శిక్ష తగ్గింపు సబబు! | All eyes on whether SC will choose to hear Raman's word for clemency | Sakshi
Sakshi News home page

శిక్ష తగ్గింపు సబబు!

Published Mon, Jul 27 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

శిక్ష తగ్గింపు సబబు!

శిక్ష తగ్గింపు సబబు!

‘రా’ మాజీ అధికారి రామన్ అభిప్రాయం
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్‌ను భారత్‌కు తీసుకొచ్చే యత్నాలు సాగుతున్నప్పుడు భారత్ విదేశీ నిఘా విభాగం(రా-రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి నేతృత్వం వహించిన బి. రామన్.. మెమన్‌కు ఉరిశిక్ష విధించడంపై 2007లో ఒక ఆంగ్ల వార్తాబ్‌సైట్‌కు ఒక వ్యాసం రాశారు.
ఆయన 2013లో మృతిచెందారు. రామన్ వ్యాసంలోని ముఖ్యాంశాలు.
     

* ఈ వ్యాసం రాయాలా? వద్దా? అని చాలా రోజులు మథనపడ్డాను. కానీ అన్యాయంగా ఉరిశిక్షకు గురవుతున్న వ్యక్తిని కాపాడటం ముఖ్యమని భావించి రాయాలనే నిర్ణయించుకున్నాను. ఈ కేసులో ముంబై పోలీసులు, సీబీఐ, ఐబీ గొప్ప పనితీరు చూపాయి. కానీ, మెమన్ శిక్ష తగ్గింపునకు అవకాశమున్న కీలకాంశాలను ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. మెమన్‌కు ఉరిశిక్ష విధింపజేయాలని ఆత్రుతగా ఉన్న ప్రాసిక్యూషన్.. శిక్ష విధింపు సమయంలో కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరలేదు.
* పాక్ ఐఎస్‌ఐ తన కుటుంబసభ్యులపై పెట్టిన అనవసర నిఘాపై విసుగుచెందిన యాకూబ్.. భారత్ అధికారులకు లొంగిపోవాలనుకుని లాయరైన బంధువు సలహా కోసం కఠ్మాండూ వెళ్లాడు. లొంగుబాటు ప్రమాదకరమని, కోరుకున్న న్యాయం జరగకపోవచ్చని లాయర్ చెప్పడంతో మళ్లీ కరాచీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, నేపాల్ పోలీసులకు చిక్కాడు. వారిసాయంతో భారత అధికారులు మెమన్‌ను ఢిల్లీ తరలించి, అక్కడ అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని నేనే సమన్వయం చేశాను.
* దర్యాప్తు అధికారులకు మెమన్ పూర్తిగా సహకరించారు. భారత్ తిరిగివచ్చేందుకు మెమన్ కుటుంబంలోని పలువురిని ఆయనే ఒప్పించారు. మెమన్ శిక్ష తగ్గింపునకు ఈ రెండు అంశాలు కీలకం.  పేలుళ్లలో మెమన్, ఆయన కుటుంబసభ్యుల పాత్రపై అనుమానం లేదు. ఐఎస్‌ఐ సాయంతో మెమన్ చేసిన పని ఉరిశిక్షకు అర్హమైనదే. కానీ కఠ్మాండూలో అదుపులోకి తీసుకున్నప్పట్నుంచి ఆయన తీరు, దర్యాప్తు అధికారులకు  సాయపడ్డ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే మరణశిక్షపై రెండో ఆలోచన చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement