముఖ్య విషయం కశ్మీర్ ప్రజలకు, మిగతా దేశానికి కూడా రూఢి కావడం ముఖ్యమని వాదించొచ్చు. చిన్నా చితకా ఎత్తుగడలతోనూ, కూటనీతితోనూ, లంచాలు తినిపించడంతోనూ కొంత సమయాన్ని సంపాదించడమనే దాన్ని కొనసాగించడం కశ్మీర్ సమస్యతో వ్యవహరించే వ్యూహంగా ఉంటోంది. దౌలత్ కథనం... ఇది మనగలిగేదేమీ కాదని, నూతన వైఖరికి రూప కల్పన చేయడం అవసరమని ఢిల్లీలోని కొత్త ప్రభుత్వానికి గుర్తు చేసే పద్ధతి కూడా అవుతుంది. ఇక రామన్ విషయానికి వస్తే, ఆయన ఘటికుడైన గూఢచారి అధికారి మాత్రమే కాదు, అంతరాత్మ ఉన్న మనిషి కూడానని మీరనవచ్చు. కస్టడీలో ఉండి సహకరించిన ఉగ్రవాది ప్రాణాలను కాపాడా లని ప్రయత్నం చేయాల్సిన నైతిక బాధ్యత ఆయనకు ఉన్నదనీ వాదిం చవచ్చు. అరెస్టు అయ్యేలా భారత ప్రభుత్వం అతడితో ముందుగా ‘‘మాట్లాడింది’’ కాబట్టి అతని పట్ల దయ చూపాల్సి ఉన్నదనీ అనొచ్చు. కానీ ఆ ఇద్దరు చేసినదీ సమస్యాత్మకమైనదే. ఇద్దరూ ఇప్పుడు నడు స్తున్న పరిణామాలపై ఉన్న ముసుగును తొలగించేశారు. ఒక రహస్య ప్రేమ కార్య కలాపం కథనాన్ని, అది ముగిసిపోయాక తగినంత సమయం గడిచాక, దానివల్ల ఆ వ్యక్తులకు, వారి మిత్రులకు బాధ కలగకుండా వారు గతించాక రాయడం వేరు. రాజకీయవేత్తలు, గూఢచారి అధికారులు, చివరికి పాత్రి కేయులు సైతం మరింత పెద్ద ప్రయోజనం కోసం తమకు సమాచారం అందిం చిన వ్యక్తులు (సోర్స్) ఎవరో ఎప్పటికీ బయటపెట్టరు. ‘వాషింగ్టన్ పోస్ట్’కు చెందిన బాబ్ వుడ్వార్డ్, కార్ల్ బెర్నిస్టీన్లు వాటర్‌గేట్ కుంభకోణాన్ని బయట పెట్టినా, ఆ సమాచారాన్ని అందించిన ‘‘డీప్ థ్రోట్ ’’ ఎవరో ఆయన మరణా నంతరం వరకు వెల్లడించలేదు. నైతిక ధైర్యం లోపించింది రామన్ సైతం తనకు సహకరించిన వ్యక్తుల పేర్లను బయటపెట్టలేదు. కానీ, తాను సైతం నిస్సందేహంగా నేరస్తుడని భావించిన యాకూబ్ మెమెన్ పట్ల ఉదారవాద సానుభూతి పెంపొంద డానికి దోహదపడ్డారు. యాకూబ్ ‘‘భారత వ్యవస్థ’’ చేతుల్లో వంచనకు గురైన బాధితుడనే అభిప్రాయం ముస్లింలలో, ప్రత్యేకించి ముస్లిం యువతలో ఉంది. దానికి రామన్ సామం జస్యాన్ని కల్పించారు కూడా. రామన్ బతికే ఉంటే యాకూబ్‌ను ఒక హీరోగా సమాధి చేయడానికి పోగైన జనాలు ఎలాంటివారో చూసి విచారించి ఉండేవారు. నేడు లేని ఒక వ్యక్తిని గురించి ఇలా అనడం ఇబ్బందికరంగానే ఉన్నా చెప్పక తప్పడం లేదు... రామన్ తానొక నైతికపరమైన పిరికివాడినని రుజువు చేసుకున్నారు. యాకూబ్ ప్రాణాలు కాపాడాలని ఆయన అంత బలంగా భావించి ఉంటే బహిరంగంగానే మాట్లాడాల్సింది. అంతేగానీ ఒక వ్యాసాన్ని రాసి, దాన్ని ప్రచురించకుండా భద్రంగా దాచి ఉంచేవారు కారు. అదొకవేళ మిగతా నిందితుల విచారణకు హాని కలగజేస్తుందని ఆయన భయపడి ఉన్నా, యాకూబ్ శిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించాకనైనా మాట్లాడాల్సింది. కానీ వివేచనతో కూడిన నైతిక ధైర్యం ఆయనకు కొరవడింది. రా వ్యవస్థాప కుడు ఆర్ఎన్ కావో శిష్యుడినంటూ ఆయన తనను తాను ‘‘కావోబాయ్’’గా పిలుచుకున్నారేగానీ అందుకు భిన్నంగా ప్రవర్తించారు. చివరికి ఆయన తన ఆశయానికే తీవ్ర న ష్టం కలగజేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో రహస్యాలు శాశ్వతంగా అలాగే ఉండిపోకుండా చూడటం ముఖ్యమైనది. రహస్యాలను వెల్లడించడాలు, వాటిపై పునర్విమ ర్శలు, వాటికి ప్రతివాదాలు ఆ సంవాదాన్ని సుసంపన్నం చేస్తాయి. అయితే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు సైతం వీటికి సంబంధించి నిబం ధనలను రూపొందించుకోవడం, ప్రత్యేకించి భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధి కారుల విషయంలో మరీ అవసరం. అమెరికాలో ఇలాంటి అనుమతులకు, పరిశీలనకు విస్తృత యంత్రాంగం ఉంది. సీనియర్ ఎమ్15 అధికారి పీటర్ రైట్ సంచలనాత్మక స్మృతుల ‘‘స్పైకేచర్’’ ప్రచురణ తదుపరి బ్రిటన్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. వివేచనారాహిత్యమనే ఈ వైరస్, అంటువ్యాధిగా ప్రబలి అదుపు చేయలేనిదిగా విజృంభించకముందే దాన్ని నియంత్రించడం అవసరం. శేఖర్ గుప్తా Twitter@Shekargupta. -
'కసబ్‌ను చంపినందుకు కక్ష తీర్చుకుంటా'
పాట్నా: రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులకు కసబ్‌ను ఉద్దేశిస్తూ బీహార్ పోలీసు కానిస్టేబుల్ బెదిరింపు ఎస్సెమ్మెస్‌లు చేశాడు. అజ్మల్ కసబ్, యాకుబ్ మెమన్ ఉరితీయడం పట్ల తాను కక్ష తీర్చుకుంటానని, వరుస బాంబు పేలుళ్లకు పాల్పడతానని రాజస్థాన్ డీజీపీ ఇతర ఉన్నత పోలీసు అధికారులకు ఎస్సెమ్మెస్ పంపించాడు. దీంతో అతడిని పోలీసులు ట్రేజ్ చేసి వెంటనే అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బీహార్ పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు. అరెస్టు చేసిన వ్యక్తిని సిగోరి అనే గ్రామానికి చెందిన షా ఉజేయిర్గా గుర్తించామని అతడిని విచారిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం విధుల్లోనే ఉన్న ఉజెయిర్ మానసికంగా కూడా బాగానే ఉన్నాడని, ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఎస్సెమ్మెస్‌లు పంపించడం అతడికి పరిపాటిగా మారిందని ప్రాథమిక విచారణలో వెల్లడయినట్లు వివరించారు. అయితే, ఇవన్నీ అతడు కావాలని చేస్తున్నాడా లేక మరేదైనా కోణముందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అతడు ఈ ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. -
క్యూఆర్టీ బలగాలను నియమించండి
రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని కోరిన రైల్వే శాఖ హోం శాఖకు చేరిన ప్రతిపాదన ‘ఉగ్ర’ హెచ్చరికల నేపథ్యలో అప్రమత్తం సాక్షి, ముంబై : లోకల్ రైళ్లలో పెరుగుతున్న నేరాలు, రైల్వే స్టేషన్లకు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ) బలగాలను ఏర్పాటు చేయాలని కోరుతూ హోం శాఖకు రైల్వే కమిషనర్ కార్యాలయం నివేదిక పంపింది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే లోకల్ రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)తోపాటు క్యూఆర్టీ బలగాలు కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నాయి. 2008 నవంబరు 26న (26/11) ఉగ్రవాదుల మారణహోమం అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భద్రత కట్టుదిట్టం చేసుకున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లోకల్ రైల్వే స్టేషన్లలో అదనంగా పోలీసులను మోహరించారు. కాని చాలా స్టేషన్లలో డోర్ మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లు పనిచేయడం లేదు. ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. తాజాగా 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు ఉరి శిక్ష విధించడంతో ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా దాడులు జరిపే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఉగ్రదాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు రైల్వే స్టేషన్లలో క్యూఆర్టీ బలగాలను ఏర్పాటు చేయాలని హోం శాఖకు రైల్వే కమిషనర్ కార్యాలయం నివేదిక పంపింది. మహిళ బోగీలు ఒకేచోట..? ఇటీవల లోకల్ రైలులో బిహార్‌కు చెందిన యువకుడు ఓ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో మహిళ ప్రయాణికుల భద్రత అంశం మరోమారు తెరమీదకొచ్చింది. సీసీ టీవీ ఫుటేజ్‌ల సాయంతో నాలుగు రోజుల తరువాత ఆగంతకుడిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ రైళ్లలో మొదటి తరగతి, రెండో తరగతి మహిళా బోగీలన్ని ఒకదాని తరువాత ఒకటి ఉంటే భద్రత కల్పించేందుకు మరింత వీలు పడుతుందని రైల్వే పోలీసు కమిషనర్ మధుకర్ పాండే అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం లోకల్ రైళ్లలో రెండు సాధారణ బోగీలు, తరువాత రెండో తరగతి మహిళా బోగీ ఉంటుంది. మొత్తం రైలు ఇలానే ఉంటుంది. దీంతో అన్ని బోగీల్లో పోలీసులను ఏర్పాటు చేయాలంటే కష్టం. దీంతో వీటన్నింటిని వరుసగా ఒకే చోట ఉంచితే పోలీసులను మోహరించేందుకు సులభతరమవుతుంది. అలాగే తాము సురక్షితంగా ఉన్నామనే భావన మహిళల్లో కల్గుతుంది’ అని పాండే అభిప్రాయపడ్డారు. -
ప్రసార స్వేచ్ఛకు సంకెళ్లా?
నలభైయ్యేళ్ల క్రితం దేశంలో ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా హోరాహోరీ పోరాడామని బీజేపీ నేతలు సభజేసి సగర్వంగా ప్రకటించుకుని ఇంకా రెండు నెలలు కాలేదు. ఇంతలోనే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మీడియా గొంతు నులిమే పనికి పూనుకుంది. వారంక్రితం మరణశిక్ష అమలైన యాకూబ్ మెమన్ కేసు విషయంలో కొన్ని చానెళ్లు నిబంధనలు అతిక్రమిం చాయని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసి ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చింది. మీడియా పని తీరు విమర్శలకు అతీతంగా ఉన్నదని, దాన్ని తప్పుబట్ట డానికేమీ లేదని ఎవరూ అనరు. నిజానికి మీడియాను కేవలం పత్రికలకూ, మేగజీ న్‌లకూ, చానెళ్లకూ పరిమితం చేసి ఆలోచించడం కూడా సరికాదు. గత పదేళ్లుగా వీటికి తోడు సామాజిక మాధ్యమాలు కూడా రంగం మీదికొచ్చాయి. మీడియా ఇలా విస్తృతం కావడంవల్లా, వాటిమధ్య విపరీతమైన పోటీ పెరగడంవల్లా ఆ క్రమంలో సమాజంలోని వివిధ వర్గాలనుంచి ఆరోపణలనూ, విమర్శలనూ కూడా ఎదుర్కొంటున్నది. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా చానెళ్లు వ్యవహరించిన తీరును అందరూ తప్పుబట్టారు. ఆ దాడి సందర్భంగా లైవ్ కవరేజీ పేరిట చానెళ్లు శ్రుతిమించాయి. ఈ మితిమీరిన ఉత్సాహాన్ని నియంత్రిం చడం కోసం ఒక నియమావళిని తీసుకొస్తామని ప్రభుత్వం హెచ్చరించాక చానెళ్లే మార్గదర్శకాలను ఏర్పర్చుకున్నాయి. మనుషుల్లో ఉండే సహజాతాలు దెబ్బతినేలా, వక్రమార్గం పట్టేలా ఉండే దృశ్యాలను ప్రసారం చేయడం, మరణావస్థలో ఉన్న, నెత్తుటి ముద్దలైన బాధితులను చూపడం వంటి వి క్రమేపీ తగ్గాయి. ఇంకా సరి చేయాల్సినవీ, మెరుగుపర్చాల్సినవీ ఉన్నాయని ఎవరైనా అంటే ఆ అభిప్రాయంతో విభేదించాల్సిన అవసరం లేదు. ఒక కేసులోని మంచిచెడ్డల్ని న్యాయస్థానాలు నిరా ్ధరించే లోగానే మీడియా అత్యుత్సాహానికి పోయి తానే తీర్పరిగా మారడానికి తహతహలాడటాన్ని తరచు చూస్తున్నాం. స్టూడియోలనే కంగారూ కోర్టులుగా మార్చి చర్చించడానికి వచ్చినవారికి ముద్రలేయడం, హేళన చేసి నోరుమూయిం చడం గమనిస్తున్నాం. ఇదంతా మారాలని, మరింత పరిణతితో ప్రవర్తిల్లాలని అందరూ కోరుకుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల వెనకున్న ఉద్దేశాలు వేరు. అవి ఆరోగ్యవంతమైన చర్చనూ, సంభాషణనూ తొక్కి పెట్టదల్చుకున్నట్టు కనబడు తోంది. యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కిన కేసుకు సంబంధించి సవాలక్ష అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అతను నరరూప రాక్షసుడూ, ఉరికంబం ఎక్కడా నికి అర్హమైన నేరం చేసినవాడన్న వాదన మొదలుకొని ఇందులో ఎన్నో ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారూ...రాజకీయ నాయకు లు, హక్కుల సంఘాలు, పౌర సమాజానికి చెందిన కార్యకర్తలు, సీనియర్ పాత్రికే యులు ఈ సంవాదంలో పాలుపంచుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానం అసాధా రణ రీతిలో అర్థరాత్రి దాటాక సమావేశమై తెల్లవారుజామువరకూ కేసును విచారిం చి తీర్పునివ్వడాన్ని శ్లాఘించిన వారున్నట్టే...అంతగా శ్రమించి కూడా అది కొన్ని మౌలిక సూత్రాలను విస్మరించిందని విమర్శించినవారున్నారు. వీటన్నిటికీ మీడి యాలో చోటు దొరికింది. ఆ వాదనల్లోని మంచి చెడ్డల్ని, లోటుపాట్లనూ... వాటి ఉద్దేశాలనూ, అంతరార్థాలనూ అందరూ తెలుసుకోగలిగారు. నిజానికి ఈ తరహా చర్చ ఇంకా ముందే జరిగుంటే పరిస్థితి వేరుగా ఉండేదని...మీడియా చివరి నిమి షంలో మాత్రమే స్పందించిందని అసంతృప్తి వ్యక్తం చేసినవారున్నారు. ఇంతకూ కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులందుకున్న మూడు చానాళ్లూ చేసిన తప్పేమిటి? ఆజ్‌తక్, ఏబీపీ చానెళ్లు మెమన్ ఉరి తర్వాత మాఫియా డాన్ చోటా షకీల్‌తో ఫోన్ సంభాషణ జరిపాయి. మెమన్ నిర్దోషని, అతనికి న్యాయం జరగలేదని ఆ సంద ర్భంగా చోటా షకీల్ అన్నాడు. ఎన్డీటీవీ మెమన్ న్యాయవాదితో ఇంటర్వ్యూ నిర్వ హించింది. చాలా దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయని ఆయనన్నాడు. ఈ ప్రసారాలు రాష్ట్రపతినీ, న్యాయవ్యవస్థనూ అగౌరవపరిచేలా ఉన్నాయని, వారి విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ జారీచేసిన నోటీసులు అభ్యంతరపెడుతున్నాయి. అసభ్యత, పరువునష్టం... కావాలని అసత్యాలు, అర్థసత్యాలు వ్యాప్తిచేయడంవంటి ఆరోపణలు ఈ నోటీసుల్లో ఉన్నాయి. హింసను ప్రేరేపించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, జాతి వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడంవంటి నిందలున్నాయి. ప్రసారమైన అంశాలకూ, ఈ ఆరోపణలకూ అసలు పొంతన ఉందా? ఇలాంటి ఆరోపణలు పుక్కిటబట్టిన నోటీసుల్ని జారీచేసి ప్రభుత్వం సాధించదల్చుకున్నదేమిటి? మీడియాను వేధించడం, భయపెట్టడం కాదా? ఇవే సెక్షన్లను ఉపయోగించి మీడియాను దారికి తెచ్చుకోవాలని గతంలో యూపీఏ సర్కారు సైతం చూసింది. ఇలాంటి ధోరణులు పాలకుల బలాన్నిగాక బలహీనతనే పట్టిచూపుతాయి. మీడియా పోకడలు సరిగా లేవనుకుంటే వాటిని ఎత్తి చూపడానికి వేదికలున్నాయి. న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీఎస్ఏ), బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్లెయింట్ కౌన్సిల్(బీసీసీసీ) వంటి స్వీయ నియంత్రణ సంస్థలు ఆ పనిలోనే ఉంటాయి. చానెళ్ల పనితీరుపై వచ్చే ఫిర్యా దుల్ని స్వీకరించి, విచారణ జరిపి అవసరమనుకున్న సందర్భాల్లో చర్యలు తీసుకుం టాయి. ఆ మూడు చానెళ్ల విషయంలోనూ కేంద్రం ఆ తోవన వెళ్తే ఎవరూ అభ్యం తరపెట్టరు. కానీ దాన్ని వదిలిపెట్టి 1994నాటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధ నలను ఆయుధంగా చేసుకుంది. నిజానికి ఇది ఒక రకంగా మేలే. అవి పుస్తకాల్లోనే నిక్షిప్తమై ఉంటే వాటితో వచ్చే ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టి ఉండేవారు కాదు. దేశంలోకి ప్రైవేటు చానెళ్లు ప్రవేశించిన కొత్తలో వచ్చిన ఆ నిబంధనలు ఎంతో అనిర్దిష్టంగా, అమూర్తంగా...అధికారంలో ఉన్నవారు ఏంచేసినా చెల్లుబాటయ్యేలా రూపొందాయి. అవి మన రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నాయి. ఆ నిబంధనలనే యూపీఏ సర్కారు అమలు చేయబూనుకుంటే ఒక్క కుంభకోణమైనా వెల్లడయ్యేది కాదు. సందర్భం వచ్చింది గనుక మీడియాతో పాటు అందరూ ఏకమై ఈ నిబంధనల రద్దుకు ఉద్యమించాలి. ఈ బాపతు నోటీసుల జారీలోని అప్రజాస్వామికతను కేంద్ర ప్రభుత్వం గ్రహించి పొరపాటును సరిదిద్దుకోవాలి. -
తమ్ముడి ఉరితీతపై రగిలిపోతున్న అన్న
-
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు
చంపుతామంటూ ఆగంతకుల లేఖ.. జడ్జి ఇంటి వద్ద భద్రత పెంపు న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో జడ్జి ఇంటి వెనుక ద్వారం గుండా ఆగంతకులు బెదిరింపు లేఖను వదిలివెళ్లారు. జడ్జిని చంపుతామంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద పోలీసుబలగాలను పెంచి భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడ పారామిలటరీ బలగాలనూ మోహరించి, మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేశారు. తనిఖీలూ చేపట్టారు. ఉగ్రవాద నిరోధక భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. 1993 ముంబై బాంబుదాడుల కేసులో మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయడం తెలిసిందే. బెదిరింపు లేఖ వదిలివెళ్లే ముందు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద ఆగంతకులు రెక్కీ చేసి ఉంటారని భావిస్తున్నారు. జడ్జి ఇంటి వెనుక దట్టమైన చెట్లు ఉండడంతో ఆగంతకుల ఛాయాచిత్రాలు సీసీటీవీల్లో రికార్డు కాలేదని చెబుతున్నారు. జస్టిస్ మిశ్రాకు గట్టి భద్రత కల్పించాలని సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు అధికారులను ఆదేశించారు. -
ప్రతీకారం తీర్చుకుంటా : టైగర్ మమన్
-
మెమన్ ఉరితీత ఉత్తర్వులిచ్చిన జడ్జికి బెదిరింపు లేఖ
-
అతడ్ని ఉరితీసినందుకు రూ.10వేల చెక్
మంగళూరు: ముంబయి పేలుళ్లలో దోషి యాకుబ్ మెమన్ను ఉరితీసిన తలారికి కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి సంఘం రూ.10 వేల చెక్‌ను పంపించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న అలాంటి వ్యక్తిని ఉరితీసిన తలారిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని, అందుకే ఈ చెక్ పంపిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పుత్తూరులోని అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొంతమంది విద్యార్థి నాయకులు తొలుత ఈ ఆలోచన చేసి కాలేజీ యాజమాన్యానికి తెలియజేయగా వారు జైలు అధికారులను సంప్రదించారు. అందుకు వారు అనుమతించడంతో ప్రతి క్లాసులో నుంచి స్వచ్ఛంద విరాళాలు వసూలు చేసి మొత్తం పది వేల రూపాయలను తలారీకి పంపించారు. -
దేవుడుగారూ-జిందాబాద్
అసదుద్దీన్ ఒవైసీ, ‘యాకూబ్ మెమన్‌ని ఉరితీయడానికి కారణం - అతని మతం’ అన్నారు. ఆయన అభ్యంతరానికి దేవుడు పెట్టుబడి. సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ మధ్య ఓ మాట అన్నాడు: ‘80 శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో సూపర్ స్టార్స్‌గా ఉన్న- షారూఖ్, సల్మాన్, అమీర్-20 శాతం ఉన్న మైనారిటీ మతస్తులు’. ఈ దేశంలో విరివిగా అమ్ము డుపోయే, కలిసివచ్చే, కొంగు బంగారంగా నిలిచే వస్తువు పేరు - దేవుడు. దేవుడు జాతి ప్రాథమిక బలహీనత - అన్నా రెవరో పెద్దమనిషి. దేవుడు జాతికి అన్ని రంగాలలోనూ ప్రధానమయిన పెట్టుబడి అని ఆయనకి తెలీదు. దేవుడు ప్రాతిపదికగా ఒక పార్టీ దేశాన్ని పరిపాలి స్తోంది. వారు చేసే ఏ పనయినా - అది మంచయినా చెడు అయినా - దేవుడు కారణంగానే ప్రతిపక్షాల విమ ర్శకు గురవుతోంది. ‘‘యోగా ఆరోగ్యానికి మంచిద య్యా’’ అంది ఐక్యరాజ్యసమితి. సూర్యుడు దేవుడు కాదు-అంది ఓ మతం. ప్రహ్లాదుడికంటే హిరణ్యకశ పుడు అనునిత్యం దేవుడిని తలుస్తూండాలి - ఆయనకి శత్రువు కనుక. Hypocricy is a fulltime job అన్నాడు సోమర్సెట్ మామ్. ఇప్పుడు రెండు కథలు. రెండు కథలకూ సుప్రీం కోర్టే మద్దతు. వ్యాపార వస్తువుల మీద - అంటే పళ్ల పొడి, తలనొప్పి మందు, మసాలా వస్తువులు, మం దులు, బట్టల మీద - దేవుడి బొమ్మలు ఉండరాదని ఒకాయన సుప్రీంకోర్టులో కేసు పెట్టాడు. సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల న్యాయపీఠం ఆ కేసుని కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి అన్నారు కదా: ‘‘ఒక వ్యాపా రి తాను బాలాజీ భక్తుడిననో, లక్ష్మి భక్తుడిననో అంటు న్నాడు. తత్కారణంగా తన కొడుక్కీ, కూతురుకీ ఆ పేర్లు పెట్టుకుంటున్నాడు. తన నేమ్‌ప్లేట్ మీదా, కారు మీదా, తయారు చేసే వస్తువు మీదా ఆ బొమ్మలు వేసు కున్నాడు. తప్పేముంది?’’ మరో కేసు. కేరళలో ఓ ము స్లిం అమ్మాయి తల చుట్టూ హిజాబ్ (కప్పుకునే చున్నీ) వేసుకునే అఖిల భారత వైద్య పరీక్షకు వస్తానంది - అది మన మతానికి సంబంధించిన ఆచారం కనుక. కేరళ హైకోర్టు అర గంట ముందు పరీక్ష హాలుకి వచ్చి తనిఖీ జరిపించాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు: ‘‘పరీక్షకి తలమీద హిజాబ్ లేకుండా రావ డం వల్ల మత విశ్వాసానికి ఏ మా త్రమూ భంగం కలుగదు’’ అని. దేవుడికీ, దేవుడిపట్ల విశ్వాసా నికీ, మెడికల్ పరీక్షకీ, మెడ మీద వేసుకున్న హిజాబ్‌ని రెండు గంటల పాటు దూరంగా ఉంచడం వల్ల ఎంత మాత్రం హాని జరగదని ఆయన విశ్వాసం. మొన్ననే కేరళలో ఓ క్రైస్తవ సిస్టర్ సైబా ఆలిండి యా ప్రీ మెడికల్ పరీక్షకి తలనిండా ముసుగు వేసుకుని, మెడలో శిలువని ధరించి వచ్చారు. పరీక్షా అధికారులు ఆమె పరీక్ష హాలులోకి అలా రావడానికి తిరస్కరించారు. వాటిని తొలగించాలన్నారు. ఆమె తనని మరొక గదిలో కూర్చుని పరీక్ష రాసే అవకాశాన్ని కోరింది. అధికారులు అంగీకరించలేదు. ఆమె పరీక్ష రాయకుండానే వెళ్లిపో యింది. 22 సంవత్సరాల కిందట (1993 మార్చి 2న) కనీ వినీ ఎరగని రీతిలో 12 స్థలాలలో ముంబైలో దారుణ మారణకాండ జరిగింది. 257 మంది చచ్చిపోయారు. 713 మంది గాయపడ్డారు. ఒక ముద్దాయిని ఈ దేశంలో అన్ని దశలలోనూ న్యాయస్థానాలు, రాష్ర్టపతితో సహా ఉరితీయవచ్చునని నిర్ణయించాయి. మొన్న శిక్ష అమలు జరిగింది. ఒకానొక అఖిల భారత ముస్లిం పార్టీ నేత అసదు ద్దీన్ ఒవైసీ, ‘‘యాకూబ్ మెమన్‌ని ఉరితీయడానికి కార ణం - అతని మతం’’ అన్నారు. ఆయన అభ్యంతరానికి దేవుడు పెట్టుబడి. ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ మధ్య ఓ మాట అన్నాడు: 80 శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో సూపర్ స్టార్స్‌గా ఉన్న ముగ్గురు నటులు - షారూఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్-20 శాతం ఉన్న మైనారిటీ మతస్తులు. ఈ దేశాన్ని గురించి చెప్పడానికి ఇంతకన్న మంచి ఉదాహరణ లేదు. దేవుడు చాలా మందికి చాలా రకాలయిన ఊతం. నిస్సహాయు లకి ఊరట. అసమర్థులకి చేయూ త. నమ్మినవారికి మోక్ష ప్రదాత. మ తఛాందసులకి సర్వస్వం. వ్యాపార స్థులకి లాభసాటి తాయిలం. రాజ కీయ నాయకులకి ఓట్లకి పెట్టుబడి. దేవుడు అందరికీ అన్నీ సమ కూర్చే కల్పతరువు అనడానికి ఇంత కన్న గొప్ప సాక్ష్యం ఏముంది? ఆశా రాం బాపూకి, అసదుద్దీన్ ఒవైసీకి, సాక్షి మహరాజ్‌కీ, బాబా రాందేవ్కీ, అజ్మల్ కసబ్‌కీ, ఉమాభారతికీ, ప్రవీణ్ తొగాడియాకీ, జాకీవూర్ రెహ్మాన్ లఖ్వీకీ - అం దరికీ అన్నిటికీ దేవుడే మూలాధారం. కొందరు ఒక దేవు డికి భక్తులు. ఆ కారణంగానే మరో దేవుడిని నమ్మేవారికి శత్రువులు. కొందరు దేవుడిని అడ్డం పెట్టుకుని అమ్మా యిలతో రాసక్రీడలు జరిపి జైలుకెళ్లారు. కొందరు దేవు డుని చేరడానికి దగ్గర తోవని వ్యాపారం చేశారు. కొంద రు మతం పేరిట మారణహోమాన్ని ఉద్యమం చేసుకు న్నారు. కొందరు పక్క మతం మసీదులు పగలగొట్టారు. కొందరు దేవుడిని రాజకీయ ఆయుధాన్ని చేసి ప్రసంగా లలో ఉద్యమాలు జరిపారు. ఇది దేవుడి విశ్వరూపం. దేవుడుగారూ, జిందాబాద్! - గొల్లపూడి మారుతీరావు -
ఉరికి కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ఉరి శిక్ష విషయంలో కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. బుధవారం సమావేశాల నేపథ్యంలో పార్లమెంటుకు వచ్చిన ఆయన ఇటీవల ఉరి తీసిన యాకుబ్ మెమన్ ఉరి విషయంలో కొందరు వ్యక్తులు భిన్నరకాల అభిప్రాయాలు వెలువరిస్తుండటంపై మీడియా వెంకయ్యనాయుడిని ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. 1993నాటి ముంబయి పేలుళ్ల కేసులో మెమన్ను గత వారం ఉరితీసిన విషయం తెలిసిందే. నాటి దాడిలో మొత్తం 257మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో వెంకయ్య మాట్లాడుతూ.. 'మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల రోజు చాలామంది వేరే అంశంపై దృష్టిని నిలిపారు. ఇక కొన్ని మీడియాలైతే ఎంతమందిని ఇప్పటివరకు ఉరి తీశారు. ఏ వర్గం వారిని ఉరి తీశారనే సంఖ్యలను ఇచ్చారు. వాస్తవానికి ప్రజలు మాత్రం ఈ విషయాలు అంతగా పట్టించుకోవడం లేదు. గతంలో 36మందిని ఉరితీశారు. వీరిలో మక్బూల్ భట్, అఫ్జల్ గురు, కసబ్‌తోపాటు ఇతరులు కూడా ఉన్నారు. ఈ సమయంలో నేను ఏ వర్గానికి చెందిన వారనే విషయంపై మాట్లాడను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని ఉరితీశారనే విషయంలో స్పష్టమైన వివరాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సబబు. ఉరితీసే విషయంలో మీరేమైనా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?ఈ విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను' అని వెంకయ్య మీడియాకు బదులిచ్చారు. -
మెమన్ ఉరితీతపై జస్టిస్ శ్రీకృష్ణ ఏమన్నారంటే..
ముంబై: '900 మంది హత్యకు గురైన అల్లర్ల కేసులో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే దోషులుగా మిగిలారు. అదే 260 మంది చనిపోయిన పేలుళ్ల కేసులోనైతే 100 మందికిపైగా దోషులుగా తేలారు. ఇక్కడ నా ఉద్దేశం మరణాలను బట్టి దోషుల సంఖ్య ఉండాలని కాదు. కేసు విచారణ జరిగిన తీరు అందరికీ అర్థం కావడానికే ఇది చెబుతున్నా' అంటూ 1992 ముంబై మత ఘర్షణలు, 1993 పేలుళ్ల దోషులకు శిక్షల అమలులపై జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. 1993 ముంబై వరుస పేలుళ్లకు అసలు కారణమైన మత ఘర్షణలపై ఏర్పాటయిన విచారణా కమిషన్‌కు నేతృత్వం వహించి.. నిజమైన నివేదిక ఇచ్చారని పేరుతెచ్చుకున్న జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అల్లర్ల కేసులో దోషులతో పోల్చితే పేలుళ్ల దోషులకు శిక్షలు అమలుచేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. పేలుళ్లకు ముందు జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 900 మంది (వీరిలో అత్యధికులు ముస్లింలు) హత్యలకు గురయిన సంగతి తెలిసిందే. 'నా దృష్టిలో ప్రభుత్వం ఏకపక్షం వహించింది. విద్రోహులను కఠినంగా శిక్షించాలనే పట్టుదలను అల్లర్ల దోషుల విషయంలో మాత్రం కనబర్చలేదు. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కేసును ముందుకు తీసుకువెళ్లడంతో ప్రభుత్వాలు అశ్రద్ధ వహించాయి. అది కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి కానివ్వండి లేదా బీజేపీ- శివసేన కూటమి కానివ్వండి. రెండూ ఒకేలా వ్యవహరించాయి. మెమన్ ఉరితీతను సమర్థిస్తున్నా. తుది నిమిషం వరకూ సుప్రీంకోర్టు దోషికి అనేక అవకాశాలు కల్పించింది. తుది తీర్పును తప్పుబట్టాల్సిన పనిలేదు, ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఉన్నప్పుడు సహజంగానే ఏదోఒక తీర్పు వెలువడకతప్పదు. నిజాకి కోర్టులన్నీ సాక్ష్యాధారాల లభ్యత, వాటి నిరూపణ ఆధారంగానే పనిచేస్తాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే అల్లర్ల కేసులో అలాంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వాటిని కోర్టుకు సమర్పించడంలో ప్రభుత్వాలు సరైన రీతిలో వ్యవహరించలేదు. అల్లర్లకు ప్రతీకారంగానే పేలుళ్లు జరిగాయనడం సమర్థనీయం కాదు కూడా. పేలుళ్ల కేసులో శిక్షలు అమలైనట్లే అల్లర్ల కేసులో నిజమైన దోషులందరికీ శిక్ష పడాలని, ఆ రోజు వస్తుందనుకుంటున్నా' అంటూ ముగించారు జస్టిస్ శ్రీకృష్ణ. -
మెమన్ భార్యకు సీటిమ్మన్నాడని వేటు
ముంబై: మహారాష్ట్రలోసమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్‌కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్‌కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఫరూక్ లేఖ రాశారు. ఫరూక్ వ్యాఖ్యలకి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పార్టీ నుంచి వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 'దేశంలోని ముస్లింల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను పెద్దల సభలో వినిపించేందుకు ఓ గొంతు కావాలి.... ఈ నేపథ్యంలో రహీన్‌కు ఈ అవకాశం ఇస్తే... వారి కోసం ఆమె పోరాడుతుంది' అని ఘోసి లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మహారాష్ట్రలోని పలు పార్టీలు నిప్పులు చెరిగాయి. మెమన్‌కు ఉరిశిక్షపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజకీయం చేయొవద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఎస్పీ నాయకులకు హితవు పలికారు. అయినా ఈ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. దానికి మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ బీజేపీ నాయకుడు మాదవ్ బండార్ సమాజ్ వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ విషయంపై ఎస్పీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అసిం అజ్మీ స్పందించారు. ఇది ఫరూక్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ అంశంపై ఆయన పార్టీని ఎప్పుడు సంప్రదించలేదన్నారు. -
అక్కడ దూకుడెందుకు చూపలేదు?
రాజీవ్ హంతకుల అంశంపై పణజి: యాకూబ్ మెమన్ కేసులో చూపించిన అత్యవసరతను.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నిర్ధారితులైన వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూపించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. రాజీవ్ హత్య కేసులో ముగ్గురికి విధించిన మరణశిక్షను తగ్గించి, వారికి కొత్త జీవితాన్ని అందించటాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారంలో కొట్టివేసింది. దిగ్విజయ్ శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకువేయటాన్ని హర్షిస్తున్నాం. కానీ.. మరోవైపు హిందూ అతివాదుల ప్రమేయం ఉన్న ఉగ్రవాద కేసుల్లో మందకొడిగా వ్యవహరించాలని ఎన్ఏఐ ఒక సీనియర్ న్యాయవాదికి చెప్పింది’’ అంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సలైన్ ఆరోపణలను ప్రస్తావించారు. యాకూబ్ కేసులో చూపిన అత్యవసరతను రాజీవ్ హంతకుల విషయంలో కానీ, సిక్కు ఉగ్రవాది భుల్లార్ విషయంలో కానీ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. మానవీయంగా నడుచుకుంది: ఆరెస్సెస్ న్యూఢిల్లీ: యాకూబ్‌ను ఉరితీసిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించిందని ఆరెస్సెస్ కితాబునిచ్చింది. వారు దేశద్రోహులు: సాక్షి మహరాజ్ రిషికేష్: యాకూబ్ మరణం పట్ల విచారిస్తున్న వారు జాతివ్యతిరేకులని, దేశద్రోహులని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అభివర్ణించారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వారు పాకిస్తాన్‌కు వెళ్లాలని సూచించారు. -
ఉరిశిక్షపై వరుణ్ గాంధీ ఏమన్నారో తెలుసా?
మరణశిక్షను రద్దు చేయాలా.. వద్దా? ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ఇప్పుడు ఉరిశిక్షను రద్దుచేయాలని పోరాడేవాళ్ల జాబితాలోకి చేరిపోయారు. మరణశిక్ష వల్ల కేవలం పగ చట్టబద్ధం అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష వల్ల సమాజంలో అరాచకత్వం పెరిగిపోతుందన్నది యుగాలుగా రుజువు అవుతూనే ఉందన్నారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరితీత నేపథ్యంలో వరుణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మరణశిక్షను నిషేధించాలని వరుణ్ గాంధీ చెప్పారు. అరుదైన వాటిల్లోకెల్లా అరుదైన కేసు అంటే ఏమిటన్న దానికి భారత న్యాయ వ్యవస్థలో స్పష్టమైన నిర్వచనం లేదని, న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి, సామాజిక - రాజకీయ నమ్మకాలను బట్టి ఇది నిర్ణయం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. మరణశిక్ష మాత్రమే ఒక మాయని మచ్చగా ఉందన్నారు. వాస్తవానికి ఇప్పుడు బతుకుతున్న చాలామందికి చావుకు అర్హత ఉందని, చనిపోయిన కొంతమందికి బతికే అర్హత ఉందని వరుణ్ చెప్పారు. -
ఊపిరి పీల్చుకున్న ముంబై
♦ యాకూబ్ మెమన్ ఉరి నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ♦ అంతా సవ్యంగా జరగడంతో వీడిన ఉత్కంఠ ♦ ముఖ్య భూమిక పోషించిన రాష్ట్ర పోలీసు శాఖ సాక్షి, ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు మొదలుకుని అంత్యక్రియల వరకు అన్నీ ప్రశాంతంగా జరగడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధి నిర్వహించిన వేలాది మంది పోలీసులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రహదారులు, కీలక రైల్వే స్టేషన్ల వద్ద అదనపు పోలీసులను మోహరించారు. వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, పోలీసులకు ఆదేశాలిచ్చేందుకు రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్, నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపారు. వీరికి తోడుగా అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు దేవేన్ భారతి, అతుల్‌చంద్ర కులకర్ణి, ఐదుగురు అప్పర్ పోలీసు కమిషనర్లు, 12 మంది డిప్యూటీ పోలీసు కమిషనర్లు రాత్రంతా మేలుకుని పరిస్థితులు పర్యవేక్షించారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం యాకూబ్ అంత్యక్రియలు ప్రశాంతంగా పూర్తికావడంతో ఇటు పోలీసులు, అటు రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడు ప్రథమ స్థానంలోనే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఎప్పుడూ ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ప్రథమస్థానంలో ఉంటుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా ముందుగా ముంబైనే అప్రమత్తం చేస్తారు. గతంలో అనేక మత ఘర్షణలు, బాంబు పేలుళ్ల సంఘటనలను 1.50 కోట్ల మంది ముంబైకర్లు కళ్లతో చూశారు. ఇలాంటి వాతావరణంలోనే నాటకీయ పరిణామాల మధ్య జరిగిన యాకూబ్ ఉరి, ఆ తరువాత భారీ జనసందోహం మధ్య జరిగిన అంత్యక్రియలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఆందోళన చెందారు. రోడ్లపై కాకుండా మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు డేగ కళ్లతో పహారాకాశారు. శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా నేరచరిత్ర ఉన్న 750 మందిని అదుపులోకి తీసుకున్నారు. యాకూబ్ నివాసముండే బిస్మిల్లా మంజిల్ భవనం వద్ద ఏకంగా 800 మంది సాయుధ పోలీసులను మోహరించారు. వీరంతా విశ్రాంతి, భోజనం లేకుండానే గురువారం అర్ధరాత్రి వరకు విధుల్లో ఉన్నారు. -
ప్రతీకారం తీర్చుకుంటాం : చోటా షకీల్
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరి తీయడంపై అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకీల్ మండిపడ్డారు. స్వదేశానికి వచ్చి లొంగిపోతే ఉరి శిక్ష వేయమంటూ యాకుబ్‌కు ప్రమాణం చేసి నమ్మక ద్రోహనికి పాల్పడిందని ఆయన భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మెమన్ ఉరి తీయడం భారత ప్రభుత్వం చట్టపరంగా చేసిన హత్య అని షకీల్ అభివర్ణించారు. అందుకు తగ్గ పరిణామాలు ఉంటాయని భారత ప్రభుత్వాన్ని చోటా షకీల్ హెచ్చరించారు. టైగర్ మెమన్ చర్యలకు గాను అతడి సోదరుడిని శిక్షించారన్నారు. యాకుబ్ మెమన్ అమాయకుడు అని గుర్తు చేశారు. అలాంటి వాడిని ఉరి తీసి భారత ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. ఈ మేరకు చోటా షకీల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1993లో ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు యాకుబ్ మెమన్ నిందితుడని కోర్టు తెల్చింది. దాంతో అతడికి ఉరి శిక్ష వేసింది. దీంతో ఉరిశిక్షను రద్దు చేయాలంటూ యాకుబ్ పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు. ఆ క్రమంలో జులై 30 మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో యాకుబ్ మెమన్ కు ఉరిశిక్షను అమలు చేశారు. దీనిపై చోటా షకీల్ పై విధంగా స్పందించారు. -
తుపాకీ నీడలో తిరుమల క్షేత్రం
-
మెమెన్ ఉరిపై ఆగ్రహం
సాక్షి, చెన్నై : దేశంలో ఉరి శిక్ష అమలును రద్దు చేయాలని ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే తీవ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు ఉరి శిక్ష అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో వ్యవహరించిందంటూ పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది నుంచి రాష్ట్రంలోని పార్టీలు, ప్రజా సంఘాలు , తమిళాభిమాన సంఘాలు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులకు పడ్డ ఉరి శిక్ష యావజ్జీవంగా మారే వరకు ఆందోళనల్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంఘాలు, పార్టీలు దేశంలో ఆ శిక్ష అమలైన సమయాల్లో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఉరి శిక్షను అనేక దేశాలు రద్దు చేసి ఉంటే, భారత్‌లో మాత్రం ఆ శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ముంబై పేలుళ్ల నిందితుడు తీవ్ర వాది యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు గురువారం ఉరి శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ శిక్ష అమలు చేయాల్సిన అవశ్యం, ఒత్తిడి ఉండి ఉంటే, మరో వారం రోజుల తర్వాత అమలు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే మెమన్ ఉరి శిక్షను అమలు చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు మహారాష్ట్ర పాలకులు కలాంకు గౌరవాన్ని ఇచ్చారోనన్నది స్పష్టం అవుతున్నదని మండి పడుతున్నాయి. అత్యుత్సాహం : పీఎంకే అధినేత రాందాసు తన ట్విట్టర్లో ఉరి శిక్ష అమలుపై తీవ్రంగానే స్పందించారు. మెమన్‌కు ఉరి శిక్ష విధించడంతో మహారాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు తిలోదకాలు దిద్ది మెమన్ను ఉరి తీశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మెమన్ పిటిషన్‌పై మరో మారు పరిశీలన జరిపి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం మృతితో కన్నీటి మడుగులో దేశం మునిగిఉన్నదని, ఉరికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం తమ సందేశాల్ని ఇచ్చి ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో ఉరిశిక్షను అమలు పరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హత్యే : న్యాయం ముసుగులో మెమన్ను ఉరి శిక్ష పేరుతో హత్య చేశారని వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత గౌరవాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటుగా, దేశం కోసం అవిశ్రాంతంగా చివరి క్షణాల వరకు శ్రమించిన అబ్దుల్ కలాం భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా పూర్తి కాక ముందే, ఆగమేఘాలపై మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేయడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన ఏడు రోజుల్లో , కోర్టుల్లో పిటిషన్ తిరస్కరించ బడ్డ పక్షంలో పదహారు రోజుల్లో ఉరిశిక్షను అమలు చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయన్నారు. అయితే, ఆ నిబంధనలకు తిలోదకాలు దిద్ది, అత్యవసరంగా, ఆగమేఘాలపై న్యాయం ముసుగులో మెమన్ను ఉరి తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
30 వేల మంది పహారా
ముంబై: అత్యంత కట్టుదిట్టమైన పోలీసు పహారా మధ్య గురువారం సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో మెరైన్ లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాగ్‌పూర్‌నుంచి తీసుకొచ్చాక మహిమ్‌లోని ఆయ న ఇంట్లో 2గంటల పాటు మృతదేహాన్ని ఉంచారు. కుటుంబీకులు, బంధువులు కడచూపు చూసుకున్నారు. ప్రార్థనలు చేశారు. అనంతరం మెరైన్ లైన్స్‌లోని శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చనే ఉద్దేశంతో అంతిమయాత్రకుఅనుమతి నిరాకరించారు. మీడియా చిత్రీకరణను కూడా నిషేధించారు. ఈ మార్గాన్ని పూర్తిగా భద్రతా బలగాలతో నింపేశారు. మొత్తం 30,000 మంది పోలీసులను మోహరించారు. 4.15 గంటలకు శ్మశానవాటికకు మృతదేహం చేరుకునే సమయానికి ముంబైలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. అయితే లోపలికి అనుమతించే ముందు ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేసి వదిలారు. అయితే జనం రద్దీ పెరగడంతో తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. 5.15 కల్లా అంత్యక్రియలు ముగిశాయి. నేరచరిత కలిగిన 526 మంది ని ముంబై పోలీసులు బుధవారమే ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. -
ఉరి.. ఊపిరి మధ్య..
14రోజులు గడువు కోరుతూ అర్ధరాత్రి సుప్రీం తలుపు తట్టిన మెమన్ లాయర్లు చట్టంలోని వెసులుబాట్లను దుర్వినియోగం చేస్తున్నారన్న ఏజే ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం వేకువజామున 4.50 గంటలకు పిటిషన్ కొట్టివేయడంతో వీడిన ఉత్కంఠ హైడ్రామా... యాకుబ్ మెమన్‌కు రాష్ట్రపతి క్షమాభిక్షను నిరాకరించారనే వార్త విని భారతావని నిద్రలోకి జారుకుంది. ఉరిని తప్పించేందుకు జరిగిన విశ్వప్రయత్నాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి మరో హైడ్రామా మొదలైంది. ఆఖరి ప్రయత్నంగా మెమన్ లాయర్లు రాత్రి 11.30కు భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటి తలుపులు తట్టారు. దాంతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ఎపిసోడ్ మొదలైంది. ఆ క్రమమే ఇది.. జూలై 29.. రాత్రి 10.45: మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. 11.10: క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాక..ఉరితీతకు 14 రోజుల కనీస గడువు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని పేర్కొంటూ మెమన్ న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. 11.30: ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఆనంద్ గ్రోవర్ తదితరులు భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు. 11.30: సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ దత్తు నివాసానికి విచ్చేశారు. సీజేఐ నివాసం 5, క్రిష్ణమీనన్ మార్గ్ వద్ద మీడియా, లాయర్లతో సందడి నెలకొంది. జూలై 30 .. తెల్లవారుజామున 1.00: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ మిశ్రా నివాసానికి మారిన సీన్. 1.30: న్యాయవాదులు జస్టిస్ మిశ్రా నివాసానికి చేరుకున్నారు. 1.35: తెల్లవారుజామున 02.10కి కోర్టుకు వచ్చేందుకు న్యాయమూర్తులు మిశ్రా, ప్రఫుల్ల చంద్ర పంత్, అమితావ రాయ్‌ల అంగీకారం. 2.00: స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా.. నడిరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకున్నాయి. కోర్టు హాలు-4 సిద్ధమైంది. 2.10: నాగ్‌పూర్ సెంట్రల్ జైలు కానిస్టేబుల్ నగరంలోని ఓ హోటల్లో మెమన్ సోదరుడికి ఉరి సమాచారంతో లేఖను అందజేశారు. 2.30: న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రాక ఆలస్యం కావడంతో విచారణ జాప్యం. 3.20: రివ్యూ పిటిషన్‌పై విచారణ ప్రారంభం. మెమన్ తరఫు లాయర్లు తమ వాదన వినిపించారు. 3.50: అటార్నీ జనరల్ వాదన ప్రారంభం 4.00: నాగ్‌పూర్ జైలులో మెమన్ గదికి జైలు అధికారులు వెళ్లారు. ఏ నిర్ణయం రాలేదు కాబట్టి వాళ్లు తమ ముందున్న డెత్ వారెంట్‌కు అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. 4.30: ముగిసిన వాదనలు. 4.50: ఉరిపై స్టే ఇవ్వడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందంటూ మెమన్ పిటిషన్‌ను తిరస్కరించిన త్రిసభ్య ధర్మాసనం. 6.30: స్నానం, ఇతర కార్యక్రమాలయ్యాక ఉరికంబం వైపు మెమన్ను నడిపించారు. న్యూఢిల్లీ: అర్ధరాత్రి దాటిపోయింది.. అప్పటికే యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చారు.. కొద్దిసేపటికే రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నో చెప్పేశారు.. అయినా యాకూబ్ లాయర్ల విశ్వప్రయత్నం.. అర్ధరాత్రి వెళ్లి సుప్రీంకోర్టు తలుపుతట్టారు..అప్పటికప్పుడు ముగ్గురు సభ్యులతో బెంచ్.. సుప్రీం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాత్రి 3.20 గంటలకు అసాధారణ విచారణ..! గంటన్నర పాటు వాదోపవాదాలు..! ఉరి, ఊపిరి మధ్య నిశిరాత్రి జరిగిన న్యాయ సమరమిది!! చివరికి ఉరే సరి అని ధర్మాసనం తేల్చేసింది. దీంతో యాకూబ్ ఉరిపై గురువారం తెల్లవారుజాము వరకు సాగిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఎవరేం వాదించారు?: క్షమాభిక్ష పిటిషన్లను గవర్నర్, రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే యాకూబ్ లాయర్లు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నివాసానికి వెళ్లారు. అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బెంచ్‌ను సీజేఐ ఏర్పాటు చేశారు. తర్వాత లాయర్లు జస్టిస్ దత్తు నివాసం నుంచి తుగ్లక్ రోడ్‌లోని జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లారు. తర్వాత అంతా సుప్రీంకోర్టు హాలు నంబర్ 4లో సరిగ్గా రాత్రి 3.20 గంటలకు ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ చేపట్టింది. క్షమాభిక్షపిటిషన్ను తిరస్కరించిన తర్వాత దాన్ని సవాలు చేసుకునేందుకు యాకూబ్‌కు 14 రోజులు గడువివ్వాలని లాయర్లు వాదించారు. అలాగే క్షమాభిక్ష తిరస్కరణ, శిక్ష అమలుకు మధ్య ఏడు రోజుల అంతరం ఉండాలని మహారాష్ట్ర జైళ్ల నియమావళి చెబుతోందని యాకూబ్ లాయర్లు ఆనంద్ గ్రోవర్, యుగ్ చౌధురి పేర్కొన్నారు. యాకుబ్ పిటిషన్ న్యాయ వ్యవస్థ ఇచ్చిన కొన్ని వెసులుబాటులను దుర్వినియోగపరిచేలా ఉందని ప్రభుత్వం తరఫున అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. యాకూబ్ డెత్ వారంట్‌ను త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే సమర్థించిందని, కేవలం 10 గంటల వ్యవధిలోనే దాన్ని రద్దు చేయడం కుదరదని స్పష్టంచేశారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. క్షమాభిక్ష తిరస్కరణ తర్వాత దాన్ని సవా లు చేసుకునేందుకు యాకూబ్‌కు తగినన్ని అవకాశాలు లభించాయంది. శిక్ష అమలు కావాల్సిందేనని వేకువజామున 4.50 గంటలకు తీర్పు ఇచ్చింది. -
‘ఉరి’పై దుమారం..
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరితీతపై ప్రభుత్వం, విపక్షాల మధ్య దుమారం చెలరేగింది. అసలు ఇంత అత్యవసరంగా మెమన్ ఉరితీతను ఎందుకు అమలు చేయాల్సివచ్చిందని, ఇందులో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ విశ్వసనీయత ప్రశార్థకంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, శశిథరూర్ వ్యాఖ్యానించగా... మెమన్ ఉరి అమలు న్యాయ తప్పిదమని సీపీఎం విమర్శించింది. మరోవైపు ఈ విమర్శలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఉగ్రవాదులను తప్పించేలా వ్యాఖ్యలు చేస్తూ వారు ప్రజలను అవమానిస్తున్నారని.. న్యాయ ప్రక్రియనే ప్రశ్నిస్తున్నారని విమర్శించింది. మెమన్ ఉరి అనంతరం దిగ్విజయ్‌సింగ్ ట్విటర్లో వరుసగా పలు ట్వీట్లు చేశారు. నిందితుల మతాన్ని బట్టి కాకుండా అన్ని ఉగ్రవాద కేసుల్లోనూ ఇదే తరహాలో వ్యవహరించాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల కేసు దర్యాప్తులో జాప్యాన్ని ఉద్దేశిస్తూ... కొన్ని ఉగ్రవాద కేసుల దర్యాప్తుల విషయంలో తనకు కొన్ని అనుమానాలున్నాయని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని ఇలా నిర్దాక్షిణ్యంగా ఉరి తీయడం వల్ల ఉగ్రవాద దాడులు తగ్గిపోయినట్లు ఎక్కడా లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. మెమన్ను ఉరితీయడం న్యాయ తప్పిదమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో ఏర్పడిన మతఘర్షణలే ముంబై బాంబు పేలుళ్లకు కారణమని శ్రీకృష్ణ కమిషన్ ఎప్పుడో స్పష్టం చేసిందని.. మరి ఆ ఘటనలకు సంబంధించిన వారిపై తీసుకున్న చర్యలేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాలెగావ్, సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు వంటి హిందూత్వ ఉగ్రవాద కేసుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. మాలెగావ్ పేలుళ్లు, గుజరాత్ అల్లర్లకు కారణమైన స్వామి అసీమానంద్, పురోహిత్, బాబు బజరంగిలను కూడా ఉరితీయాలనిఎంఐఎం నేత ఒవైసీ డిమాండ్ చేశారు. -
7 గంటలకు.. ఉరిశిక్ష అమలు
నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్‌కు ఉరి బిగింపు * కూతుర్ని చూడాలని చివరి కోరిక * సాధ్యం కాకపోవడంతో.. ఫోన్లో మాట్లాడించిన అధికారులు * ముందు రోజు రాత్రి అన్నను చూడగానే ఉద్వేగభరితం * ముంబై పేలుళ్ల కేసులో ఇది తొలి మరణ శిక్ష * సోదరుడికి మృతదేహం అప్పగింత * ముంబైలో అంత్యక్రియలు; ముంబై, నాగపూర్లలో భారీ భద్రత నాగపూర్/న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు గురువారం ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మరణశిక్ష అమలు చేశారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు చివరి నిమిషం వరకు మెమన్ తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో పేర్కొన్న విధంగా జూలై 30 ఉదయం సరిగ్గా ఏడుగంటలకు యాకూబ్ మెమన్(53)ను ఉరి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని యాకూబ్ సోదరుడు సులేమాన్, దగ్గరి బంధువు ఉస్మాన్‌లకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని ముంబై తీసుకువచ్చారు. బంధుమిత్రుల సమక్షంలో ముంబై మెరైన్ లైన్స్‌లోని శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మరణశిక్ష అమలైన మొదటి దోషి యాకూబ్ మెమనే. ఉరిశిక్ష అమలైన జూలై 30వ తేదీ యాకూబ్ మెమన్ జన్మదినం కూడా. ‘ఉదయం సరిగ్గా 7 గంటలకు మెమన్ను ఉరితీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ప్రతినిధులకు సందేశం పంపించారు. మృతదేహాన్ని తమకు అప్పగించాల్సిందిగా యాకూబ్ సోదరుడు సులేమాన్ నాగపూర్ జైలు అధికారులను బుధవారం రాత్రి లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. మెమన్ ఉరిపై స్టే విధిచేందుకు బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించిన అనంతరం.. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ఇద్దరూ క్షమాభిక్షకు నిరాకరించిన తరువాత.. చివరి ప్రయత్నంగా మెమన్ లాయర్లు బుధవారం అర్ధరాత్రి మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి, తెల్లవారుజామున 3.20 నుంచి 4.50 వరకు సాగిన విచారణ అనంతరం ఉరివైపే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. ఉరిశిక్ష అమలును నిలిపేయడం న్యాయ అధిక్షేపణే అవుతుందంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అప్పటికే నాగపూర్ సెంట్రల్‌జైలులో పూర్తి సన్నద్ధంగా ఉన్న అధికారులు మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేశారు. పుణేలోని ఎరవాడ జైళ్లో పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన జైలు కానిస్టేబులే మెమన్ను కూడా ఉరితీశాడు. నాగపూర్ జైల్లో ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు వారం క్రితం ఎరవాడ జైలు నుంచి వచ్చిన 20 మంది బృందంలో ఆయన కూడా ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా అధికారులు ఆయన వివరాలను వెల్లడించలేదు. కసబ్ ఉరి సమయంలో ఎరవాడ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న యోగేశ్ దేశాయిని ప్రత్యేకంగా మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసేందుకే నాగపూర్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారని సమాచారం. మహారాష్ట్రలో ఎరవాడ, నాగపూర్ జైళ్లలోనే ఉరిశిక్ష అమలు చేసే సదుపాయం ఉంది. టాడా కోర్టు విధించిన మరణశిక్షను సమర్థిస్తూ 2013లో సుప్రీంకోర్టు .. ‘ముంబై పేలుళ్ల వెనుక చోదకశక్తి’గా మెమన్ను అభివర్ణించిన విషయం గమనార్హం. ఇదే కేసులో దోషిగా తేలిన మెమన్ సోదరుడు ఎస్సా, వదిన రుబీనా ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగా.. కీలక సూత్రధారులైన టైగర్ మెమన్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఉరికంబంపై..: 2012 నవంబర్ 21న మహారాష్ట్రలోని ఎరవాడ జైళ్లో కసబ్‌ను ఉరికంబం ఎక్కించారు. కొన్ని నెలల తరువాత 2013, ఫిబ్రవరి 9న ఢిల్లీలోని తీహార్ జైళ్లో పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటగా మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి నాథూరాం గాడ్సే, నారాయణఆప్టేలను ఉరితీశారు. వారిని 1949, నవంబర్ 15న పంజాబ్‌లోని అంబాల జైళ్లో ఉరితీశారు. మాజీ ప్రధాని ఇంది రాగాంధీ హత్య కేసులో దోషులు సత్వంత్ సింగ్, కేహార్ సింగ్‌లకు 1989, జనవరి 6న మరణశిక్ష విధించారు. భారత్‌లో మరణశిక్షను రద్దు చేయాలంటూ దశాబ్దాలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. 2007లో ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను నిషేధించాలన్న ఐరాస ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 2012లోనూ ఐరాస ముందు అదే వైఖరిని స్పష్టంచేసింది. కాగా మెమన్ ఉరిని కశ్మీర్ వేర్పాటువాద హురియత్ సంస్థ నేతలు ఖండించారు. వారికీ ఇదే గతి పట్టాలి.. సాక్షి, ముంబై: మెమన్ను ఉరితీయడంపై 1993 ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది చట్టం సాధించిన విజయమన్నారు. పేలుళ్ల సూత్రధారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌లకు కూడా ఇదే గతి పట్టాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు 24.. 1864లో ఆంగ్లేయుల పాలనలో స్థాపించిన నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష అమలైన వారి సంఖ్య నేటికి 24కు చేరింది. ఇక్కడ 1984 నవంబర్ అయిదవ తేదీ చివరిసారిగా ఉరిశిక్ష అమలైంది. ఓ హత్య కేసులో మహారాష్ట్రలోని అమరావతికి చెందిన వాంఖడే సోదరులకు ఇదే జైల్లో ఉరిశిక్ష వేశారు. యాకూబ్ మెమన్ ఉరితో మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 58 మందికి మరణశిక్ష అమలు చేశారు. చివరి 3 గంటలు..! ఒకవైపు, మెమన్ ఉరిని ఆపేందుకు దేశ రాజధానిలోని అత్యున్నత న్యాయస్థానంలో ఆఖరి ప్రయత్నాలు సాగుతుండగానే.. అక్కడికి 1050 కి.మీ.ల దూరంలో ఉన్న నాగపూర్(మహారాష్ట్ర) సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ టైమ్‌లైన్.. తెల్లవారుజామున 4 గంటలు: ఒంటరిగా జైలుగదిలో ఉన్న యాకూబ్ మెమన్ వద్దకు జైలు అధికారులు వచ్చారు. 4.15: మెమన్ స్నానానికి వెళ్లారు. 4.30: ఆయనకు కొత్త దుస్తులు అందించారు. 4.45: అల్పాహారం అందించారు. 5.00: డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. 5.30: ప్రార్థన చేశారు. ఖురాన్ పఠించారు. 6.00: పక్కనున్న మరో సెల్‌లోకి మార్చారు. 6.15: ఉరికంబాన్ని, అక్కడి పీఠాన్ని, ఉరి బిగించడానికి ఉపయోగించే తాడు సామర్ధ్యాన్ని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి, అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ పరీక్షించారు. 6.30: నల్లని మందపాటి వస్త్రాన్ని ముఖానికి కప్పి, ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు. 6.45: టాడా కోర్టు తీర్పులోని అమలు భాగాన్ని నాగపూర్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్(సీజేఎం) చదివి వినిపించారు. 6.50: ఉరితీయడానికి ఉద్దేశించిన పీఠంపై నిల్చోబెట్టారు. మెడ చుట్టూ ఉరితాడు బిగించారు. 6.55: ఉరికంబంపై అన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా? అని తలారి, జైలుఅధికారులు పరీక్షించారు. 7.00: ఉరి తీయాలంటూ సీజేఎం సంజ్ఞ చేశారు. వెంటనే తలారి తన చేతిలోని లివర్‌ను లాగారు. 7.30: నిబంధనల ప్రకారం అరగంట పాటు ఉరి కంబానికి వేలాడదీశాక మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం వైద్యులు పరీక్షించి మరణించినట్లుగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శవపేటికలో ఉంచి, యాకూబ్ సోదరుడు సులేమాన్‌కు అప్పగించారు. ‘అన్ని అవకాశాలు పొందాడు’ వివిధ వేదికలపై తన వాదనలను వినిపించుకునే అన్ని అవకాశాలను యాకూబ్ మెమన్ పొందారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంలాంటి అంశాల్లో అంతా ఐక్యంగా ఉండాలన్నారు. ‘ఉగ్రవాదాన్ని ఒక సవాలుగా స్వీకరించాలి. ఐక్యగళం వినిపించాలి. అప్పుడే దాన్ని అంతం చేయగలం’ అని గురువారం విలేకరులతో వ్యాఖ్యానించారు. ‘ఒక క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు తెల్లవారుజామున విచారించడం ప్రపంచంలోనే తొలిసారి కావచ్చు. మరే వ్యవస్థలోనూ ఇంత పారదర్శకత ఉండదు.’ అని ఆయన అన్నారు. అంత తొందరేంటి?: ప్రశాంత్ భూషణ్ యాకూబ్ మెమన్ను ఉరితీసేందుకు అంత అసాధారణ తొందరపాటు ఎందుకని సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నించారు. ఇది రాజ్యం చేసిన ప్రతిహింస అని అధిక్షేపించారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసే అవకాశం మెమన్‌కు ఇవ్వలేదని ఆక్షేపించారు. మెమన్‌కు మద్దతుగా బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుప్రీంకోర్టులో వాదించిన లాయర్లలో భూషణ్ ఒకరు. ‘దర్యాప్తు అధికారులతో మెమన్ సహకరించాడు. సుప్రీంకోర్టు మెమన్‌కు విధించిన శిక్షను తగ్గిస్తే బావుండేది’ అని అభిప్రాయపడ్డారు. ఆ ముగ్గురికి భద్రత పెంపు న్యూఢిల్లీ: మెమన్ ఉరిపై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన త్రిసభ్య ధర్మాసనం సభ్యులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్, అమితవ రాయ్‌లకు భద్రతను పెంచారు. వీరి నివాసాల వద్ద బందోబస్తులో ఉండే పోలీసుల సంఖ్య పెంచడమే కాకుండా జడ్జిల నివాసప్రాంతంలో గస్తీని ముమ్మరం చేసినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మొహరించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. -
ఆ న్యాయమూర్తులకు పటిష్ఠ భద్రత
న్యూఢిల్లీ: మెమన్ ఉరిశిక్ష తీర్పుపై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఏర్పాటుచేసిన త్రిసభ్య ధర్మాసనం లోని సభ్యులకు కేంద్రం పటిష్ఠ భద్రతను ఏర్పాటచేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఉరిశిక్ష విధించాలన్న తీర్పు వెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఒకవేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని, తమ విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం త్రిసభ్య ధర్మాసనం ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. -
యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తి
ముంబై: యాకూబ్ మెమన్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం 5.15 గంటలకు ముగిశాయి. దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ ప్రాంతంలో బదాకబరస్థాన్ శ్మశాన వాటికలో ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అతడి తండ్రి సమాధి వద్దే యాకూబ్ ను పూడ్చిపెట్టారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఈ ఉదయం ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత యాకూబ్ మెమన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం మెమన్ భౌతిక కాయాన్ని ముంబైకు తరలించారు. మరోవైపు మెమన్ నివాసానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకుని అతడి కోసం ప్రార్థనలు చేశారు. అయితే ఎటువంటి నినాదాలు చేయొద్దని వారికి పోలీసులు సూచించారు. మెమన్ నివాసం వద్ద భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మొహరించారు. -
'కంటతడి పెట్టిన యాకూబ్ మెమన్'
నాగపూర్: ఉరికంబం ఎక్కడానికి ముందు యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడని నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు. దగ్గర బంధువులను చూడగాడనే కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలిపారు. బుధవారం తనను కలవడానికి వచ్చిన సోదరుడు సులేమాన్ ను చూసి కంటతడి పెట్టాడని వెల్లడించారు. అలాగే జైల్లో సహచర ఖైదీలకు చివరిసారిగా వీడ్కోలు చెప్పాడని, తాను ఏమైనా పొరపాట్లు చేసివుంటే మన్నించాలని వారిని కోరాడని చెప్పారు. ఉరికంబం ఎక్కడానికి ముందు మెమన్ వైద్య పరీక్షలు చేయించుకోలేదు. తాను ఫిట్ గా ఉన్నానని, వైద్య పరీక్షలు అవసరం లేదని జైలు డాక్టర్లతో చెప్పాడు. తెల్లవారుజామున ఖురాన్ చదివాడని జైలు అధికారులు వెల్లడించారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం మెమన్ కు అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. -
ఆ ఉరితాడు ఎక్కడ తయారైందో తెలుసా?
పట్నా: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ను ఉరితీయడానికి ఉపమోగించిన తాడును బిహార్ జైలు నుంచి పంపించినట్లు జైలు అధికారులు తెలిపారు. బుక్సార్ సెంట్రల్ జైలులో తయారుచేసిన ఈ తాడును మెమన్ ఉరితీత కోసం పంపినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్కే చౌదరి వెల్లడించారు. గతంలో దేశంలోని పలు జైళ్లలో కూడా ఈ తాడును వియోగించినట్లు చెప్పారు. తొలిసారిగా 2004లో 14 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసులో ధనంజయ్ బెనర్జీని ఉరితీయడానికి కోల్‌కతాకు ఈ తాడు చేరవేసినట్లు తెలిపారు. పార్లమెంట్ దాడులకు కారుకుడైన అఫ్జల్‌గురు, ముంబై దాడుల కేసులో నిందితుడు అజ్మల్ కసబ్ లను ఉరితీసేందుకు ఇక్కడ తయారుచేసిన తాడునే వాడినట్లు చౌదరి పేర్కొన్నారు. జే-34 కాటన్ వాడి తాడును తయారు చేశామని, ఆ తర్వాత మైనంతో దానిని మెత్తబడేలా చేస్తామని తయారీ పద్ధతిని వివరించారు. -
మెమన్ మృతదేహం బంధువులకు అప్పగింత
ముంబై : ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. ముంబై పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం ఉదయం నాగపూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలా వద్దా అనే అంశంపై అధికారులు చివరి వరకూ తర్జనభర్జన పడ్డారు. చివరకు కుటుంబ సభ్యులకే మెమన్ మృతదేహాన్ని అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో నాగపూర్ సెంట్రల్ జైలు నుండి అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్ లో కుటుంబసభ్యులు ముంబైకి తీసుకు వెళ్లారు. ముంబైలోని బాదా కబరిస్తాన్ లేది మెరైన్స్ లైన్స్, మాహింలోగాని మెమన్ అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాహింలోనే యాకూబ్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎలాంటి అల్లర్లు జరగకుండా భద్రతను పెంచారు. కాగా జైలు అధికారుల నిర్ణయం మీదట యాకూబ్ మెమన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని కెపి బక్సి వెల్లడించారు. అయితే కొన్ని ప్రత్యేక నిబంధనలను జైలు అధికారులు విధించారని తెలిపారు. -
ట్విట్టర్ టాప్ ట్రెండ్ లో మెమన్
న్యూఢిల్లీ : యాకూబ్ మెమన్ ను ఉరితీశారన్న వార్త ట్విట్టర్లో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. గురువారం ఉదయం అతడిని నాగ్‌పూర్ జైలులో ఉరితీసిన తర్వాత ట్విట్టర్ అకౌంట్లలో ఈ విషయాన్ని షేర్ చేయడం ప్రారంభించారు. యాకూబ్ హ్యాంగ్డ్, ఇండియాకాఇన్సఫ్, మెమన్ ఎట్ 9 ఏఎమ్ వంటి ట్యాగులతో ఖాతాదారులు ఈ వార్తను పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఆసక్తి కనబరుస్తున్నారు. యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘా మరింత పెంచారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్‌పై డేగకన్ను వేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు మెమన్ను ఉరిశిక్ష అమలు చేయటంతో... కేంద్ర హోంశాఖ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అందువల్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ సూచించింది. -
'కేంద్రం ఇటువంటి నిబద్ధతే చూపించాలి'
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్‌కి విధించిన తరహా శిక్ష ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారికి అనువర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆకాంక్షించారు. ఇలాంటి ఉగ్రవాదుల దాడికి పాల్పడిన వారిపై ఇటువంటి శిక్షలు అమలు చేసేందుకు నిబద్ధతే చూపించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దాడికి పాల్పడిన వారు ఎవరైనా వారి కులం, మతం, ప్రాంతం అనేవి పట్టించుకోకుండా ప్రభుత్యం, న్యాయస్థానాలు ఇలానే వ్యవహారిస్తాయని దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్‌కు గురువారం ఉదయం 7.00 గంటలకు నాగపూర్ జైలులో ఉరి తీశారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. -
జైలుకు బర్త్‌డే కేక్ పంపించారు
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమన్ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబసభ్యులు జైలు అధికారులకు బుధవారం రాత్రి బర్త్‌డే కేక్ పంపించారు. మెమన్ పుట్టినరోజు వేడుక జరపాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. క్షమాబిక్ష పిటిషన్‌పై వారు అప్పటివరకూ ఎన్నో అశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది మెమన్ తొలి పిటిషన్ ను తిరస్కరణను గురైన విషయం తెలిసిందే. మరోవైపు తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు. తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది. -
ఉరి అమలు ఇలా
-
జైల్లోనే మెమన్ అంత్యక్రియలు!
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్ మృతదేహానికి ఆ జైలు ఆవరణలోనే అంత్యక్రియలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు కాంప్లెక్స్ ప్రాంగణంలో మెమన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 1993 మార్చి 12న ముంబై 13 వేర్వేరు చోట్ల వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ను గురువారం ఉదయం 6:40 గంటలకు ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలనే డిమాండ్‌ను జైలు అధికారులు తిరస్కరించారు. శవపరీక్ష నివేదిక అందిన అనంతరం మెమన్ను జైలు ప్రాంగణంలోనే ఖననం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ముంబయిలోని మెమన్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
మెమన్ మృతదేహం ఆసుపత్రికి తరలింపు
నాగపూర్: నాగపూర్ కేంద్ర కారాగారంలో యాకుబ్ మెమన్‌కు ఉరి తీసిన అనంతరం అతడి మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. అక్కడ యాకుబ్ మృతదేహనికి శవపరీక్ష నిర్వహిస్తారు. దీనిపై వైద్యులు పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత యాకుబ్ మృతదేహన్ని అతడి బంధువులకు ఇవ్వవచ్చు... లేదా జైలు ప్రాంగణంలోనే అతడికి అంత్యక్రియలు నిర్వహించవచ్చు. ఆ అధికారం జైలు ఉన్నతాధికారులకు కలదు. అయితే యాకుబ్ మృతదేహన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా... జైలు ప్రాంగణంలోనే ఖననం చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. 1993లో ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ నిందితడి తేలడంతో కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. సదరు శిక్షను గురువారం ఉదయం 7.00 గంటలకు మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. -
యాకూబ్ వీలునామా రాయలేదు
యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయలేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశించినట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలను అదనపు డీజీపీ (జైళ్లు) మీరా బోర్వాంకర్ పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైలు భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. -
ఉరి అమలు ఇలా
జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందించారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇచ్చారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షించి, తర్వాత ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపించారు. మేజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేశాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం ప్రక్రియ ఉంటుంది. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షించారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారించారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పించారు. పదేళ్లలో నాలుగోది యాకుబ్ మెమన్ ఉరితీతతో కలిపి భారత్‌లో గత పదేళ్లలో నాలుగు ఉరిశిక్షలు మాత్రమే అమలయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004-2013 మధ్య దేశంలోని కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణశిక్షలు విధించాయి. వీరిలో ముగ్గురే ఉరికంబమెక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు14న బెంగాల్‌లోని అలిపోర్ జైలులో ఉరితీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసాయి కసబ్ ను 2012 నవంబరు 12న పుణే యెరవాడ జైల్లో ఉరితీశారు. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. గత పదేళ్లలో ఉరికంబమెక్కిన వారిలో యాకుబ్ నాలుగోవాడు కానున్నాడు. ఈ పదేళ్ల కాలంలో 3,751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి. -
హైదరాబాద్ లో భారీ భద్రత
హైదరాబాద్ : ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ జైలులో ఉరి నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను పటిష్టం చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్‌లో భారీగా భద్రత పెంచారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. యాకూబ్ మెమన్ ను ఈ రోజు ఉదయం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉరితీసిన విషయం తెలిసిందే. -
ఆ సమయంలో అక్కడే సోదరులు?
-
యాకూన్ ను ఉరితీసిన అధికారులు
-
ఆ సమయంలో అక్కడే సోదరులు?
ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ను ఉరి తీసే సమయంలో ఆయన సోదరులు సులేమాన్ తదితరులు నాగ్ పూర్ జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మెమన్ భార్య రహిన్ మాత్రం గురువారం ఉదయమే ముంబై నుంచి నాగ్ పూర్ బయల్దేరి వెళ్లారు. మెమన్ భౌతిక కాయాన్ని తమకు అప్పగించాల్సిందిగా ఆమె జైలు అధికారులను కోరనున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల నుంచి 6.50 గంటల మధ్యలో ఉరిశిక్ష అమలైంది. తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్ ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. అనంతరం ప్రార్థనలు కూడా జరిగాయి. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. తెల్లటి జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది. -
యాకూబ్ కు ఉరిశిక్ష అమలు
-
యాకూబ్ కు ఉరిశిక్ష అమలు
ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం 6:40 గంటలకు ఉరి తీశారు. చిట్టచివరి నిమిషంలో దాఖలైన పిటిషన్ ను దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు, ఆ పిటిషన్ ను కూడా కొట్టేయడంతో ఇక మెమన్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి. ముందు నుంచి సిద్ధంగా ఉన్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉరిశిక్షను అమలు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న సులేమాన్ మెమన్, సమీప బంధువు ఉస్మాన్ లను యాకూబ్ మెమన్ కలుసుకున్నారు. గత వారం మెమన్ తన భార్య రహిన్, కూతురు జుబేదా తదితరులను కూడా కలుసుకున్నారు. పుణె ఎర్రవాడ జైలు నుంచి నాగ్ పూర్ కు మెమన్ ను 2007 ఆగస్టులో తరలించారు. ఆ తర్వాత సరిగ్గా 7 సంవత్సరాల 11 నెలల 17 రోజులకు అతడిని ఉరి తీశారు. మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని బుధవారం ఉదయం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 13 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై (నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 257 మంది చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఏం జరిగింది ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణశిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. ఉరి తీయాల్సిందే మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. పదేళ్లలో నాలుగోది న్యూఢిల్లీ: యాకుబ్ మెమన్ ఉరితీతతో కలిపి భారత్‌లో గత పదేళ్లలో నాలుగు ఉరిశిక్షలు మాత్రమే అమలయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004-2013 మధ్య దేశంలోని కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణశిక్షలు విధించాయి. వీరిలో ముగ్గురే ఉరికంబమెక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు14న బెంగాల్‌లోని అలిపోర్ జైలులో ఉరితీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసాయి కసబ్ ను 2012 నవంబరు 12న పుణే యెరవాడ జైల్లో ఉరితీశారు. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. గత పదేళ్లలో ఉరికంబమెక్కిన వారిలో యాకుబ్ నాలుగోవాడు కానున్నాడు. ఈ పదేళ్ల కాలంలో 3,751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి. మరికొన్ని అంశాలు.. ► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ► అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష -
కంచుకోటలా మారిపోయిన నాగ్ పూర్ జైలు
-
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు మెమన్‌కు ఉరి
-
'అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి'
ముంబై : నేడు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష విదిస్తున్నందున అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో నాగ్ పూర్, ముంబైలలోమహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ముంబై, నాగ్‌పూర్‌లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మత పెద్దలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
భోజనం తినలేదు..
తెల్లటి పొడవాటి గెడ్డం.. తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ అత్యంత ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు తనకు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు. సీఏ పూర్తి చేసిన మెమన్.. దాంతోపాటు పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు లిటరేచర్ లలో రెండు మాస్టర్స్ డిగ్రీలు కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. జైల్లో ఖైదీలకు అతడు బోధించేవాడు. దాంతో నాగ్ పూర్ జైల్లో ఉన్న ఖైదీలు అందరికీ మెమన్ బాగా తెలుసు. అయితే బుధవారం మాత్రం ఇతర ఖైదీలను మెమన్ తో కలవనివ్వలేదు. కాగా, నిబంధనల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మెమన్ ను నిద్ర లేపారు. -
స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
-
మెమన్ ఆఖరి ప్రయత్నమూ విఫలం
-
అర్ధరాత్రి హైడ్రామా
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ క్షమాభిక్షపిటీషన్ని తిరస్కరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మెమన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరికొందరు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు రాత్రి 12 గంటల సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కూడా అక్కడకు చేరుకొని మెమన్ తరఫు న్యాయవాదుల పిటీషన్లను తీసుకొని సీజేఐ కు సమర్పించారు. క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. తెల్లవారుజామున మూడుగంటలకు సుప్రీం కోర్టులోని హాల్లో మెమన్ ఉరిశిక్ష వాయిదాకు సంబంధించిన తుది విచారరణ ప్రారంభమైంది. అంతకు ముందులాగే ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు మెమన్ ఉరిశిక్ష నిలిపివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉరిశిక్ష అమలుకు 10గంటల ముందు దాఖలు చేసిన క్షమాభిక్షపిటీషన్ చెల్లు బాటుకాదని, నిజానికి ఈ కేసులో వాస్తవ న్యాయప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయిందని ఆటార్నిజనరల్ ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. ఇంతకు ముందు క్షమాభిక్షపిటీషన్ మెమన్ సోదరుడు దాఖలు చేయగా, తాజాగా బుధవారం రాష్ట్రపతికి అందిన పిటిషన్ మెమన్ ఇచ్చిందని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రం నుంచి శిక్షఅమలుకు 14 రోజుల వ్యవధి ఉండాలని మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా తీర్పువెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగినట్లయింది. -
నేరము శిక్ష
► యాకూబ్ మెమన్ను 1994 ఆగస్టు 5న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశామని సీబీఐ చెప్తోంది. కానీ.. తాను 1994 జూలై 28న నేపాల్‌లో పోలీసులకు లొంగిపోయానని అతడన్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్నపుడు యాకూబ్ కరాచీలో ఉండగా జరిపిన సంభాషణల ఆడియో రికార్డును కూడా అతడి బ్రీఫ్‌కేసు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నప్పటి నుంచీ అతడిని తొలుత ఎరవాడ జైలులో ఉంచారు. 2007 ఆగస్టులో నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు బదిలీచేశారు. యాకూబ్ ఆ జైలు నుంచే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో, రాజకీయశాస్త్రంలో ఎం.ఎ. పట్టాలు పొందాడు. ► యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ 1962 జూలై 30న ముంబైలో పుట్టాడు. ముంబైలోనే కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. 1990లో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేశాడు. 1991లో బాల్య స్నేహితుడు చేతన్ మెహతాతో కలిసి ‘మెహతా అండ్ మెమన్ అసోసియేట్స్’ పేరుతో చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థను నెలకొల్పాడు. ఆ తర్వాతి ఏడాది వారు విడిపోయారు. యాకూబ్ ‘ఏఆర్ అండ్ సన్స్’ పేరుతో అకౌంటెన్సీ సంస్థను ప్రారంభించాడు. మరుసటి ఏడాదే ముంబై మెమన్ సమాజం నుంచి ‘ఈ ఏడాది ఉత్తమ చార్టర్డ్ అకౌంటెంట్’ అవార్డు పొందాడు. మాంస ఉత్పత్తులను ఎగుమతి చేసే ‘తేజ్రాత్ ఇంటర్నేషనల్’ అనే ఎగుమతి సంస్థను యాకూబ్ స్థాపించాడు. ► 1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రణాళికారచన, అమలులో దావూద్ ఇబ్రహీంకు, తన సోదరుడైన టైగర్ మెమన్‌కు యాకూబ్ ఆర్థికంగా సాయం చేశాడని దర్యాప్తు సంస్థల అభియోగం. అలాగే.. టైగర్‌మెమన్ నిధుల నిర్వహణతో పాటు.. ఆయుధాలు, పేలుడు పదార్థాల వినియోగంలో 15 మందికి పాకిస్తాన్లో శిక్షణ కార్యక్రమానికి కూడా యాకూబ్ నిధులు సమకూర్చాడని ఆరోపణ. ► యాకూబ్‌ను నేరపూరిత కుట్ర అభియోగం కింద దోషిగా నిర్ధారించిన టాడా కోర్టు అతడికి 2007 జూలై 27న ఉరిశిక్ష విధించింది. ‘ఉగ్ర’దాడికి సాయం చేయటం, ప్రోత్సహించటం; ఆయుధాలలను అక్రమంగా కలిగివుండటం, రవాణా చేయటం; ప్రాణాలు హరించే ఉద్దేశంతో పేలుడు పదార్థాలు కలిగివుండటం అభియోగాల్లో కూడా అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. ఆ నేరాలకు గాను జీవిత ఖైదు, 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ► టాడా కోర్టు తీర్పుపై మరో 100 మందితో పాటు యాకూబ్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అతడికి విధించిన మరణశిక్ష నిర్థరణ కోసం కోర్టులో రిఫరెన్స్ పిటిషన్ వేసింది. వీటిపై 2011 నవంబర్ 1న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు 2013 మార్చి 21న తీర్పు ఇస్తూ.. యాకూబ్‌ను నాటి దాడుల వెనుక ‘మాస్టర్‌మైండ్’గా, ‘డ్రైవింగ్ఫోర్స్’గా అభివర్ణిస్తూ.. అతడికి విధించిన ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో 10 మందికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఈ ఖైదు పడ్డ 18 మందిలో 16 మంది ఆ శిక్షను ఖరారు చేసింది. ► ఆ తర్వాత.. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ యాకూబ్ రివ్యూ పిటిషన్ వేశారు. 2013 జూలై 30వ తేదీన.. సుప్రీం ద్విసభ్య బెంచ్ మౌఖికంగా విచారించాలని కోరిన యాకూబ్ దరఖాస్తును తిరస్కరించింది. రివ్యూపిటిషన్‌ను కొట్టివేసింది. మరణశిక్ష తీర్పులపై రివ్యూ పిటిషన్లను మౌఖికంగా విచారించాలనియాకూబ్ రిట్ పిటిషన్ వేశాడు. ►2013 ఆగస్టు 14న యాకూబ్‌కు మరణశిక్ష అమలు చేయటానికి మహారాష్ట్ర ప్రభుత్వం తొలి డెత్ వారంట్ జారీ చేసింది. ► క్షమాభిక్ష కోసం యాకూబ్ చేసుకున్న దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 ఏప్రిల్ 11న తిరస్కరించారు. ► మరణశిక్ష తీర్పుల సమీక్షను.. చాంబర్లలో కాకుండా బహిరంగ కోర్టులో విచారించాలని యాకూబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ విచారిస్తున్నందున.. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలును నిలిపి ఉంచాలంటూ 2014 జూన్ 2న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ► యాకూబ్ రివ్యూ పిటిషన్‌పై 2015 మార్చి 24న కోర్టు హాలులో విచారణ మొదలైంది. అతడి తరఫున సీనియర్ న్యాయవాది జస్పాల్సింగ్ వాదించారు. 2015 ఏప్రిల్ 9న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత యాకూబ్ క్యురేటివ్ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు ఈ నెల 21వ తేదీన దానిని తిరస్కరించింది. ► ఈలోగా.. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలు చేయటానికి జూలై 30వ తేదీని నిర్ణయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ వారంట్ జారీ చేసింది. దీంతో యాకూబ్ మహారాష్ట్ర గవర్నర్‌కు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకున్నాడు. అలాగే.. తనకు చట్టపరంగా గల ప్రత్యామ్నాయాలన్నిటినీ వినియోగించుకోకముందే డెత్ వారంట్ జారీ చేయటం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ.. క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం వచ్చే వరకూ తనకు ఉరిశిక్ష అమలు చేయటాన్ని నిలిపివేయాలని కోరుతూ జూలై 23న సుప్రీంలో రిట్ పిటిషన్ వేశాడు. ► జూలై 28: యాకూబ్.. తాను సమర్పించిన క్యూరేటివ్ పిటిషన్‌పై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. దానిపై నిర్ణయం తీసుకునే విషయంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అవసరమైన కోరం హాజరు కాలేదని తాజా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తూ.. దీనిపై అత్యవసరంగా విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తిచేశారు. ► జూలై 29: ప్రత్యేకంగా ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం.. యాకూబ్‌కు మరణశిక్ష అమలుపై స్టే విధించటానికి నిరాకరించింది. యాకూబ్ మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగరరావుకు క్షమాభిక్ష దరఖాస్తు సమర్పించారు. ఆయన దానిని తిరస్కరించారు. దీంతో యాకూబ్ మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును సమర్పించారు. -
1993 ముంబై పేలుళ్లు..
1993 మార్చి 12వ తేదీ.. ముంబై నగరం ఉగ్రరక్కసి కరాళనృత్యంతో నెత్తురోడిన రోజు. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలుకొని 3:40 గంటల వరకూ 13 చోట్ల వరుస విరామాలతో బాంబు పేలుళ్లు సంభవించాయి. 257 మంది అమాయకులు చనిపోగా, 713 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల కుట్ర పన్నింది మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అని.. అతడికి సహచరుడైన టైగర్ మెమన్, అతడి సోదరులైన యాకూబ్ మెమన్, ఈసామెమన్, యూసుఫ్‌లు సాయం చేశారని దర్యాప్తు సంస్థలు నిగ్గుతేల్చాయి. అంతకు 4 నెలల ముందు 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీమసీదు విధ్వంసం.. తదనంతరం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ముంబైలోనూ చెలరేగిన మతఘర్షణలు ఈ బాంబు దాడులకు కారణంగా చెప్తారు. ముంబై అల్లర్లలో దాదాపు 900 మంది చనిపోయారు. దీంతో ముంబైలో బాంబు పేలుళ్లతో రక్తపాతానికి పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ వ్యూహరచనతో దావూద్ ముఠా కుట్రపన్నింది. నగరంలో మైనారిటీ వర్గానికి చెందిన 19 మంది యువకులను ప్రలోభపెట్టి.. తొలుత దుబాయ్‌కి, అక్కడి నుంచి పాక్‌కు తరలించి.. బాంబులు, మారణాయుధాల వినియోగంలో శిక్షణనిచ్చారు. వారు ముంబైకి తిరిగివచ్చి నగరంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ముంబై పోలీసులు.. రెండు రోజుల్లోనే మాఫియా డాన్ దావూద్ హస్తాన్ని గుర్తించారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. వారిలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ను 1993 ఏప్రిల్ 19న అరెస్ట్ చేశారు. ఆయన అక్రమంగా ఆయుధాలు కలిగివుండటం, సాక్ష్యాలను ధ్వంసం చేయటం అభియోగాల కింద అరెస్ట్‌చేశారు. 1993 నవంబర్ 4వన.. 189 మంది నిందితులపై 10 వేల పేజీలతో ప్రత్యేక టాడా కోర్టులో అభియోగపత్రం నమోదుచేశారు. అప్పటికే దావూద్, టైగర్ మెమన్లు పాక్‌లో తలదాచుకుని ఉండటం.. కేసు తీవ్రత దృష్ట్యా అదే ఏడాది నవంబర్ 19న దర్యాప్తు సీబీఐకి బదిలీ అయింది. టాడా కోర్టు.. 1995 ఏప్రిల్ 10వ తేదీన నిందితుల్లో 26 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. సుప్రీం మరో ఇద్దరిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. ఇద్దరు నిందితులు అప్రూవర్లుగా మారారు. 1996 మార్చి 26న టాడా కోర్టు జడ్జీగా పి.డి.కోడె నియమితులయ్యారు. 684 మంది సాక్షుల పరిశీలన 2000 అక్టోబర్ వరకూ కొనసాగింది. 2006 సెప్టెంబర్ 12 నుంచి కోర్టు తీర్పులు వెలువరించింది. మెమన్ కుటుంబంలో నలుగురిని దోషులుగా ప్రకటించింది. మరో ముగ్గురిని సందేహలాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిర్దోషులుగా వదిలిపెట్టింది. మొత్తం 100 మందికి శిక్షలు ప్రకటించింది. వారిలో యాకూబ్ సహా 12 మందికి మరణశిక్ష, 18 మందికి జీవితఖైదు విధించింది. అయితే దావూద్ ఇబ్రహీం, టైగర్‌మెమన్ పరారీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు.. యాకూబ్ మెమన్‌కు విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. మిగతా వారికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుకు తగ్గించింది. సంజయ్‌దత్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ.. అక్రమంగా ఆయుధాలు కలిగివుండటం, సాక్ష్యాలను ధ్వంసం చేయటం నేరాల కింద టాడా కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. సుప్రీం శిక్షను ఖరారు చేయడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. →101 2015 జూలై నాటికి 101 దేశాల్లో మరణశిక్షను రద్దు చేశారు. ఎంత ఘోరమైన నేరానికైనా మరణశిక్ష ఉండదు. →22 2014లో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలు మరణశిక్షను అమలు చేశాయి. →2,466 2014లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 2,466 మందికి మరణదండన విధించారు. 2013తో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ. -
మెమన్‌కు ఉరి
నాగపూర్ సెంట్రల్ జైల్లో నేడు ఉదయం అమలు ► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష ఉరిపై ఉత్కంఠకు తెరపడింది! చర్చోపచర్చలు, వాదోపవాదాలు ముగిశాయి. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు మరణశిక్ష అమలు ఖరారైంది. శిక్షను తప్పించుకునేందుకు అతడు చివరికి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగ్‌పూర్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు అతడి పుట్టిన రోజు కూడా! శిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సైతం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తిరస్కరించారు. ఇక ఆఖరిగా.. క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మరోసారి రాష్ట్రపతిని ఆశ్రయించారు. రాత్రి 10.45 గంటల సమయంలో.. క్షమాభిక్షను తోసిపుచ్చుతూ రాష్ట్రపతి నిర్ణయం వెలువరించారు. ఇక ఉదయం శిక్ష అమలు కావడమే మిగిలింది!! న్యూఢిల్లీ/నాగపూర్: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరణశిక్ష అమలు ఖరారైంది. మరణశిక్షను తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు(గురువారం) ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్ను ఉరి తీయనున్నారు. ఇదే రోజు మెమన్ పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ జులై 30న మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 12 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై(నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ.. విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! సోమవారం మరణించిన మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణ శిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. సుప్రీం తీర్పును పలువురు న్యాయనిపుణులు తప్పుపట్టారు. సాక్ష్యాలను తీసుకొచ్చి, దర్యాప్తులో సాయపడ్డ వ్యక్తిని ఉరితీస్తున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఉరి తీయాల్సిందే..మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన..ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ: కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. ‘అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెమన్ను మోసం చేయడం వల్లనే మెమన్‌కు ఉరి శిక్ష పడింది. రాజీవ్ హంతకులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హంతకులకు ఉన్నట్లుగా మెమన్‌కు రాజకీయపరమైన మద్దతు లేకపోవడం కూడా ఒక కారణం’ అని వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఉరి అమలు ఎలా..! జైలు మాన్యువల్ ప్రకారం.. యాకూబ్ మెమన్ను గురువారం వేకుజామున నిద్ర లేపుతారు. స్నానాదికాలు పూర్తయ్యాక తేలిగ్గా ఉండే ఆహారం అందిస్తారు. తర్వాత ప్రార్థన చేసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఇస్తారు. మరణశిక్ష అమలు చేసే ముందు వైద్యులు మెమన్ను పరీక్షిస్తారు. ఆ తరువాత ఉరికంబం వద్దకు తీసుకువెళ్తారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్‌పాండే టాడా కోర్టు ఉత్తర్వుల్లోని ఉరిశిక్ష అమలు భాగాన్ని మెమన్‌కు చదివి వినిపిస్తారు. మెజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు రాగానే తలారి తన చేతిలో ఉన్న లివర్‌ను లాగి, ఉరిశిక్ష అమలు చేస్తాడు. అరగంట పాటు ఆ శరీరం అలాగే ఉరికంబంపై వేలాడుతూ ఉండాలని జైలు మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఆ తరువాత వైద్యుడు పరీక్షించి, చనిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ఆ తరువాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. ఉరి అమలు చేసే ముందు, మెమన్ బరువును ఉరికంబం, ఉరితాడు తట్టుకోగలదా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారు. మెమన్ బరువుకు ఒకటిన్నర బరువున్న వస్తువుతో ప్రయోగం చేసి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. ఎరవాడ జైల్లో అఫ్జల్ కసబ్‌ను ఉరితీసిన బృందాన్ని మెమన్ ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు నాగపూర్ జైలుకు రప్పిస్తున్నారు. జైలు వద్ద పటిష్ట భద్రత యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పూర్తయ్యాయని నాగపూర్ జైలు వర్గాలు వెల్లడించాయి. అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ ఆ సన్నాహాలను పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైళ్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు. ఆ తర్వాత నాగ్‌పూర్ నుంచి విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారు. ముందు జాగ్రత్తగా, ముంబైలోని మెమన్‌ల నివాసం వద్ద ఏకంగా ఐదువేల మంది పోలీసులను నియమించారు. నేరచరిత్ర కలిగిన వారిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. శాంతిని కాపాడాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఇదివరకే పోలీసులు మతపెద్దలను కోరారు. కాగా, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలని ప్రజలను కోరారు. యాకూబ్ వీలునామా రాయలేదు యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయ లేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
మెమన్ 'ఉరి శిక్ష అమలు'లో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. ఉరి శిక్ష వాయిదాపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడనందున షెడ్యుల్ ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు మెమన్ను ఉరి తీసేందుకు నాగ్‌పూర్ జైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో నాగ్ పూర్ ముంబైలలోమహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మిగాతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. మరోవైపు నాగ్‌పూర్ హోటల్లో ఉన్న మెమన్ కుటుంబ సభ్యులకు పోలీసులనుంచి ఉరిశిక్ష అమలుకు సంబంధించి లేఖ అందింది. గురువారం తెల్లవారుజామున 2.10 సమయంలో ఒక పోలీసు అధికారి హోటల్లో బస చేస్తున్న మెమన్ కుటుంబ సభ్యులకు ఆ లేఖని అందించాడు. -
ఉరితో యాకూబ్ హోరాహోరీ
ఉరితాడుతో ముంబై బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకూబ్ మెమన్ సాగించిన హోరాహోరీ పోరాటం ముగిసింది. 23 ఏళ్లుగా నాగపూర్ జైల్లో... ప్రత్యేకించి ఎనిమిదేళ్లుగా ఉరితాడు నీడలో ఉంటున్న యాకూబ్‌కు గురువారం ఉదయం మరణశిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం చకచకా సంభవించిన పరిణామాలన్నీ యాకూబ్కున్న దారుల్ని మూసేశాయి. క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్నాయంటున్న కొన్ని సాంకేతిక లోపాలపైనా, అన్ని అవకాశాలూ ముగియక మునుపే మహారాష్ట్ర ప్రభుత్వం ‘డెత్ వారంట్’ జారీచేయడంపైనా వచ్చిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చగా... అంతకు కొన్ని గంటలముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అతని క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఇక యాకూబ్ తరఫున భిన్న రంగాలకు చెందిన ప్రజాస్వామికవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు దాఖలు చేసి ఉన్న క్షమాభిక్ష పిటిషన్ ఒక్కటే మిగిలింది. దాన్ని తోసిపుచ్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రణబ్‌కు సలహా ఇచ్చారు. ఆ సలహాకు భిన్నంగా ఆయన వ్యవహరించకపోవడానికే ఆస్కారం ఉంది. మరోపక్క యాకూబ్ న్యాయవాదులు అర్ధరాత్రి రెండోసారి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. మార్చి 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్ల వ్యవహారంలో యాకూబ్‌కు, మరో 10మందికి టాడా ప్రత్యేక కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. వీరిలో యాకూబ్ మినహా మిగిలినవారి ఉరిశిక్షలను సుప్రీంకోర్టు రెండేళ్లక్రితం యావజ్జీవ శిక్షలుగా మార్చింది. ముంబై మహానగరంలో ఒక హిందూ స్నేహితుడితో కలిసి చార్టెర్డ్ అకౌంటెంట్‌గా గౌరవనీయమైన స్థానంలో ఉన్న యాకూబ్ ఉరిశిక్షకు అర్హమైన నేరంలో దోషిగా రుజువుకావడం...53 ఏళ్ల వయసులో తన పుట్టినరోజునే ఉరికంబం ఎక్కాల్సిరావడం ఒక వైచిత్రి. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా అలుముకున్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలే దీనంతటికీ కారణం. ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరున, 1993 జనవరి మొదటి వారంలో ముంబైలో చోటుచేసుకున్న మతకలహాల్లో 900మంది మరణించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ఇందుకు ప్రతిగా నగరంలో జనసమ్మర్ధంగా ఉండే 12 ప్రాంతాల్లో పేలుళ్లు జరిగి 257మంది మరణించారు. దేశ చరిత్రలో ఆర్డీఎక్స్ను వినియోగించడం అదే ప్రథమం. ఈ పేలుళ్ల వ్యవహారంలో మెమన్ కుటుంబం పాత్ర వెల్లడై వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించేసరికే అందరూ దేశం దాటి వెళ్లిపోయారు. పెద్దవాడైన టైగర్ మెమన్, ఆయన కుటుంబం ఇప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలోనే తలదాచుకుంటున్నారు. ఇప్పుడు యాకూబ్ మెమన్ కంఠానికి బిగుసుకుంటున్న ఉరిపై సాగిన వివాదం రెండు దశాబ్దాలక్రితం ఇందిరాగాంధీ హత్య కేసులో మాజీ పోలీస్ అధికారి కేహార్సింగ్కు పడిన ఉరిపైనా...పార్లమెంటుపై దాడి కేసులో రెండేళ్లక్రితం అఫ్జల్ గురుకు అమలైన ఉరి విషయంలోనూ అల్లుకున్న చర్చలు గుర్తొస్తాయి. ఆ రెండు సందర్భాల్లోనూ దోషులుగా నిర్ధారణ అయినవారికి అన్యాయం జరిగిందని ప్రజాస్వామికవాదులు భావించారు. ఇప్పుడు యాకూబ్ కేసులోనూ అలాంటి వాదనలే వినిపిస్తున్నాయి. అయితే శిక్షను వ్యతిరేకిస్తున్నవారిలో రెండు రకాల వారున్నారు. పేలుళ్ల పథకరచన యాకూబ్‌కు తెలియదని వాదిస్తున్నవారు కొందరైతే...ఆయన ఖచ్చితంగా నేరస్తుడేనని, అయినా ఉరి సరికాదని అంటున్నవారు మరికొందరు. నేరస్తుడని విశ్వసించినా ఉరి వద్దని చెప్పినవారిలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ ఉన్నతాధికారి రామన్ ముఖ్యులు. యాకూబ్ కరాచీనుంచి భారత్ రావడానికి జరిగిన ఆపరేషన్‌లో ఆయన భాగస్వామి. ఉరి శిక్ష పడదని హామీ ఇచ్చాకే ఆయన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కళ్లుగప్పి వచ్చాడని రామన్ వెల్లడించారు. వస్తూ ఐఎస్ఐ పాత్రను నిర్ధారించే అనేక పత్రాలనూ, సీడీలనూ, తమకు ఆశ్రయమిచ్చిన ఇంటి పరిసరాల వీడియోలనూ తీసుకొచ్చాడు. మారు పేరుతో తనకు పాక్ ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టును ఇచ్చాడు. అతని సహకారం లేకపోతే మన దేశంలో పాక్ సాగిస్తున్న దుశ్చర్యల గురించి బయటి ప్రపంచానికి చూపేందుకు సాక్ష్యాలే ఉండకపోయేవని రామన్ చెప్పారు. రాజ్యం తరఫున ఇచ్చిన హామీని గౌరవించకపోతే రేపన్నరోజున ఏ ఉగ్రవాదీ సహకరించడన్నది ఆయన వాదన. కేసు కోర్టు ముందుకు వెళ్లేసరికే రామన్ రిటైరయ్యారు. ఇప్పుడైతే ఆయన జీవించి లేరు. అసలు యాకూబ్‌కు అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. రామన్ అత్యంత విశ్వసనీయత కలిగిన అధికారి గనుక ఆయన అబద్ధమాడారని భావించలేం. యాకూబ్ తోడ్పడిన తీరుకు సంబంధించిన అంశాలను ఆ కేసుతో వ్యవ హరించిన సీబీఐ అధికారులు టాడా కోర్టు ముందు ఎందుకు ఉంచలేదో, అతనికిచ్చిన హామీ నుంచి ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఈ విషయమై సుప్రీంకోర్టు సైతం తన నిస్సహాయత వ్యక్తంచేసింది. అది కార్యనిర్వాహక వ్యవస్థ చేతుల్లోనే ఉంటుందని చెప్పింది. మరణశిక్ష సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. సోమవారం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం ప్రాణం పోయలేని వ్యక్తికి ప్రాణం తీసే హక్కు ఉండరాదని అభిప్రాయపడ్డారు. 139 దేశాలు తమ శిక్షాస్మృతులనుంచి మరణశిక్షలను తొలగించాయి. అందువల్ల ఆ దేశాల్లో నేరాలేమీ పెరగలేదు. ఈ శిక్ష ఉండొద్దని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. చట్టంలో ఆ శిక్ష ఉన్నంతవరకూ న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా కోర్టులు కూడా ఏమీ చేయలేవు. యాకూబ్ విషయంలో చెలరేగిన వాదోపవాదాలు, కలాంవంటివారి అభిప్రాయలు కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం మరణశిక్ష కొనసాగింపుపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. -
క్షమాభిక్షపై అర్ధరాత్రి హైడ్రామా
హస్తిన కేంద్రంగా యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ లాంటి అంశాలపై బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, రాత్రి దాదాపు 8 గంటల నుంచి 10.30 గంటల వరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. రాష్ట్రపతి భవన్ లోనే, ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీ ఇదే అంశంపై సాలిసిటర్ జనరల్ ను కూడా సలహా అడిగారు. అన్నీ అయిన తర్వాత రాత్రి 10.45 గంటల సమయంలో యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు బయటకు తెలిసింది. దాంతో ఉత్కంఠకు తెరవీడింది. మరోవైపు మహారాష్ట్రలోని నాగపూర్ లో కూడా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. నాగపూర్ మొత్తం 144 సెక్షన్ విధించారు నాగపూర్ జైలు బయట నిషేధాజ్ఞలు విధించారు ముంబైలో పోలీసు ఉన్నతాధికారులంతా సమావేశమయ్యారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం రాగానే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు నాగపూర్ జైలు అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు -
మెమన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండోసారి కూడా తిరస్కరించారు. మెమన్‌కు క్షమాభిక్ష పెట్టేందుకు గతేడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించాల్సిందిగా రాష్ట్రపతికిసూచించారు. మెమన్ను గురువారం ఉదయం 7 గంటల్లోపు ఉరి అమలు చేస్తారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాత్రి 10.40 గంటల వరకు రాష్ట్రపతి భవన్ వద్దే ఉండి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చర్చించారు. మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన అబ్దుల్ కలాంకు నివాళిగా మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. దీనికి తోడు తనకు క్షమాభిక్ష పెట్టాలని మరోసారి రాష్ట్రపతిని మెమన్ అభ్యర్థించాడు. దీనిపై పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. -
క్షమాభిక్షపైనే మెమన్ చివరి ఆశలు
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా కోరారు. క్షమాభిక్ష పిటిషన్ ను బుధవారం సాయంత్రం హోంశాఖను పంపించారు. యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష తిరస్కరించాలని రాష్ట్రపతికి హోంశాఖ సలహా ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా రాష్ట్రపతిని కలిసి విన్నవిస్తారని సమాచారం. హోంశాఖ సూచనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. క్షమాభిక్ష తిరస్కరిస్తే గురువారం యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు చేస్తారు. మరోవైపు రాష్ట్రపతి క్షమాభిక్షపైనే మెమన్ చివరి ఆశలు నిలుపుకున్నాడు. ఈ రాత్రికి నిర్ణయం వెలువడే అవకాశముంది. -
వారిని ఎందుకు వదిలేశారు..
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబుపేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను ఖరారు చేయడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేసిన ఒవైసీ.. మెమన్ మరణశిక్షపై విమర్శలు గుప్పించారు. యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. బుధవారం అతనికి మరణశిక్షను ఖరారుచేసింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దోషులకు శిక్ష పడాల్సిందే.. మరి బాబ్రీ మసీదును కూల్చేసిన విధ్వంసకుల మాటేమిటని ప్రశ్నించారు. వారికి శిక్షలు ఎందుకు విధించరని ప్రశ్నించారు. ఒకవైపు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు శిక్షలు తగ్గిస్తూ, మరోవైపు మెమన్‌కు శిక్ష ఖరారు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. అయితే అందరూ సంయమనం పాటించాలని.. చట్టాలను, కోర్టులను గౌరవించాలన్నారు. శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ మద్దతు లేనందువల్లే యాకూబ్‌కు ఉరిశిక్షను విధించారనేదే ఇప్పటికీ తన అభిప్రాయమన్నారు. యాకూబ్ పోలీసుల ముందు లొంగిపోయి, కీలకమైన సమాచారం అందించాడన్నారు. అయినా అప్పటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు యాకూబ్‌కు న్యాయం చేయలేదని, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాం జెఠ్మలానీ ,శతృఘ్నసిన్హా తదితరులు కూడా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్నారని ఒవైసీ గుర్తు చేశారు. -
10 ఏళ్లలో మూడు మరణశిక్షలు
న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షను ఖరారుచేసింది. అనేక చర్చోపచర్చలు, వాదనల తర్వాత టాడా అతనికి విధించిన డెత్ వారెంట్ శిక్షను సమర్ధించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమన్ ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రెండోసారి కూడా తిరస్కరిస్తే గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు కావడం ఖాయం. గత పదేళ్లలో కోర్టులు విధించిన మరణశిక్షలు, అమలైన ఉరిశిక్షను ఒకసారి పరిశీలిస్తే.. భారతదేశంలో 2004 నుంచి 2013 మధ్య కాలంలో నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 1303 మందికి మరణశిక్షలు విధించారు. అయితే వీరిలో ముగ్గురికి మాత్రమే ఈ శిక్ష అమలైనట్టు లెక్కలు చెబుతున్నాయి. గత పదేళ్లలో మూడు ఉరిశిక్షలు 1. పశ్చిమ బెంగాల్ (2004): ఒక బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉదంతంలో ధనుంజయ్ చటర్జీని ఆగస్టు 14 అలీపూర్ కేంద్ర కారాగారంలో ఉరితీశారు. యాదృచ్ఛికంగా ఆ రోజు అతని 42 వ పుట్టినరోజు. 2. మహారాష్ట్ర (2012): 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను పుణే ఎర్రవాడ జైలులో నవంబర్ 21న ఉరి తీశారు. 3. న్యూఢిల్లీ(2013): 2001 పార్లమెంటు దాడి కేసులో ఉగ్రవాది మహమ్మద్ అఫ్జల్ గురుకు సుప్రీం విధించిన మరణశిక్ష ఫిబ్రవరి 9 న అమలైంది. ఇదిలా ఉంటే రేపు జూలై 30న యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలైతే, పుట్టినరోజు నాడు ఉరిశిక్ష అమలైన దోషులలో మెమన్ రెండో వాడవుతాడు. కాగా సుమారు 3,751 మంది దోషులకు విధించిన ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ముస్లిం కాబట్టే మెమన్ ను ఉరితీస్తున్నారన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 170 (మెమన్‌తో కలిపి) మందికి ఉరిశిక్ష పడితే వారిలో 15 మంది ముస్లింలకు ఉరిశిక్షలు అమలయ్యాని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. అయితే సుమారు 60 మంది ముస్లింలను (వారి ఇంటిపేర్ల ఆధారంగా) ఉరితీశారని ఏఎన్ఐ రిపోర్టు. మరోవైపు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారుకావడంలో ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మా జీవితంలో మర్చిపోలేని రోజన్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల ఆత్మలకు 22 ఏళ్ల తరువాత శాంతి చేకూరిందని దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతున్నారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ న్యాయచరిత్రలో ఇది చీకటిరోజని ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది సతీష్ మానే షిందే వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ నేరాల కారణంగా ఉరికంబాలు ఎక్కుతున్నవారిలో పేదలు, వెనుకబడిన వర్గాల వారే అధికంగా ఉంటున్నారని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా గతంలో వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌కలాం కూడా మరణశిక్షలను వ్యతిరేకించారు. డీఎంకే నేత కనిమొళి, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తదితరులు మరణశిక్షలను వ్యతిరేకించిన వారిలో ఉండగా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మరణశిక్షలను సమర్థించింది. -
మెమన్‌కు ఉరి సరే... మరి బాబ్రీ కేసు?
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ను ఉరి శిక్షను సుప్రీం కోర్టు బుధవారం నాడు ఖరారు చేసింది. ఉరి శిక్ష సబబా, కాదా ? అన్న అంశాన్ని పక్కన పెడితే... ఈ వరుస బాంబు పేలుళ్లకు దారితీసిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసు సంగతేమిటీ? ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణను ఇటు కేంద్రం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద విచారించి శిక్ష వరకు తీసుకెళ్లాయి. అంతకు దాదాపు మూడు నెలల ముందు, అంటే 1992, డిసెంబర్ 6వ తేదీన జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో విచారణ కూడా కొలిక్కి రాకపోవడానికి కారణం ఏమిటీ? యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చిన వారు, ముఖ్యంగా బీజేపీ, శివసేన కార్యకర్తలు కనీసం బాబ్రీ విధ్వంసం కేసు గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? తమ నేతలే ఆ కేసులో నిందితులుగా ఉండడం వల్లనా! నేరం ఏదైనా నేరమే. న్యాయం ఎవరికైనా ఒక్కటే కావాలన్నది మన ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి. మన పాలకులకు ఆ స్ఫూర్తి కొరవడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ఏ పార్టీ అతీతం కాదు. కేంద్రంలో అధికారం మారినప్పుడల్లా బాబ్రీ విధ్వంసం కేసులను విచారిస్తున్న సీబీఐ తన వైఖరిని మార్చుకోవడం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాడు జారి చేసిన తప్పుడు నోటిఫికేషన్, పాలకుల జోక్యం కారణాల వల్ల ఈ కేసులు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే చందంగా ఉండిపోయాయి. 2000, అక్టోబర్ నుంచి 2002, మార్చి 8వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న రాజ్‌నాథ్ సింగ్ తప్పుడు నోటిఫికేషన్‌ను సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించి న మోదైన కేసుల్లో ప్రధాన కేసులు రెండు. ఒకటి క్రైమ్ నెం. 197-92, మరొకటి క్రైమ్ నెం. 198-92. మొదటి కేసులో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయగా, రెండో కేసులో (198-92) బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ, ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో మంత్రిగావున్న ఉమాభారతి సహా ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అద్వానీపై సీబీఐ భారతీయ శిక్షాస్మృతిలోని 120 (బీ) కింద విచారణ చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా రెచ్చగొట్టే ప్రసంగం మాత్రమే చేశారంటూ ఇతర సెక్షన్ల కింద విచారించి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ రెండు ప్రధాన కేసుల విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక కోర్టులు ఒకటి, లక్నోలో, మరొకటి రాయ్‌బరేలిలో ఏర్పాటు చేసింది. అద్వానీ, ఉమా భారతి నిందితులుగా ఉన్న 198 క్రైమ్ నెంబర్ కేసును రాయ్ బరేలి కోర్టు నుంచి లక్నో ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కేసును బదిలీ చేసేటప్పుడు హైకోర్టు అనుమతిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ విషయంలో అప్పటి యూపీ ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వం ఈ పొరపాటును సవరించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ సాంకేతిక కారణాల వల్ల కేసు విచారణలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. యూపీలో సమాజ్‌వాది, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కూడా ఈ కేసుల విచారణ ముందుకు సాగలేదు. కీలకమైన బిల్లులకు ఎన్డీయే పక్షాల మద్దతును సేకరించడం కోసం నాటి యూపీఏ ప్రభుత్వం ఈ కేసుల విషయంలో రాజీపడిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సాక్షాత్తు ఎన్డీయేనే కేంద్రంలో అధికారంలోవుంది, సీబీఐని ప్రభావితం చేయగల స్థానంలో కేంద్ర హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ కొనసాగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాబ్రీ విధ్వంసం కేసులు కొలిక్కి వస్తాయన్న నమ్మకం ప్రజాస్వామ్యవాదులకు లేకుండా పోతోంది. -
'మెమన్ కు క్షమాభిక్ష పెట్టండి'
న్యూఢిల్లీ: ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన అబ్దుల్ కలాంకు నివాళిగా మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ఈ నెల ఆరంభంలో ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని న్యాయ కమిషన్ కు కలాం తెలిపారని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో మెమన్ కు ప్రాణభిక్ష పెట్టి అతడికి కొత్త జీవితం ప్రసాదించాలని రాష్ట్రపతిని గాంధీ అభ్యర్థించారు. తొందరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మెమన్ కు క్షమాభిక్ష పెట్టేందుకు గతేడాది రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష పెట్టాలని మరోసారి రాష్ట్రపతిని మెమన్ అభ్యర్థించాడు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోవాల్సివుంది. -
ఉరిశిక్ష అమలు ఎలా?
ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో.. అసలు ఉరిశిక్షను ఎలా అమలుచేస్తారన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.. ఉరి తీసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీమీటర్ల) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే తాడును సిద్ధం చేస్తారు ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్ల బరువుండే బస్తాలతో వారం రోజుల ముందే రెండు తాళ్లను పరీక్షించి వాటిని లాక్ చేస్తారు రేపు ఉరిశిక్ష అమలు చేస్తారనగా.. ఈరోజు సాయంత్రం మరోసారి సూపరింటెండెంట్ సమక్షంలో వాటిని పరీక్షిస్తారు ఉరిశిక్ష అమలుచేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు తప్పనిసరిగా ఉండాలి. ఉరి తీసే సమయాలు కూడా నెలల వారీగా మారతాయి మే నుంచి ఆగస్టు వరకు అయితే ఉదయం 6 గంటలకు ఉరి తీస్తారు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉదయం 8 గంటలకు ఉరి తీస్తారు మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు ఖైదీకి అర్థమయ్యే భాషలో అతడిని ఉరి తీస్తున్నట్లు చెబుతారు యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుచేసేందుకు రూ. 22 లక్షలు కేటాయించారు మెమన్ ఉరితీతకు తగినంత ఫిట్‌గానే ఉన్నాడని నాగపూర్ జైలర్ తెలిపారు ఇప్పటివరకు భారతదేశంలో 169 మందిని ఉరి తీశారు.. యాకూబ్ మెమన్ 170వ వ్యక్తి అవుతాడు ఉరి తీసే ప్రదేశానికి అత్యంత సమీపంలోనే యాకూబ్ మెమన్ ఇప్పుడు ఉన్నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికి 12 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు ఉరిశిక్ష విధించే ఖైదీని సాధారణంగా ఆరోజు అర్ధరాత్రి 2.30 గంటలకు నిద్ర లేపుతారు. అప్పుడే స్నానం చేయాలని అడుగుతారు. ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ డెత్ వారెంట్ చదువుతారు. అనంతరం ఖైదీకి ఇష్టమైన టిఫిన్ పెడతారు. తర్వాత అతడి చివరి కోరిక ఏంటో అడుగుతారు. ఆ వెంటనే అతడ్ని ఉరికంబం వద్దకు తీసుకెళ్తారు. -
ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఉరి!
ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష దాదాపు ఖరారైంది. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తే, గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జైల్లో ఉరి తీస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఈ శిక్షను అమలుచేయొచ్చు. టాడా కోర్టు జారీచేసిన డెత్ వారంటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ వారంటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి గతంలో క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, దాన్ని 14 రోజుల్లోగా కోర్టులో సవాలు చేయాల్సి ఉండగా మెమన్ అలా చేయలేదని సుప్రీం విస్తృత ధర్మాసనం తెలిపింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించడం సరైనదేనని కూడా విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, ఇక మెమన్ను ఉరి తీయడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న క్షమాభిక్ష పిటిషన్ విషయం తేలడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. -
యాకూబ్ మెమన్ కు ఉరి ఖరారు
-
మెమన్ పిటిషన్ తిరస్కరణ సబబే: సుప్రీం
-
యాకూబ్ మెమన్ కు ఉరి ఖరారు
న్యూఢిల్లీ: తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అతడి ఉరిశిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. దీంతో గురువారం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. తనకు విధించిన మరణశిక్షను అడ్డుకునేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకున్నప్పటికీ మెమన్ కు ప్రాణభిక్ష దక్కలేదు. యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ తిరస్కరించారు. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. రాష్ట్రపతి కూడా దాన్ని తిరస్కరిస్తే ఇక ఉరి తీయడం ఖరారవుతుంది. యాకూబ్ పిటిషన్ ను మంగళవారం విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించేందుకు జస్టిస్ దవే నిరాకరించగా, ఉరిశిక్ష అమలును జస్టిస్ కురియన్ వ్యతిరేకించారు. దీంతో ఈ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయింది. క్యూరేటివ్ పిటిషన్ ను తిరస్కరించడం సబబేనని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మెమన్ కు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. -
మెమన్ పిటిషన్ తిరస్కరణ సబబే: సుప్రీం
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను తిరస్కరించడం సబబేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్యూరేటివ్ పిటిషన్ విచారణలో చట్టపరంగా ఎలాంటి లోపాలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణలో న్యాయప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొంది. యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ పై వాదనలు త్రిసభ్య ఎదుట బుధవారం సాయంత్రం ముగిశాయి. క్యూరేటివ్ పిటిషన్ విచారణలో మెమన్ లేవనెత్తిన సాంకేతిక అంశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ చట్టబద్ధంగా జరగలేదని అంతకుముందు మెమన్ తరపు లాయర్ వాదించారు. జైల్లో మెమన్ సత్ప్రర్తనను దృష్టిలో పెట్టుకోవాలని త్రిసభ్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మెమన్ స్కిజోఫ్రెనియాతో బాధ పడుతున్నారని తెలిపారు. -
'రాష్ట్రపతి గారూ.. క్షమాభిక్ష ప్రసాదించండి'
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ ఏర్పడింది. ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారిస్తోంది. బుధవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తోంది. కాగా తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని యాకూబ్ ఇదే రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నివించాడు. యాకూబ్ గతంలో కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ నెల 30న యాకూబ్‌ను ఉరితీయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేపు నాగ్‌పూర్ జైల్లో యాకూబ్‌ను ఉరితీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో యాకూబ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్టే ఇస్తుందా? లేక రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. -
మెమన్ ఉరిపై ఉత్కంఠ
నేడు విచారించనున్న సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్టే అభ్యర్థనపై విభేదించిన ఇద్దరు న్యాయమూర్తులు న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు విధించిన ఉరి శిక్ష అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఉరిశిక్షను రేపు(జూలై 30) అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. మరణశిక్ష అమలుపై స్టే విధించాలంటూ మెమన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ఆ ధర్మాసనం నేడు(బుధవారం) మెమన్ భవితవ్యాన్ని తేల్చనుంది. అంతకుముందు, మెమన్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ద్విసభ్య బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉరిశిక్ష అమలుపై స్టే ఇచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తుది నిర్ణయం కోసం విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, బుధవారమే విచారణకు అవకాశం కల్పించాల్సిందిగా చీఫ జస్టిస్‌ను కోరారు. ద్విసభ్య బెంచ్ విచారణ సందర్భంగా మెమన్ స్టే పిటిషన్‌ను జస్టిస్ దవే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగా, జస్టిస్ కురియన్ స్టేపై సానుకూలత వ్యక్తం చేశారు. దాంతో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించడమే సరైనదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మెమన్ తరఫు న్యాయవాది రాజు రామచంద్రన్ బెంచ్‌కు సూచించారు. మెమన్ తన పిటిషన్లో పేర్కొననప్పటికీ.. మెమన్ గతంలో దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేయడంలో లోపాలున్నాయని జస్టిస్ కురియన్ అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో తనతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ దవే సభ్యులని, అందువల్ల క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో తామూ ఉండాలనేది నిబంధన అన్నారు. కానీ క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో తమ ముగ్గురిలో ఒక్క దవేనే ఉన్నందున అది నిబంధనల ఉల్లంఘనే కాక, జీవించే హక్కును కాలరాయడమూ అవుతుందన్నారు. లోపాలను సరిచేసి, మళ్లీ పిటిషన్‌ను విచారించాలన్నారు. ఉరి అమలుపై స్టే విధించడం అవసరమేనన్నారు. శిక్ష అమలుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేయాలన్న మెమన్ లాయర్ అభ్యర్థనను జస్టిస్ కురియన్ తోసిపుచ్చారు. అయితే జస్టిస్ దవే.. పిటిషన్ కొట్టివేత నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. మెమన్ గత రివ్యూ పిటిషన్‌ను, క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసి, ఉరిని నిర్ధారించిన విషయాన్ని.. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ క్షమాభిక్షను తిరస్కరించిన అంశాన్ని గుర్తు చేశారు. అయితే, మెమన్ మరోసారి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై మహారాష్ట్ర గవర్నర్ ఉరిశిక్ష అమలు జరిగేలోపు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. -
సుప్రీం విస్తృత ధర్మాసనానికి యాకూబ్ పిటిషన్
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మంగళవారం యాకూబ్ పిటిషన్ విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించేందుకు జస్టిస్ దవే నిరాకరించగా, ఉరిశిక్ష అమలును జస్టిస్ కురియన్ వ్యతిరేకించారు. దీంతో ఈ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ముంబై పేలుళ్ల కేసులో మెమెన్‌కు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో ఉంటున్న యాకూబ్‌కు అక్కడే ఉరిశిక్ష అమలు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
మెమన్ క్షమాభిక్ష: విచారణ రేపటికి వాయిదా
-
మెమన్ 'క్షమాభిక్ష': విచారణ రేపటికి వాయిదా
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ కొనసాగుతూనేఉంది. ఉరిని రద్దుచేయాలని కోరుతూ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. మొదట మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 257 మందిని బలితీసుకున్న ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ పాత్ర సుస్పష్టమని, గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ నెల 30న అతడిని ఉరితీయాల్సిందేనని ముకుల్ రోహత్గీ వాదించారు. మెమన్ తరఫు వాదనలను మంగళవారం వింటానన్న కోర్టు.. విచారణను రేపటికి వాయిదావేసింది. అయితే తుది తీర్పు ఎప్పుడు వెలువరించేది తెలియరాలేదు. మరోవైపు గత ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 30న నాగపూర్ జైలులో యాకూబ్ మెమన్ ను ఉరితీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
శిక్ష తగ్గింపు సబబు!
‘రా’ మాజీ అధికారి రామన్ అభిప్రాయం న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ను భారత్‌కు తీసుకొచ్చే యత్నాలు సాగుతున్నప్పుడు భారత్ విదేశీ నిఘా విభాగం(రా-రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి నేతృత్వం వహించిన బి. రామన్.. మెమన్‌కు ఉరిశిక్ష విధించడంపై 2007లో ఒక ఆంగ్ల వార్తాబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఆయన 2013లో మృతిచెందారు. రామన్ వ్యాసంలోని ముఖ్యాంశాలు. * ఈ వ్యాసం రాయాలా? వద్దా? అని చాలా రోజులు మథనపడ్డాను. కానీ అన్యాయంగా ఉరిశిక్షకు గురవుతున్న వ్యక్తిని కాపాడటం ముఖ్యమని భావించి రాయాలనే నిర్ణయించుకున్నాను. ఈ కేసులో ముంబై పోలీసులు, సీబీఐ, ఐబీ గొప్ప పనితీరు చూపాయి. కానీ, మెమన్ శిక్ష తగ్గింపునకు అవకాశమున్న కీలకాంశాలను ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. మెమన్‌కు ఉరిశిక్ష విధింపజేయాలని ఆత్రుతగా ఉన్న ప్రాసిక్యూషన్.. శిక్ష విధింపు సమయంలో కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరలేదు. * పాక్ ఐఎస్ఐ తన కుటుంబసభ్యులపై పెట్టిన అనవసర నిఘాపై విసుగుచెందిన యాకూబ్.. భారత్ అధికారులకు లొంగిపోవాలనుకుని లాయరైన బంధువు సలహా కోసం కఠ్మాండూ వెళ్లాడు. లొంగుబాటు ప్రమాదకరమని, కోరుకున్న న్యాయం జరగకపోవచ్చని లాయర్ చెప్పడంతో మళ్లీ కరాచీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, నేపాల్ పోలీసులకు చిక్కాడు. వారిసాయంతో భారత అధికారులు మెమన్ను ఢిల్లీ తరలించి, అక్కడ అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని నేనే సమన్వయం చేశాను. * దర్యాప్తు అధికారులకు మెమన్ పూర్తిగా సహకరించారు. భారత్ తిరిగివచ్చేందుకు మెమన్ కుటుంబంలోని పలువురిని ఆయనే ఒప్పించారు. మెమన్ శిక్ష తగ్గింపునకు ఈ రెండు అంశాలు కీలకం. పేలుళ్లలో మెమన్, ఆయన కుటుంబసభ్యుల పాత్రపై అనుమానం లేదు. ఐఎస్ఐ సాయంతో మెమన్ చేసిన పని ఉరిశిక్షకు అర్హమైనదే. కానీ కఠ్మాండూలో అదుపులోకి తీసుకున్నప్పట్నుంచి ఆయన తీరు, దర్యాప్తు అధికారులకు సాయపడ్డ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే మరణశిక్షపై రెండో ఆలోచన చేయొచ్చు. -
యాకూబ్‌ను కాదు.. టైగర్‌ను పట్టుకోండి: సల్మాన్
యాకూబ్ మెమన్ ఉరితీతపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు. యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ను పట్టుకుని ఉరితీయాలి, కానీ యాకూబ్‌ను కాదంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఆయన సోదరుడిని కాదు, టైగర్‌ను పట్టుకుని, ఉరితీయండి. ఈ విషయంపై ట్వీట్ చేయాలని రెండుమూడు రోజులుగా అనుకుంటున్నా. కానీ భయపడి ఊరుకున్నా. కానీ ఇది ఒక వ్యక్తికి, ఆయన కుటుంబానికి చెందిన విషయం. అందుకే స్పందిస్తున్నా. సోదరుడిని ఉరితీయద్దు. పారిపోయిన ఆ నక్క(టైగర్ మెమన్)ను పట్టుకుని ఉరితీయండి. ఒక అమాయకుడిని చంపడం అంటే మానవత్వాన్ని చంపడమే’ అంటూ సల్మాన్ వరుసగా ట్వీట్స్ చేశారు. టైగర్ మెమన్ను భారత్‌కు అప్పగించాలని పాక్ ప్రధాని షరీఫ్‌ను కోరారు. అనంతరం తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి, బేషరతు క్షమాపణలు తెలిపారు. మెమన్ చేసిన నేరాన్ని సమర్థించడం తన ఉద్దేశం కాదన్నారు. తప్పుడు అభిప్రాయం వ్యక్తమయ్యేలా ఉన్నందున ఆ ట్వీట్స్‌ను ఉపసంహరించుకోవాలని తన తండ్రి సలీమ్ కోరారన్నారు. అంతకుముందు సల్మాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్ ఇంటిముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. కారుతో ఢీకొట్టి ఒకరి మృతి కారణమైన కేసులో సల్మాన్‌కు బెయిల్‌ను రద్దు చేయాలని బీజేపీ, శివసేన డిమాండ్ చేశాయి. సల్మాన్ వ్యాఖ్యలు దేశ న్యాయవ్యవస్థను అవమానించేలా ఉన్నాయని ముంబై పేలుళ్ల ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. అవి సల్మాన్ వ్యక్తిగత అభిప్రాయాలని యాకూబ్‌కు ఉరిశిక్ష విధించిన టాడా కోర్టు జడ్జి పీడీ కోడె అన్నారు. సల్మాన్ భావాల్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నించాలంటూ శతృఘ్నసిన్హా సల్మాన్‌కు అండగా నిలిచేం దుకు ప్రయత్నించారు. సల్మాన్‌కు ట్విటర్లో 1.3కోట్లమంది ఫాలోవర్లు ఉన్నారు. -
మెమన్ ఉరి.. సరికాదు!
ఉరిశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి ప్రముఖుల వినతి ♦ బలహీన సాక్ష్యాధారాలపై ఉరిశిక్ష విధించారన్న జస్టిస్ కట్జూ ♦ యాకూబ్‌ను కాదు..టైగర్ మెమన్ను పట్టుకుని ఉరితీయాలంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్ ♦ మెమన్ మరణశిక్షను వ్యతిరేకించేవారివి చిల్లర రాజకీయాలు: బీజేపీ ♦ ముంబై పేలుళ్ల దోషి ఉరిపై వేడెక్కుతున్న వాతావరణం ముంబై/న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకవైపు, ఈ గురువారం(జూలై 30న) ఆయన ఉరిశిక్షకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా.. మరోవైపు, మెమన్‌కు మరణదండన సరికాదన్న వాదన కూడా బలపడ్తోంది. న్యాయకోవిదులు, రాజకీయ నేతలు, సినీ తారలు మెమన్ ఉరికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. మెమన్ను ఉరితీయడం న్యాయాన్ని అవహేళన చేయడమేనంటున్నారు. అసలు సూత్రధారి యాకూబ్ మెమన్ సోదరుడు టైగర్ మెమన్ అని, ఆయన్ను పట్టుకుని ఉరితీయడం సబబని వాదిస్తున్నారు. ఆ తీర్పును సమీక్షించి, యూకూబ్‌కు శిక్ష తగ్గింపు అవకాశాల్ని పరిశీలించాలని కోరుతున్నారు. భారత విదేశీ నిఘా విభాగం ‘రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)’లో కీలక బాధ్యతలు నిర్వర్తించి, యాకూబ్ భారత్ రావడానికి సంబంధించిన ‘ఆపరేషన్’ను విజయవంతంగా పర్యవేక్షించిన సీనియర్ అధికారి బి.రామన్ 2007లో రాసిన ఒక వ్యాసం తాజాగా వెలుగులోకి రావడం వారి వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. ముంబై పేలుళ్లలో యాకూబ్ పాత్ర మరణశిక్షకు అర్హమైనదే అయినప్పటికీ.. దర్యాప్తునకు ఆయన సహకరించిన విధానం, మెమన్ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులను భారత్ రప్పించేందుకు ఆయన చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే బావుండేదని రామన్ ఆ వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. తనకు క్షమాభిక్ష లభించే విషయంలో న్యాయపర అవకాశాలింకా ముగిసిపోనందున, ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ వేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. క్షమాభిక్ష ప్రసాదించండి: రాష్ట్రపతికి ప్రముఖుల వినతి యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేసి, ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ పలువురు న్యాయ, రాజకీయ, సినీ ప్రముఖులు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇచ్చారు. ఉరిశిక్ష రద్దుకు అవసరమైన న్యాయపరమైన అంశాలను, అంతర్జాతీయ నిబంధనలను అందులో ఉటంకించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ కాదని, మరెవరో చేసిన నేరానికి ఇతడికి ఉరిశిక్ష విధించడం సరికాదని అందులో పేర్కొన్నారు. రక్తాన్ని చిందించడం, మనుషుల్ని బలి తీసుకోవడం వల్ల భారతదేశ ప్రతిష్ట దిగజారుతుందని.. బదులుగా క్షమాభిక్ష ప్రసాదించడం ద్వారా దేశ ఔన్నత్యం మరింత పెరుగుతుందని వివరించారు. 20 ఏళ్లకు పైగా జైల్లో గడిపారన్న కారణాన్ని చూపి ఈ కేసులోని 10 మంది ఇతర నిందితుల మరణశిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 21 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న యాకూబ్ మెమన్ విషయంలో మాత్రం ఈ సూత్రాన్ని పాటించలేదన్నారు. ఆ వినతి పత్రంపై మణిశంకర్ అయ్యర్(కాంగ్రెస్ నేత), శతృఘ్నసిన్హా(బీజేపీ ఎంపీ),న్యాయకోవిదులు రామ్ జెఠ్మలానీ, కేటీఎస్ తులసి, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందాకారత్(సీపీఎం), డీ రాజా(సీపీఐ), బాలీవుడ్ ప్రముఖులు నసీరుద్దీన్ షా, మహేశ్ భట్, మాజిద్ మెమన్(ఎన్సీపీ), టీ శివ(డీఎంకే), హెచ్‌కే దువా, తుషార్ గాంధీ.. తదితరులు సంతకాలు చేశారు. కాగా, మెమన్ ఉరిని వ్యతిరేకిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. చట్టపరమైన ప్రక్రియను పూర్తిచేసి ఈ నిర్ణయం తీసుకున్నారని, తీర్పును అంతా గౌరవించాలని సూచించింది. మరోవైపు, ‘భారతీయ అధికారులతో ఏదైనా అవగాహన అనంతరమే యాకూబ్ మెమన్ భారత్ వచ్చారా? అదే నిజమైతే, ఆ విషయం ఆయన కోర్టుకు తెలిపారా అన్నది కీలకం’ అంటూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీటర్లో స్పందించారు. ఇది న్యాయ అధిక్షేపణ: కట్జూ యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించడంలో న్యాయం దారుణంగా అధిక్షేపణకు గురైందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కెండేయ కట్జూ వ్యాఖ్యానించారు. ‘తీర్పు ప్రతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మెమన్ను దోషిగా నిర్ధారించడానికి ఉపయోగపడిన సాక్ష్యాధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇతర నిందితుల వాంగ్మూలాలను, రికవరీ చేసిన వస్తువులను సాక్ష్యాలుగా తీసుకున్నారు. మనదేశంలో చిత్రవధ చేసి నిందితుల నుంచి పోలీసులు వాంగ్మూలాలను ఎలా తీసుకుంటారో అందరికీ తెలుసు. అలాగే రికవరీ చేసిన వస్తువులనూ వారు సృష్టిస్తారు’ అని కట్జూ వ్యాఖ్యానించారు. ‘పోలీసుల చిత్రవధ ఎంత దారుణంగా ఉంటుందంటే.. దానికి తట్టుకోలేక నిందితులు దేన్నైనా ఒప్పుకుంటారు. చిత్రహింస తట్టుకోలేక జోన్‌ఆఫ్ ఆర్క్ అంతటామెనే మంత్రగత్తెనని ఒప్పుకుంది’ అని జస్టిస్ కట్జూ పేర్కొన్నారు. ఔదార్యం చూపండి: మెమన్ భార్య స్వయంగా లొంగిపోయినందున తన భర్తపై ఔదార్యం చూపి, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని యాకూబ్ భార్య రహీ మెమన్ ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను అభ్యర్థించారు. తన భర్త అమాయకుడని, తానే స్వయంగా భారతీయ అధికారులకు లొంగిపోయారని గుర్తు చేశారు. 1993 పేలుళ్ల కన్నా ముందే, ఈద్ పండుగ జరుపుకునేందుకే తాము దుబాయ్ వెళ్లామని, అంతేకానీ పేలుళ్ల తర్వాత దేశం విడిచిపారిపోలేదన్నారు. రక్షణవలయంగా నాగ్‌పూర్ జైలు సాక్షి, ముంబై: యాకూబ్ మెమన్ను 30వ తేదీన నాగపూర్ జైలులో ఉరితీయనున్న నేపథ్యంలో ఆ జైలు భద్రతను క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో భాగంగా 10 మంది సాయుధులైన పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో జైలు లోపల, బయట అనుక్షణం కాపలాగా ఉంటారు. ఉగ్రవాదుల మెరుపు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా జైలుకు రక్షణగా ఉంటారు. ఇదిలాఉండగా, ఉరితీత ఏర్పాట్లలో జైలు పరిపాలన విభాగం నిమగ్నమైంది. ఉరి శిక్ష రద్దుచేయాలంటూ జైలులో ఖైదీలు నిరహార దీక్ష చేపట్టినట్లు సమాచారం. కాగా, ఉరి తర్వాత శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. -
మెమన్‌కు న్యాయం జరగాలంటే తప్పేంటి..?
మత ప్రాతిపదికన శిక్షలు వద్దు: అసదుద్దీన్ హైదరాబాద్: ‘‘ ముంబై పేలుళ్లలో అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం లేదు. కోర్టు తీర్పులను గౌరవించాం. గౌరవిస్తాం, మత ప్రాతిపదికన శిక్షల అమలు వద్దు. యాకుబ్ మెమన్ విషయంలో న్యాయం జరగాలి. అతని స్థానంలో హిందువు ఉన్నా.. గళం విప్పుతా..? తప్పేంటి?’’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఖిల్వాత్ మైదానంలో పార్టీ మాజీ అధ్యక్షుడు, దివంగత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ 7వ వర్థంతి సందర్భంగా శనివారం అర్ధరాత్రి జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగించారు. ఇటీవల మక్కామసీదులో రంజాన్ జూమ్మతుల్ విదా పురస్కరించుకొని తాను చేసిన వ్యాఖ్యలను కాషాయ వాదులు తప్పుబడుతున్నారని, వారం రోజుల తర్వాత జాతీయ మీడియా దాన్ని చిలువలు పలువలు చేస్తోందని విమర్శించారు. యాకుబ్ మెమన్‌పై సీనియర్ జర్నలిస్టు జగన్నాథం రాసిన కథనం, ముంబై పేలుళ్లపై విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ చీఫ్ రామన్ నివేదికల్లోని అంశాలనే తన ప్రసంగంలో ఉదహరించానన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మజ్లిస్‌ను తక్కువ అంచనా వేసి అవాకులు, చవాకులు పేలుతున్నారనీ, మతతత్వవాదులని విమర్శిస్తున్నారని అసదుద్దీన్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మజ్లిస్ పార్టీ మద్దతు కోసం అప్పట్లో దివంగత నేత ఇందిరా గాంధీ దారుస్సలాం రాక తప్పలేదని, తిరిగి అదే చరిత్ర కాంగ్రెస్ నేతలకు పునరావృతం కాక తప్పదన్నారు. -
రేపు సుప్రీంకోర్టులో యాకూబ్ పిటిషన్ విచారణ
న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తన భర్త లొంగిపోయిన కారణంగా ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ యాకూబ్ భార్య రహీన్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో యాకూబ్ ఉరిశిక్ష అమలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30న అతడికి ఉరిశిక్ష వేయాలని కోర్టు గతంలోనే తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. -
తప్పయితే.. క్షమించండి: సల్మాన్
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతో సల్మాన్ తాను చేసిన ట్వీట్లను వెనక్కి తీసుకున్నారు. తనవల్ల ఏదైన తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరారు. సల్మాన్ ట్వీట్లను ఆయన తండ్రి సలీం ఖాన్ తప్పుపట్టారు. ముంబై పేలుళ్ల గురించి సల్మాన్‌కు అవగాహనలేదని చెప్పుకొచ్చారు. ఇక యోగా గురు బాబా రాందేవ్ సహా రాజకీయ నేతలు, నెటిజెన్లు సల్మాన్ పై విమర్శలు చేశారు. దీంతో సల్మాన్ క్షమాపణలు చెప్పారు. యాకూబ్ అమాయకుడు అని తానెప్పుడూ చెప్పలేదని అన్నారు. సల్మాన్ అంతకుముందు ఏమన్నారంటే... 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష పడిని విషయం తెలిసిందే. దీనిపై సల్మాన్ ట్విట్టర్లో స్పందిస్తూ యాకూబ్‌ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. (పూర్తి వివరాలు చదవండి) -
సల్మాన్ ట్వీట్లపై మండిపడ్డ తండ్రి
- ఉద్రిక్తతల నేపథ్యంలో నటుడి ఇంటివద్ద భద్రత పెంపు ముంబై: ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరితీయొద్దంటూ ట్వీట్లు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఆయన తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన నాటి ఘటన గురించి సల్మాన్‌కు ఏమాత్రం అవగాహన లేదని.. ట్విట్టర్లో అతని రాతలన్నీ అర్థరహితమైనవని, తెలివితక్కువతనాన్ని బయటపెట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం మద్యహ్నం తన అభిప్రాయాన్ని మీడియాకు తెలియజేసిన సలీం ఖాన్.. యాకూబ్ ఉరితీత విషయంలో మాత్రం కొడుకుతో ఏకీభవించాడు. 'యాకూబ్ దోషే అయినప్పటికీ ఉరి విధించకుండా అతడ్ని జీవితాంతం జైలులో ఉచడమే సరైన శిక్ష' అని సలీం అన్నారు. సల్మాన్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవాలని ప్రజలను కోరారు. ఇదిలాఉండగా, సల్మాన్ ఖాన్ ట్వీట్లపై రాజకీయ వర్గాలతోపాటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అతడి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు ముంబై పోలీసులు. సల్మాన్ తన ట్వీట్లను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ముంబై పేలుళ్ల కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ కోరారు. కోర్టు తీర్పులను తప్పుపట్టడం సరికాదని హితవుపలికారు. -
సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్లు
-
సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్లు
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్ష అమలుపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించాడు. యాకూబ్‌ను ఉరితీయొద్దని.. అతడి సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. ఓవైపు సొంత తమ్ముడు ఉరికంబం ఎక్కబోతుంటే.. కేవలం తన ప్రాణాలు కాపాడుకునేందుకు తప్పించుకు తిరుగుతున్న టైగర్.. అసలు టైగరెలా అవుతాడని నిందించాడు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై శనివారం రాత్రి నుంచి సల్మాన్ వరుస ట్వీట్లు చేశారు. 'టైగర్ ఎక్కడున్నాడు? అసలు టైగర్ టైగరే కాదు పిల్లి. తప్పించుకు తిరిగే పిల్లిని మనం పట్టుకోలేం. నిజానికి యాకూబ్ ఉరిశిక్షపై మాట్లాడటం భయంతోకూడుకున్నదే కానీ ఇక్కడో కుటుంబం ఆవేదన దాగుంది. ఇండియాలో టైగర్ల కొరత చాలా ఉంది. టైగర్‌ను పట్టుకురండి. టైగర్.. నీ కోసం నీ తమ్ముడు చనిపోబోతున్నాడు. ఇప్పటినుంచి వాణ్ని టైగర్ అని ఎవరూ పిలవద్దు. అలా పిలిపించుకునే అర్హత వాడికి లేదు' అంటూ పలు ట్వీట్లు చేశాడు సల్మాన్ ఖాన్. Get tiger hang him. Parade him not his brother — Salman Khan (@BeingSalmanKhan) July 25, 2015 Kidhar chupa hai tiger? Hey koi tiger nahi hai hai hai billi aur hum ek billi ko nahi pakad sakteh. — Salman Khan (@BeingSalmanKhan) July 25, 2015 been wanting to tweet Tis fr 3 days n was afraid to do so but it involves a man's n family. Don't hang brother hang tha lomdi who ran away — Salman Khan (@BeingSalmanKhan) July 25, 2015 -
అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
-
మెమన్ ఉరికి మతమే కారణం!
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల ఉగ్రవాది యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించడానికి అతని మతమే కారణమంటూ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. అసలు అయోధ్యలో వివాదాస్పద కట్టడం (బాబ్రీ మసీదు) కూల్చివేత, ముంబైలో, గుజరాత్లో మతఘర్షణలు వంటి తీవ్రమైన కేసుల్లో నేరస్తులకు ఈ తరహా శిక్షలు విధించలేదేమని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లో అసదుద్దీన్ మాట్లాడారు. ‘‘బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని ఇప్పటివరకు ఎందుకు శిక్షించలేదు, వారికి కూడా ఉరిశిక్ష విధించాలి. 1992-93లో ముంబైలో జరిగిన మత కల్లోలాల్లో వెయ్యి మంది ఊచకోతకు గురయ్యారు. ఆ ఘటనలో ఎంతమందిని శిక్షించారు. మాలెగావ్ పేలుళ్లతో సంబంధమున్న సాధ్వి ప్రజ్ఞ, స్వామి అసీమానంద్‌లకు ఉరిశిక్ష విధించగలరా?..’’ అని పేర్కొన్నారు. యాకూబ్ మెమన్‌కు అతని మతం కారణంగానే ఉరిశిక్ష విధించారని అన్నారు. అలాంటి వారు పాక్ వెళ్లాలి: మహరాజ్ దేశాన్ని గౌరవించనివారికి, న్యాయవ్యవస్థను గౌరవించనివారికి దేశంలో ఉండే హక్కు లేదని, అలాంటివారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ అసదుద్దీన్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ వ్యాఖ్యానిం చారు. ‘‘దేశాన్ని అసదుద్దీన్ నడిపించడం లేదు. మెమన్ దోషి అని కోర్టులు నిర్ధారించాయి. ఉగ్రవాది ఉగ్రవాదే. వారు ఇలాంటి మత రాజకీయాలకు పాల్పడడాన్ని ఆపేయాలి..’’ అని పార్లమెంటు వెలుపల మీడియాతో పేర్కొన్నారు. ఇక అసదుద్దీన్ మత రాజకీయాలకు పాల్పడుతున్నాడని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. అసదుద్దీన్ ప్రతిదానిలో మతాన్ని చూస్తారని, ఇది దురదృష్టకరమన్నారు. ఒవైసీది రాజకీయ అవివేకం: దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్‌కు సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్షను మతకోణంలో చూడడం తగదని అసదుద్దీన్‌కు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. మెమన్‌కు ఉరిశిక్షను ప్రభుత్వం విధించలేదని, సుప్రీంకోర్టు విధించిందని ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన వారికి ఉరిశిక్ష విధిస్తున్నారడం రాజకీయ అవివేకమని, ఎంఐఎం ఆలోచనా ధోరణిని ఎప్పటికీ మారదని విమర్శించారు. -
మెమన్ పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో తనకు విధించిన మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 27నవిచారించనున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు వెల్లడించారు. చాలా సున్నితమైన ఈ అంశాన్ని జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలోని బెంచ్‌కు అప్పగించానని శుక్రవారం తెలిపారు. యాకూబ్కుశిక్షను ఈ నెల 30న అమలు చేయనుండడం తెలిసిందే. మెమన్ తరఫున న్యాయవాది రాజు రామచంద్రన్ పిటిషన్‌ను ప్రస్తావించగా, మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్న డెత్ పెనాల్టీ లిటిగేషన్ క్లినిక్ తరఫున టీఆర్ అంధ్యారుజినా హాజరయ్యారు. మెమన్‌కు డెత్ నోటీసు ఇవ్వలేదని అంధ్యారుజినా చెప్పారు. మెమన్ నాగపూర్ జైలు ఉండగా, డెత్ వారెంట్ ప్రక్రియను ముంబై జైలులో అమలుచేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ముంబైలోని టాడా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమన్నారు. -
ఉరిశిక్షపై అనవసర రాజకీయాలా?
మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనవసరంగా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రాజకీయం చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ మండిపడింది. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల దోషి అయిన మెమన్ను ఈనెల 30న ఉరితీయనున్న విషయం తెలిసిందే. కోర్టులు తీర్పు చెప్పేముందు ఎప్పుడూ దోషుల మతం చూబోవని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. ముంబై పేలుళ్లలో హిందూ ముస్లింలు ఇద్దరూ మరణించారని, యాకూబ్ మెమన్ రెండు మతాల వాళ్లనూ చంపారని ఆయన చెప్పారు. ఈ నేరాన్ని హిందూ- ముస్లిం దృక్కోణంలో చూడటం సరికాదని అన్నారు. ఒవైసీ అనవసరంగా ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. యాకూబ్ మెమన్ ముస్లిం కావడం వల్లే అతడిని ఉరి తీస్తున్నారంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే యాకుబ్ ను ఉరి తీస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లిం అయినందు వల్లే యాకుబ్ మెమన్ ఉరిశిక్ష విధించారన్నారు. అతని పిటిషన్ పరిశీలించకుండా, అసలు యాకూబ్ ను ఎలా ఉరి తీస్తారని ఒవైసీ నిలదీశారు. రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ నేతల అండ ఉందన్నారు. అందుకే వారు యావజ్జీవ శిక్షలతో బతికిపోయారని, కానీ ముస్లిం మతస్థుడైన యాకూబ్‌ను ఆదుకునేవారే కరువయ్యారన్నారు. ఒక వేళ నేరస్తులను ఉరి తీయాలనుకుంటే, మతాన్ని ఆధారంగా చేసుకుని వారికి మరణ శిక్షలు విధించొద్దని ఆయన కోరారు. ఒక మతాన్ని టార్గెట్ చేయడం సమంజసం కాదన్నారు. కాగా 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన యాకుబ్ మెమన్‌కు టాడా కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా మెమన్ క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించారు. ఇటీవల శిక్షనుతగ్గించాల్సిందా యెమెన్ పెట్టుకున్న పిటిషన్ కూడా సుప్రీం తిరస్కరించడంతో ఈ నెల 30న నాగపూర్ జైల్లో అతణ్ని ఉరి తీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. . ఈ సమయంలో ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
ఉరితీసేలోగా పీజీ పట్టా ఇవ్వలేం
నాగ్‌పూర్: ఈ నెల 30న ఉరిశిక్ష అమలు ఖాయమైన నేపథ్యంలో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ చివరి కోరిక తీరకుండానే చనిపోనున్నారు. గడిచిన 21 ఏళ్లుగా జైలులోనే ఉన్న ఆయన.. రెండు పీజీ కోర్సులు పూర్తిచేశారు. అరెస్టుకు ముందు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా మెమన్ కు మంచి పేరుండేది. జైలులోనూ తన పఠనాసక్తిని కొనసాగించిన ఆయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు పాస్ అయ్యారు. చనిపోయేలోగా ఎంఏ ఇంగ్లీష్ పట్టా తీసుకోవాలనుకుంటున్నట్లు మెమన్.. జైలు అధికారులకు చెప్పగా వారు యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. అయితే ఇప్పటికిప్పుడు పీజీ పట్టాలు ఇవ్వలేమని, దానికి కొంత సమయం పడుతుందని, అదికూడా ఈ నెల 30లోగా పట్టా అందించడం అసాధ్యమని ఇగ్నో అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆఖరి కోరిక తీరకుండానే మెమన్ ఉరి కంబం ఎక్కనున్నారు. -
యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖాయం
1993 ముంబయి పేలుళ్ల కేసులో తొలి మరణశిక్ష క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు; జూలై 30న ఉరి న్యూఢిల్లీ: ముంబయిలో 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతని ఉరిశిక్ష అమలు ఖరారైనట్లయింది. మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు సహ కుట్రదారులుగా యాకూబ్ మెమన్ అతని సోదరుడు టైగర్ మెమన్లను న్యాయస్థానం నిర్ధారించి మరణ శిక్షను విధించింది. 1993 తరువాత టైగర్ దేశం విడిచి పారిపోయాడు. 1994లో నేపాల్ సరిహద్దులో యాకూబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తనకు మరణ శిక్ష నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా యాకూబ్ మెమన్ సర్వోన్నత న్యాయస్థానంలో నిరుడు క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అతను పిటిషన్ లో పేర్కొన్న కారణాలు క్షమాభిక్షకు అర్హమైనవి కావని తేల్చిచెప్పింది. ఈ కేసులో మరణ శిక్ష అమలవుతున్న తొలి నేరస్థుడు మెమనే. తాను 1996 నుంచి దాదాపు 20 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నానని, మనోవైకల్యంతో బాధపడుతున్నానని యాకూబ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఒక నేరస్థుడికి ఒక నేరంలో జీవితఖైదు, ఉరిశిక్ష రెండు శిక్షలు వేయజాలరని యాకూబ్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను కొట్టివేసింది. సుప్రీం తీర్పుతో జూలై 30న యాకూబ్ ఉరికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాగపూర్ సెంట్రల్ జైలులో కానీ, పూణె ఎఱవాడ జైలులో కానీ ఉరిశిక్ష అమలు చేయవచ్చని నాగపూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు. చరిత్రాత్మకం: ఉజ్వల్ నికమ్ యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించటం చరిత్రాత్మకమని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు. సుప్రీం తీర్పును శివసేన కూడా హర్షించింది. ఇదేకేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్న అబూ ఆజ్మీకూడా ఆహ్వానిస్తున్నానని అన్నారు. గవర్నర్‌ను క్షమాభిక్ష కోరిన యాకూబ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించటంతో తుది ప్రయత్నంగా మహారాష్ట్ర గవర్నర్‌ను క్షమాభిక్ష కోరుతూ యాకూబ్ మెర్సీ పిటిషన్ దాఖలు చేశారు. నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులకు ఈ పిటిషన్‌ను అందజేశారు. తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను యాకూబ్ సోదరుడు సులేమాన్ వేశారని, ఇప్పుడు యాకూబ్ స్వయంగా క్షమాభిక్ష కోరుతున్నందున రెండో క్షమాభిక్ష పిటిషన్ చెల్లుతుందని ఆయన లాయర్ అనిల్ గెడెమ్ తెలిపారు. ముంబయి పేలుళ్ల కేసు పరిణామ క్రమం 1993 మార్చి 12: ముంబైలో 13 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి.. 713మందికి పైగా గాయాలు 1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై దాదాపు 10వేల పేజీల చార్జిషీటు దాఖలు 1995 ఏప్రిల్ 10: 26మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు. 2001 జూలై18: 684మంది సాక్షుల స్టేట్మెంట్ల రికార్డు పూర్తి 2003 సెప్టెంబర్: పూర్తయిన విచారణ.. రిజర్వులో తీర్పు 2006 సెప్టెంబర్ 12: తీర్పు వెల్లడి. యాకూబ్ మెమన్‌తో సహా అతని నలుగురు కుటుంబ సభ్యులు దోషులుగా ఖరారు. యాకూబ్ సహా 12మంది నిందితులకు మరణ శిక్ష. మరో 20మందికి జీవిత ఖైదు. 2013 మార్చి 21:యాకూబ్ ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. 2014 మే: యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. 2014 జూన్ 2: సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్‌ను వేసిన యాకూబ్ 2015 జూలై 21: క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత -
ఆ ఉగ్రవాదికి ఉరి ఖాయం
-
ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం
ముంబై: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరశిక్ష దాదాపు ఖరారైంది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో ముంబై పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష అమలు ఖాయమైంది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను ఆ తర్వాత సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. ఈ నేపథ్యంలో జూలై 30న యాకూబ్ ను ఉరితీయనున్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను అమలుచేసేందుకు రంగం సిద్ధం చేశామని ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలుకానుంది. ప్రస్తుతం ఉరి శిక్ష కోసం ఎదురుచూస్తున్న ఏకైక ఖైదీ మెమన్ మాత్రమే. తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా గతంలో రాష్ట్రపతికి పెట్టుకున్న తిరస్కరించడంతో అతని మరణశిక్ష అమలు రూఢీ అయింది. కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్‌ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది. -
ఈ నెలాఖర్లో మెమన్‌కు ఉరి!
నాగ్‌పూర్ జైల్లో ఏర్పాట్లు * క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం * వెలువడగానే శిక్ష అమలుకు సన్నాహాలు ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్‌కు ఈనెల చివర్లో ఉరిశిక్ష అమలు చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. శిక్ష అమలుకు నాగ్‌పూర్ జైల్లో అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. 1993 పేలుళ్ల కేసులో మెమన్‌కు గతంలోనే టాడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. శిక్షను 2013, మార్చి 21న సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ర్టపతి కూడా తిరస్కరించారు. అయినా శిక్షను పునఃసమీక్షించాల్సిందిగా అతడు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. దీనిపై సుప్రీం త్వరలోనే నిర్ణయం వెలువరించనుంది. ‘సుప్రీంకోర్టు ఏం చెబితే అది అమలు చేస్తాం. సరైన సమయంలో మీడియాకు సమాచారం అందిస్తాం’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. సుప్రీం తీర్పును అమలు చేస్తే పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన తొలి దోషి మెమనే కానున్నాడు. ప్రస్తుతం ఇతడు నాగ్‌పూర్‌లోని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. సాధారణంగా ఉరిశిక్షలను ఇక్కడే అమలు చేస్తుంటారు. నాకు తెలియదు: జైలు సూపరింటెండెంట్ మెమన్‌కు సంబంధించిన డెత్ వారెంట్లు జైలుకు అందాయా? అని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్‌ని అడగ్గా.. ‘నాకు తెలియదు. ఇది ప్రభుత్వం స్థాయిలో జరిగే వ్యవహారం’ అని ఆయన పేర్కొన్నారు. మెమన్ను ఉరికంభం ఎక్కిస్తే.. నేరం చేసినవారికి శిక్ష తప్పదన్న బలమైన సంకేతం సమాజంలోకి వెళ్తుందని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ఇదీ కేసు నేపథ్యం..: 1993, మార్చి 12 (శుక్రవారం) రోజున దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇందులో 250 మందికి పైగా అమాయకులు మరణించగా, సుమారు 1200 మంది గాయపడ్డారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఈ దాడులకు సూత్రధారిగా తేలింది. పేలుళ్లలో దావూద్ అనుచరుడైన టైగర్ మెమన్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. భారత్, పాక్‌లోని కొందరు స్మగర్లు దాడులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో పాక్ ఐఎస్ఐ హస్తం ఉందని, అనేక మంది ఉగ్రవాదులకు పాక్‌లో శిక్షణ ఇచ్చి ముంబై పంపారని భారత్ పేర్కొంది. అయితే అధికారులు దీన్ని కోర్టులో నిరూపించలేకపోయారు. -
ఉరి శిక్ష తప్పదు.. 30నే అమలు
-
ఈ నెల 30 నే అతనికి ఉరి
ముంబై: ముంబై పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ మెమన్ను ఉరితీయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను జూలై 30న అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు బుధవారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేశాయి. నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలు కానుంది. అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ముంబై పేలుళ్ల ముద్దాయి పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ ను ఉన్నత ధర్మాసనం తిరస్కరిస్తే యాకూబ్ ఉరిశిక్ష యథాతథంగా అమలవుతుంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే దీనిపై తదుపరి విచారణ జూలై 21 ఉంటుందని తెలుస్తోంది. కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్‌ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది. -
సర్వే చేయలేదని సెల్‌టవర్ ఎక్కాడు..
శంషాబాద్: సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు తన కుటుంబ వివరాలు నమోదు చేసుకోలేదని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన శంషాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని గొల్లపల్లి దర్వాజ సమీపంలో పాడుపడిన పోలీస్‌క్వార్టర్‌లో నివాసముంటున్న యా కోబ్(45) స్థాని కంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉన్నారు. కుటుంబ సర్వే కారణంగా యాకోబ్ మంగళవారం ఇంటివద్దే అందుబాటులో ఉన్నాడు. రాత్రి వరకు కూడా అధికారులెవరూ సర్వే కోసం యాకోబ్ ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యాకోబ్ బుధవారం సాయంత్రం పట్టణంలోని వైఎన్ఆర్ గార్డెన్ సమీపంలోని సెల్‌టవర్‌పై ఎక్కా డు. ఆత్మహత్యకు పాల్పడుతానని ఆందోళన చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, ఆర్జీఐఏ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యాకోబ్‌తో ఫోన్లో మాట్లాడి సర్దిచెప్పారు. అధికారులతో పేర్లు నమోదు చేయిస్తామని హామీ ఇవ్వడంతో యూకోబ్ సెల్‌టవర్ పైనుంచి కిందికి దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. -
పొలిటికల్ సైన్స్ చదువుతున్న మెమన్
నాగపూర్: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పీజీ కోర్సు చేస్తున్నాడు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమన్ ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ద్వారా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన మెమన్ ఇప్పుడు ఎంఏ రెండో సంవత్సరంలో ఉన్నాడు. ఈ నెల 3న మొదటి పరీక్ష హాజరైన అతడు సోమవారం రెండో పేపర్ రాశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు గదిలో అతడు పరీక్ష రాశాడు. కరడుగట్టిన నేరస్తుడు కావడంతో జైలు బయట పరీక్ష రాసేందుకు పోలీసులు అనుమతించలేదని ఇగ్నో ప్రాంతీయ డైరెక్టర్ పి శివస్వరూప్ తెలిపారు. ఈనెల 28తో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు. మెమన్ తో పాటు మరణశిక్ష పడిన మరో ఐదుగురు ఖైదీలు పరీక్షలు రాసినట్టు వెల్లడించారు. 300 మందిపైగా ఖైదీల వివిధ కోర్సుల పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మెమన్ కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గతవారం స్టే విధించింది. -
ముంబై’ పేలుళ్ల దోషికి క్షమాభిక్ష నిరాకరణ
న్యూఢిల్లీ: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఆ నిర్ణయం తీసుకున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముంబై పేలుళ్ల కుట్రలో కీలకపాత్ర, అందుకు ఆర్థిక సాయం చేయడం, పేలుళ్లలో పాలు పంచుకున్న ఇతరులకు ఆ డబ్బు పంపిణీ చేయడం.. తదితర నేరాలపై 2007లో టాడా కోర్టు యాకూబ్ మెమన్‌కు మరణశిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును 2013 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు సమర్థించింది.