యాకూబ్ మెమన్ ఉరితీత కేసు కవరేజ్‌లో కొన్ని వార్తా చానళ్లు హద్దులు మీరాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరితీత కేసు కవరేజ్‌లో కొన్ని వార్తా చానళ్లు హద్దులు మీరాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించకుండా వారే స్వీయ నియంత్రణ పాటించాలని బుధవారమిక్కడ ఓ సదస్సులో పేర్కొన్నారు.
ఇటీవల పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని తమ శాఖ చేసిన సూచనలను కొన్ని చానళ్లు పెడచెవిన పెట్టాయన్నారు. యాకూబ్ ఉరితీత కేసు కవరేజిలో కొన్ని చానళ్లు లక్ష్మణ రేఖను దాటాయని, టీఆర్‌పీ రేటింగ్ పెంచుకునేందుకు చోటా షకీల్ (మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు)తో మాట్లాడించాయని అన్నారు.