మెమన్ 'ఉరి శిక్ష అమలు'లో కొత్త ట్విస్ట్ | 2 am hearing by Supreme Court judges | Sakshi
Sakshi News home page

మెమన్ 'ఉరి శిక్ష అమలు'లో కొత్త ట్విస్ట్

Published Thu, Jul 30 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

2 am hearing by Supreme Court judges

న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన  ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు.

ఉరి శిక్ష వాయిదాపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడనందున షెడ్యుల్ ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు మెమన్ను ఉరి తీసేందుకు నాగ్పూర్ జైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో నాగ్ పూర్ ముంబైలలోమహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మిగాతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

మరోవైపు నాగ్పూర్ హోటల్లో ఉన్న మెమన్ కుటుంబ సభ్యులకు పోలీసులనుంచి ఉరిశిక్ష అమలుకు సంబంధించి లేఖ అందింది. గురువారం తెల్లవారుజామున 2.10 సమయంలో ఒక పోలీసు అధికారి హోటల్లో బస చేస్తున్న మెమన్ కుటుంబ సభ్యులకు ఆ లేఖని అందించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement