Article
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
చంద్రబాబు కెరీర్లోనే ఇది వరస్ట్ రాజకీయమట!
రాజకీయాల్లో సుద్దపూసలు భూతద్దంతో వెతికితేనే కనిపిస్తారని ఓ మహానుభావుడన్నాడు. చంద్రబాబులాంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఆ కోవ కిందకు అసలే రారు. తాజాగా తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన ప్రేలాపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే టైంలో.. మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోయి మరీ ఆయన మత రాజకీయాలకు దిగడం చూస్తున్నాం.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీజేపీతో ఎన్డీయే పొత్తులో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు జాతీయ మీడియాను కూడా బాగానే మేనేజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి లడ్డూపై ఆయన కామెంట్లను అవి హైలెట్ చేసిన తీరే అందుకు నిదర్శనం. అయితే అందుకు భిన్నంగా ఓ ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన సంచలనాత్మక వ్యాసం .. ఇప్పుడు చర్చనీయాంశమైంది.తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయాన్ని ఆ ఆర్టికల్ ఫుల్లుగా ఏకీపారేసింది. ముఖ్యంగా చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం ఆధారాల్లేకుండా చేసిన ఆరోపణలు.. ఆ ఆరోపణలను ఎలా అనుకూలంగా మార్చుకోవాలని చూసింది కపిల్ కోమిరెడ్డి ఆ వ్యాసంలో విశ్లేషించారు.చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, వాస్తవాల వక్రీకరణ, తప్పుడు ప్రచారాలను విపులంగా అందులో వివరించారు. అదే టైంలో.. చంద్రబాబు కొత్తగా మొదలుపెట్టిన మతపరమైన రాజకీయాలనూ ప్రశ్నించారు. బాబు జిత్తులమారి రాజకీయానికి నిజనిర్ధారణతో సంబంధం లేకుండా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలాంటి వాళ్లు పడిపోవడం సైతం ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు.ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్క్ కన్నింగ్ రాజకీయం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎలా నడిచిందనేది సైతం డిటైయిల్డ్గా చర్చించింది ఆ వ్యాసం. తండ్రి వైఎస్సార్ బాటలో అన్ని మతాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదరించింది.. అయినా కూడా జగన్‌పై హిందూ వ్యతిరేకి ముద్ర వేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని టచ్ చేసింది.తిరుపతి ఆలయ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. ఉద్దేశపూర్వకమైనవేనని, పక్కా రాజకీయ లబ్ధి కోసమేనని కుండబద్ధలు కొట్టారు కపిల్. అలాగే.. ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఇదే అత్యంత దిగజారిన పరిణామమని అభిప్రాయపడ్డారు.చివరగా.. రాజకీయ సంస్కృతిలో మతాన్ని జొప్పించడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పిదమే చేశారని, ఏపీ ప్రజానీకం బాబు కుట్రలను, కుతంత్రాన్ని అర్థం చేసుకోగలరని ఆ వ్యాసం విశ్లేషించింది. ఏపీలో అధికారం ఎల్లవేళ ఒకే పార్టీ దగ్గర ఉండదనే విషయాన్ని ప్రస్తావించింది. మత రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్రయత్నం.. బెడిసి కొట్టడమే కాకుండా జీవితాంతం ఆయన్ని, ఆయన రాజకీయ వారసత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని ఆ ఆర్టికల్ పేర్కొంది. ప్రింట్ ఆంగ్ల వ్యాసం కోసం క్లిక్ చేయండి -
యాది మరువలేదు.. ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎంఓ
సాక్షి, కామారెడ్డి: ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. గతేడాది మార్చి 28న జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కూలిపోయిన ఇంట్లో ఉంటున్న భిక్క నూరు లక్ష్మి బాధలు ఆలకించారు. అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై సీఎంఓ స్పందించి, వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే రెవెన్యూ ఇన్స్పె క్టర్ పూల్‌సింగ్, ఏడీ నర్సింహారెడ్డి చిన్నమల్లా రెడ్డి గ్రామానికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూలిపోగా మిగిలిన కొద్ది భాగంలో లక్ష్మి కుటుంబం నివసిస్తున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉంటే పొరుగునే ఉన్న తిమ్మక్‌పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తా మని అధికారులు చెప్పారు. అయితే కూలిపోయిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్మి కోరడంతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మితో పాటు ఆమె కు టుంబ సభ్యులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం!
ఏ దేశంలోనైనా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భారత అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాల ద్వారా పలు వివాదాలకు పరిష్కారం చూపింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పొడవునా సుప్రీంకోర్టు అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వాటిలో 10 తీర్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆర్టికల్ 370 రద్దు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు ఈ ఏడాది కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. 2. విడాకుల విషయంలో.. విడాకులపై ఈ ఏడాది సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇక విడాకులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఆరు నెలలు వేచిచూడనక్కరలేదని పేర్కొంది. విడాకులకు దంపతులు ఆసక్తి చూపిన వెంటనే జారీ చేయవచ్చని పేర్కొంది. విడాకుల మంజూరు కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3. ద్వేషపూరిత ప్రసంగాలు.. ద్వేషపూరిత ప్రసంగం అనేది దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2022లో కేవలం మూడు రాష్ట్రాలకు వర్తించే తీర్పు పరిధిని విస్తరించింది. 4. డీమోనిటైజేషన్ నిర్ణయంపై.. మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై 2023లో తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. 5. ఎన్నికల కమిషనర్ల నియామకం ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ప్యానెల్ ద్వారా నియమిస్తామని కోర్టు తెలిపింది. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తదుపరి ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిర్ణయిస్తారని కోర్టు పేర్కొంది. 6. స్వలింగ జంటల వివాహం 2023లో సుప్రీంకోర్టు స్వలింగ జంటల వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించడాన్ని కోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 7. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153ఏ (ఐటీ యాక్ట్ సెక్షన్ 153ఏ) కింద సోదాలు జరిపినప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు లభించకపోతే పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ఏకపక్షంగా పెంచలేరని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో ఇలాంటి సందర్భాల్లో ఆదాయ పన్ను విభాగం ఇష్టారాజ్యం ఇకపై తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 8. జల్లికట్టుపై కీలక నిర్ణయం తమిళనాడు, మహారాష్ట్రల సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, ఎడ్ల బళ్ల పందేలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో ఎద్దుల బండి పందేలను అనుమతించే చట్టం చెల్లుబాటుపై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఆటలు శతాబ్దాలుగా సంస్కృతిలో భాగమని, వాటికి అటంకం కలిగించలేమని కోర్టు పేర్కొంది. 9. అవినీతి అధికారులపై కఠిన చర్యలు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది తన నిర్ణయాన్ని వెలువరించింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2014కు ముందు నమోదైన అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించబోమని కోర్టు స్పష్టం చేసింది. 10. అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. అదానీ-హిండెన్‌బర్గ్ కేసు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు మార్చి 2న ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రిసోర్స్ రిపోర్ట్ లేవనెత్తిన ప్రశ్నలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని ఈ కమిటీలో ఆరుగురు సభ్యులను చేర్చాలని కోరింది. ఇది కూడా చదవండి: గోవా విముక్తికి భారత్ ఏం చేసింది? -
ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు?
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్రప్రతిపత్తి జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1947ఆగస్ట్ 15న భారత్, పాక్ స్వాతంత్య్రం పొందాయి. నాడు శ్రీనగర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత్ సాయం కోరిన జమ్మూకశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రధానిగా హేక్‌అబ్దుల్లాను (1949) భారత్ నియమించింది. 1949 అక్టోబర్ 17న.. రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ ఉన్నారు. 1949 అక్టోబర్ 17న కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలో 370 ఆధికరణను చేర్చింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనను అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1954లో 35ఏ నిబంధన జరిగింది. 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే ఈ ప్రత్యేకప్రతిపత్తిని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 370 రూపకర్త.. ఒకప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధాన రూపకర్త. 1937-43 కాలంలో జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1947 అక్టోబర్‌లో కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్రమంత్రిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. Photo Credits: LIVE LAW HINDI ఆర్టికల్ 370 అంటే.. భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలూ, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయన్న నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యలకు, వివాదాలకు నిలయం.. మొదటి నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కశ్మీర్లో క్రయవిక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతిభద్రతలు అదుపులో లేకపోవడంతో ఇన్నాళ్లూ పెద్ద కార్పొరేట్ కంపెనీలేవీ కశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. మరొకవైపు ఉగ్రదాడులకు స్థావరంగా మారడంతో ప్రబుత్వానికి ఆర్టికల్ 370 రద్దు అనివార్యమైంది. ఎప్పుడైనా స్వతంత్రప్రతిపత్తి రద్దు.. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా కశ్మీర్‌కు ఇచ్చిన స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేయడానికి అధికారాలున్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఈ నిబంధనతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వినియోగించుకున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ నుంచి తప్పించుకుంది. ఆర్టికల్ 370 రద్దు ఇలా.. భారత రాజ్యసభలో ఆగస్ట్ 5, 2019న ఉదయం 11 గంటకు, లోక్‌సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనుమతిని తెలుపుతూ గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దు జరిగింది. 360 రద్దుతో 35ఏ ఆర్టికల్ కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఢిల్లీ తరహా పాలన అమలులోకి వచ్చింది. -
సీఎం పర్యటనతో కరెంటు తీగలకు లింకేంటి!
సాక్ణి, అమరావతి: రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విద్యుత్ తీగలకు సీఎం పర్యటనతో లింకు పెట్టి ఈనాడులో ఆదివారం ప్రచురించిన కథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, వాస్తవాలు దాచి తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాల్లో 85 శాతానికి పైగా మరణాలకు పంపిణీ వ్యవస్థలోని లోపాలే కారణమని రాసిన వార్తలో నిజం లేదంటున్న సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు’ ఇటీవల అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన దృష్ట్యా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలను ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. డిస్కంలో ప్రతి విద్యుత్ ఉద్యోగికి సరైన శిక్షణ ద్వారా అవగాహన కల్పిం చి, భద్రతా పరికరాలు అందించి, ఉద్యోగుల ప్రమాదాలు తగ్గించాం. ఎలక్ట్రికల్ షార్ట్ పోల్స్, లాంగ్ స్పాన్ ఉన్న చోట్ల మిడిల్ పోల్స్ ఏర్పాటు, ఒరిగిన స్తంబాలను సరి చేయడం, విద్యుత్ నియంత్రికల ఎత్తు పెంచడం, ఎర్తింగ్ ఏర్పాటు వంటివి క్రమం తప్పకుండా చేస్తున్నాం.సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ, లక్షలాది విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులను చేపడుతున్నాం. నగరాలు, పట్టణాల్లో ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, వ్యాపార ప్రాంతాలు, ఇరుకు రోడ్లలో 30 ఏళ్లు దాటిన పోల్స్ , కండక్టర్స్ మార్చడం ద్వారా విద్యుత్ ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ శివాలయం వీధిలో కండక్టర్ లేని ఎంసీసీబీ బాక్స్‌తో కూడిన ఓవర్ హెడ్ కేబుల్ ఏర్పాటు చేసే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. వర్షాల వల్ల పెదవేగి మండలం పినకమిడి పొలాల్లో నీరు నిలిచిన కారణంగా ఒరిగిపోయిన స్తంభాలను సరిచేశాం. విశాఖపట్నం పాత పోస్టాఫీస్ ప్రాంతంలో లక్ష్మి థియేటర్ దగ్గర వాడవీధిలో పోల్కి పోల్కి మధ్యలో ఉన్న బేర్ కండక్టర్ తొలగించి ఎల్టీ ఏబీ కేబుల్ వైరు అమర్చాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇదో నిరంతర ప్రక్రియ. ఈ చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ‘కండక్టర్లు మార్చాం’ గతేడాది నవంబర్ నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎల్టీ లైన్ కండక్టర్‌ను 2,403 కిలోమీటర్లు, 11 కేవీ లైన్ కండక్టర్ 2,256 కిలోమీటర్లు, 33 కేవీ లైన్ కండక్టర్ 256 కిలోమీటర్లు, ఎల్టీ కేబుల్ 1,089 కిలోమీటర్ల మేర మార్చాం. ఒరిగిన ఎల్టీ విద్యుత్ స్తంభాలు 6,873, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 7,498, 33 కేవీ విద్యుత్ స్తంభాలు 3,254 కొత్తవి వేశాం. విద్యుత్ లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎల్టీ లైన్ల పరిధిలో 3,317 చోట్ల, 11 కేవీ లైన్ల పరిధిలో 3,383 చోట్ల, 33 కేవీ లైన్ల పరిధిలో 860 చోట్ల ప్రమాదాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేశాం. రోడ్డు క్రాసింగ్‌ల వద్ద ఎల్టీ లైన్ పరిధిలో 19,068, 11 కేవీ లైన్ల పరిధిలో 10,763, 33 కేవీ లైన్ల పరిధిలో 954 విద్యుత్ స్తంభాలను సరిచేశాం. సబ్స్టేషన్ల పరిధిలో ప్రొటెక్షన్‌ను పటిష్టం చేయడం ద్వారా లైన్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా వెంటనే ట్రిప్ అయ్యేలా ఏర్పాటు చేశాం. ఈపీడీసీఎల్ పరిధిలో అన్ని విద్యుత్ ఉప కేంద్రాలకు, 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లు 2020 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సర్వే చేసి సరిదిద్దాం. ఈ క్రమంలో 38,850 వాలిన విద్యుత్ స్తంభాలను సరిచేసి వేలాడే వైర్ల మధ్యలో 7,454 మధ్యస్థ స్తంబాలను వేశాం. 31,324 విరిగిపోయిన స్తంభాలను మార్చి 2,557 కిలోమీటర్ల మేర వేలాడుతున్న వైర్లను సరిచేశాం. ప్రయాస్ కొత్తగా చెప్పిందేమీ లేదు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 9 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం రైతులకు ఒక వరం. దీనివల్ల రైతులకు విద్యుత్ ప్రమాదాలు తగ్గడమే కాకుండా చేలకు నీటిని కావలసిన విధంగా వాడుకుని పంటలు సంవృద్ధిగా పండిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించిన రోజే రైతులు, మోటార్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరికరాలను ప్రభుత్వమే తన ఖర్చుతో పెట్టాలని నిర్ణయించింది. మినీయేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ), ఎర్త్ పైప్ పెట్టడం వల్ల రైతుకు, మోటార్‌కు, ఎలక్ట్రికల్ సామగ్రికి భద్రత ఉంటుంది. వోల్టేజీ హెచ్చుతగ్గులను కెపాసిటర్ నివారిస్తూ మోటార్ సామర్థ్యం పెంచుతుంది. విద్యుత్ వృథా కాకుండా నివారిస్తుంది. ఇవన్నీ సీఎం జగన్ ఎప్పుడో ఆలోచించారు. ఇక్కడ ప్రయాస్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ‘తరచూ శిక్షణ ఇస్తున్నాం’ డిస్కంల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లకు తరచుగా భద్రత, లైన్ మరమ్మతులపై శిక్షణ ఇస్తున్నాం. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, లైన్లు దెబ్బతినడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించి వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, దెబ్బతినడం, లైన్లు వేలాడుతుండటం వంటి సమస్యలను గుర్తిస్తే వినియోగదారులు వెంటనే 1912 కాల్ సెంటర్‌కు సమాచారం అందిస్తే వెంటనే మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పల తడక అంటూ విశ్లేషించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ వివేకా హత్యకు సంబంధించి విచారణ ముగించిందని సీబీఐ చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని ది వైర్ కథనం స్పష్టం చేసింది. వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. ఇక ఈ నెల 20న వచ్చిన తుదిచార్జీ షీట్లో సీబీఐ కేవలం అసంబద్ధమైన కథనాలను వండివార్చిందని ది వైర్ ఏకిపారేసింది. వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ సీటుపై వచ్చిన విభేదాలే అని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ వివేకా రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ చెప్పింది. ఇక కడప ఎంపీ టిక్కెట్ తనకు కానీ, వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు ఇవ్వాలని వైఎస్ వివేకా కోరుకున్నారనేది సీబీఐ థియరీ. చదవండి: వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్! ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి బలహీనమైన అభ్యర్థి అని వివేకా వాదించనట్లు.. అందుకే అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని వివేకా చెప్పేవారని తన చార్జిషీటులో సీబీఐ కథనం అల్లింది. అయితే ఈ కథనానికి ఎక్కడా ఆధారం చూపలేకపోయింది. పైగా సీబీఐ చార్జిషీటులోనే ఈవాదనను వ్యతిరేకిస్తూం ఎన్నో అంశాలున్నాయి. కడప సీటుకు సంబంధించి హత్య జరిగిందని సీబీఐ చెప్తున్న మాటలకు చాలా వైరుధ్యాలున్నాయి.ఇందులో వివేకా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని సీబీఐ చెప్పిన మాటలు పూర్తి వాస్తవ విరుద్ధం. నిజానికి 2004 తర్వాత వివేకా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి రిటైర్ అయ్యారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. 2011 లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓటమి తర్వాత మా నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని సునీత సీబీఐకి చెప్పింది. దీనిని పూర్తిగా పక్కన పెట్టిన సీబీఐ వివేకా యాక్టివ్‌గా ఉన్నారని చార్జిషీట్లో రాసుకొచ్చింది. ఇక కడప ఎంపీ అభ్యర్ధి విషయంలో వచ్చిన విభేదాలే హత్యకు కారణమని సీబీఐ చెప్పిన మాటలకు ఆధారాలు లేవు. పైగా ఇది పూర్తి అబద్ధం అని నిరూపించే ఆధారాలు చార్జిషీట్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా 2019 మార్చి 10న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక మార్చి 17, 2019 న ఒకేసారి అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు రోజులు ముందుగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉన్నా.. వివేకా మరణంతో రెండు రోజులు ఆలస్యమయింది. ఇక నోటిఫికేషన్‌కంటే ముందు అంటే అధికారికంగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం కన్నా ముందే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారైంది. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బలహీన అభ్యర్థి అనేది వాస్తవ విరుద్ధం. 2014 లోనే కడప నుండి లక్షా 93 వేల 323 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 3,80,976 ఓట్లతో ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత బలమైన అభ్యర్థి అనేది కడప వారినే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఇక కడప ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్వతహాగా వివేకా కూతురు, అల్లుడు స్వయంగా సీబీఐకి చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడో నిర్ణయించారని వైఎస్ వివేకానందరెడ్డి కూడా అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశారని స్వయంగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో వెల్లడించారు. వివేకా చనిపోవడానికి ఒకరోజు ముందు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వివేకా జమ్మలమడుగులో ప్రచారం చేసినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటికి రెండుసార్లు చెప్పారు. అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మినహా మరెవరి పేరు చర్చకు లేదని, అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవ్వరూ ఎన్నడూ వ్యతిరేకించలేదని వైఎస్ వివేకా సోదరి విమలమ్మ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయాలేవి మాత్రం సీబీఐకి కనపడలేదు. పైగా కడప ఎంపీ విషయంలో జోక్యం చేసుకుని పెద్దగా ప్రభావం చూపగల శక్తిగాని అంత అధికారంగాని వివేకాకు లేదని కడప రాజకీయాలను గమనించేవారందరికి తెలుసు. వైఎస్ వివేకా కడప ఎంపీ అభ్యర్థి నిర్ధారించే విషయంలో వైఎస్ వివేకా ప్రభావం చాలా తక్కువ. 2011 లో వైఎస్ జయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసిన వివేకా అనంతరం వైఎస్సార్ కుటుంబానికి దూరమయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆయన తన కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా అధికారం కోసం వైఎస్ వివేకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ బయటకు వస్తే మంత్రి పదవి కోసం ఏకంగా తల్లిలాంటి వదిన విజయమ్మపై పోటీ చేశారు. 2008లో అమెరికా నుండి వచ్చినవైఎస్ వివేకా అల్లుడికి రాజకీయ కాంక్ష ఎక్కువ. ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించారు. 2011లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా నర్రెడ్డి కుటుంబం ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో విజయమ్మ చేతిలో వివేకా ఘోరంగా పరాజయం పొందారు. ఇంత జరిగినా చిన్నాన్న వివేకాపై వైఎస్ జగన్ సానుభూతిగానే వ్యవహరించారు. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, కడప జిల్లా ఇన్ ఛార్జ్‌ని చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నంత ప్రభావవంతంగా వివేకా లేరనేది చాలామంది కడప నాయకులకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అంత ప్రభావం చూపిస్తారా ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యారని స్వయంగా వివేకా కూతురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అధికారిక ప్రకటన కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలుసని.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు. అయినా సీబీఐ మాత్రం కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందనిఛార్జ్ షీట్ లో కథ అల్లడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక కడప ఎంపీ సీటే వివేకా హత్యకు కారణం అని కథ అల్లిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఇక ఈ కథనానికి బలం చేకూర్చేందుకు సీబీఐ మరో కథను సిద్ధం చేసింది. అదే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి. వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ద్రోహం చేశారని అందుకే ఆయన ఓడిపోయారనేది సీబీఐ కథనం. ఇక ఓటమికి కారణం అయిన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇంటికి వెళ్లి వైఎస్ వివేక తీవ్రంగా అవమానించారనేది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట. దీంతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబం వివేకాను హత్య చేసిందనిం సీబీఐ కథనం అల్లింది. అయితే అసలు వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. వివేకాను ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జగన్ ఆయనకు బీఫాం ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైన గెలవడానికి స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు వివేకాకు వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతోంది. అయితే దీనికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన 800 మంది ఓటర్లలో ఒక్కర్ని కూడా సీబీఐ విచారించలేకపోయింది. ఈ 800 మందిలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తమకు డబ్బు ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు. వీరెవరి దగ్గరు సీబీఐ స్టేట్మెంట్లు రికార్డు చేయేలేదు. అంతే కాదు కనీసం వివేకాను ఓడించిన మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని కూడా సీబీఐ విచారించ లేదు. అయినా రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని ఛార్జ్‌షీట్ లో కథనం అల్లేసింది. రెండేళ్ల కిందట జరిగిన గొడవకు, ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధం ఎలా ఉంటుందో సీబీఐ చెప్పలేదు. ఇక సీబీఐ చార్జిషీటులో రాజకీయ కోణమే హత్యకు కారణమని తేల్చేసింది. ఎక్కడా ఆధారం లేకపోయిన కథనం అల్లేసి వండివార్చేసింది. ఇక మిగిలిన ఆధారాలను మాత్రం పక్కన పడేసింది. అందులో ముఖ్య కారణం..ఆస్తి తగాదాలు. హత్య జరిగిన సమయానికి వివేకా వయస్సు 67 సంవత్సరాలు.పులివెందులలోని తన నివాసంలో వివేకా ఒంటరిగా నివసిస్తున్నారు. వివేకాకు ఆరు నెలలకిందటే గుండె ఆపరేషన్ జరిగినా వివేకా భార్య మాత్రంం వివేకాను వదిలి తన కుమార్తె సునీత దగ్గర ఉంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే వివేకా దగ్గరకి ఆయన సతీమణి వచ్చి వెళ్లేవారు. వివేకా కూతురు సునీతా ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తండ్రిని కలిసేవారు. వ్యాపార సంబంధాల కారణంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం పలు మార్లు వివేకాను కలిసేవారనేది సీబీఐ సేకరించిన వాంగ్మూలాల ద్వారా స్పష్టం అవుతోంది. వివేకా గురించి ఆయన కుమార్తె సునీత సీబీఐతో చెప్పిన విషయాలతో వారి కుటుంబం మధ్య ఉన్న గొడవలు స్పష్టంగా అర్ధం అవుతాయి. తన తండ్రి వివేకాకు షమీమ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసాక తాను తండ్రి దగ్గరకు వెళ్లే దాన్ని కాదని ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లినా కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండే దాన్నని సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. వివేకా హత్య కంటే ముందు 2018 క్రిస్మస్ రోజున తాను చివరిసారిగా వివేకా ఇంచికి వెళ్లినట్లు సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. షమీమ్అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా వివేకాకు మొదటి భార్య కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయనిం సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తోంది. 2006లో వివేకాకు షమీమ్ అనే మహిళతో పరిచయమైంది. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం కోసం వివేకా సహాయం కావాలని షమీమ్ కోరింది. ఇక వివేకా షమీమ్ల మధ్య పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో తన పేరును అక్బర్‌గా మార్చుకుని వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు.మరణించే సమయానికి వివేకా, షమీమ్ లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం గురించి తెలిసిన తర్వాత వివేక మొదటి భార్య కుటుంబ సభ్యులు తనను బెదిరించారని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ పలుమార్లు మనుషులను పంపి నన్ను బెదిరించారని.. తన కోసం వివేకా పలుమార్లు బావ మరుదులతో ఘర్షణకు దిగారని సీబీఐకి తెలిపిన షమీమ్. నెలసరి ఖర్చులతో పాటు వివేకా తనను అన్ని రకాలుగా చూసుకున్నారని షమీమ్ సీబీఐకి తెలిపారు. 2018లో గుండె ఆపరేషన్ తర్వాత తన ఆరేళ్ల కుమారుడి భవిష్యత్ కోసం వివేకా ఆందోళన చెందేవారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపింది. తన కుమారుడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించడంతో పాటు తనకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తానని కొంత డబ్బు ఫిక్డ్స్ డిపాజిట్ చేయించడంతో పాటు వ్యవసాయ భూమిని కొనిస్తానని వివేకా వాగ్ధానం చేశారని సీబీఐ వాంగ్మూలంలో చెప్పిన షమీమ్. అయితే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్ని కంపెనీల నుండి వివేకా చెక్ పవర్ తొలగించడంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు స్టేట్మెంట్లో స్పష్టం చేసిన వివేకా రెండో భార్య షమీమ్. ఇక మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి వివేకా తీవ్రమైన వేదనలో ఉన్నట్లు కేర్‌టేకర్ పండింటి రాజశేఖర్ సీబీఐకి తెలిపారు. డబ్బులు లేకపోవడంతో వివేకా ఆందోళనకు గురయ్యారని.. ఫలితంగా విపరీతంగా మద్యం సేవించేవారని రాజశేఖర్ చెప్పాడు. ఒకరోజు డబ్బు విషయం మాట్లాడటం విన్నట్లు త్వరలోనే డబ్బు వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో అన్నట్లు పండింటి రాజ స్టేట్ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఎర్ర గంగిరెడ్డిని బూతులు తిడుతూ వివేకానందరెడ్డి గట్టిగా అరిచేవారని అయినా ఎర్ర గంగిరెడ్డి మౌనంగా ఉంటూ తరచూ వస్తు ఉండేవాడనేది రాజా సీబీఐకి చెప్పాడు. ఇక హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి వివేకా ప్రవర్తన అసాధారణంగా మారిపోయిందని.. మెట్ల మీద కూర్చుని విపరీతంగా మద్యం సేవించడం, సిగరెట్లు విపరీతంగా కాల్చేవారని రాజా సీబీఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు. మెల్లమెల్లగా వివేకా ఆరోగ్యం పూర్తిగాక్షీణించడం ప్రారంభించిందని ఇది చూసి తాను ఒకరోజు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానట్లు రాజా స్టేట్మెంట్లో స్పష్టం చేశాడు. ఇంకా ఏదో ఒకపంచాయతీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని వివేకా ఎదురుచూస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డికి చెప్పానని సీబీఐ ముందు రాజా ఒప్పుకున్నాడు. ఇక వివేకా డబ్బు వ్యవహారాల గురించి పండింటి రాజశేఖర్‌తో పాటు చాలా మందికి తెలుసు.సీబీఐ వాంగ్మూలాలను పరిశీలించినా వివేకాకు దాదాపు 5 కోట్ల అప్పు ఉందని స్పష్టమౌతోంది. ఇక ఓవైపు వివేకా అప్పులతో తీవ్రమైన వేదనలో ఉంటేం సునీత రెడ్డి మాత్రం సీబీఐ వాంగ్మూలంలో మరో చెప్పింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందని సునీతరెడ్డి చెప్పింది. అయితే వివేకా చెక్ పవర్ ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు సునీత రెడ్డి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాము వ్యాపారం కోసం అప్పు తీసుకొడానికి ప్రయత్నించినట్టు, అయితే వివేక అప్పటికే చాలా అప్పులు చేసినందున తమ కంపెనీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించినట్లు సునీత వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. అందుకే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసి వివేకా చెక్ పవర్‌ను తొలగించినట్లు సునీతారెడ్డి చెప్పింది. కేవలం కంపెనీలో అప్పుతెచ్చుకోవడానికే ఈ మార్పులు చేశామని తన తండ్రి కంపెనీలలో తాను కూడా డైరెక్టర్‌గా ఉన్నానని సునీత ఒప్పుకుంది. ఇక వివేకా మరణం తరువాత ఆయన స్థానంలో తాను డైరెక్టర్‌గా చేరిన సునీత.. తండ్రి మరణం తరువాత అప్పులన్నీ కట్టేసి కంపెనీలను లాభాలలోకి తెచ్చామని చెప్పిన సునీత. అయితే వివేకా బతికి ఉన్నప్పుడు మాత్రం కనీస ఖర్చులకు డబ్బులు లేకుండా ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ వివేకా మరణం తరువాత 2023 జనవరిలో 93 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్న కూతురు సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ్మ. వివేకా కుటుంబంలో ఈ స్థాయిలో ఆస్తి కోసం కుట్రలు జరిగినా సీబీఐ మాత్రం వీటిని పట్టించుకోలేదు. తన విచారణలో ఎక్కడా హత్యకు సంబంధించిన కారణాలలో ఆస్తి తగాదాలకు సంబంధించిన కోణంలో విచారణ జరప లేదు. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు సీబీఐ కావాలని ఆస్తి తగాదాలను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేసింది. వివేకా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం పైన సీబీఐ పూర్తిగా విచారణ జరపలేదు.సీబీఐ విచారణ మొత్తం కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను ముగించింది. వివేకా హత్యకేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారం. కానీవీళ్లిద్దరు నిజం చెప్తున్నారా...? అనే దానికి ఎక్కడా ఆధారం లేదు అంటూ ది వైర్ కథనంలో పేర్కొంది. -
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్!
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్! -
గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు
ఇప్పుడు మనం ఓ గాడిద కథ చెప్పుకుందాం.. ప్రాచీన గ్రీసు దేశంలో డెమాస్తనీస్కు మహావక్తగా మంచి పేరుండేది. ఆయనోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నులు.. ఇలా చెప్తుంటే జనంలో కాస్త అలజడి, గందరగోళం కనిపించాయి. వాళ్ల అనాసక్తి గ్రహించిన డెమాస్తనీస్.. వెంటనే ప్రసంగం ఆపి మీకు ఒక కథ చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు. ‘‘ఇద్దరు వ్యక్తులు వేసవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడి దగ్గర గాడిద ఉంది. మరొకడికి దాని అవసరం ఉంది. దాన్ని అమ్ముతావా అని అడిగాడు. ఇద్దరూ మాట్లాడు కున్నారు. బేరం కుదిరింది. అమ్మకం అయిపోయింది.. వారు వాళ్ల ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే వేసవి ఎండ ఎక్కువగా ఉండి.. ఓ దగ్గర ఆగారు. గాడిద నిలబడి ఉండగా దాని నీడలో అమ్మిన వ్యక్తి కూర్చున్నాడు. కొన్నా యనకు మండుకొచ్చింది. కొనుక్కున్న నేను ఎండలో ఉండాలి అమ్మినవాడు నీడలోకూర్చుంటాడా? అని ఆర్గ్యు చేశాడు. ‘నువ్వు లే నేను కూర్చుంటా’నని గదమాయించాడు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమ్మిన వ్యక్తి బాగా తెలివైన వాడు.. ‘నేను గాడిదను అమ్మాను గానీ నీడను కాదు.. నీడ నాదే..’ అంటూ తన లాజిక్ వదిలాడు.. ఇంకేం తగువు మొదలైంది. నలుగురూ చుట్టూ చేరారు. వాదులాట పెరిగింది. గాడిద–నీడ సమస్య పరిష్కరించడంలో అందరూ మునిగిపోయారు’’ అని చెప్పడం ఆపేశాడు డెమాస్తనీస్. వింటున్న జనంలో ఆసక్తి మొదలైంది. వాళ్లలో వాళ్లు గాడిద గొడవపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పరిష్కారమేమైంది? ఏం తేల్చారు? అని డెమాస్తనీస్ను అడగడం మొదలుపెట్టారు. అసలు తమ బతుకు సంగతి చెబితే పట్టని జనం గాడిద గొడవ చర్చించడం చూసి డెమాస్తనీస్ నవ్వి ఊరుకున్నాడు. ఆ గాడిద గొడవ తేలేది కాదు కాబట్టి, మనమూ వదిలేద్దాం. జనాన్ని మనకు అనుకూలమైన చర్చ వైపు నెట్టడమే కదా.. మంచి వక్త నేర్పరితనం. చుట్టూ వరదలున్నా గ్లూమీ.. గ్లూమీ సమాచారంతోనైనా మనకు ఇష్టమైన దారిలోకి ‘మంద’ను మళ్లించడమే కదా.. అసలైన పొలిటీషియన్ టెక్నిక్.. చర్చ గాడిదల వైపు కావచ్చు.. విదేశీ కుట్రల వైపూ కావచ్చు.. జనం ‘కళ్ల నిండా కాళేశ్వరం’ చూసి కంగారు పడో, కడుపు మండో ‘విదేశీ కుట్ర’ అని ఒక మాట అనరా.. బరాబర్ అంటారు ఆయన.. ఇంకా ‘విదేశీ కుట్ర’ అన్నారాయన. ఈ విషయంలో సొంత ప్రభుత్వంపైన అనుమానాలున్నవారు కూడా ఉన్నారు. ఇట్లా రండి అలా సోషల్ మీడియాలో దూరుదాం.. సిడ్నీ.. స్వదేశీ కుట్ర కొద్దిరోజుల క్రితం.. సిడ్నీలో భారీ వర్షాలు పడ్డాయి. ఎంతగా అంటే ఎనిమిది నెలల వర్షం నాలుగు రోజుల్లో దంచేసింది. సహజంగానే పెను నష్టం వాటిల్లింది. ఇంకేం రకరకాల సిద్ధాంతాలు నిద్ర లేచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘క్లౌడ్ సీడింగ్’ దానికి కారణమని ప్రచారమైంది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్ సీడింగ్ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని గవర్నమెంట్ చెప్పినా.. అ వాయిస్ జనానికి చేరేలోపు.. లక్షల్లో వ్యూస్ నమోదయ్యాయి. రాడార్ చిత్రాలు, మేఘాలలో వింత ఆకారాల ఫొటోలు.. విమానం ఎగరడాలు.. ఇలా ఏవేవో ఆధారాలు చూపుతూ.. అది ప్రభుత్వం ప్రజలపై వేసిన ‘వెదర్ బాంబే..’ అనేయడం మొదలుపెట్టారు. ఇదంతా న్యూస్ చానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణ నిపుణులు శాస్త్రీయ కారణాలు చెప్పినా ఎవరూ వినలేదు.. అంతా అధికార పక్షం చేసినదేంటూ ఢంకా బజాయించారు... దీనికన్నా మనం విన్న ‘విదేశీ కుట్రే’ నయం కదా.. థాయ్‌లాండ్.. వరద రాజకీయాలు 2011లో ఇక్కడ వచ్చిన వరదలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ‘నష్టం’గా పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు కొనసాగాయి. జనవరి 2012 వరకు కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ వరదల ప్రభావం ఎంతో. ఆ వరదలు బ్యాంకాక్‌ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనయింది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకుపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా జరిగిన నష్టం 46.5 బిలియన్ డాలర్లు.. ఇంత విధ్వంసానికి కారణం ‘ప్రకృతి ప్రకోపం’ అన్న పాయింట్ పక్కకుపోయింది.. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలో వరదలు వచ్చాయి. ‘తాము ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందనీ.. తర్వాత వానలతో డ్యాములన్నీ నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయని విపక్షం వాదనకు దిగింది. ‘వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయాలని.. రాజకీయంగా తమను, ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని..’ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. కొన్నేళ్ల పాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది.. ‘‘అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాలపై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది. ..ఇదీ స్వదేశీ వరద రాజకీయమే. అవకాశం రావాలేగానీ.. వరదలు, విపత్తులు, మహమ్మారులు వేటినీ వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతున్నాయి. 2011లో జపాన్‌లో తారస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీనే సృçష్టించింది. 30 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడి.. ఫుకుషిమా పవర్ ప్లాంట్‌లో ‘అణు’ ప్రమాదానికి దారి తీసింది. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ‘ఠాట్!.. అంతా తప్పు. దీనికి ఇజ్రాయెల్ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్ కోసం çజపాన్ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనే’నని జపాన్‌లో బాగా నమ్మిన వారున్నారు. 2004లో ఇండోనేసియాలో 9.1–9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో 2,27,000 మందికిపైగా మరణించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పనేనని ప్రచారమైంది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించడానికి అమెరికా చేసిన పనేనని బలంగా నమ్మారు. అక్కడ కనిపించిన అమెరికా యుద్ధనౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడూ అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.. ఇలాంటి సిద్ధాంతాలకు వందలకొద్దీ ఆధారాలు (?) గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజమేనని అనిపించేలా చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని కొందరు అనుమానాలు వ్యక్తీకరించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలే దానికి కారణమని మనవైపూ అనుమానంగా చూసినవారూ ఉన్నారు. .. చివరికి భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నమ్మి ప్రచారం హోరెత్తించిన వారూ ఉన్నారు. ఇలా అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖానుపుంఖాలుగా జనం నెత్తిన రుద్దేవారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు.. గ్లూమీ, గ్లూమీగా విషయం తెలిసినవారే. అప్పటి అవసరాలు, పాలిటిక్స్ కోసం జనం ముందుకు తెచ్చినవారే. ఇది బాగుంది... శుక్రవారం మళ్లీ వర్షాలు మొదలు కావడంతో సోషల్ మీడియాలో కనిపించిన జోక్.. ఇది కూడా బాగుంది... ఈ మధ్య వరదలు, వ్యాఖ్యలు చూస్తుంటే గుర్తొస్తుందంటూ ఓ మిత్రుడు చెప్పిన కామెంట్.. ప్రముఖ అమెరికన్ రచయిత, కాలమిస్టు, వక్త, యాక్టివిస్టు జిమ్ హైటవర్.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌పై వేసిన చురక ఇది.. ‘అజ్ఞానం బ్యారెళ్ల లెక్కన అమ్మే వీలుంటే.. జార్జి బుష్ బుర్ర డ్రిల్లింగ్ హక్కులు సంపూర్ణంగా నేనే కొనుక్కుంటా..’ .. ఆహా.. నిజమే ఇలాంటి మార్కెట్ ఉంటే బాగుండు.. సహజ వనరులున్న బుర్రలు మనకు అనేకం ఉన్నాయి కదా.. -సరికొండ చలపతి -
రాజీవ్ గాంధీ హత్య.. ఆ రోజు ఏం జరిగిందంటే..?
అది 1991 మే 21. సమయం రాత్రి 10.30. కొత్త ఢిల్లీలోని 10– జనపథ్ రోడ్లో ఉన్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్రెటరీ వి. జార్జ్ రూమ్‌లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. జార్జ్ రిసీవర్ ఎత్తి హలో అనగానే, అటు నుండి ‘దిస్ ఈస్ సీఐడీ ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై సర్. మేడం (సోనియా గాంధీ)తో మాట్లాడాలండీ‘ అని ఆదుర్దాగా అన్నాడు. జరగరానిదేదో జరిగిందని జార్జ్ సిక్స్త్ సెన్స్ శంకించింది. ‘బాస్ (రాజీవ్) ఎలా ఉన్నారు?’ వణకుతున్న గొంతుతో జార్జ్ ప్రశ్న. ‘సర్ మేడంకి ఇవ్వండి ఫోన్’ అటునుండి అర్థింపు. ‘నేను అడుగుతుంది బాస్ ఎలా ఉన్నాడు అని’... ఈ సారి కటువుగానే అడిగాడు పీఏ జార్జ్. ‘సర్... హి ఈస్ నో మోర్...’ అంతే... లైన్ డిస్ కనెక్ట్ అయింది. చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు ఆ రోజు ఉదయం (21.5.1991) నుండి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు? ఒరిస్సాలో ఎన్నికల సభల్లో మాట్లాడి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సర్క్యూట్ హౌజ్ చేరుకున్నారు. పదవ లోక్‌సభ (1991) ఎన్నికలకు 40 శాతం సీట్లను ఆయన యువతకే కేటా యించారు. అందులో వైజాగ్ లోక్‌సభ కాండిడేట్, 38 సంవత్సరాల ఉమా గజపతి రాజు కూడా ఒకరు. ఆమె కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడే ఢిల్లీ నుండి సోనియా ఫోన్! వెంటనే బయల్దేరి ఢిల్లీకి వచ్చేయమని ఆమె కోరింది. ‘మరగతం (చంద్రశేఖర్) ఆంటీ... మమ్మీ (ఇందిరాజీ) క్లోజ్ ఫ్రెండ్. ఈ రాత్రి ఆమె సభను (శ్రీపెరుం బుదూర్) అడ్రస్ చేసి రేపు ఉదయం ఫస్ట్ ఫ్లైట్‌కి ఇంటికి చేరుకుంటాను’ అన్నారు రాజీవ్. ఫోన్ పెట్టేశారు సోనియా. తమ ఇంట్లో డిన్నర్ చేసి వెళ్లమన్నారు ఉమ. ‘నో ఉమా, లెట్ మీ మూవ్’ (మృత్యువు పిలుపు కాబోలు) అంటూ, మందహాసంగా ఆమె రిక్వెస్ట్‌ను తోసిపుచ్చారు బాస్. తమిళనాడు శ్రీపెరుంబుదూర్ సభా ప్రాంగణం ఆ రాత్రి ఫ్లడ్ లైట్ల కాంతిలో, కాంగ్రెస్ కార్యకర్తలు, క్రిక్కిరిసిన శ్రోతలతో పండగ వాతావరణం సంతరించుకుంది. లౌడ్ స్పీకర్లలో తమిళ తల్లిని కీర్తిస్తూ పాటలు! మరో వైపు రంగు రంగుల పూలతో అలంకరించిన అతి పెద్ద వేదిక మీద తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుపయ్య మూపనార్, ఇతర నాయకులూ; పార్టీ అభ్యర్థీ, సీనియర్ నాయకురాలూ అయిన మరగతం చంద్రశేఖర్ వంటివారు ఉత్సాహంగా రాజీవ్‌గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ ప్రాంతం చుట్టుముట్టు తమిళ ఉగ్రవాదుల ‘స్లీపర్ సెల్స్’ మాటేసి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘లిబరే షన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’ (ఎల్టీటీఈ) హిట్ లిస్ట్‌లో ఉన్న మొదటి ఇండియన్ లీడర్ రాజీవ్ గాంధీ! రాత్రి వేళల్లో తమిళనాడులో ఓపెన్ మీటింగులకు ఆయన రావటం రిస్కుతో కూడుకున్న పని అని పోలీసు నిఘావర్గం అప్పటికే తెలిపింది. అయినా రాత్రి 9 గంటలకు ఈ సభలో ప్రసంగించాలని బయలు దేరారు రాజీవ్. విధిలీల! సభా ద్వారం నుండి ఎర్ర తివాచీపై నడుస్తూ... నవ్వుకుంటూ అభిమానుల చేతులు కలుపుతూ ఒక్కొక్క అడుగే వేస్తున్నారు. జనసమూహం నుండి ఆతన్ని వేరు చేయటానికి స్థానిక పోలీసులు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రదీప్ గుప్తా శత విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతలోనే పంజాబీ డ్రస్ ధరించి కళ్లజోడు పెట్టుకున్న 16 ఏళ్ల చామన చాయ యువతి, చందనపు దండ పట్టుకుని రాజీవ్‌కు ఎదురుగా ప్రత్యక్షమైంది. నవ్వుతూ ఆయన మెడలో ఆ దండ వేసింది. ఆమెను వారిస్తూ ఒక వైపు తోసే ప్రయత్నం చేసింది లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. ఆమెను చూసి చిరునవ్వుతో ‘రిలాక్స్ బేబీ’ అని అపారాయన. అదే అదునుగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నట్టు ముందుకు వంగింది ఆ అమ్మాయి (థాను). అంతే...! చెవులు చిల్లులు పడే శబ్దంతో బాంబు పేలటం, రెప్పపాటులోనే రాజీవ్ గాంధీ శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరి పోవటం జరిగిపోయింది. ఈ భీకర సంఘటన అప్పటి దేశ రాజకీయ చదరంగంలో అతి పెద్ద మలుపునకు దారితీసింది. 48 సంవత్సరాల కాంగ్రెస్ యువనేత రాజీవ్ గాంధీకి బదులు 68 సంవత్సరాల దక్షిణాది తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధాని పీఠం అధిరోహించారు. (రషీద్ కిద్వాయి గ్రంథం ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా...) - జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ (మే 21న రాజీవ్ గాంధీ వర్థంతి) -
దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!
ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్ ఒక సంఘం, విద్వేష కేంద్రం కాదు అనేది తొలి పాఠం. నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వాన్ని ‘సంఘం’ అని రాజ్యాంగం అంటోంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష విధ్వంస ఉద్వేగ ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి, భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో... రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. ‘నేషనల్’ అన్న పదానికి తెలుగులో మనం ‘జాతీయ’ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశభక్తి భావాలను రక రకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం. మన నాయకుల సంగతి మరీ దారుణం. చంపండి, నరకండి అని తెలుగు సినిమా ఫ్యాక్షన్ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను వేదికల మీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడే వారు దేశద్రోహులు. వాడుకగా పత్రికల్లో, టీవీల్లో మనం ‘కేంద్రం’ అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనే మాటే లేదు. ఆ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తొలి తెలుగుదేశం వ్యవస్థాపకుడు (చంద్రబాబు నాయుడికి ముందు తెలుగుదేశం) ఎన్టీ రామారావు ‘కేంద్రం’ అనే పదం ‘మిథ్య’ అనేవారు. రాష్ట్రాలు లేకపోతే దేశం ఎక్కడ అనేవారు. అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా వాదించేవారు. మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా? రాష్ట్రం గొప్పదా? అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కేంద్రం అని. గొప్పదంటే ఏమిటీ? ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికల ద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సమానమే కదా? సమానమే కానీ కేంద్రం ‘ఎక్కువ సమానం’. ఎందుకంటే... దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు, ఇవన్నీ యూనియన్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్ లిస్ట్ అని ఏడో షెడ్యూల్లో కొన్ని అంశాలపై పాలనాధికారాలనూ, శాసనా ధికారాలనూ ప్రత్యేకించి యూనియన్‌కే పరిమితం చేశారు. యూనియన్ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం. కానీ వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. రాజనీతి పరంగా... రాజ్యాంగ వాడుకలో స్టేట్ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్ అంటే రాజ్యం అనీ, దేశ పాలనా వ్యవస్థ అనీ అర్థం. మార్గ దర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానతను సాధించడానికీ, పేద ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికీ కృషి చేయాలనే సూత్రం ఒకటి ఉంది. స్టేట్‌ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా ‘రాజ్యం’ రాష్ట్రమైంది. ‘రాష్ట్రం’ దేశమైంది. ‘దేశం’ కేంద్రమైంది. రాష్ట్రం కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలకపదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటాం. న్యాయ పరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది. ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగం తొలి అధికరణం సంవిధాన రచన ఆరంభమవుతుంది. ఆర్టికల్ 1 సంఘం (యూనియన్) పేరు ప్రాదేశిక పరిధి: (1) ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సంఘమై ఉంటుంది. (2) రాష్ట్రాలు వాటి ప్రాదేశిక పరిధుల వివరణ తొలి షెడ్యూలులో ఉంది. (3) ఈ ఇండియా పరిధిలో ఉండేవేవంటే... (ఏ) ఆయా రాష్ట్రాల పరిధి, (బీ) తొలి షెడ్యూల్లో పేర్కొన్న కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి, (సీ) భవిష్యత్తులో స్వాధీనం చేసుకోబోయే ప్రాంతాలు ఏవైనా ఉంటే అవీ. (క్లిక్: రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు) తొలి షెడ్యూల్లో ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాల రాష్ట్రాలను, వాటి పరిధులను పేర్కొన్నారు. (ఏ) భాగంలో బ్రిటిష్ ఇండియాలోని తొమ్మిది ప్రొవిన్స్లూ, (బీ)లో స్వతంత్ర రాజ్యాలు, (íసీ)లో కేంద్ర పాలనలో ఉన్న అయిదు రాష్ట్రాలు; అండమాన్ నికోబార్ దీవులు (డీ)లో చేర్చారు. ఏడో రాజ్యాంగ సవరణ (1956) ద్వారా పార్ట్ (ఏ) (బీ)ల మధ్య తేడాను తొలగించారు. తరువాత రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్నిర్మించారు. ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న మాట వెనుక హేతుబద్ధత ఏదీ లేదనే విమర్శలకు గురైన విధానం ఇది. అయిదారు రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. వాటన్నిటినీ కలపడం భావ్యమా? తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటి అనే వాదం కూడా తెలంగాణ ఏర్పాటు కార ణాల్లో ఒకటి. 1950లో లేని అనేక కొత్త రాష్ట్రాలు ఆ తర్వాత వచ్చాయి. తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. కానీ జమ్ము–కశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. (క్లిక్: రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసివుంటే...) ‘భారత్’ అని ఇండియాను పిలవాలంటూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం 2016లో దాఖలైంది. మన రాజ్యాంగంలో మన దేశానికి భారత్ అనీ, ఇండియా అనీ రెండు పేర్లున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్ర వాక్యం ‘భారత్ మాతాకీ జై’. అందులోంచి భారత్ అన్న పేరును స్వీకరించారు. ప్రతి భారతీయుడికీ ఈ రెండు పేర్లలో ఒక పేరును ఎంచుకునే హక్కు ఉందని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అంటూ ఈ పిటిషన్‌ను కొట్టి వేశారు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో నిర్ణయించే నిరంకుశాధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. (క్లిక్: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
దేశాన్ని విడదీస్తోంది
న్యూఢిల్లీ: విద్వేషం, మత దురభిమానం, అసహనం వంటి చెడు ధోరణులు దేశాన్ని నానాటికీ విడదీస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఈ ధోరణికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే సమాజం తిరిగి బాగు చేయలేనంతగా పాడవటం ఖాయం. తరాల తరబడి కష్టించి నిర్మించుకున్న విలువలన్నింటినీ ఈ విద్వేషాగ్ని భస్మీపటలం చేస్తుంది’’ అని హెచ్చరించారు. ప్రజలే ముందుకొచ్చి ఈ విద్వేషపు సునామీని అడ్డుకోవాలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసంలో ఆమె పిలుపునిచ్చారు. ఇదంతా బీజేపీ పాపమేనని ఆరోపించారు. ‘‘భారత్ శాశ్వతంగా విభజనవాదంలో కూరుకుపోవాల్సిందేనా? ప్రస్తుత పాలకులు దీన్నే కోరుకుంటున్నారు. వస్త్రధారణ, ఆహారం, విశ్వాసాలు, పండుగలు, భాష వంటి అన్ని విషయాల్లోనూ పౌరులను పరస్పరం ఉసిగొల్పుతున్నారు. చరిత్రను వక్రీకరించి మరీ రెచ్చగొడుతున్నారు. అప్పడే తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేరతాయని భావిస్తున్నారు’’ అంటూ బీజేపీని దుయ్యబట్టారు. అపారమైన వైవిధ్యానికి మన దేశం నిలయమని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలను విడదీసేందుకు ఆ వైవిధ్యాన్ని కూడా వక్రీకరిస్తున్నారన్నారు. ‘‘మైనారిటీలపై దాడులకు దిగేలా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. వారిలో దుందుడుకుతనాన్ని, మత విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. మన ఉన్నత విలువలకు, సంప్రదాయాలకు పాతరేస్తున్నారు. పైగా అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను ఉక్కుపాదంతో అణచేసే ప్రమాదకర ధోరణిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పైకి పూర్తిస్థాయిలో ఉసిగొల్పి వారిని నిత్యం వేధిస్తున్నారు. హక్కుల కార్యకర్తలను బెదిరించి నోరు మూయించజూస్తున్నారు. విద్వేషపు విషాన్ని, పచ్చి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఇష్టానికి దుర్వినియోగం చేస్తున్నారు’’ అని వాపోయారు. భయం, మోసం, బెదిరింపులే మోదీ ‘ఆదర్శ పాలన’కు మూలస్తంభాలుగా మారాయంటూ నిప్పులు చెరిగారు. ‘ఎక్కడైతే భయోద్వేగాలుండవో...’ అంటూ విశ్వకవి టాగూర్ రాసిన గీతాంజలి కవితా పంక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరముందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ సంస్కృతి వ్యాప్తి చేస్తున్న విద్వేషాగ్నికి ప్రతి భారతీయుడూ మూల్యం చెల్లిస్తున్నాడని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. సోనియా వ్యాసాన్ని ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. -
Russia Ukraine War: పుతిన్‌కు క్యాన్సర్?!
రష్యా అధినేత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియా ప్రాజెక్ట్ సంస్థ ‘ఇన్వెస్టిగేషన్ ఆన్ వ్లాదిమిర్ పుతిన్ హెల్త్’ పేరిట విడుదల చేసిన ఒక కథనంలో అనుమానం వ్యక్తం చేసింది. రష్యా ప్రజల నుంచి ఆయన తన అనారోగ్యాన్ని దాచిపెడుతున్నారని, ఇందుకోసమే ఉక్రెయిన్‌పై దాడికి దిగారని గతంలో వచ్చిన ఆరోపణలకు తాజా కథనం బలం చేకూరుస్తోంది. ఈ మీడియా ప్రాజెక్ట్ (మీడియా ప్రొకెట్ అంటారు) సంస్థను రష్యాలో నిషేధించారు. దీంతో సంస్థ విదేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతోంది. పుతిన్ స్టెరాయిడ్ వాడకంలో ఉన్నారని, అందుకే ఆయన మెడ, ముఖం వాచినట్లున్నాయని కథనంలో పేర్కొంది. పుతిన్‌తో ఎప్పుడూ ఉండే కొందరు డాక్టర్ల గురించి కథనంలో ప్రస్తావించారు. వీరిలో ఒకరు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు కాగా మరొకరు న్యూరో సర్జన్. పుతిన్ 2020 జూలైలో నేషనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ దెదోవ్ను కలిసారని కథనం తెలిపింది. పుతిన్ పెద్ద కూతురు ఇక్కడే పనిచేస్తారు. ఈ సమావేశంలో థైరాయిడ్ క్యాన్సర్, లక్షణాలు, దానికి కనిపెట్టిన టైరోజిన్ అనే ఔషధం తదితర వివరాలను పుతిన్‌కు ఇవాన్ వివరించారని కథనం పేర్కొంది. కొత్త ఔషధం వల్ల రికవరీ ఎంత వరకు ఉండొచ్చని పుతిన్ ప్రశ్నించారని తెలిపింది. అప్పుడే పుతిన్ ఆరోగ్యంపై చర్చలు మొదలయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో పుతిన్ చాలా రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆ సమయంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు ఆయనతో ఎప్పుడూ ఉండేవారని పేర్కొంది. తర్వాత రోజుల్లో ఆయన జనాలతో చాలా దూరం నుంచి మాట్లాడేవారని గుర్తు చేసింది. 2016 నుంచే? పుతిన్ అనారోగ్య సమస్యలు 2016–17 నుంచే సీరియస్‌గా మారాయని కథనం పేర్కొంది. ఆ సమయంలో ఆయనకు డిమిట్రీ వెర్బోవోయ్ అనే డాక్టరు చికిత్స చేశారు. సోచీలోని ఒక రిసార్టులో పుతిన్ ఎక్కువగా గడుపుతుంటారు. ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడూ కనీసం 5– 17మంది డాక్టర్లుండేవారని తెలిపింది. అనారోగ్య కారణాలతో పుతిన్ సడెన్‌గా మాయమవడం ఐదుసార్లు జరిగిందని గుర్తు చేసింది. ఆయనకు చికిత్సనందించినందుకు కృతజ్ఞతగానే ఓలెగ్ మిస్కిన్ అనే వైద్యుడికి పుతిన్ డాక్టర్ ఆఫ్ రష్యా అవార్డిచ్చారని తెలిపింది. థైరాయిడ్ ప్రాంతంలో వాపు, మాట బొంగురుగా రావడం, మింగడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, పొడిదగ్గు తదితరాలుంటే థైరాయిడ్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. పుతిన్‌కు ఈ సమస్యలున్నాయని, అందుకే డాక్టర్ అలెక్సీ షెగ్లోవ్ అనే స్పెషలిస్టు పుతిన్‌తో 282 రోజుల పాటు కలిసిఉన్నారని కథనం తెలిపింది. ఆయనతో పాటు ఇగోర్ ఇసకోవ్ అనే స్పెషలిస్టు 152 రోజులు, క్యాన్సర్ సర్జన్ సెలివనోవ్ 166 రోజుల పాటు పుతిన్‌తో గడిపారని తెలిపింది. అయితే వీరు ఏ సమయంలో పుతిన్‌తో కలిసిఉన్న విషయం కథనంలో వెల్లడించలేదు. ఎంతవరకు నిజం? గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. వచ్చే అక్టోబర్‌కు ఆయనకు 70 సంవత్సరాలు వస్తాయి. కేవలం వయసు కారణంగా వచ్చే సమస్యలు తప్ప ఆయనకు మరీ తీవ్రమైన అనారోగ్యాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య ప్రభుత్వాలు కావాలని ఇలాంటి కథనాలు వ్యాప్తిచేస్తుంటాయని రష్యా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు మానసిక సమస్యలున్నాయంటూ జపాన్‌కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ సంస్థ ఒక కథనం వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ ముదిరిపోయిందన్న కథనం కూడా ఇలాంటి కల్పిత కథేనని కొందరు నిపుణుల భావన. రష్యా లాంటి దేశంలో అధికారికంగా ప్రకటించేవరకు ఏ సంగతి తెలియదని వీరు గుర్తు చేస్తున్నారు. ఐదుసార్లు గాయబ్! గతంలో అనారోగ్య కారణాలతో పుతిన్ అకస్మాత్తుగా కొన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన ఘటనలివే.. 1. 2012 నవంబర్: వ్యాపార యాత్రలు, దూర ప్రయాణాలను పుతిన్ రద్దు చేసుకున్నారు. ఆయన యథావిధిగా విధులు నిర్వహిస్తున్నట్లు చూపడానికి పాత వీడియోలను కొన్నాళ్లు క్రెమ్లిన్ ప్రసారం చేసేది. 2. 2015 మార్చి: ప్రజలకు దూరంగా కొన్నాళ్లు కనిపించలేదు. ఆయన పాల్గొనాల్సిన సమావేశాలు రద్దయినా గత వీడియోలను చూపి సదరు సమావేశాలు జరిగినట్లు మేనేజ్ చేశారు. 3. 2017 ఆగస్టు: సోచీ రిసార్టుకు వెళ్లిన పుతిన్ వారం పాటు కనిపించలేదు. 4. 2018 ఫిబ్రవరి: ఎన్నికల ప్రచారం మధ్యలో అకస్మాత్తుగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొన్నారు. ఆయనకు జలుబు చేసినందున విశ్రాంతికి వెళ్లారని అధికారులు చెప్పారు. 5. 2021 సెప్టెంబర్: సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అన్ని కార్యక్రమాలకు వీడియో ద్వారా హాజరయ్యారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
పురోగతి బాటలో ఎకానమీ
ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్ ఎకానమీ విస్తృత స్థాయి పురోగతికి బాటలు వేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి బులిటన్లో ప్రచురితమైన ఆర్టికల్ విశ్లేషించింది. మూడవ వేవ్‌ను సవాళ్లను అధిగమించిన భారత్‌లో ఆర్థిక రికవరీ ఇప్పటికే పటిష్టం అవుతోందని వివరించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలుసహా వివిధ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎకానమీ పురోగమిస్తోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ థామ్‌తో ప్రచురితమైన ఆర్టికల్ పేర్కొంది. ఆర్టికల్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల పునరుద్ధరణ వల్ల 2022–23లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉపాధి కల్పన, డిమాండ్‌ను బలోపేతం వంటి అంశాలకూ దోహదపడుతుంది. ► మల్టీ–మోడల్ కనెక్టివిటీ, రవాణా రంగం పురోగతి ద్వారా విస్తృత స్థాయి వృద్ధిని భారత్ సాధించగలుతుంది. ఈ లక్ష్య సాధనలో గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్రణాళిక కీలకమైనది. మౌలిక సదుపాయాల పురోగతిలో ఇది కీలకమైనది. ► ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ నుంచి భారత్ బయట పడిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో పునరుద్ధరణ వేగంగా ఉంది. ► డిమాండ్, ఆశావాదం ప్రాతిపదికన తయారీ, సేవల రంగాల రెండూ విస్తరిస్తున్నాయి. వినియోగదారు, వ్యాపార విశ్వాసాన్ని మెరుగుపడ్డం కూడా కలిసివస్తోంది. వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్వసిస్తున్నాం. ► ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతోంది. క్రూడ్‌సహా కమోడిటీల ధరలు పెరగడం, సరఫరాల్లో సమస్యలు దీనికి ప్రధాన కారణం. ► ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంకా తీవ్ర అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. పలు అంశాలు ఇంకా సవాళ్లవైపే పయనిస్తున్నాయి. ► భారత్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచి అధిక వ్యయాల ప్రణాళికలు, వ్యాపారాలను సులభతరం చేయడానికి చర్యలు సానుకూల అంశాలు. ఆయా అంశాలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వరుసలో భారత్‌ను మొదట నిలబెడుతున్నాయి. ► ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమావేశాల్లో ద్రవ్యోల్బణం–వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా పదవ త్రైమాసిక బేటీలోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. ► పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఆర్థికశాఖ నెలవారీ నివేదిక స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ (2022–23 ఆర్థిక సంవత్సరం)లో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలతో పోల్చితే వేగంగా పురోగమించనుందని ఆర్థికశాఖ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. కోవిడ్–19 అనంతర ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలన్న ప్రణాళికతోనే ప్రస్తుత సంవత్సరం కూడా ముగియవచ్చని నివేదిక విశ్లేషించింది. భారత్‌కు సంబంధించినంతవరకూ తయారీ, నిర్మాణ రంగాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని పేర్కొంది. పీఎల్ఐ, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాల పెంపు దేశీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తాయని నివేదిక విశ్లేషించింది. నివేదికలోని కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే... ► నికర విత్తన విస్తీర్ణం, పంటల వైవిధ్యీకరణలో స్థిరమైన పురోగతిని వ్యవసాయ రంగం సాధిస్తోంది. ఇది దేశ ఆహార నిల్వల పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఆదాయ బదిలీల వంటి అంశాలు ఈ రంగానికి లాభిస్తాయి. ► వేగవంతమైన వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్‌ను తొలి స్థానంలో నిలిపిన విషయం గమనార్హం. జనవరి మొదట్లో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీగా 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. అయినా ఈ స్థాయి వృద్ధి కూడా ప్రపంచ దేశాల్లో అత్యధికమని పేర్కొంది. ► దేశంలో మూడవ వేవ్ సవాళ్లు తలెత్తినప్పటికీ, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు వీటిని తట్టుకుని నిలబడ్డాయి. విద్యుత్ వినియోగం, తయారీకి సంబంధించి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఎగుమతులు, ఈ–వే బిల్లులు వంటి వంటి అనేక హై ఫ్రీక్వెన్సీ సూచికలు బలమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. వృద్ధి రికవరీ పటిష్టతను ఇది ప్రతిబింబిస్తోంది. ► కోవిడ్ 19 వైరస్ వల్ల కలిగిన అనిశ్చితి, ఆందోళన ప్రజల మనస్సుల నుండి తొలగిపోయిన తర్వాత, వినియోగం పుంజుకుంటుంది. డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత స్థాయి అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలను మినహాయిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు 2022–23లో పలు సానుకూల అంశాలు ఉన్నాయి. -
విజయ సోపానాలు
మానసాన్ని, శరీరాన్ని సరైన గమ్యం వైపు నడిపించడమే ఏకాగ్రత. నిశ్చయమైన, నిశ్చలమైన బుద్ధి దీనికి తోడ్పాటును అందిస్తుంది. ఏ విషయం మీదనైనా ఏకాగ్రత కుదిరినప్పుడే అద్వితీయమైన విజయాలను సొంతం చేసుకోవచ్చునని చరిత్ర సాక్షిగా మనకు తెలుస్తుంది. ధనార్జనలోనైనా, కార్యసాధనలోనైనా, చేయదలచిన ఏ కార్యంలోనైనా, ఏకాగ్రతాశక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం అంత చక్కగా జరిగి, విజయం సిద్ధిస్తుంది. ఒకే రకమైన అర్హతలూ, తెలివి తేటలూ ఉన్నా, విజయలక్ష్మిని సొంతం చేసుకునే వారు మాత్రం కొందరే ఉంటారు. దానికి కారణం వారి వ్యక్తిత్వంలోని విశిష్టశైలి, ప్రవర్తనలోని ప్రత్యేకమైన సుగుణాలు. విజేతలు తమ విజయానికి సోపానాలుగా మలచుకునే కొన్ని అరుదైన లక్షణాలను తమ వ్యక్తిత్వానికి అలకరణలుగా నిలుపుకుని ఉద్యమిస్తూ ఉంటారు. తాను విజేతను కావాలని కలలుగనేవారు ముందుగా సాధించబూనిన కార్యానికి సంబంధించిన అంశాన్ని జీవనధ్యేయం గా మలచుకోవాలి. ఆ భావాన్నే శ్వాసగా, ధ్యాసగా నిలుపుకుని ముందుకు సాగాలి. తన శరీరంలోని మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి అంగమూ మహత్తరమైన ఆ భావంతో తాదాత్మ్యం చెందాలి. తామర తంపరగా మనల్ని చుట్టుముట్టే మిగిలిన భావాలకు సంబంధించిన ఆలోచనలను పక్కకు నెట్టేయాలి. కార్యాన్ని ఏ విధంగా సాధించ దలచుకున్నారో దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆలోచనతో పురోగమించాలి. ఆలోచనే ఏ మనిషినైనా కార్యాన్ముఖుని చేయగల గొప్ప శక్తి. ఇది విజయానికి ప్రథమ సోపానం. విజేతగా నిలవాలని భావించే వ్యక్తి పట్టించుకోకూడనివి, పయనించే మార్గంలో వారికి ఎదురయ్యే అపజయాలు. విజయసాధనలో అత్యంత ముఖ్యమైనది అపజయాలను లెక్కచేయకుండా, ముందుకు సాగడమే. అపజయాలు మనకు అపకారాలు చేయవు. మనకున్న అవకరాలూ కావు. అవి విజయానికి సాధకుని మరింతగా సన్నద్ధం చేసే గొప్ప అలంకారాలు. స్వల్పమైన అపజయం కలుగ గానే రకరకాల ఆలోచనలు, ముఖ్యంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించే తలపులు మదిలో ముసురుకుని దాడి చేస్తాయి. అప్పుడే, దృఢమైన చిత్తంతో, సంకల్పబలంతో ముందడుగు వేయాలి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ‘‘సాగరంలోని కెరటం కింద పడేది, మరింత ఉధృతమైన శక్తితో పైకి లేవడానికే’’ అన్న వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని అచంచలమైన విశ్వాసంతో పురోగమించాలి. విజయసాధనలో మనిషికి బలవత్తరంగా ఉపకరించే మరొక అపురూపమైన సోపానం ఏకాగ్రత. ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని సాధించాలన్నా, ఎంతటి ఉన్నతమైన విజయాన్ని అందుకోవాలన్నా మనిషికి ఆధారంగా నిలిచేది ఏకాగ్రతే. ఒకరకంగా చెప్పాలంటే విజయసాధన అనే తాళాన్ని తెరిచే తాళపుచెవి ఏకాగ్రత అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాధకులు తమలోని సంకల్పబలాన్ని, ఆలోచనను, తమలో ఉన్న చైతన్యాన్ని అంతటినీ జాగృతం చేసి, ఒకేచోట కేంద్రీకృతం చేయడమే ఏకాగ్రత అయితే, మనసు ను ఏకైక విషయం మీద దృష్టిని నిలిపేలా చేయడం ఏకాగ్రతా సిద్ధి. ఏ కార్యంలోనైనా ఏకాగ్రత సాధిస్తే, విజయ శిఖరాన్ని చేరడం ఖాయం. విజయసాధకులకు పెట్టని ఆభరణంలా ఉండే శుభలక్షణం ఆత్మవిశ్వాసం. ఈ విషయాన్ని మణిపూసల వంటి సమాజ సేవకులను, క్రీడాకారులను చూసినప్పుడు మనం స్పష్టంగా గమనించవచ్చు. సమాజ సేవకులను ఉదాహరణగా తీసుకుంటే, వారికి దారిలో కలిగే ప్రతిబంధకాలు అనేకం. ముఖ్యంగా వారు తీసుకు రాదలచినమార్పును అంగీకరించని వ్యక్తుల నుంచి వచ్చే సహాయ నిరాకరణ వంటి అంశాలు ఎప్పుడూ ఈ సేవా దృక్పథం కలిగినవారి మదిలోనే ఉండవు. సమాజహితం కోరి తాము చేయదలచిన కార్యం మాత్రమే వారి మనోయవనిక మీద మనోరమ్యంగా రెపరెపలాడుతూ ఉంటుంది. మనిషికున్న ఆత్మవిశ్వాసమే భౌతికబలాన్ని మించిన నిజమైన బలం. భౌతిక శక్తిని, మానసిక యుక్తిని సమన్వితం చేయడమే మనిషిలో విశ్వాసాన్ని పాదుకొల్పుతుంది. క్రీడాకారులు ఆత్మవిశ్వాసం ప్రకటించడంలో ఎప్పుడూ ఉన్నతస్థానంలోనే ఉంటారు. వారు ఆడే ఆటలోఅంతకుముందు ఉన్న ప్రమాణాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, కొత్తప్రమాణాలను నెలకొల్పుతూ ముందుకు సాగడం మనకు ఎన్నో సందర్భాల్లో దీప్తివంతంగా కనబడుతూనే ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణపతకమే దీనికి చక్కని ఉదాహరణ. వందేళ్లకు పైబడి ఏ భారతీయ అథ్లెట్ సాధించని అద్వితీయ విజయం ఈ ఒలింపిక్స్ క్రీడల్లో నీరజ్ సొంతమయ్యింది. అదే విధంగా అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయి చాను ఈ ఒలింపిక్స్ క్రీడల్లోనే వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించింది. ఈశాన్యభారత రాష్ట్రమైన మణిపూర్ కు చెందిన మీరాబాయి పేదరికాన్ని జయించి, అప్రతిహతమైన పట్టుదలతో విజేతగా నిలిచింది. విజేతలు గుర్తుంచుకోవలసిన లక్షణాలను నిండుగా కలిగిన తెలుగమ్మాయి సింధు మరొక చక్కని ఉదాహరణ. వీరి విజయాలకు మిగిలిన కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, ప్రధాన కారణం మాత్రం మొక్కవోని పట్టుదలను ప్రదర్శిస్తూ ‘‘నేను సాధించగలను’’ అని త్రికరణశుద్ధిగా నమ్మిన వారి ఆత్మవిశ్వాసమే అని చెప్పకతస్పదు. విజయ సాధనలో వినయశీలతకూ ప్రధాన భూమికే ఉంది. అహంకరించినవాడు ఎంత శక్తివంతుడైనా, అతి స్వల్ప కాలంలోనే మట్టికరచిన దాఖలాలు మనకు చరిత్రలో ఎక్కువగానే కనబడతాయి. ఉత్తమంగా భాసించే పైన పేర్కొన్న లక్షణాలను సదా దృష్టిలో నిలుపుకుంటే, అవి సాధకునికి మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధపు కవాటాలను దాటించి, విజయ బావుటాను ఖచ్చితంగా ఎగురవేయిస్తాయి. – ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి -
ఎమర్జెన్సీ చీకటికి 46 ఏళ్లు
దేశ ప్రజలు నిద్రిస్తున్న వేళ 1975 జూన్ 25 నాడు∙లోక్ నాయక్ జయప్రకాష్ నారా యణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ లాంటి అగ్రశ్రేణి నాయకులను రాత్రికి రాత్రే జైళ్లలో నిర్బంధించారు. ఆరెస్సెస్‌పై నిషేధం విధించి, వారి కార్యాలయాలను సీజ్ చేశారు. వార్తా పత్రికల కార్యాలయాలకు కరెంట్ కోత విధించి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా సెన్సార్ కత్తిని ఎత్తి బెది రించారు. ప్రజలకు ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపే మొత్తం దేశాన్ని బందీఖానాగా మార్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. 1973లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరా గాంధీ అక్రమాలకు, అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైనందున ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. అదేరోజు వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడినట్టు తేలింది. ఆరోజే ఇందిరకు అత్యంత సన్ని హితుడు డి.పి. ధార్ గుండె నొప్పితో చనిపోయాడు. పిడుగుపాటు లాంటి ఈ మూడు వార్తలు ఒక వైపు, అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి మరోవైపు రావడంతో ఆమెలోని వికృత రూపం జడలు విప్పింది. అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వాల అక్రమా లకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఆధ్వ ర్యంలో ప్రారంభమైన నవ నిర్మాణ్ సంఘర్ష సమితి ఉద్యమంలో నాటి జనసంఘ్ నాయకులు, విద్యా ర్థులు పాల్గొని దాన్ని బిహార్ నుండి గుజరాత్ వరకు విస్తరింపజేశారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రజలను ప్రేరేపిస్తున్నారని దుష్ప్రచారం చేసి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కీలుబొమ్మ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గుడ్డిగా సంతకం చేశారు. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సిగ్గు లేకుండా ఎమర్జెన్సీని సమర్థించింది. విప్లవ కవి త్వంలో అగ్రగణ్యుడైన శ్రీశ్రీ ఇందిరమ్మ నియంతృ త్వాన్ని స్వాగతించారు. తర్వాతి కాలంలో తప్పు చేశామని చెంపలేసుకున్నారు, అది మరో కథ. 18 నెలల పాటు నిరంకుశత్వం స్వైరవిహారం చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని సుప్రీం కోర్టులో వాదించారు. ఆనాటి అమానుషమైన స్థితికి ఒక ఉదాహరణ కేరళ విద్యార్థి నాయకుడు రాజన్‌ను పోలీసులే అపహరించటం. ఆ అపహరణ కేసులో ప్రభుత్వం పక్షాన వాదించిన అటార్నీ జనరల్ ‘అపహ రించడమేకాదు, ఒక పౌరుణ్ని చంపినప్పటికీ ప్రశ్నించే అధికారం ఏ కోర్టుకు కూడా లే’దని వాదించాడంటే ఆనాటి కిరాతక స్థితి ఎలా ఉందో ఊహించొచ్చు. నియంతృత్వానికి వ్యతిరేకంగా బహిరంగ ఉద్య మాలకు, సత్యాగ్రహాలకు రూపకల్పన జరిగింది. తమకు ఎదురేలేదని విర్రవీగుతున్న నియంతకు హఠా త్పరిణామంతో దిమ్మ తిరిగింది. ఎక్కడికక్కడ అరె స్టులకు పూనుకుంది. స్కూళ్లు, కాలేజీ భవనాలను జైళ్లుగా మార్చవలసి వచ్చింది. ఎన్నికలకు ఇదే అదను అని ఆంతరంగికులు సలహా ఇచ్చారు. ప్రజలు బ్రహ్మ రథం పడతారని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పాయి. ఎన్నికలు జరిపిస్తే అంతర్జాతీయంగా వచ్చిన చెడ్డపేరు పోయి ప్రజాస్వామ్యంలో నిబద్ధత కలిగిన నాయకురా లిగా మంచిపేరు వస్తుందని ఊహించారు. ప్రతిపక్షా లకు ఊపిరిపీల్చే సమయం ఇవ్వకుండా తక్షణమే ఎన్నికల ప్రకటన చేయించారు. నాయకులందరూ నిర్బంధంలో ఉన్నప్పటికీ ప్రజలు నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. తల్లీ కొడుకులు ఇద్దరూ కూడా చిత్తుగా ఓడిపోయారు. జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా, వాజ్‌పేయి, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండావతే లాంటి హేమాహేమీలు మంత్రు లుగా జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ పునాదులను కదిలించగలిగిన స్థాయిలో సత్యాగ్రహోద్యమం నడిపించగలిగిందంటే ఆరెస్సెస్ నెట్వర్క్ ఎంత పటిష్టమైనదో ప్రజలకు తెలి సొచ్చింది. ఆనాడు పోరాటంలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులకు, ఇంతమందిని కదిలించిన ఆరెస్సెస్ కార్యదక్షతకు జోహార్లు అర్పిం చాలి. ఎమర్జెన్సీ నేర్పిన గుణపాఠాలను రానున్న తరాలకు భద్రంగా అందించాలి. అయితే ఇందిరా గాంధీకి కొమ్ముకాసిన కమ్యూనిస్టులే నేడు బీజేపీ రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని గగ్గోలు పెడుతుండటం గమనార్హం. వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే మొబైల్ : 98663 26248 -
ఆఫ్రికా గర్వించదగ్గ దిగ్గజం కౌండా
జూన్ 17 నాడు మరణించిన జాంబియా మాజీ అధ్యక్షుడు కెనెత్ కౌండా ఇరవయ్యో శతాబ్దపు ఆఫ్రికా జాతీయవాద గొప్ప నాయకుల్లో చివరివాడు. మూడు దశాబ్దాల పాటు ఆఫ్రికాలోనూ, ప్రపంచ పటంలోనూ జాంబియాకు విశిష్ట స్థానం సంపా దించిపెట్టిన కౌండా 97 ఏళ్ల వయ సులో మరణించారు. 27 ఏళ్లపాటు జాంబియాను పాలిం చిన కౌండా కీర్తికి రెండు పార్శా్వలున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత శాంతియుతంగా పదవి నుంచి తప్పుకున్న కాండా దేశంలో ఏక పార్టీ విధానానికి ఆద్యుడు. ఆఫ్రికా సామ్యవా దానికి మార్గదర్శిగా నిలిచిన వాడే నిరసనను అణచివేశాడు.అయితే ‘కెకె’గా ప్రసిద్ధుడైన కౌండా దయాళువైన రాజు అనిపించుకున్నారు. సఫారీ సూట్లు ధరించడం, తెల్ల కర్చీఫు లను ఊపడం, బాల్రూమ్ డ్యాన్సులు చేయడం, సైకిల్ తొక్కుతూ తనే రాసిన పాటలు పాడటం, బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి చేష్టలతో ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సాధించారు. కెన్నెత్ డేవిడ్ కౌండా అక్టోబర్ 14, 1924న ఉత్తర జాంబియాలో జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో ఒకడు. నాన్న మిషనరీ టీచర్. తల్లి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ అర్హత పొందిన మహిళ. తల్లిదండ్రుల బాట లోనే మొదట కాండా కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. టాంజానియాలోనూ కొంతకాలం అదే వృత్తిలో కొన సాగారు. అప్పుడే టాంజానియాకు మున్ముందు అధ్యక్షుడు కానున్న జూలియస్ నైరీరి పట్ల ఆరాధన పెంచుకున్నారు. ఆయన ప్రవచించిన ‘ఉజ్మా’ తరహా సామ్యవాదాన్ని (సహ కార ఆర్థికవ్యవస్థ) అనుసరించడానికి ప్రయత్నించారు. టాంజానియా నుంచి తిరిగివచ్చాక, శ్వేతజాతి సెటి లర్స్‌కు మరింత ప్రాబల్యం పెరిగేలా దక్షిణ రొడీషియా, ఉత్తర రొడీషియా, న్యాసాలాండ్‌తో కలిపి సమాఖ్య ఏర్పాటు తలపెట్టిన బ్రిటిష్‌వారి పథకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే కారణంగా తొమ్మిది నెలలపాటు జైలుకు వెళ్లారు. తిరిగి వచ్చాక పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నమై ఉత్తర రొడీషియా ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. అయితే, బ్రిటిష్ వారితో మితవాద వైఖరితో ఉన్న ఆ పార్టీ నాయకుడు హారీ కుంబులాతో విభేదించి, జాంబియన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో చీలిపోయారు. సహ జంగానే ఇది నిషేధానికి గురైంది. కౌండా మరో తొమ్మిది నెలలు జైలుకు వెళ్లారు. ఇది మరింతగా ఆయనకు ప్రజా దరణ పెంచింది. కొత్త ఉద్యమంగా పెల్లుబికిన యునైటెడ్ నేషనల్ ఇండిపెండెన్స్ పార్టీ తమ నాయకుడిగా కౌండాను ఎన్ను కుంది. అనంతరం కౌండా అమెరికా వెళ్లి మార్టిన్ లూథర్ కింగ్‌ను కలిశారు. మహాత్మా గాంధీ, లూథర్ కింగ్ భావాల స్ఫూర్తితో ‘చా–చా–చా’ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. 1964లో స్వాతంత్య్రం పొందిన తర్వాత జాంబియాకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, స్వతంత్ర దేశంలో తొలి సవాల్ విద్యరూపంలో ఎదురొ చ్చింది. దేశంలో ఒక్క విశ్వవిద్యాలయం లేదు, ప్రాథమిక స్థాయి విద్యను పూర్తిచేసినవాళ్లు సగం శాతం లేరు. దాంతో ఉచిత పుస్తకాల పంపిణీ, అత్యల్ప ఫీజు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఆఫ్రికా మానవవాదం పేరుతో తన ఆర్థిక విధానాలను రూపొందించారు. విదేశీయులు యజమానులుగా ఉన్న కంపెనీల్లో 51 శాతం వాటా దేశానికే ఉండేట్టు చేశారు. అయితే ఈ విధానానికి 1973లో గట్టిదెబ్బ తగిలింది. అనూ హ్యంగా పెరిగన చమురు ధర, దేశ ఎగు మతుల్లో 95 శాతం వాటా ఆక్రమించిన రాగి ధరలో తగ్గుదల దేశాన్ని కుదిపే సింది. స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే ప్రపంచంలోనే అత్యధిక అప్పుల ఊబిలో కూరుకు పోయిన రెండో దేశంగా మిగిలింది. అనంతర కాలంలో ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రవేశానికి దారితీసింది. వారి షరతులకు తలొగ్గేట్టు చేసింది. దాంతో ప్రైవేటీకరణ పెరిగింది, ఆహార సబ్సిడీ నిలిచిపోయింది, ధరలు పెరిగాయి. క్రమంగా కౌండా ప్రజాదరణ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అయితే చాలామంది వలసవాద వ్యతిరేక నాయకుల్లాగే కౌండా కూడా బహు పార్టీ విధానాన్ని పాశ్చాత్య భావనగా చూశారు. అదే ఘర్షణలకు, గ్రూపులకు దారితీస్తుందని తలచారు. 1968లో యూఎన్ఐపీ మినహా అన్ని పార్టీలను నిషేధించారు. ఆయన ప్రభుత్వం క్రమంగా నిరంకుశంగా, నిరసన పట్ల అసహనంగా, తన వ్యక్తిత్వమే అన్నింటికీ కేంద్రంగా తయారైంది. అయితే చాలామంది నిరంకుశ, ఏక పార్టీ నేతలతో పోల్చితే అణచివేత, అవినీతి విషయాల్లో కౌండా మెరుగైన నాయకుడు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా, రష్యా రెండింటిలో దేనితోనూ చేరక అలీన విధా నాన్ని పాటించారు. 1985లో పదవీ విరమణ చేసిన జూలియస్ నైరీరి తన స్నేహితుడిని కూడా రాజకీయాల్లో నుంచి తప్పుకొమ్మని కోరారు. కానీ కౌండా భీష్మించారు. అప్పటికే ధరలు ఆకాశా న్నంటాయి. 1990లో రేగిన తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొన్నాక, ఆహార అల్లర్లు చెలరేగాక బహు పార్టీ ఎన్ని కల విధానానికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. భూమ్మీదే స్వర్గాన్ని సృష్టిస్తానన్న మహర్షి మహేశ్ యోగికి దేశంలో దాదాపు పావు వంతు భూభాగాన్ని కేటాయించనున్నట్టు వెల్లడించిన ఆయన ప్రణాళిక కూడా ప్రజాదరణ పెంచలేక పోయింది. దాంతో 1991లో జరిగిన ఎన్నికల్లో ట్రేడ్ యూని యన్ నాయకుడు ఫ్రెడెరిక్ చిలూబా భారీ విజయం సాధించారు. ఎన్నికల్లో అపజయాన్ని కాండా హుందాగానే స్వీక రించినప్పటికీ కొత్త ప్రభుత్వం ఆయన పట్ల ఉదారత ఏమీ చూపలేదు. తిరుగుబాటు ఆరోపణ మీద ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది. 1996లో ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయనను దేశంలేని వాడిగా ప్రకటించింది(వాళ్ల నాన్న మలావీలో పుట్టాడన్న కారణం చూపి). అయితే ఆయన కోర్టుకు వెళ్లి నెగ్గారు. 1997లో జరిగిన హత్యాయత్నంలో బుల్లెట్ తగిలినా క్షేమంగా బయటపడ్డారు కౌండా. వాళ్ల కుమారుడిని మాత్రం 1999లో ఇంటి బయట కాల్చి చంపారు. 1986లో ఎయి డ్స్‌తో మరణించిన మరో కుమారుడి కారణంగా హెచ్ఐవీ సమస్యలకు స్పందించి, దానికి తొలినాళ్లలోనే ప్రచారం చేయడం ఆరంభించిన ఆఫ్రికా నేత అయ్యారు. గొప్ప ఆఫ్రికా జాతీయవాదిగా, విప్లవాలకు ఆశ్రయం ఇచ్చిన విప్లవకారునిగానే కాక అసమ్మతితోనే అయినా జాంబియాకు ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసిన నేతగా కౌండా గుర్తుండి పోతారు. వ్యాసకర్త లెక్చరర్ లండన్ విశ్వవిద్యాలయం -
కొత్త బంగారు లోకం
న్యూఢిల్లీ: పని సంస్కృతిలో, వృత్తి, ఉద్యోగ వాతావరణంలో ‘కరోనా’ గణనీయ మార్పు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇల్లే ఆఫీస్‌గా మారిందని, ఇంటర్నెటే మీటింగ్ రూమ్‌గా రూపాంతరం చెందిందని, ఆఫీస్‌లో సహోద్యోగులతో కలిసి బ్రేక్ టైమ్ గడపడం చరిత్రగా మారిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘లింక్డ్ఇన్’ పోర్టల్‌కు తాను రాసిన ఒక వ్యాసాన్ని ఆదివారం మోదీ ట్వీట్ చేశారు. సృజనాత్మక, శక్తిమంతమైన భారతీయ యువత ఆరోగ్య, సౌభాగ్య భవిష్యత్తుకు మార్గాన్ని ప్రపంచానికి చూపగలరన్నది తన విశ్వాసమని, అందుకు సంబంధించిన కొన్ని ఆలోచనలను పంచుకున్నానని పేర్కొంటూ ‘లైఫ్ ఇన్ ద ఎరా ఆఫ్ కోవిడ్–19’ పేరుతో రాసిన ఆ వ్యాసం లింక్‌ను ప్రధాని ట్వీట్ చేశారు. ఏ ఈ ఐ ఓ యూ ‘ఈ శతాబ్దంలోని మూడో దశాబ్దం అనేక ఒడిదుడుకులతో ప్రారంభమైంది. కోవిడ్–19 తనతో పాటు ఎన్నో అవాంతరాలను తీసుకువచ్చింది’ అని ఆ వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాపార నమూనాలు తెరపైకి వస్తున్నాయన్న ప్రధాని.. ఈ సంక్షోభ సమయాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా అనంతర ప్రపంచంలో నూతన వ్యాపార అభివృద్ధి అవకాశాలను రూపొందించుకోవాలని సూచించారు. ‘పరిస్థితులకు తగ్గట్లుగా మార్పు చెందుతూ, అంతర్జాతీయ పరిణామాలను ఆకళింపు చేసుకుంటూ, సామరŠాధ్యలను పెంపొందించుకుంటూ, అవకాశాలను సృష్టించుకుంటూ, సమ్మిళిత దృక్పథంతో ముందుకు సాగాలి’ అని ఇంగ్లీష్ భాషలోని అచ్చులు ఏ(అడాప్టబిలిటీ), ఈ(ఎఫిషియెన్సీ), ఐ(ఇన్‌క్లూజివిటీ), ఓ(అపార్చునిటీ), యూ(యూనివర్సలిజం)లను సమయోచితంగా ఉపయోగిస్తూ దిశానిర్దేశం చేశారు. కరోనా అనంతర ప్రపంచంలో ఈ ఐదు అంశాలు ఏ వ్యాపార నమూనాకైనా ముఖ్యమైన అంతర్భాగాలవుతాయన్నారు. కరోనాకు కులం, మతం లేదు కరోనా కులం, మతం, జాతి, వర్గం, వర్ణం, భాష.. ఇవేమీ చూడదని ప్రధాని పేర్కొన్నారు. వీటికి అతీతంగా దాడి చేస్తుందన్నారు. కరోనాపై పోరాటంలో అందరు కూడా సోదర భావంతో ఐక్యంగా సాగాలన్నారు. ‘గతంలో దేశాలు, ప్రాంతాలు పోరాడుకున్నాయి. ఇప్పుడు మానవాళి అంతా ఒక ఉమ్మడి శత్రువుపై పోరాడుతోంది. ఎంత ఐక్యంగా పోరాడామన్న విషయంపైననే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని తెలిపారు. నేనూ మారాను కరోనా కారణంగా మారిన పరిస్థితులకు అనుకూలంగా తాను కూడా మార్పు చెందానని ప్రధాని పేర్కొన్నారు. ‘ఇప్పుడు మంత్రివర్గ సహచరులతో, అధికారులతో, ప్రపంచ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశమవుతున్నా’నన్నారు. ‘సులభంగా ఆచరించదగిన వ్యాపార, జీవనవిధాన నమూనాల గురించి ఆలోచించాల్సిన తరుణమిది’ అన్నారు. కొత్త పని సంస్కృతిని రూపొందించే కార్యక్రమానికి యువ భారత్ నడుం బిగించి, నాయకత్వం వహించాలని ప్రధాని కోరారు. అన్ని శక్తిసామర్థ్యాలున్న భారత్.. కరోనా అనంతర బహుళ వ్యాపార ప్రపంచంలో కీలక శక్తిగా ఎదగగలదన్నారు. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకుని, ఎదుగుదామని పిలుపునిచ్చారు. ‘ఆధునిక సాంకేతికతతో ముందుగా లాభపడేది పేదలే. సాంకేతికత వల్ల దళారులు అంతమయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయి’ అని వివరించారు. కరోనాపై పోరాటాన్ని కూడా మన సినిమా తారలు, క్రీడాకారులు, సంగీతకారులు టెక్నాలజీ సాయంతో అత్యంత సృజనాత్మకంగా చేపట్టారని ప్రధాని గుర్తు చేశారు. డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడటం మన మార్పును ఆహ్వానించే తత్వానికి మంచి ఉదాహరణ అని గుర్తు చేశారు. టెలీమెడిసిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఆఫీస్‌లో ఎంతసేపు ఉన్నామనే విషయం కన్నా.. ఉత్పాదకత, సామర్ధ్యం కీలకమన్నారు. చవకైన వైద్య పరిష్కారాలను, భారీ ఎత్తున సృష్టించాల్సిన అవసరాన్ని కరోనా కలిగించిందన్నారు. రైతులకు అవసరమైన సమాచారం, వినియోగదారులకు నిత్యావసరాలు అందేలా సాంకేతికత సాయంతో సృజనాత్మక మార్గాలను వెతకాలని కోరారు. కిరాణా వర్తకులకు థాంక్స్ లాక్డౌన్ కాలంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్న చిన్న వ్యాపారస్తులు, కిరాణా వర్తకులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రాణాలకు తెగించి వారే ఈ సేవలను అందివ్వనట్లయితే.. పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. చిన్న వర్తకుల ఈ సేవను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది’ అని పీఎం వరుస ట్వీట్స్ చేశారు. ‘ఎన్నో వర్గాల ప్రజలు సానుకూలంగా సేవలందించడం వల్లనే లాక్‌డౌన్‌ను ఆచరించగలుగుతున్నారు’ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని క్రిషన్ కుంజ్ మురికివాడలో బిక్కుబిక్కుమంటున్న జనం -
ఒక్క జగన్‌పై వంద గన్స్!
వెయ్యి గోబెల్స్ పవర్ల శక్తి గలిగిన ఒక కొత్త థౌజండ్ వాలా టపాసును ఇటీవల చంద్రబాబు తయారు చేసు కున్నారు. ఒక్క గోబెల్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ హార్స్పవర్ అనే లెక్కతో దాన్ని చేయించి ఉంటారు. అందుకే ఈ థౌజండ్వాలాపై చాలా ఆశలు పెట్టు కున్నారు. ఎన్నికల్లో దారుణమైన, అవమానకరమైన ఓటమి ప్రాప్తించిన తర్వాత, కింకర్తవ్యస్థితిలో ఇంచు మించు క్షీరసాగర మథనం స్థాయిలో ఉభయకుశలో పరులతోటి ఆయన సంప్రదింపులు జరిపారని వినికిడి. తనవారు, తాను వివిధ రాజకీయ పార్టీల్లో, వివిధ రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన స్లీపర్ సెల్సూ, తనకు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల్లాగా పనిచేస్తూ జాబ్‌వర్క్ చేసి పెట్టే కొన్ని పొలిటికల్ పార్టీల ప్రొప్రయిటర్లు, తనకు విశ్వాసపాత్రులైన ‘స్వతంత్ర’ మీడియా పెద్దలు, ఇట్లు... తమ విధేయులని చెప్పుకునే సోషల్ మీడియా మేనేజర్లు వగైరాలతో జరిగిన మేధోమథనం అనంతరం ఈ థౌజం డ్వాలాను రూపొందించారు. అంటే పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చూపినంత తపన, అణ్వస్త్రం కోసం పాకిస్తాన్వాడు పూనినంత దీక్ష దీని వెనకాల ఉందన్న మాట. హిట్లర్ దగ్గర ప్రచార మంత్రిగా పనిచేసిన గోబెల్స్ అనే వ్యక్తి ‘ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందనే’ సిద్ధాంతాన్ని తయారు చేశాడని మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీని దురాక్ర మణ చేసిన తర్వాత చంద్రబాబు ఈ గోబెల్స్ సిద్ధాంతా నికి మరింత మెరుగుపెట్టి పార్టీకి ప్రాణవాయువుగా మార్చిన సంగతి కూడా మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ గ్రాండ్ అలయెన్స్‌కు... (అంటే, దాని మిత్రపక్షాలు, మిత్ర సంస్థలు, మిత్ర వ్యవస్థలూ– కనిపించేవీ, కనిపించనివీ అన్నీ కలిపి) ఎన్నికల్లో ఎదు రైన ఓటమి ఒక ఎత్తయితే, ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తీసుకుంటున్న విప్ల వాత్మక నిర్ణయాలు మరో ఎత్తుగా పరిణమించి బాధిస్తు న్నాయి. ఆయన గతంలో అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ పోరాడి నిర్మించుకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత కారణంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 50 శాతం మంది ఓటువేసి అధి కార పగ్గాలు అందించారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని ప్రకటించిన జగన్ మోహన్‌రెడ్డి ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈ విప్లవ ప్రస్థానాన్ని కొనసాగనిస్తే, భవిష్యత్తులో జరిగే ఏ ఎన్ని కల్లోనైనా వై.ఎస్. జగన్‌ను ఎదుర్కోవడం అసాధ్యమనే నిర్ణయానికి ప్రతిపక్ష శిబిరం వచ్చేసింది. ఆదిలోనే అడ్డు కోవాలన్న లక్ష్యంతో ‘మారీచ – సుబాహు విఘ్న క్రీడ’ను ఆశ్రయించింది. ఆ విఘ్నక్రీడకు ఆధునిక రూపం గోబెల్స్ ప్రచారం. ఈ విద్యలో ఇప్పటికే ప్రావీణ్యం ఉన్న చంద్రబాబు అండ్ కో ఒకేసారి వెయ్యి గోబెల్స్‌ల పెట్టున ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారానికి తెరతీస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఓ థౌజండ్‌వాలా టపాసుకు నిప్పంటించింది. ఇప్పటి వరకూ ఆ థౌజండ్వాలాలో ఒక్క టపాసూ ఢామ్మని పేలలేదు. కానీ, తుస్సుమన్నప్పుడు కూడా కొంత పొగ వస్తుంది కదా! అనుంగు మీడియాలో ముందుగా ఆ పొగ కనిపిస్తుంది. అది కనిపించగానే తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష, ప్రచ్ఛన్న, పరోక్ష సేనలూ – ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అద్దె నేతలూ ‘శరభ, శరభ’ అంటూ బృంద గానంతో కూడిన వీరనాట్యాన్ని మొదలుపెడతారు. ఆ వెంటనే ఢిల్లీ దర్బార్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన కోవర్టుల అభినయం మొదలవుతుంది. అనుంగు మీడి యాలో తమకు అవసరమైన కహానీ కనబడగానే మోదీ గారూ, మోదీగారూ అంటూ ఒకరు, షాజీగారూ షాజీ గారూ అంటూ ఒకరు మీడియా కెమెరాల ముందు నుంచి లోపలకు పరుగెత్తుతారట. అక్కడ ఎవర్ని కలు స్తారో తెలియదు కానీ, బయటకు అంతే వేగంతో పరు గెత్తుకొచ్చి, ఓ కొత్తకథ వినిపిస్తారు. మరుసటిరోజు అనుంగు పత్రికలు అచ్చేస్తాయి. ఈ కోవర్టుల వ్యవహార శైలి చూసి ఉత్తరాది ఎంపీలు, మీడియా ప్రతినిధులు విస్తుపోతున్నారట. ‘వీధి నాటకంలో కేతిగాడి పాత్రకు ఎక్కువ, సర్కస్‌లో బఫూన్ పాత్రకు తక్కువ’ అంటూ వీరి ప్రవర్తనపై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదే శ్లో జరుగుతున్న పరిణామాలపై జాతీయస్థాయి మీడి యాను తప్పుదోవ పట్టించడంకోసం ఒక ప్రత్యేక విభా గాన్నే ఏర్పాటుచేసినట్టు తెలిసింది. ఇటీవల హైదరాబా ద్లో జాతీయ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం జరిగిన మరునాడే ఐదారు జాతీయస్థాయి పత్రికల్లో ఒకే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంపాదకీయాలు రావడం గమనార్హం. ఈ ప్రత్యేక విభాగం అనుసరించిన తప్పుదోవ పట్టించే వ్యూహం కారణంగానే ఈ ఘటన జరిగిందని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈరకంగా ‘ఒక్క జగన్‌పై వంద గన్స్’ అన్నట్టుగా అష్టదిక్కుల నుండి చుట్టుముట్టి తప్పుడు ప్రచారాలతో హోరెత్తించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్థాయిలో ప్రారంభించారు. దీనికి కనిపించే వ్యక్తులతో పాటు కనిపించని శక్తుల తోడ్పాటు కూడా ఉండవచ్చు. తొలుత ఇసుక తుపాను సృష్టించేటందుకు శాయ శక్తులా ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ఇసుక సరఫరా రంగాన్ని మాఫియా ముఠాలు శాసించాయి. తివిరి ఇసుమున ‘తైలము’ తీయవచ్చునని నిరూపించాయి. వైఎస్ జగన్ అధికారం లోకి రాగానే ఈ దోపిడీని అరికట్టే చర్యలను చేపట్టారు. దానికితోడు, వేసవి కాలంలో ఇసుక డంపులను ఏర్పాటు చేయవలసిన కర్తవ్యాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించింది. రానున్న వర్షాకాలం వరదలను దృష్టిలో పెట్టుకుని వేసవిలోనే ఇసుక డంప్‌లను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈసారి ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురిసి నదులూ, వాగులు, వంకలూ వరదె త్తాయి. ఇసుక తవ్వడంలో జాప్యం జరిగింది. ఈ కార ణాల వలన సరఫరాలో రెండు నెలలపాటు కొన్ని ఇబ్బం దులు తలెత్తాయి. ఇప్పుడు సమృద్ధిగా ఇసుక లభిస్తు న్నది. శ్రీలంకలో నెత్తుటేరులు పారించిన జాతుల సమ స్యతో సమానస్థాయిలో ఇసుక సమస్యను చిత్రించడానికి ప్రయత్నించి చంద్రబాబు, ఆయన పార్ట్నర్స్ నవ్వుల పాలయ్యారు. పేద ప్రజల ఆశలను, ఆకాంక్షలనూ అవహేళన చేసే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనపై కూడా తప్పుడు ప్రచారాన్ని దండోరా వేశారు. ప్రతిపక్షాల వైఖరిపై బడుగు–బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తడంతో ఇంగ్లీషుపై తోకముడుచుకొని ఇప్పుడు తెలుగు నాశనమైపోతున్నదంటూ ఆరున్నొక్క రాగాన్ని అందుకున్నారు. నిజానికి తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘాలను పునరుద్ధరించి, పాలక మండళ్లను నియమించి తెలుగు వైభవానికి చర్యలు తీసుకున్నది జగన్ ప్రభుత్వమే. అంతేకాకుండా బోధనా భాషగా ఇంగ్లీషును ప్రవేశపెట్టినప్పటికీ తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు భాష కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినందున తెలుగు భాషకు జరగబోయే నష్ట మేదీ లేదని తేటతెల్లమైంది. కానీ ఈ నెలరోజుల్లో అనుంగు మీడియాలో ఇంగ్లీష్ బోధనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం బహుశా వియత్నాంలో అమెరికా చేసిన దురాక్రమణ యుద్ధానికి కూడా ఆరోజుల్లో లభించి ఉండకపోవచ్చు. ఒక పత్రికకైతే ఇంగ్లీష్ మీడియం బోధన వెనుక మత మార్పిడి కోణం కూడా కనిపించింది. అదే నిజమైతే ఈపాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సగం జనాభా మతం మారి ఉండాలి. మంచీ–చెడు విచక్షణను విడిచి, ఉచ్ఛ–నీచ వివే చనను వదిలి ఈ ముఠా చేస్తున్న మరో దుర్మార్గం – అన్యమత ప్రచారం పేరుతో సృష్టిస్తున్న దుమారం. రాజ్యంలో పాలితులది ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా, ఎన్ని ఆరాధనా పద్ధతులను వారు అవలంభించినా, పాలకుడు అనుసరించవలసినది రాజధర్మమే. అశో కుడు, అక్బర్ వంటి గొప్ప చక్రవర్తులందరూ ఆ రాజ ధర్మాన్ని పాటించారు. గుజరాత్లో మత విద్వేషాలు చెలరేగిన సమయంలో అప్పటి ప్రధాని అటల్జీ నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి ఉపదేశించింది కూడా రాజధర్మమే. ఆ ఉపదేశాన్ని మోదీజీ శిరసా వహించారు. రాజుకు ప్రజలందరూ సమానులే. ప్రజలు వేర్వేరు మత విశ్వాసాలు కలిగివున్నా, భిన్నమైన ఆచార, సంప్రదా యాలను పాటించినా, వారందరి విశ్వాసాలు, ఆచా రాలు రాజుకు గౌరవప్రదమైనవే. ఇటువంటి రాజ ధర్మాన్ని త్రికరణశుద్ధితో అనుసరించిన ముఖ్యమంత్రు లలో నిస్సంశయంగా వై.ఎస్. జగన్ అగ్రగణ్యుడు. మసీదులో అల్లాను వేడుకున్నా, చర్చిలో ప్రభువును ప్రార్థించినా, గుడిలో స్వామిని కొలిచినా అరమోడ్పు కనుల మాటున అదే ఏకాగ్రత వై.ఎస్. జగన్‌లో కని పిస్తుంది. ఏ మందిరంలో ఉంటే అక్కడి ఆచారాన్ని, ఆహార్యాన్ని నిక్కచ్చిగా పాటించే ఆయన ఆత్మశుద్ధి ఇప్పటికే లోకానికి వెల్లడైంది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే పూజారుల చిరకాల వాంఛితమైన వంశపారంపర్య అర్చక హక్కులను పునరుద్ధరించారు. చర్చి పాస్టర్లకు, మసీదులో ఇమామ్‌లకు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచారు. పేద ముస్లింలకు హజ్ యాత్రకు, క్రైస్తవులకు జెరూసలేం యాత్రకు ప్రభుత్వ సాయాన్ని పెంచారు. ఒక్క అభాగ్యుని కన్నీటి బొట్టు కనిపించనంత వరకూ, ఒక్క నిస్సహాయుని నిట్టూర్పు వినిపించనంత వరకు సంక్షేమ ఫలాలను అందజేయాలన్న లక్ష్యంతో వై.ఎస్. జగన్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో భాగంగానే సమాజంలో గౌరవనీయమైన స్థానం ఉన్న ఈ వర్గాల ఆకాంక్షలను కూడా నెరవేర్చింది. ఇందులో మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అచ్చమైన రాజధర్మం ప్రాతిపదికపైనే ఇవన్నీ నెర వేర్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న జన రంజక పరిపాలన కారణంగా నిస్పృహకు లోనైన విపక్ష నేతలు కొందరు ప్లాన్ చేసి కొన్ని శక్తులను ప్రయోగించి రాష్ట్రంలో అన్యమత ప్రచారం పేరుతో కొన్ని వదంతు లను సృష్టించారు. ఆ వదంతులన్నీ నూటికి నూరుశాతం అబద్ధాలు, అభూత కల్పనలని విచారణలో రుజువైంది. బీజేపీ ముఖ్యనాయకుడొకరు ఈ విషయంపై కొంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన అను చరుడొకరు సందేహం వెలిబుచ్చారట. అందుకు సదరు నాయకుడు బదులిస్తూ ‘ఎవరో ఆరోపిస్తున్నారు. మనం గొంతు కలిపితే తప్పేముంది. ఆ ప్రచారం పనిచేస్తే బల పడేది మన పార్టీయేగా’ అన్నాడట. ఇదీ సంగతి. చిత్త శుద్ధిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా! వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
బహుజనుల చిరకాల స్వప్నం ఇంగ్లిష్
మెకాలే భారతదేశంలో ఇంగ్లిష్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు దేశంలో అక్షరాస్యత రెండు, మూడు శాతాన్ని మించి లేదు. 1901 నాటికి ఈ అక్షరాస్యత ఐదుశాతం. బ్రాహ్మణ, హిందూరాజులు శూద్రులకు, అతి శూద్రులకు చదువులు లేకుండా చూడాలన్న నియమాన్ని తు.చ.తప్పకుండా పాటించారు. ఇలా ఈ దేశ బహుజనులకు చదువులు అందని మానిపండ్లే అయ్యాయి. భారతీయ బహుజనులు గులాంగిరి నుంచి విముక్తం కావాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవాలని, విద్యావంతులు కావాలని పూర్తిస్థాయిలో పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేసిన మొట్టమొదటి బహుజన తాత్వికుడు మహాత్మ జ్యోతిబాపూలే. బ్రిటిష్ వారి ప్రోత్సాహంతో కులాలకతీతంగా అందరికీ విద్యనందించాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫూలే స్ఫూర్తితో చదువుల్లో సారమెల్ల చదివాడు. ఆయన భారత రాజ్యాం గంలో పొందుపరిచిన రిజర్వేషన్లు, విద్యా హక్కుల వల్లనే ఈ దేశ బహుజనులు ఈ మాత్రంగానైనా చదువుకోగలిగారు. గత శతాబ్ది ‘80’ల వరకూ ప్రైవేట్ పాఠశాలలుండేవి కావు. ఒకటి, అరా క్రైస్తవ మిషనరీలో నడిపే ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలుండేవి. ఈ పాఠశాలల్లో ధనవంతులు, అగ్రవర్ణాల వారే ఎక్కువ మంది చదువుకునేవారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని బహుజనులు స్వల్పంగానైనా చైతన్యవంతులు కావడం అగ్రవర్ణాలకు నచ్చలేదు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. అందులో ఇంగ్లిష్ మీడియం చదువులు మాత్రమే ఉంటాయి. బహుజనులకు తరతరాలుగా చదువును నిరాకరించిన ఉన్నత కులాలవారే ఈ పాఠశాలలు, కళాశాలల్లో వందలు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు అనే మాటే వినబడకున్నా ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం వద్దనే వాళ్ళు, తెలుగు భాషోద్ధారకులమని చెప్పుకునే వాళ్ళు పెదవి కూడా కదపలేదు. ఇప్పుడేమో గ్రామీణ పేదలకు ఇంగ్లిష్ మాధ్యమమంటే నానాయాగీ చేస్తున్నారు? ఇదేం న్యాయం? క్రమక్రమంగా బహుజన పేదలకూ ఇంగ్లిష్ చదువులపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం. ప్రైవేట్ ఉద్యోగాలు.. ఐటీ ప్రాధాన్యత పెరగడం. విదేశీ వలసలు పెరగడం అన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ఇంగ్లిష్‌కి ప్రాధాన్యతనివ్వడం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ పేద బహుజనులు కూడా మాకు ఇంగ్లిష్ మీడియమే కావాలంటున్నారు. గత ముప్పై నలభై ఏళ్లుగా తెలుగు జాతి బహుజనులు, అసలైన తెలుగు భాషా పరిరక్షకులు ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఆ చదువులు కావాలని కలగంటున్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేస్తున్న ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధానం బహుజనులకు ఆత్మస్థైర్యాన్నిస్తుంది. దాన్ని అడ్డుకోవటానికి మీరెవరు? విద్యాహక్కులో భాగంగా ఇంగ్లిష్ మాధ్యమ చదువులు కావాలని కోరుకుంటున్న బహుజనుల పిల్లలను ఫీజుల భారం మోయలేక నిరక్షరాస్యులుగా మిగలమంటారా? ఇంగ్లిష్ మాధ్యమ పాఠశాలలను, కళాశాలను నడుపుతున్నది మీరే. మీ పిల్లలను, మనుమలను, మనుమరాండ్లను ఇంగ్లిష్ మాధ్యమంలో చదివిస్తున్నది మీరే. ఇండ్లల్లోంచి తెలుగును తరిమివేసింది మీరే. విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేసింది మీరే. మాతృభాషలను వేన వేల ఏళ్ళుగా కాపాడుతున్నది బహుజనులు, వాళ్ళే తమకిప్పుడీ ఆంగ్లమాధ్యమం కావాలని కోరుకుంటున్నారు. తమ విద్యాహక్కుగా కోరుతున్నారు. అడ్డుకుంటానికి మీరెవరు?బహుజనుల అంతరంగాన్ని అర్థం చేసుకొని, ఆధునిక పోకడలను అవగాహన చేసుకొని ఇంగ్లిష్ అవసరాన్ని గుర్తించి ‘బహుజనుల చిరకాల స్వప్నం ఆంగ్లమాధ్యమం’ను సాకారం చేస్తున్న యువనాయకుడు వై,ఎస్.జగన్మోహన్ రెడ్డిని అభినందిద్దాం. ఈ చర్యను విజయవంతం చేస్తే బహుజనులంతా ఆయనకు రుణపడి ఉంటారు. డా. కాలువమల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత, మొబైల్ : 91829 18567 -
‘సింగిల్’ రిటైలర్ల నిబంధనల సడలింపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను పంపింది. ప్రతిపాదనల ప్రకారం.. యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు 200 మిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తెచ్చిన పక్షంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటుకన్నా ముందు ఆన్లైన్ స్టోర్స్ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్లలోగా ఈ సంస్థలు ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు.. ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాతే ఆన్లైన్ అమ్మకాలు జరిపేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి సోర్సింగ్ నిబంధనలను సడలించే అంశం కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదనల్లో ఉంది. ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న కాలవ్యవధిని 6–10 ఏళ్ల దాకా పొడిగించవచ్చు. -
సంక్లిష్టతా యుగ ప్రతినిధి
వలస ప్రజల వ్యథలను, వలసవాద రాజకీయాలను, మతఛాందసవాదపు దుష్టపోకడలను ఎలుగెత్తి చాటిన అపురూపమైన కలం కనుమరుగైపోయింది. సామాన్యుడినే కథా వస్తువుగా స్వీకరించి నోబెల్ కిరీ టాన్ని అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ (85) శనివారం లండన్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినా, ఇంగ్లండ్‌లోనే ఎక్కువగా గడిపిన నయపాల్ జీవితం సంక్లిష్టమైన సాంస్కృతిక వైవిధ్యతల మధ్య కొట్టుమిట్టులాడింది. కొనార్డ్, చార్లెస్ డికెన్స్, టాల్‌స్టాయ్‌ల జీవితాలతో పోలిస్తే నైపాల్ సాహిత్య జీవితాన్ని వలసవాదానికి బలైన మూడో ప్రపంచ దేశాల అవ్యవస్థత పట్ల విమర్శకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. పాశ్చాత్య నాగ రికతకు బలమైన మద్దతుదారుగా నిలబడినప్పటికీ విశ్వజనీనవాదమే ఆయన తాత్వికత. అందుకే ‘వెస్టిండియన్ నవలాకారుడి’గా తన పేరును కేటలాగ్‌లో చేర్చిన ఒక ప్రచురణకర్తతో తన సంబంధాలనే తెంచుకున్నాడు నైపాల్. భారతీయ మూలాలు : వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో 1932 ఆగస్టు 17న జన్మించిన విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. ఆయన తాత 1880లో ఇండియా నుంచి వలస వచ్చి ట్రినిడాడ్‌లోని చెరకు తోటల్లో పనిచేశారు. తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్‌లో గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేశారు. బాల్యంలో పేదరికం అనుభవించిన నైపాల్ 18 ఏళ్ల వయస్సులో లండన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం అందుకున్న తర్వాత మిగిలిన జీవితంలో ఎక్కువకాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే నవల రాయగా ప్రచురణ కాలేదని కినిసి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. కానీ 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె ప్రేరణతో సాహిత్య కృషిలో కుదురుకున్నారు. 1954లో ఆక్స్ఫర్డ్ విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్ చేరిన నైపాల్ అక్కడే స్థిరపడ్డారు. అనంతరం కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యంలో 30కి పైగా పుస్తకాలు రచించిన లబ్దప్రతిష్టుడయ్యారు. ద హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్, ఎ బెండ్ ఇన్ ది రివర్, ది ఎనిగ్మా ఆఫ్ ఎరైవల్ లాంటి ప్రఖ్యాత రచనలు ఆయన జీవి తాన్ని మలుపుతిప్పాయి. ‘‘ఇన్ ఏ ఫ్రీ స్టేట్’’ పుస్తకానికిగాను బుకర్ ప్రైజ్‌ను అందుకున్నారు. 2001లో ప్రఖ్యాత నోబెల్ సాహితీ పురస్కారం గెలిచారు. రాయడం అంటే జీవితంలో వెనక్కు వెళ్లి తరచి చూడటమే, స్వీయ జ్ఞానానికి అది ప్రారంభం అని చెప్పుకున్న నైపాల్ తొలి నవల ది మిస్టిక్ మసాయిర్ 1957లో వెలువడి బాగా ప్రజాదరణ పొందింది. తన జీవితనేపథ్యం ఆధారంగా రాసిన ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ (1961), ఆర్థికంగా తన భార్యపై ఆధారపడవలసి వచ్చిన ఒక నడివయస్సులోని జర్నలిస్టు విముక్తి పయనం గురించి వర్ణిస్తుంది. అది తన జీవితమే. ఉద్యోగంలేని స్థితిలో భార్య నైపాల్‌ను కొంతకాలం పోషించింది. ఈ పరాధినతా భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆయన రాసిన తన జీవిత చరిత్ర సమకాలీన తరంలో అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరిగా మార్చింది. 1960లనాటికి కాల్పనికేతర సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మనకు తెలియని కొత్త ప్రపంచానికి కాల్పనికేతర సాహిత్యమే తలుపులు తెరుస్తుందని పేర్కొన్నాడు. 1962లో వెస్టిండీస్‌కి తిరిగి వెళ్లినప్పుడు తాను రాసిన ది మిడిల్ ప్యాసేజ్ రచనలో ట్రినిడాడ్‌లోని జాతి వివక్షాపరమైన ఉద్రిక్తతలను చిత్రించాడు. వలసవాదం నుంచి విముక్తి పొందిన కరీబియన్ చిన్న దీవుల్లో పర్యాటకరంగం ముసుగులో కొత్త బానిసత్వానికి ప్రజలు అమ్ముడుపోవడం జరుగుతోందని పసిగట్టాడు. 1964లో రాసిన తొలి పర్యాటక నవల ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’లో భారత్ గురించి రాశాడు. తన మూలాలు భారత్‌లో ఉన్నప్పటికీ తాను ఇప్పుడు భారత్‌కు చెందడం లేదని కనుగొన్నాడు. పైగా జాతీయవాదం పేరిట భారతీయులు బ్రిటిష్ వారినే అనుకరిస్తున్నారని విమర్శించాడు. తాను పుట్టిపురిగిన ప్రాంతాలకు కూడా దూర మైన నైపాల్‌ను ఆఫ్రికన్ రచయితలు చాలామంది వ్యతిరేకించారు. పాశ్చాత్య ప్రపంచం నల్లవారిపై మోపిన కాల్పనికతలవైపే నైపాల్ మొగ్గు చూపుతున్నాడని నైజీరియన్ రచయిత చినువా అచెబె పేర్కొన్నారు. అయితే విశ్వజనీన నాగరికత ఎప్పటిౖకైనా భూమిపై విల్లసిల్లుతుందన్న నమ్మకాన్ని చివరికంటా పాదుకున్న నైపాల్ మానవ సంక్లిష్టతా వైరుధ్యాల మధ్యే జీవితం గడిపాడు, ముగించాడు కూడా. -కె. రాజశేఖరరాజు -
ఓల్గా నుంచి గంగకు..
మన తాతముత్తాతల చరిత్రను తెలుసుకోవాలన్న కుతూహలం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వాళ్ల జీవిత విశేషాలను ఎవరైన చెప్తూంటే, చాలా ఉద్వేగంతో వింటాం. మరి ‘మానవత్వారంభ కాలం నుండి అంటే 361 తరాల నుండి మొదలుకుని 20వ శతాబ్దం వరకు జరిగిన మానవ వికాస క్రమాన్నీ, సామాజిక పరిణామాన్నీ కథలుగా మలిచి మన ముందుంచితే’? అది ఊహలకందని అద్భుతం. అలా రాహుల్ సాంకృత్యాయన్ చేసిన అద్వితీయ రచన ‘ఓల్గా నుండి గంగకు’. ఇందులో మొత్తం 20 కథలున్నాయి. మొదటి కథ ‘నిశ’ క్రీ.పూ. 6000 సంవత్సరం నాడు ఓల్గా నదీ తీరంలోని, ఆర్కిటిక్ మంచు మైదానాలలో ఒక ఇండోయూరోపియన్ కుటుంబం తమ జీవిక కోసం ప్రకృతితో జరిపిన పోరాటాన్ని వర్ణిస్తుంది. మరొక కథలో స్వేచ్ఛ కోసం, స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించి, కట్టుబాట్లను ఎదరించలేక విధివంచితుడిగా మిగిలిన పాంచాల యువరాజు సుదాసుడి విరహ వేదన హృదయాలను కదిలిస్తుంది. ‘బ్రిటిష్ పాలకులు అనుసరించిన క్రూరమైన పన్ను విధానాలు, సామాన్య రైతులపై జరిపిన దోపీడీలు, అత్యాచారాలు– వాటిని ఎదిరించలేని పేదల నిస్సహాయత’లకు ‘రేఖా భగత్’ పాత్ర ఒక విషాద సత్యం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దళిత మేధావి ‘సుమేరుడు’ ఫాసిస్టు శక్తుల నుండి దేశాన్ని రక్షించేందుకు చూపిన తెగువ, అతడి ఆత్మబలిదానం నిరుపమానమైనవి. ప్రతీ కథలోనూ జీవన పోరాటం ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, సమసమాజం, ప్రపంచశాంతి వంటి విలువల కోసం ప్రధాన పాత్రలు పరితపిస్తాయి. ఈ కథలు చదువుతుంటే ప్రాచీన చరిత్రపై మనకున్న సందేహాలూ, అపోహలూ మటుమాయం అవుతాయి. ప్రతీ కథలోనూ రాహుల్జీ చేసిన ప్రకృతి వర్ణన మనం ఆయా స్థలకాలాదులలో విహరించిన అనుభూతి కలిగిస్తుంది. ఈ ఇరవై కథలు ఫిక్షన్ జోనర్లో రాసినప్పటికీ ప్రామాణికత పాటించి రాసిన ‘మానవుడి చరిత్ర తాలూకు అవశేషాలు’. రాహుల్జీ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా హజారీబాగ్ జైలులో ఉన్నప్పుడు ‘ఓల్గా సే గంగా’ పేరుతో 1943లో వీటిని హిందీలో రాశారు. చాగంటి తులసి తెలుగులోకి అనువదించారు. -సింగరాజు కూచిమంచి మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి. -
మాట తప్పిన హరిశ్చంద్రుడు!
ఆ రాజుది ఇక్ష్వాకువంశం. పేరు హరిశ్చంద్రుడు. ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం ఒక్కటే లేదు. దాంతో మునులు, కుల గురువుల సలహా మేరకు వరుణుడిని బహుకాలం ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సంతానం కావాలన్నాడు హరిశ్చంద్రుడు. ‘‘ఓ రాజా! పురాకృత పాపకర్మల వల్ల నీకు సంతానయోగం లేదు. అయితే, ఒక్క షరతు మీద నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను. అందుకు అంగీకరిస్తావా మరి?’’ అని అడిగాడు వరుణుడు. సంతానం ప్రాప్తిస్తోందన్న సంతోషంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ‘‘స్వామీ! మీరు నిబంధన విధించడం, నేను అతిక్రమించడమూనా!? సెలవివ్వండి, తప్పక చేస్తాను’’ అన్నాడు హరిశ్చంద్రుడు. ‘‘నీ కోరిక తక్షణం నెరవేరుతుంది. ఇప్పుడు విను నా నిబంధన. నీకు సంతానం కలిగిన వెంటనే తీసుకు వచ్చి, నాకు అప్పగించాలి. అదే నా షరతు’’ అన్నాడు వరుణుడు. ఖిన్నుడయ్యాడు హరిశ్చంద్రుడు. ఇదెక్కడి న్యాయం? సంతానం కోసమే కదా నేను కఠోర తపస్సు చేసిందీ, ప్రసన్నుడిని చేసుకున్నదీ. ఇప్పుడు ఆ సంతానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకుంటానంటాడేమిటి? అయినా, ముందు సంతానం కలగనీ, అప్పుడు చూద్దాం’’ అనుకుని సరేనన్నాడు హరిశ్చంద్రుడు. అయితే ఆ కొడుకును, వరుణయజ్ఞంలో వరుణుడికే బలి చేస్తానని ముందు ఒప్పుకొన్న హరిశ్చంద్రుడు, పుత్ర ప్రేమ వల్ల ఆ బలిని వాయిదా వేస్తూ వెళతాడు. చివరికి తన పుత్రుడి బదులు డబ్బుతో కొనుక్కొన్న శునశ్సేపుడు అనే క్షత్రియ పుత్రుడిని బలి చేయటానికి సిద్ధపడతాడు. శునశ్సేపుడు తనకు విశ్వామిత్రుడు ఉపదేశించిన వరుణ మంత్రం జపించి, వరుణుడిని ప్రసన్నం చేసుకొంటాడు. వరుణుడు చివరకు ఏ బలీ లేకుండానే హరిశ్చంద్రుడికి వరుణ యజ్ఞఫలం ప్రసాదించి అనుగ్రహిస్తాడు. అయితే తాను అసత్యం చెప్పడం వల్లే కదా, ఇంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనది.. కాబట్టి ఇకముందు ఎన్నడూ అసత్యం ఆడకూడదు. సత్యమే చెప్పాలి అని మనసులో బలంగా నిశ్చయించుకుంటాడు. అప్పటినుంచి అన్న మాటకు కట్టుబడి ఉండటంతో హరిశ్చంద్రుడు అసలు అబద్ధం చెప్పడు, అలా హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అవుతాడు. (ఈ కథ ఋగ్వేద బ్రాహ్మణంలోనూ, కొన్ని మార్పులతో దేవీ భాగవత పురాణంలోనూ కనబడుతుంది) – డి.వి.ఆర్. -
గూగుల్‌కి 5 బిలియన్ డాలర్లు జరిమానా
బ్రసెల్స్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి యూరోపియన్ యూనియన్(ఈయూ) కాంపిటీషన్ కమిషన్ భారీ షాకిచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ సిస్టమ్ ఆధిపత్య దుర్వినియోగ ధోరణులకు గాను 4.3 బిలియన్ యూరోల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. సొంత సెర్చ్ ఇంజిన్, బ్రౌజర్ వినియోగాన్ని పెంచేందుకు స్మార్ట్‌ఫోన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఆధిపత్యం ఉన్న ఆండ్రాయిడ్‌ను గూగుల్ ఉపయోగించుకుందని ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాజర్ పేర్కొన్నారు. గతంలో మరో కేసులో గూగుల్‌పై ఈయూ కమిషన్ విధించిన పెనాల్టీకి తాజా జరిమానా రెట్టింపు కావడం గమనార్హం. ఉత్పత్తులను పోల్చి చూపే సర్వీసులను అందించడంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2017లో గూగుల్‌పై ఈయూ కమిషన్ 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెంచడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన తరుణంలో గూగుల్‌పై ఈయూ కమిషన్ రికార్డు స్థాయిలో జరిమానా విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దిగుమతి సుంకాల వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు యూరోపియన్ కమిషన్ చీఫ్ జాన్ క్లాడ్ జంకర్ మరో వారంలో అమెరికా వెళ్లనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. ఈయూ నిబంధనల ప్రకారం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వార్షికాదాయంలో 10 శాతం దాకా జరిమానా విధించవచ్చు. గతేడాది ఆల్ఫాబెట్ ఆదాయం 110.9 బిలియన్ డాలర్లు. ఆరోపణలు ఇవీ..: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్య దుర్వినియోగానికి సంబంధించి గూగుల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాచుర్యంలో ఉన్న కొన్ని గూగుల్ యాప్స్‌లకు లైసెన్సు తీసుకోవాలంటే ఆయా స్మార్ట్‌ఫోన్స్‌లో క్రోమ్ బ్రౌజర్‌తో పాటు తమ సెర్చి ఇంజిన్‌ను ఇన్స్టాల్ చేయాల్సిందేనంటూ శాంసంగ్ వంటి హ్యాండ్సెట్ తయారీ సంస్థలకు గూగుల్ షరతులు విధిస్తోందని అభియోగాలు ఉన్నాయి. దీనివల్ల సదరు డివైజ్‌లను కొనుగోలు చేసిన వారు ప్రీ–ఇన్స్టాల్డ్ గూగుల్ క్రోమ్ బ్రౌజరు, సెర్చి ఇంజిన్లే ఉపయోగిస్తూ మిగతా వాటి వైపు చూడటం లేదని.. ఆ రకంగా పోటీ సంస్థలను తొక్కేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కోడ్ ఆధారిత పోటీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో హ్యాండ్‌సెట్స్‌ను ఉత్పత్తి చేయకుండా కంపెనీలను కూడా గూగుల్ అడ్డుకుంటోందంటూ ఏప్రిల్‌లో ఫిర్యాదు నమోదైంది. తమ డివైజ్‌లలో గూగుల్ సెర్చిని ఇన్స్టాల్ చేసే తయారీ సంస్థలు, మొబైల్ ఆపరేటర్లకు గూగుల్ ‘ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు’ కూడా అందిస్తోంది. ఈ స్థాయి ప్రోత్సాహకాలు ఇవ్వలేని పోటీ సంస్థలకు ఇది ప్రతికూలంగా ఉంటోంది. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 28 దేశాలు ఉన్నాయి. సిలికాన్ వేలీ దిగ్గజాలపై వెస్టాజెర్ పోరు.. యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషనర్‌గా గత నాలుగేళ్లుగా వెస్టాజెర్ పలు సిలికాన్ వేలీ టెక్నాలజీ దిగ్గజాలపై పోరు కొనసాగిస్తున్నారు. దీనికి యూరప్‌లో మంచి పేరే వచ్చినప్పటికీ .. అమెరికాకు మాత్రం ఆమె కంటగింపుగా మారారు. గూగుల్ షాపింగ్ ఫైల్స్, ఆండ్రాయిడ్ దుర్వినియోగంపై జరిమానాలు పక్కన పెడితే.. యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ వ్యాపారంపై కూడా ప్రస్తుతం ఈయూ కమిషన్ విచారణ జరుపుతోంది. మరోవైపు, వివాదాస్పద డీల్‌తో ఎగవేసిన పన్నులకు సంబంధించి ఐర్లాండ్‌కు 13 బిలియన్ యూరోలు చెల్లించాలంటూ 2016లో యాపిల్‌ను ఈయూ కమిషన్ ఆదేశించింది. అటు అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌లకు కూడా ఇలాంటి జరిమానాలు తప్పలేదు. -
తను ఎవరు?
అద్దంలో ఒక బొడిపె ఉంటే మిగతా అద్దం కనపడదు...బొడిపే కనిపిస్తుంది.కాగితం మీద ఒక చుక్క ఉంటే ఆ చుక్కే కనిపిస్తుంది...కాగితం కనపడదు. దోషం లేని సృష్టే లేదు. మనసూ అంతే... ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ తెలిసో తెలియకో చందమామలాంటి మనసులో ఒక మచ్చ కనపడవచ్చు. అలాగే వ్యక్తిత్వంలో ఇలాంటి మచ్చలు తొమ్మిది ఏరి మీకు చూపిస్తున్నాం. మచ్చ మంచిదే... అదుపు మీరకుంటే!! ఒక్కొక్క వ్యక్తి వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. ఈ తీరును బట్టే సమాజం అతడి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మనిషి వ్యవహారంలో తేడాలున్నప్పటికీ స్థూలంగా అందరూ సమాజం ఆమోదించేలాగే వ్యవహరిస్తారు. అయితే కొందరి వ్యవహారశైలి కొంత ఎక్కువ, తక్కువలతో తేడాగా ఉండి, అది సమాజాన్ని కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాలతో వచ్చే ఇబ్బందులను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. వాటి గురించి అవగాహన, అలాంటి వ్యవహారశైలి ఉన్నవారు తమను ఎలా చక్కదిద్దుకోవాలో తెలియజేయడం కోసం ఈ కథనం. 1 పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు అందరితో సామాజిక సంబంధాలను సరిగా నెరపలేరు. ఇతరులను తేలిగ్గా నమ్మరు. ప్రతివారినీ అనుమానంగా చూస్తారు. ఇతరుల పట్ల వారికి ఉన్న అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు అవసరమైన సమర్థనలను (క్లూస్) ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. తాము ఏదైనా అంశంలో వైఫల్యం చెందినప్పుడు చాలా ఎక్కువగా సెన్సిటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. ఇతరులతో పొసగని సంబంధాలు నెరపుతుండటమే కాకుండా వారితో తగవు పెట్టుకునేందుకు అవసరమైన సాకులు వెతుక్కుంటుంటారు. అంతేకాదు తమకు నచ్చని పని ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది చేయడం ఇష్టం లేక దాని పట్ల తమ అయిష్టం ఎందుకో వివరించేందుకు ఇతరుల ఉదాహరణలు తీసుకొని తమను తాము సమర్థించుకుంటుంటారు. తమను సరిచేయబోయేవారిని ద్వేషించడం ప్రారంభిస్తారు. 2 స్కీజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ వ్యక్తిత్వ సమస్య ఉన్నవారు తాము మిగతా సమాజం నుంచి వేరుగా ఉండటాన్ని ఇష్టపడతారు. తమదైన ప్రపంచంలో, తమ ఊహాలోకపు ఫ్యాంటసీలలో విహరిస్తుంటారు. ఇతరులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను నెరపడానికి ఇష్టపడరు. అంతేకాదు... ఎంతో బలమైనవిగా పరిగణించే లైంగికపరమైన బాంధవ్యాల పట్ల కూడా వీరికి ఆసక్తి ఉండదు. ఉద్వేగపరమైన స్పందనలు (ఎమోషనల్ రెస్పాన్స్) కూడా పెద్దగా ఉండదు. ఒక దీర్ఘకాలిక బంధాన్ని కోరుకుంటున్నప్పటికీ దాన్ని కొనసాగించలేరు. దాంతో నిరాశగా మళ్లీ తమదైన ఒంటరి ప్రపంచంలోకి ముడుచుకుపోతారు. అయితే వారి తాలూకు ప్రవర్తనను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు సాధారణంగా తమ ఆలోచనల్లో ఉన్న వైవిధ్యాన్ని ప్రదర్శించరు. దాంతో తమ ప్రవర్తన లోపంతో సమాజానికి ఒక పట్టాన పట్టుబడరు. 3 స్కీజోటైపల్ డిజార్డర్ : ఈ తరహా డిజార్డర్ ఉన్నవారు కనిపించేతీరు, ప్రవర్తన, మాటలు అన్నీ చాలా వింతగా ఉంటాయి. స్కీజోఫ్రీనియా ఉన్నవారిలో కనిపించే ఆలోచనలే వీరిలోనూ ఉంటాయి. స్కీజోఫ్రీనియా ఉన్నవారు కొన్ని రకాల భ్రాంతులకు గురవుతుంటారన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు తమకు ఏవో దెయ్యాలు కనిపిస్తున్నాయనీ, మాటలు వినిపిస్తున్నాయని వారు అంటుంటారు. అలాగే స్కీజోటైపల్ పర్సనాలిటీ ఉన్నవారు ఇతరులు తమకు హానిచేసేందుకు యత్నిస్తున్నారంటూ నమ్ముతూ, సామాజిక బంధాలను కొససాగించరు. చుట్టూ జరిగే సంఘటనలను తమ నమ్మకానికి అనువుగా వ్యాఖ్యానిస్తుంటారు. అందుకే వీరికి సామాజిక బంధాలను కొనసాగించడమే ఇష్టం ఉండదు. ఇక ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే... షైజోటైపల్ పర్సనాలిటీ ఉన్నవారిలో దాదాపు 50 శాతం మంది స్కీజోఫ్రీనియాకు గురవుతుంటారు. అందుకే ఈ కండిషన్‌ను ‘లేటెంట్ స్కీజోఫ్రీనియా’ అని కూడా అంటారు. 4 బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ : భావోద్వేగాల పరంగా స్థిరత్వం లేనివారిని బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌గా చెప్పడం జరుగుతుంటుంది. ఇలాంటివారిలో బలమైన సొంత వ్యక్తిత్వం నిర్మితం కాదు. దాంతో అందరూ తనను తృణీకరిస్తున్నారనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. సామాజిక సంబంధాలను స్థిరంగా కొనసాగించలేరు. ఒకసారి బలంగా సంబంధాలు నెరపుతూ అంతలోనే వాటిని బలహీన పరుచుకుంటుంటారు. భావోద్వేగాల వ్యక్తీకరణలోనూ స్థిరత్వం ఉండదు. ఒక్కోసారి చాలా కోపంగా, హింసాత్మకంగా ఉంటారు. ప్రత్యేకంగా తమను ఎవరైనా విమర్శించినప్పుడు తీవ్రమైన ఆగ్రహానికి గురవుతుంటారు. తిరగబడేరీతిలో చాలా త్వరగా ప్రతిస్పందిస్తుంటారు. తాము ఆత్మహత్య చేసుకుంటామనీ లేదా తమకు తాము హాని చేసుకుంటామనే బెదిరింపులు చాలా సాధారణం. వీరిలో అటు నరాలకు సంబంధించిన (న్యూరోటిక్) ప్రవర్తనలతో పాటు ఇటు సైకోటిక్ తరహా ప్రవర్తలు కనిపిస్తుంటాయి. యాంగై్జటీ, స్కీజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి లక్షణాలకు బార్డర్లో ఉండటం వల్ల ఈ వ్యక్తుల ప్రవర్తన తీరుకు ‘బార్డర్‌లైన్’ అని పేరు పెట్టారు. సాధారణంగా చిన్నప్పుడు లైంగికంగా వేధింపులకు గురైనవారిలో ఈ బార్డర్‌లైన్ పర్సనాలిటీ పెరుగుతుంది. ఇది మహిళల్లో ఎక్కువ అని కొందరు విశ్లేషిస్తుంటారు. మహిళల్లో ఈ తరహా పర్సనాలిటీ సమస్యలు ఉన్నవారు ఒకే భాగస్వామితో ఉండరనీ, అదే పురుషులు అయితే హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారనీ కొందరు పేర్కొనడం ఈ వ్యాధి విషయంలో ఉన్న చర్చ. 5 హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్: ఈ తరహా ప్రవర్తన ఉన్నవారిలో సొంత వ్యక్తిత్వం ఉండదు. వీరు ప్రతిపనినీ పక్కవారి దృష్టిని ఆకర్షించడం కోసం చేస్తుంటారు. ప్రతిదానికీ పక్కవారి ఆమోదం కోసం ఎదురుచూస్తుంటారు. ‘హిస్ట్రియానిక్’ అంటే లాటిన్లో ‘నటులకు సంబంధించిన’ అని అర్థం. వీరు కాస్త నాటకీయంగా ప్రవర్తిస్తుండటం వల్ల ఈ వ్యక్తిత్వ సమస్యకు ఆ పేరు వచ్చింది. తాము ఎవరినైనా ఆకర్షించగలమనీ, ఎవరినైనా తమ ప్రవర్తనతో ఆకట్టుకోగలమని భావిస్తారు. ఎప్పుడూ ఎక్సయిట్మెంట్ కోసం కోరుకోవడం వల్ల అకస్మాత్తుగా ఏదైనా సాధించడానికీ లేదా ప్రమాదాల్లో కూరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. తమకు ఏదైనా దక్కకపోయినా లేదా తమను ఎవరైనా విమర్శించినా చాలా ఎక్కువగా కుంగిపోతారు. దాంతో చాలా చెడ్డగా ప్రవర్తిస్తారు. ఈ గుణం వల్ల మరింత ఎక్కువగా సమస్యలపాలవుతారు. సమస్యల పాలయ్యామని మళ్లీ చెడుగా ప్రవర్తిస్తారు. వీరి ప్రవర్తన విషయంలో ఈ విషవలయం ఇలా సాగుతూనే ఉంటుంది. 6 నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్: వీరు తమనూ, తమ ప్రాధాన్యాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ, తమను ఎల్లప్పుడూ అందరూ మెచ్చుకోవాలని భావిస్తారు. తమలోని గుణాలే ఎదుటివారిలోనూ ఉన్నాయంటూ ఎదుటివారిని మెచ్చుకుంటే వీరు భరించలేరు. ఉదాహరణకు వీరు బాగా నటిస్తారనుకుందాం. అప్పుడు ఏదో సందర్భంలో ఎదుటి నటుడిని మెచ్చుకుంటూ... అతడూ మీలాగే బాగా నటిస్తాడు అన్నా తట్టుకోలేరు. నాతో పోలికేమిటి అన్న భావన ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్నవారిలో ఎదుటివారి పట్ల సహానుభూతి ఉండదు. తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం అబద్ధాలు ఆడటం, ఎదుటివారిని ఎంతగానైనా ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకు సిద్ధమవుతారు. అందుకే ఇలాంటి వారు ఎదుటివారికి సహనం లేనివారిగా, స్వార్థపరులుగా, ఎదుటివారి సమస్యల పట్ల స్పందించని వారిగా కనిపిస్తుంటారు. వీరిని కాస్త ఆటపట్టించినా లేదా సరదాగా ఛలోక్తులు విసిరినా చాలా తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతుంటారు. ఇలాంటి ప్రతిచర్యనే ‘నార్సిస్టిక్ రేజ్’ అంటారు. ఇది చాలా విధ్వంసపూరితమైన ప్రవర్తన. 7 అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ : ఈ తరహా ప్రవర్తన ఉన్నవారు సామాజికంగా ఎలాంటి ప్రత్యేకతలు, నైపుణ్యాలు లేకుండా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాస లేమితో ఉంటారు. ఎప్పుడూ బిడియంగా కనిపిస్తూ తమ ఆత్మవిశ్వాస లేమి కారణంగా విమర్శలకు లోనవుతూ ఉంటారు. వీరితో మెలగడం ఎవరికైనా పెద్దగా ఆసక్తిగా ఉండదు. వీరిలో ఏదైనా ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ అంశం కారణంగా కలవాల్సిన వ్యక్తులను మినహాయించి, ఎవరినీ కలవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారు ఎప్పుడూ యాంగై్జటీతో బాధపడుతుంటారు. నిజానికి చిన్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులూ తృణీకరించిన వారిలో ఈ తరహా వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది. దాంతో వీళ్లు కూడా సామాజికంగా అందరితోనూ కలవలేరు. ఇక్కడ కూడా తాము కలవలేకపోవడంతో దూరం జరగడం, దూరం జరగడం వల్ల ఇతరులతో కలవలేకపోవడం అనే ఒక విషవలయం కొనసాగుతూ ఉంటుంది. 8 డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్: ఈ తరహా వ్యక్తిత్వ సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. వీరు ప్రతిదానికీ ఇతరుల మీదే ఆధారపడతారు. తమ తరఫున ఇతరులే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. తమను ఎదుటివారు తృణీకరిస్తారేమోనని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దాంతో ఎప్పుడూ సురక్షితమైన బంధాలను కొనసాగించడానికి చాలా తాపత్రయపడుతూ, కష్టపడుతూ ఉంటారు. తను ఏదైనా కీలకమైన విషయాన్ని డీల్ చేయాల్సి వచ్చేటప్పటికి పక్కవారి అధీనంలోకి వెళ్లిపోతారు. ఈ తరహా ప్రవర్తన ఉన్నవారు తమకు అంతగా అనుభవం లేదంటూ ఒప్పుకుంటూ, తమ చేతకాదని చెప్పుకుంటూ, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. సాధారణంగా ఎప్పుడూ తమను ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి, తమను దోచుకోడానికి అవకాశమిస్తూ ఉంటారు. 9 ఎనాన్కాస్టిక్ (అబ్సెసివ్–కంపల్సివ్) పర్సనాలిటీ డిజార్డర్: ఇలాంటి పర్సనాలిటీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నిబంధనల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ నిబంధన ప్రకారం ఇది తప్పు.. ఆ రూల్‌ను బట్టి ఇలా చేయకూడదు.. ఫలానా మార్గదర్శకాల ప్రకారం ఇది పూర్తిగా సరికాదు.. అంటూ ఎప్పుడూ చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. పనిలో పూర్తిస్థాయి సునిశితత్వం కోసం ఆత్రపడుతుంటారు. వీరి గుణం వల్ల చాలా పనులు సరిగా పూర్తికాకుండా పెండింగ్‌లో పడిపోతుంటాయి. వీరి కారణంగా పనులు ఒక పట్టాన జరగకపోవడంతో అందరూ వీరి నుంచి దూరంగా ఉంటారు. ఇలాంటి ఎనాన్కాస్టిక్ పర్సనాలిటీ ఉన్నవారు ఎప్పుడూ ప్రతిదాన్నీ సందేహిస్తూ, అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కఠినంగా వ్యవహరిస్తుంటారు. ప్రతి విషయంలోనూ మితిమీరిన స్వీయనియంత్రణతో ఉంటారు. హాస్యపూరితమైన ధోరణి, నవ్వుతూ ఉండటం వంటి గుణాలే ఉండవు. ఏమాత్రం లోపం జరిగినా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. అందుకే సహోద్యోగులు, తోటిపనివారు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో సంబంధాలు నెరపడం లేదా ఇలాంటివారితో మిగతావారు సంబంధాలను కొనసాగించడం చాలా కష్టమవుతుంటుంది. చక్కదిద్దడం ఎలా : ఒక మానసిక వ్యాధికీ, ప్రవర్తనపూర్వకమైన సమస్యలకు చాలా తేడా ఉంది. అలాగే సాధారణ ప్రజల వ్యవహారాలకు, ఈ తరహా వ్యక్తిత్వ లోపాలకు మధ్య తేడా కనుగొనడం కూడా చాలా సంక్లిష్టమైన వ్యవహారమే. అందుకే ఇలాంటి లోపాలను కనుగొనడానికి సైకియాట్రిస్టులు ఎంతో నైపుణ్యంతో, సునిశితత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వారి ప్రవర్తన కారణంగా సామాజిక సమస్యలు వచ్చే తీరుతెన్నులను గుర్తించడంతో పాటు చాలా నేర్పుగా ఈ విషయాలను డిజార్డర్‌తో బాధపడేవారికి తెలియజెప్పాల్సి ఉంటుంది. ఈ దిశగా వారిని చక్కదిద్దే ప్రయత్నంలో కౌన్సెలింగ్‌తో పాటు, పర్సనాలిటీ డెవలప్ ట్రైయినింగ్ కార్యకలాపాలు బాగా దోహదపడతాయి. వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంటుందంటే? ఒకరి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైన అంశం జన్యువులు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధానభూమిక వహించినప్పటికీ అవే పూర్తిగా వ్యక్తిత్వాన్ని నిర్మించలేవు. ఎందుకంటే.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో వేర్వేరు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. అందుకే జన్యువులతో పాటు వారు పెరిగిన వాతావరణం, చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, ఏవైనా అఘాయిత్యాలకు గురికావడం, కొన్ని అంశాల పట్ల అతిగా స్పందించడం (హైపర్ రియాక్టివిటీ), చుట్టుపక్కలవారి స్నేహాలు (పియర్), బలమైన వ్యక్తిత్వం గల ఇతరులతో ప్రభావితం కావడం... ఇలాంటి ఎన్నో అంశాలు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అందరు వ్యక్తులు సమాజంతో వ్యవహరించాలి. సమాజం అంటే వేరే ఏమిటో కాదు... ఎదుట ఉన్న వ్యక్తులే. ఒకరు ఒక సమూహంతో ఒకలాగా మరో సమూహంతో ఒకలాగా వ్యవహరించవచ్చు. ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించే యజమాని ఇంటి సభ్యులతో ప్రేమగా ఉండవచ్చు. ఇంటి సభ్యులతో కఠినంగా ఉండే వ్యక్తి స్నేహితులతో ఆప్యాయంగా ఉండొచ్చు. కొందరి ప్రవర్తన వ్యక్తికీ వ్యక్తికీ మారుతుండవచ్చు. ఇవి సాధారణ స్థాయిలో ఉంటే సరేగానీ శృతి మించి అవి సమాజానికి చెరపు చేస్తున్నప్పుడు... మనస్తత్వశాస్త్రం వాటిని వ్యక్తిత్వానికి సంబంధించిన రుగ్మతలుగా పేర్కొంటుంది. వాటినే ఇంగ్లిష్‌లో పర్సనాలిటీ డిజార్డర్స్‌గా చెప్పవచ్చు. -
ఆర్టికల్ 31బి రద్దు చేయాలి
ముంబై: రాజ్యాంగంలోని ఆర్టికల్ 31బిని రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రలో కిసాన్ పుత్ర ఆందో ళన్ (కేపీఏ) పేరిట రైతులతో భారీ ఉద్యమాన్ని ప్రారంభించిన అమర్ హబీబ్ అనే రైతు నాయకుడు మార్చి 21న సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను వేశారు. ఆర్టికల్ 31బి తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని చెబుతోంది. అంటే వీటిని కోర్టులో ఎవరూ సవాల్ చేయకూడదు. షేత్కా రీ సంఘటన నాయకుడు శరద్ జోషి సహచ రుడైన హబీబ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేపీఏ వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాన్ని గుర్తించిందన్నారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి కారణమైన పలు చట్టాలకు మూల కారణం ఆర్టికల్ 31బి అని, దీన్ని రద్దు చేస్తే రైతులకు మేలు జరుగుతుంద న్నారు. మెరుగైన మద్దతు ధర లభించడంతో పాటు మిగతా ప్రయోజనాలూ లభిస్తాయ న్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌కు చెందిన వ్యవసాయ భూ గరిష్ట పరిమితి చట్టం, నిత్యావసర వినియోగ వస్తువుల చట్టం, భూసేకరణ చట్టం కిందకు వచ్చే పలు చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని.. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందులకు గురవుతు న్నారని అన్నారు. ‘ఆర్టికల్ 31బి రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగంలో ఉన్న సమాన త్వ హక్కుకు ఇది విరుద్ధం. అంటే ఈ ఆర్టికల్ ప్రకారం రైతులు క్రూర స్వభావం ఉన్న చట్టాల ను సవాల్ చేయడానికి వీల్లేదు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా తొమ్మిదో షెడ్యూల్లో కొన్ని చట్టాలనూ రద్దు చేస్తే ప్రభుత్వాలు రైతు రుణ మాఫీ వంటి వి చేయనవసరం ఉండదు’ అని అన్నారు. -
సేవలందించేవారు మనుషులు కారా?
ఒక గొంతు వినిపించిన స్వరం లేదా నేను కృతజ్ఞతలు తెలిపినప్పుడు అతడి ముఖంలో కనిపించిన ఆశ్చర్యం దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితంనాటి జ్ఞాపకాల్లోకి నన్ను తీసుకెళ్లింది. ఏ రకంగా చూసినా అది నేనెన్నడూ మర్చిపోని గుణపాఠం. ఇటీవలే నేను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా తనిఖీ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు పోలీ సుల విధినిర్వహణ తీరులో వచ్చిన మార్పును నేను గమనిం చాను. వారి ప్రవర్తన దర్శనీయమైనదే కాదు.. మర్యాదతో కూడి ఉండటం విశేషం. నేను తీసుకెళుతున్న ఒక నల్ల సూట్‌కేస్‌ని తెరవమని సెక్యూరిటీ చెక్ వద్ద కోరారు. అది రుచించని నేను నా సూట్‌కేస్‌ని సీఆర్పీఎఫ్ అధికారివైపు నెట్టాను. సూట్‌కేస్ తెరిచే పని అతడే చేయాలన్నది నా ఉద్దేశం. నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఆ అధికారి అసాధారణమైన జాగ్రత్తతో ఆ పనిచేశారు. అదెంత సమగ్రంగా, గుర్తించదగినదిగా ఉందంటే, సూట్‌కేస్ లోపలి దుస్తులు ఏమాత్రం నలగని విధంగా తనిఖీ చేశారు. తన విధి ముగించిన తర్వాత సూట్‌కేస్‌లోని దుస్తులను పొందికగా సర్ది, జాగ్రత్తగా జిప్ పెట్టి నవ్వుతూ నాకు అందించారు. ఫైవ్ స్టార్ హోటల్లో నౌఖరు కూడా అంతకంటే బాగా చేసి ఉండేవాడు కాదు. ఆ అధికారికి కృతజ్ఞత తెలిపాను. నా గొంతులో స్పష్టంగా ఆశ్చర్యం ధ్వనించింది. ‘నమ్మశక్యం కానివిధంగా మీరు పని చేశారు’ అన్నాను. ఎందుకు చేయకూడదు సర్ అని ఆ అధికారి సమాధానమిచ్చారు. ఈ సారి అతడి గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. ‘నా సొంత దుస్తులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. మీ దుస్తులను నేను ఎందుకు జాగ్రత్తగా చూడను?’ ఆ అధికారి చాలా సాదాసీదాగా, ముక్కుసూటిగా సమాధానమిచ్చారు కానీ నేను మూగపోయాను. నేను ఊహించని మాట లవి. పోలీసులను కూడా సాధారణ ప్రజల్లో భాగమని మనలో ఎవరూ పరిగణించరు. కానీ వారూ మనుషులే. ఆ సీఆర్పీఎఫ్ అధికారి సున్నితంగా ఆ విషయాన్నే చెప్పారు. తర్వాత నేను విమానాశ్రయం నుంచి వెళుతున్నప్పుడు 1985లో లండన్‌లో జరిగిన ఇదేరకమైన ఘటనను గుర్తు తెచ్చుకున్నాను. నిషా, నేను అప్పుడే ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నాం. ఆ ఇల్లు మాకెంతో గర్వకారణం. ఎంతో జాగ్రత్తగా దాన్ని అలంకరించాము. అలాంటిది, ఒక సాయంత్రం పొద్దు గుంకిన తర్వాత పైన ఉన్న బాత్ రూమ్ వెలుపల తివాచీపై తడి ఉండటం చూశాను. స్నానాల గదిని తెరిచినప్పుడు దాని పై కప్పులో చీలిక నుంచి సన్నగా నీళ్ల ధార కిందికి కారటం చూశాను. అగ్ని మాపక దళానికి కాల్ చేయమని నిషా సూచించింది. కాల్ చేసిన నిమిషంలో వారు వచ్చారు. పరిస్థితి వివరించడానికి నాకు పది నిమిషాలు పట్టింది. వెంటనే సిబ్బంది పనిలోకి దిగిపోయారు. బాత్ రూమ్ పై భాగం నుంచి లీక్ అవుతున్నట్లు వారు కనిపెట్టారు. పై ఇంటిలో ఉన్నవారు ఆ సమయంలో ఇంట్లో లేరు. ముందు గదికి తాళం వేశారు. ఫైర్ బ్రిగేడ్ సభ్యుడొకరు మా వంట గది బాల్కనీ నుంచి పైకి ఎక్కారు. నీళ్ల పైపును పట్టుకుని ఎవరైనా పైకి ఎక్కగలరని నేను ఎన్నడూ చూసి ఉండలేదు. అందులోనూ చీకటిలో ఆ పనిచేయడం నన్ను మెప్పించింది, ఆ దృశ్యాన్ని చూడటానికి కాస్త భయమేసింది కూడా. పై అంతస్తు లోని సరిగా మూయని టాప్‌ను నిలిపివేయడంతో మా ఇంటిలో కారుతున్న నీరు ఆగిపోయింది. కానీ బాత్ రూమ్ ఇంకా చిందరవందరగా ఉండిపోయింది. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఫైర్‌మెన్ దీని పని పట్టడానికి సిద్ధమయ్యారు. కచ్చితమైన పని విధానంతో వారు బాత్రూమ్ని శుభ్రపర్చారు, నేలను తుడిచారు, గోడలపై తడి లేకుండా చేసి, పోగుపడిన చెత్తను నల్ల సంచీలలో పోసి తమతో తీసుకెళ్లారు. ‘మీకెలా కృతజ్ఞత చెప్పాలి’ అని నిషా వారితో అన్నది. ‘కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ ఫైర్ బ్రిగేడ్ చీఫ్ సంతృప్తితో నవ్వుతూ అన్నారు. ‘గుర్తుంచుకోండి, మేం కూడా ఇళ్లలో నివసిస్తున్నాం. తన బాత్ రూమ్ లీక్ అవడం చూడటాన్ని నా భార్య కూడా ఇష్టపడదు’ అన్నాడాయన. మొట్టమొదటిసారిగా ఫైర్మెన్లు కూడా మనుషులే అని నాకు అనిపించింది. సాధారణంగా వాళ్లు మనుషులే కాదన్న రీతిలో వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ పట్టీ పట్టించుకోకుండా ఉండటం చాలామందికి అలవాటు. నిజానికి ఇలాంటి వందలాది ఘటనల్లో మన వైఖరి చాలావరకు ఇలాగే ఉంటుంది. ఒకసారి సాన్నిహిత్యం ఏర్పడగానే ఇతరులను అర్థం చేసుకోవడం అలవడుతుంది. అలాంటి సాన్నిహిత్యం లేనప్పుడే దురభిప్రాయాలు మనలో ఆవహిస్తాయి. కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
అదనపు అక్రమం
ప్రధాన మార్గంలో సెట్ బ్యాక్ వదలకుండానే భవన నిర్మాణం పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు పైగా రోడ్డు విస్తరణలో స్థలం పోతుందంటూ ఉదారత భవన యజమానికి టీడీఆర్ బోనస్ మంజూరు ఆ దన్నుతో పక్క స్థలం కబ్జాకు తెగిస్తున్న యజమాని వారిపై బెదిరింపులు, దాడులు.. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అదో అక్రమ కట్టడం.. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నా.. ఒక్క ఇంచీ అయినా సెట్‌బ్యాక్ స్థలం వదలకుండానే పక్కా భవంతి నిర్మించేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.. ఘనత వహించిన జీవీఎంసీ అధికారులు రోడ్డు విస్తరణలో ఆ భవనానికి చెందిన కొంత స్థలం పోతుందని నిర్థారించిన సమయంలోనైనా ఈ అక్రమాన్ని గుర్తించలేదో.. లేక గుర్తించనట్లు నటిస్తున్నారో తెలీదు గానీ.. విస్తరణలో పోయే స్థలానికి బదులుగా అదనపు అంతస్తు నిర్మాణానికి ఉదారంగా అనుమతి ఇచ్చేశారు.. కానీ సదరు భవన యజమాని విస్తరణకు స్థలాన్ని ఇవ్వకపోగా.. పక్కనున్న స్థలాలపైనా కన్నేశాడు.. వారిని ఖాళీ చేయించేందుకు బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నాడు.. విశాఖపట్నం : విశాఖ నగరంలోని కీలకమైన దొండపర్తి ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లే ప్లై ఓవర్ మొదటి కాలమ్ వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని ఓ జి ప్లస్ టు భవనం ఉంది. ఫర్నిచర్ వ్యాపారం నిర్వహిస్తున్న నవీన్ మరోడా దాని యజమాని. బహుళ అంతస్తుల భవనాలు.. అదీ రహదారిని ఆనుకొని నిర్మించేవాటికి నిబంధనల ప్రకారం రోడ్డు నుంచి కొంత స్థలానికి సెట్‌బ్యాక్‌గా వదిలిపెట్టాలి. కానీ ఈ భవన నిర్మాణ విషయంలో ఆ నిబంధనను అసలు పట్టించుకోలేదు. ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా 150 అడుగుల రహదారి ఉంది. ఆ ప్రకారం కనీసం పందొమ్మిదిన్నర అడుగుల సెట్ బ్యాక్ స్థలం వదిలి భవనాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. రహదారికి ఆనించి నిర్మాణం కానిచ్చేశారు. అయినా అధికారులెవరూ పట్టించుకోలేదు. విస్తరణ సమయంలోనూ విస్మరణ నిర్మాణ సమయంలో పట్టించుకోని అధికారులు ఈ మార్గంలో ఫ్లై ఓవర్ నిర్మాణం, రోడ్డు విస్తరణ సమయంలోనైనా ఈ అక్రమాన్ని పట్టించుకోలేదు. పైగా రోడ్డు విస్తరణ కొలతలు వేసినప్పుడు ఈ భవనానికి చెందిన 334 గజాల ఈ స్థలంలో కొంత పోతుందని నిర్థారించారు. దానికి బదులుగా 30 గజాల స్థలానికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ (టీడీఆర్)ను భవన యజమానికి ఉదారంగా ఇచ్చేశారు. ఆ హక్కుతోనే తాను సెట్ బ్యాక్ స్థలంతో కలిపి భవన నిర్మాణం చేపట్టానని యజమాని వాదిస్తున్నారు. కానీ టీడీఆర్ పొందిన వారు అదనపు అంతస్తు మాత్రమే వేసుకోవాలి గానీ.. సెట్‌బ్యాక్ స్థలాన్ని మింగేయడానికి కాదు. మరోవైపు రహదారి విస్తరణలో స్థలం కోల్పోతున్నందునే టీడీఆర్ ఇచ్చామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఆ స్థలం కూడా ఇవ్వకుండానే టీడీఆర్‌ను వినియోగించుకుంటున్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తులపై మరో అంతస్తుకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసినట్లే. దీని వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జీవీఎంసీ అధికారులు తనకు అనుకూలంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని తమ స్థలాన్ని ఆక్రమించేందుకు నవీన్ మరోడా ప్రయత్నిస్తున్నారంటూ పక్కనే నివాసం ఉంటున్నవారు ఆరోపిస్తున్నారు. స్థలాన్ని తనకు అప్పగించాలంటూ బెదిరింపులకు, దాడులకు సైతం పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. -
మొరం అక్రమ దందా
ప్రభుత్వ పనుల పేరిట తరలింపు ప్రైవేటు వ్యక్తులకూ విక్రయిస్తున్న వైనం పట్టించుకోని అధికారులు కోటగిరి (బాన్సువాడ): ప్రభుత్వ పనుల పేరిట మొరం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.. అలాగే ప్రైవేటు వ్యక్తులకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.. కోటగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీ గుట్ట ప్రాంతం నుంచి 15 రోజులుగా అక్రమంగా మొరం తరలిస్తుండడమే ఇందుకు నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ సహాయంతో టిప్పర్లు, ట్రాక్టర్లతో మొరాన్ని తరలిస్తున్నారు. ఇటీవల మండలంలో ఓ రోడ్డు నిర్మాణ పనులకు రూ. 2 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం మొరం తరలిస్తున్నారు. అలాగే రాంపూర్ శివారులో నుంచి మొరం తవ్వి ఓ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీ నిర్మాణానికి తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు రుద్రూర్ మండలం సులేమాన్‌ఫారం గుట్టప్రాం తం నుంచి మొరం తోడేస్తూ ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో టిప్పర్‌కు సుమారుగా రూ. 2200–2500ల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా మొరం తవ్వుతూ అక్రమంగా తరలిస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులే బినామీ కాంట్రాక్టర్లు ! కొందరు రాజకీయ నాయకులే బినామీ కాంట్రాక్టర్లుగా మారడంతో ప్రజలు ఏమాత్రం అడ్డుకోలేని పరిస్థితులున్నాయి. ఇదేమిటని ప్రశ్నించే వారిని బెదిరించడం తంతుగా మారింది. సంబంధిత అధికారికి సమాచారం ఇస్తే ఆ వ్యక్తి పేరును నాయకులకు చెబుతుండడంతో ప్రశ్నించేందుకు పలువురు జంకుతున్నారు. పట్టించుకోని అధికారులు అక్రమాలను అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన స్థానిక అధికారులు తమ ప్రాంతంలో అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు జరుపుతున్నా తమకేమి పట్టనట్లుగా వ్యవహారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మొరం అక్రమ రవాణాను నిలిపివేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
కత్తులతో కో‘ఢీ’
నిబంధనలకు నీళ్లు.. యథేచ్ఛగా పందాలు జిల్లాలో జోరుగా కోడి పందాలు చేతులు మారుతున్న లక్షల రూపాయలు ప్రజాప్రతినిధులే ప్రత్యక్ష సాక్షులు పోలీసులు మౌన ప్రేక్షకులు పందెం కోడి కాలు దువ్వింది.. కత్తులు కట్టుకొని మరీ కదం తొక్కింది.. సంప్రదాయానికి సరే.. కత్తులు మాత్రం కూడదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ కాలదన్నింది.. భోగి పండుగ అయిన శుక్రవారం నుంచే పందెం కోళ్లు ఢీ అంటే ఢీ అన్నాయి.. వాటి మధ్య లక్షల రూపాయలు చేతులు మారాయి.. విశాఖ నగర శివారులోని ముడసర్లోవతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. వీటితోపాటు గుర్రపు పందాలు, ఎడ్లపందాలకు గ్రామీణ ప్రాంతాల్లో బరులు సిద్ధమయ్యాయి. విశాఖపట్నం: సంక్రాంతి అంటే కోడిపందాల కోలాహలం తప్పనిసరి. అయితే ఈసారి కత్తులు లేకుండా కోడిపందాలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కత్తులతోనే కోడిపందాలు జరిగాయి. నగర శివార్లలో భారీ బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలి, కోటఉరట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, చోడవరం, మాడుగుల, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం ప్రాంతాల్లో పందాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణలు దగ్గరుండి ముడసర్లోవ ప్రాంతంలో కోడి పందాలు జరిపించారు. దీంతోపోలీసులు ప్రేక్షకపాత్ర వహించి, శాంతి భద్రతలు పర్యవేక్షణతో సరిపెట్టారు.పక్క జిల్లాల నుంచి పందెం రాయుళ్లు నగరంలో జరిగిన కోడి పందాలకు పక్క జిల్లాలైన తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పందెం రాయుళ్లు వచ్చారు. నిజానికి ఉభయగోదావరి జిల్లాల్లోనే కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈసారి అక్కడి పోలీసులు నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు సొంత ప్రాంతంలో పందాలు కాయడానికి కొందరు సంశయించడం వంటి కారణాలతో విశాఖ జిల్లాకు తాకిడి పెరిగింది. వీరంతా తమ వెంట కోళ్లను తీసుకువచ్చి మరీ పందాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు: కోడిపందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్కీన్లు ఏర్పాటు చేశారు. నగదు కొరత ప్రభావం కోడి పందాలపై పెద్దగా కనిపించలేదు. నగదు రహిత పందాలకూ సై అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. స్మార్ట్ఫోన్లు, స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకున్నారు. దీంతో పందెంరాయుళ్లతోపాటు.. మందుబాబులతో శివారు ప్రాంతాలు కోలాహలంగా మారాయి. షామియానా సప్లయర్లు, భోజన విక్రేతలకు, చిరుతిళ్ల వ్యాపారులకు మంచి వ్యాపారం జరిగింది. ముఖ్యంగా మాంసం అమ్మకాలు విపరీతంగా జరిగాయి. బారులు తీరిన వాహనాలు: కోడి పందాలకు వచ్చిన వారితో నగరంలోని బరులు, రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. ఒక్క ముడసర్లోవ ప్రాంతంలోనే ఐదొందల కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు కష్టంగా మారింది. వందలాది మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డులను నియమించారు. రేపటి నుంచి ఎడ్లు, గుర్రం పందాలు కనుమ రోజు నుంచి జిల్లాలో ఎడ్లపందాలు కూడా భారీ నిర్వహిస్తారు. కనుమ తర్వాత మాడుగుల, చోడవరం, సబ్బవరం, పెందుర్తి, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చియ్యపేట తదితర మండలాల్లో నెలరోజుల పాటు తీర్థాలు (తిరునాళ్లు) మొదలవుతాయి. ఈ తిరునాళ్లతో పాటు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు కూడా ఏర్పాటు చేసి విజేతలకు నగదు బహుమతులిస్తారు. జిల్లాలోని దాదాపు 200 గ్రామాల్లో ఏటా ఇవి జరుగుతుంటాయి. ఎడ్ల పందాల్లో మైసూరు జాతి ఎడ్లనే ఎంపిక చేస్తారు. వీటి ఖరీదు రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు ఉంటాయి. ఎడ్ల పందాల ఎద్దులను వ్యవసాయ పనులకు ఉపయోగించరు. ఏడాది పొడవునా వీటికి ప్రత్యేక దాణా పెడతారు. అదే విధంగా గుర్రం పందాలు కూడా నిర్వహిస్తారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఈ గుర్రపు పందాలు ఎక్కువగా జరుగుతాయి. -
పచ్చ పైత్యం
స్కూళ్లు, వంటషెడ్లు పసుపుమయం పచ్చనేతల అత్యుత్సాహం చోద్యం చూస్తున్న అధికార గణం పచ్చ రంగు కాదని బుకాయింపు విశాఖపట్నం : సొమ్ము సెంటర్‌ది.. సోకు చంద్రబాబు పార్టీది.. అంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. నిబంధనలకు తిలోదకాలిచ్చి టీడీపీ నాయకులు చేస్తున్న ఓవరాక్షన్ చూస్తే ఎంత తెగువని విస్మయం కలుగుతుంది. కేంద్రం నిధులతో నిర్మిస్తున్న భవనాలకు పసుపు రంగు పులుముతున్న వైనం చూస్తే నివ్వెరపాటు కలుగుతుంది. దాంతో ఇక్కడా అక్కడా అని లేకుండా ఎటు చూసినా పచ్చ రంగు కనిపిస్తోంది. విద్యాలయాలకే కాదు.. మధ్యాహ్న భోజన పథకం వంటశాలలకూ పసుపు రంగు పూస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. సర్వశిక్షా అభియాన్ పథకంలో పాఠశాలల భవనాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. ఈ సొమ్ముతో పాఠశాలల భవనాలు, వాటి మరమ్మతులు, మధ్యాహ్న భోజన పథకం వంట షెడ్ల నిర్మాణం వంటివి చేపడ్తారు. వాటికి లేత క్రీమ్ (గోపీ కలర్) రంగును వేస్తారు. సర్వశిక్షా అభియాన్ ఏర్పాటైన దాదాపు 15 ఏళ్ల నుంచి అన్నిచోట్లా ఆ రంగునే వేయిస్తున్నారు. కానీ విశాఖపట్నం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఓ అడుగు ముందుకేసి పాత రంగుకు తిలోదకాలిస్తూ పసుపు రంగు వేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను తలదన్నేలా రంగు మార్చేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్‌లో పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో 984 వంటశాలలు మంజూరయ్యాయి. మొదటి దశలో నిర్మాణం -
ప్రొఫెషనల్ బాక్సర్‌గా పింకీ జాంగ్రా
న్యూఢిల్లీ: ప్రపంచ మాజీ చాంపియన్ సరితా దేవి స్ఫూర్తితో మరో మహిళా భారత బాక్సర్ ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకుంది. హరియాణాకు చెందిన 26 ఏళ్ల పింకీ రాణి జాంగ్రా ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్ వ్యవహారాలను పర్యవేక్షించే స్పోర్టీ బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆమె ఒప్పందం చేసుకుంది. ‘ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నాను. అయితే అమెచ్యూర్ కెరీర్ కూడా కొనసాగిస్తాను. వచ్చే ఏడాది జరిగే ఆసియా, కామన్వెల్త్ క్రీడలపై దృష్టి పెట్టాను. ప్రొఫెషనల్‌గా మారిన బాక్సర్లు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అర్హులని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిబంధనలు మార్చింది. దాంతో కొత్తదనం కోసం ప్రొఫెషనల్‌గా మారుతున్నాను’ అని 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన పింకీ తెలిపింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 19న సరితా దేవితోపాటు పింకీ జాంగ్రా తొలి ప్రొఫెషనల్ బౌట్ జరుగుతుంది. -
కష్టాల కల్యాణం
పెళ్లిళ్లపై పెద్దనోట్ల ప్రభావం నగదు విత్‌డ్రాకు నిబంధనల అడ్డు దిక్కుతోచని వధూవరుల తల్లిదండ్రులు వ్యక్తి పేరు దుర్వాసులు. ఈయన కూతురు చందు ప్రియకు ఈనెల 27న వివాహం. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఒక్కగానొక్క కూతురికి ఘనంగా పెళ్లి చేయాలని బంధువులందరికీ ఆహ్వానాలు పంపారు. అరుుతే ఒక్కసారిగా పెద్దనోట్ల ప్రకటన రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పుచేసి తెచ్చుకున్న డబ్బు నిరుపయోగంగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లికోసం రూ.2.5 లక్షల నగదు ఇస్తామని చెప్పినా నవంబర్ 8వ తేదీకి ముందు డిపాజిట్ చేసిన వారికే అని షరతు మరిన్ని అగచాట్లకు గురిచేస్తోంది. చిత్తూరు, సాక్షి: పెద్ద నోట్ల రద్దుతో పెళ్లి ఇంట కష్టాలు మొదలయ్యాయి. నగదు డ్రా చేసే విషయంలో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టడంతో పెళ్లిపనులు ముందు కు సాగడం లేదు. ఈ పరిస్థితి మరో 40 రోజులు ఉండటంతో తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారానికి రూ.24 వేల దాకా డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రకటన వెలువడిన మొదట్లో రోజుకు రూ.2 వేలు, వారానికి రూ.24 వేలు డ్రా చేసుకునే నిబంధన ఉండేది. అరుుతే దీనిపై పెద్ద ఎత్తున వి మర్శలు వెల్లువెత్తడంతో ఒకేసారి రూ.24 వేలు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది ఆర్బీఐ. పెళ్లి, ఇతర శుభకార్యాలకుకూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ డబ్బుతో పెళ్లిళ్లు ఎలా జరపాలో తెలపాలని వధూవరుల తల్లిదండ్రులు వాపోతున్నారు. రూ.2.5 లక్షల నిబంధన ఊసేలేదు.. వివాహ వేడుకల నిమిత్తం రూ.2.5 లక్షల నగదు ఉపసంహరణకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. దీనికి కఠిన నిబంధనలు విధించింది. అరుునా జిల్లాలో బ్యాంకర్లు ఎక్కడా అమలు చేయకపోవడం గమనార్హం. ఆర్బీఐ గైడ్లైన్స ఇప్పటివరకు తమకు అందలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రధాని ప్రకటన వెలువడిన తరువాత బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికే నగదు ఇస్తారని వార్తలు వస్తుండటంతో.. వడ్డీ వ్యాపారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిదగ్గర కూడా సరిపడినంత నగదు నిల్వలు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. పెళ్లి బట్టలు, బంగారం, కేటరింగ్, పురోహిత ఖర్చులు, మండపం బుకింగ్ వంటి వాటికి డబ్బు లేకపోవడంతో వధూవరుల తల్లిదండ్రులు తంటాలు పడుతున్నారు. ఎవరికి ఎంత ఇస్తారో చెప్పండి పెళ్లి ఖర్చులకు బ్యాంకులకు డబ్బులు ఇచ్చినా ఎవరెవరికి ఎంతిస్తారో చెప్పాలని నిబంధన విధించింది. దీనికితోడు నవంబర్ 8కి ముందు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు మాత్రమే తీసుకోవాలని మరో నిబంధన మరిం త ఆందోళనకు దారితీస్తోంది. ఇది కూడా డిసెంబర్ 30 లోపు జరిగే పెళ్లిళ్లకు మాత్రమే అని మరో మెళిక పెట్టింది. ఈ గడువు కంటే ముందు పెళ్లిళ్లకు మాత్రమే డబ్బు ఇవ్వాలని షరతు విధించింది. తల్లిదండ్రులు, పెళ్లి చేసుకునే వ్యక్తి ఖాతా నుంచి మాత్రమే డబ్బు డ్రా చేసుకోవాలని నిబంధన ఉండటంతో బ్యాంకు ఖాతా లేనివారి పరిస్థితి దయనీయంగా మారింది. దీనికితోడు పెళ్లి ఖర్చులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్బీఐ ప్రకటించడంతో.. పెళ్లికి ఇన్ని నిబంధనలా అంటూ ప్రజలు అవాక్కవుతున్నారు. తమ డబ్బులు ఇవ్వడానికి ఎందు కు ఇన్ని షరతులు అని ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పురోహితులు, కేటరింగ్.. ప్చ్.. పెద్దనోట్ల రద్దు వధూవరుల తల్లిదండ్రులతోతో పాటు కేటరింగ్, ఫంక్షన్ హాల్, డెకరేషన్ తదితర వ్యాపారస్తులకు కూడా ఖేదాన్ని మిగులుస్తోంది. పాత పెద్ద నోట్లు తీసుకోడానికి వీరు వెనకడుగు వేస్తున్నారు. అప్పులు చేద్దామంటే.. పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో కుదరని పని అని.. ఒకవేళ తేడా వస్తే పరిస్థితి దిగజారుతుందని వెనకడుగు వేస్తున్నారు. దీంతో వ్యాపారం కూడా డల్‌గా ఉందని వాపోతున్నారు. ఈ సీజన్ తమకు కన్నీళ్లనే మిగులుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ముహూర్తాలు డిసెంబర్ 30 వరకే.. మంచి ముహూర్తాలు కూడా వచ్చే నెల చివరి వరకే ఉండటం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్ 1, 3, 4, 5, 8, 9, 10, 12, 14 తేదీల్లోనే అధికంగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. జాతకాలు, రాశిఫలాల ప్రకారం డిసెంబర్ 30 వరకు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నారుు. ఎంత లేదన్నా జిల్లాలో 500 వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. -
జనవరి 21 నుంచి హెచ్ఐఎల్-5
ముంబై: వచ్చే ఏడాది జనవరి 21న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్‌కు తెర లేవనుంది. ముంబైలో దబంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 25న సెమీఫైనల్స్, ఫిబ్రవరి 26న ఫైనల్ జరుగుతారుు. ‘హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టు మైదానంలో సెమీఫైనల్స్, ఫైనల్‌ను నిర్వహిస్తారు. ప్రస్తుత విజేత పంజాబ్ వారియర్స్ కావడంతో సెమీస్, ఫైనల్ చండీగఢ్‌లో జరుగుతారుు’ అని హెచ్ఐఎల్ చైర్మన్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. -
ఆస్తులూ-సెంటిమెంట్లూ
అక్షర తూణీరం ఆ రోజుల్లో ఫియట్ కారంటే గొప్ప. పీఎస్ చారి అని మా ఆఫీసు పెద్ద సారువాడుండే వాడు. చాలా రూల్స్ మనిషి. ఈయన పెద్ద వట్టివేళ్ల తడి కండీ అని పనులమీద వచ్చి వెళ్లేవారు వ్యాఖ్యానించేవారు. గీరు నామంతో, ఖద్దరు కట్టుతో చారి చాలా నిరాడంబరంగా కనిపించేవారు. ఎప్పుడూ తడుపుతూ ఉంటే గానీ వట్టివేళ్ల తడిక సుఖంగా పనిచెయ్యదు, చారి కూడా అదే బాపతని ఒకాయన వివరించాక మర్మం నాకు బోధపడింది. ఇట్లాంటి వారికి గొప్ప చిక్కు ఏంటంటే, గడ్డితిని సంపా యిస్తారు గాని సుఖంగా ఏ భోగమూ అనుభవించలేరు. సర్వీస్ ఉండగా భయం. దిగిపోయాక్కూడా భయమే. ఎవడైనా ఓ ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడేమోనని. ఉన్నట్టుండి చారి ఫియట్ కారులో ఆఫీసుకు వచ్చాడు. అంతా నివ్వెరపోయారు. ఎవరూ విస్తుపూర్వక ప్రశ్నలు సంధించకముందే, చారి ఫియట్ వృత్తాంతాన్ని వివ రించాడు. డీలర్ దగ్గర ఖాళీగా పడి ఉందిట. టైర్లు, సీట్లు ఎలుకలవల్ల హరించాయిట. ఉద్యమ వేళ అద్దాలు వడ గళ్లుగా నేలపై రాలాయిట. డీలర్‌ని అడిగితే, మీరు అడి గారని చెబుతున్నా నాలుగువేలిచ్చి తీసికెళ్తారా అని అడిగాట్ట! ఫియట్ కారు ఆయన జీవితాశయమని లోగడే చారి పలుమార్లు చెప్పారు. సరేనని తెగించి వాయిదాల పద్ధతిలో తీసుకున్నాట్ట. సీట్లు మిసెస్ చారి కుట్టిందిట. కొడుకు పాత టైర్లు సేకరించి, స్వయంగా ఫియట్‌కి రంగులు, హంగులు కూర్చాడట. మొత్తం ఐదువేల ఆరువందల పన్నెండు రూపాయలు అయిం దని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు చారి. చారి చెప్పిన తీరులో ఒక నిజాయితీ ధ్వనించింది. అయినా నమ్మశక్యం కాలేదు. మొన్న మన ప్రియతమ నేత స్థిర చరాస్తులు ప్రకటించగానే నాటి మా చారి గుర్తొచ్చారు. విశాలంగా, సర్వ సదుపాయాలతో ఇల్లు కట్టుకోవడం సంతోషమేగానీ మరీ మూడుకోట్లు అప్పు చేయడమేమిటని మావూరి రచ్చబండ జాలిపడింది. దాదాపు అర్ధ శతాబ్ది రాజకీయ జీవితం, పెళ్లినాటికే మంత్రిపదవి, ఆ తర్వాత సరేసరి. అందరికీ తెలిసిందే. ప్రజల కోసం జీవితం ధారపోస్తున్న నాయకుడు, పైగా వయసు మీద పడింది కూడా. ‘ఇప్పుడు రుణభారం పెట్టుకోవడమా పాపం’ అంటూ ఒకరిద్దరు పెద్ద మను షులు బాధపడ్డారు. ఏముంది మనమంతా తలా పావలా వేసుకున్నా బిల్డింగ్ లేచిపోతుందని ఒకాయన లెక్క తేల్చాడు. ఉన్నట్టుండి మావూరి సర్పంచ్‌కి ఆవేశం వచ్చింది. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నానుగందా. నే కూడా నా ఆస్తులు డిక్లేర్ చేస్తున్నా రాసుకోండ్రా అంటూ లేచి నిలబడ్డాడు. పాత పెంకుటింటితో మొదలుపెట్టి, చింకి చాపలు, విరిగిన ఎడ్లబండి, తుప్పట్టిన బోరింగు గొట్టాలు, ఒట్టిపోయిన గేదె దూడతో సహా చెప్పు కుంటూ వెళ్లాడు. రచ్చబండ మీది నలుగురూ వాటి వాటి ధరలు నిర్ణయించి చెబుతుంటే, ఓ కుర్రాడు అంకెలు కూడుకున్నాడు. పదివేల చిల్లరకు వచ్చింది మొత్తం. సర్పంచ్ ఒక్కసారి తేలుకుట్టినట్టు అరిచాడు. మా మాంగారు అలకల్లో ఇచ్చిన సైకిల్రోయ్ అనగానే, వేసుకో పన్నెండు రూపాయలన్నారు పెద్దలు. సర్పంచ్ ససేమిరా అన్నాడు. ఆ సైకిల్లో బోలెడు సెంటిమెంట్లు న్నాయి. కనీసం ఒక లక్షన్నా పడాల్సిందే అంటూ వాదించాడు. మొత్తానికి మా సర్పంచ్ ఆస్తుల ప్రకటనైతే అయి పోయింది. శ్రీరమణ -
నిశ్శబ్దం వెనుకనున్న నిజాలు..
విశ్లేషణ మహారాష్ట్రలో ఈ ఏడాది ఎప్పటిలా కాక, ఏదో తెలియని కొంత భయం ఆవహించింది. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన సందర్భంగా ఆ సంస్థ అధి పతి మోహన్ భాగవత్ నాగపూర్ వార్షిక బహిరంగ సభలో ప్రసంగిం చారు. అంతేకాదు, ఉద్ధావ్ థాకరే ముంబైలో జరిగిన మరో బహిరంగ సభలో శివసేన జన్మదినో త్సవం సందర్భంగా ఉపన్యసించారు. రాష్ట్రంలో మరొక భారీ కార్య క్రమం కూడా జరిగింది. అయితే ఎవరూ దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. అది, హిందూ మతపు అవమానకరమైన అంచులలోని ఆరు లక్షల మంది బీఆర్ అంబేడ్కర్ నేతృ త్వంలో బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భాన్ని సంస్మ రిస్తూ జరిగిన కార్యక్రమం. ఆర్ఎస్ఎస్, శివసేన పుట్టినది విజయ దశమి రోజున. అలాగాక, 1956 అక్టోబర్ 14న ఆ సామూహిక మత మార్పిడి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్ర మమది. ఈ సామూహిక ప్రజాకార్యక్రమాలకు మీడియాలో చోటు లభించింది. కాకపోతే, ఆర్ఎస్ఎస్, శివసేనలకే అవి చాలా వరకు పరిమితమయ్యాయి. సామూహిక మతమార్పిడి 60వ వార్షిక సంస్మరణ సహా ఈ మూడూ ఒకేసారి వచ్చాయి. ఈ విషయాన్ని మీడియా ఎలా చూసింది అనే దాని వల్ల, వర్తమాన సందర్భం వల్ల ఈ ఏక కాలీనతకు కొంత ప్రాధాన్యం ఉంది. మొదటి రెండిటికీ లైవ్ టీవీ కవరేజీ సైతం లభించింది. అయితే ఎప్పటిలాగే భారీగా తరలి వచ్చిన దళిత సమ్మేళనానికి మాత్రం పాద సూచిక మాత్రపు చోటు మాత్రమే ఇచ్చారు. బౌద్ధ దీక్షా దినమూ, ఆర్ఎస్ఎస్ అధిపతి ఉపన్యాసమూ ఒకే నగరం-నాగపూర్‌లో జరిగాయి. అయినా దళిత కార్యక్ర మాన్ని పట్టించుకోలేదు. మీడియా అలా చెయ్యాలని ముందే అనుకుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మీడియా దేన్న యినా విస్మరించిందంటే ఆ కార్యక్రమం తక్కువ సందర్భోచి తమైనదనో లేదా దాని ఉద్దేశం, సామీప్యత, లేదా పాఠక జనం ఆసక్తి రీత్యా ఆసక్తికరమైనది కాదనో అర్థం. లేదా అందులో కొత్తదనమేమీ లేకపోయి ఉండాలి. అంబేడ్కర్ అంతటివారు కానీ, అలాంటి వారు కానీ ప్రస్తుతం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయినా ఒక తరం నవ బౌద్ధులు, ఆ తదుపరి తరాల వారు తాము ‘మహామానవుడు’ అని పిలుచుకునే వ్యక్తిని స్మరించుకోవడానికి అక్కడకు వచ్చారు. దళితులు ఎప్పుడూ గమనంలోకి తీసుకోవాల్సిన సమస్య గానే ఉన్నారు. దళితులు అనే ఆ పద మే బౌద్ధానికి వెలుపల ఉన్నవారితో సహా అగ్ర కులాల వేధింపులకు గురయ్యే వారికం దరికీ వర్తిస్తుంది. గతంలో అంబేడ్కర్ కాలంలో జరిగినట్టు గానే, అణచివేస్తున్న కులాల వారిది మోసకారితనమని చెప్పా లని అనుకున్నందుకు ఈ ఏడాది వారు అధ్వాన స్థితిని ఎదు ర్కొంటున్నారు (గుజరాత్లో చూసినట్టుగా). గ్రామాల్లోని పశు కళేబరాలను తీసుకుపోవడం లేదా వాటి చర్మాలను వలవడం చేయరాదని వారు నిశ్చయించుకున్నారు. ఉనాలో గోసంరక్ష కులు తమపై దాడి చేసిన తర్వాతనే అలా చేశారు. ఆ తదుపరి వార్తా నివేదికలు వెల్లువెత్తాయి. పశు కళేబరాలను తొలగిం చడం ఆపేశాక ఆ దళితుల జీవనోపాధి పరిస్థితి ఏమవు తోంది? లేదా రాజుకునే గ్రామాల్లో పరిస్థితి ఏలా ఉంది తెలి యదు. పట్టణం లేదా నగరంలోనైతే మత ఉద్రిక్తతలు రాజు కోడానికి మీడియా ప్రేరేపణ కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా అతి తేలిగ్గా ఉద్రిక్తతలు రాజుకునే గ్రామాల్లో వివిధ మతస్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయమూ అంతే. నీచమైనదిగా చూసినా, దళితుల సంప్రదాయక బాధ్య తను వారు బహిష్కరిస్తుండటం వల్ల నెలకొన్న పరిస్థితితో అగ్ర కులాలు ఎలా వ్యవహరిస్తున్నాయో.. అగ్రకులాల దృష్టి కోణం నుండైనా తెలుసుకోవాలని బాహ్య ప్రపంచం కోరుకుంటోంది. అదీ తెలియడం లేదు. ఒక మరాఠా బాలికపై దళితులు అని ఆరోపిస్తున్నవారు జరిపిన అత్యాచారాన్ని ట్రిగ్గర్‌గా వాడుకుని మరాఠాలు హఠా త్తుగా ప్రజా ఆందోళనకు దిగారు. తమకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ మొదలుపెట్టిన వారు.. మెల్లగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల (నిరోధక) చట్టం, 1989ని నీరుగార్చాలని అన సాగారు. ఆ విషయాన్ని మీడియా చాటింది. ప్రకాష్ అంబే డ్కర్ వంటి దళిత నేతలు ప్రతి ఆందోళనకు దిగకుండా వారిం చినా, దళితులు, ఆదివాసులలో అశాంతి రగులుతోంది. వారు మిలిటెంటు ఆందోళనకు దిగి, అమీతుమీ తేల్చుకోడానికి దిగొచ్చు. అయితే ఆ చట్టాన్ని మరాఠాలు ఆరోపిస్తున్నట్టు ‘‘దుర్వినియోగం కాకుండా నివారించడం కోసం’’ నీరుగార్చే యడం అంత తేలికేం కాదని వారు గ్రహిస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించకపోయినా అత్యా చారాల చట్టం వారి పాత సమస్య కాబట్టి ఏవో కొన్ని తాయి లాలు లభించినంత మాత్రాన మరాఠాలు సంతోషపడక పోవచ్చు. 1980లలో మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును అంబేడ్కర్ వర్సిటీగా మార్చడాన్ని మరాఠాలు అంత తేలికగా ఏం తీసుకోలేదు. దళితులు ఆ విముఖతను తమ సొంత అస్తిత్వపు గుర్తింపు కోసం చేస్తున్న కృషికి అడ్డంకిగా చూశారు. రెండు వర్గాల మధ్య విభజన అప్పుడు ముందుకు వచ్చింది. అయితే అది అప్పటి నుంచి లోలోపల రాజుకుంటూనే ఉంది. అందువల్ల ముందు ముందు కొంత సంఘర్షణ తలెత్త నుంది. కానీ అన్ని విషయాల్లోలాగే ఏ సామాజిక సమస్య లోనైనా రాజకీయాలు కలగలిసిపోతాయి. మరాఠాల కోటా డిమాండు లేదా అత్యాచారాల చట్టాన్ని నీరుగార్చడం కావచ్చు లేదా అత్యాచారాల చట్టం కింద తమ ఫిర్యాదులను అధికా రులు విస్మరిస్తున్నారనడం కావచ్చు.. చాలా కాలంగా ఇలా ఆరోపిస్తున్న దళితులు నేడు హఠాత్తుగా తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడం కావచ్చు.. ఏ సామాజిక సమస్యలోనైనా రాజ కీయాలు కలగలిసి పోవాల్సిందే. ఎందుకంటే సామాజిక సమ స్యలను సాధనంగా వాడుకోవడానికి తప్ప రాజకీయాలకు సామాజిక సమస్యలతో ఎలాంటి సంబంధమూ లేదు. మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
జారుడుమెట్లపై జర్నలిజం
జాతిహితం కార్గిల్ యుద్ధ కాలం నుంచి మనం, జర్నలిస్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, మన దేశ బలాన్ని బహుళంగా హెచ్చింపజేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజానికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ, డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చేయడం ద్వారానో కాదు. భారతీయ జర్నలిజం స్వీయ వినాశకమైదిగా ఎప్పుడు మారింది? మన జర్నలిజం స్వీయ వినాశం ఎప్పుడు మొదలైంది? లేదా అది స్వీయ వినాశక దిశగా పయనిస్తోందా? మీరు ఎంతగా అందరి దృష్టిని ఆకర్షించాలని కోరు కుంటారనే దాన్ని బట్టి మీరే ఈ ప్రశ్నను ఎలా వేయాలో ఎంచుకోండి. మొదటిది ఊరిస్తున్నా, మూడోదాన్ని నేను ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇది రాస్తున్నది స్వీయ (సంస్థాగత) సానుభూతితో కాదు... స్వీయశోధనను, చర్చను ఆహ్వానించడం కోసం. పైన పేర్కొన్న ప్రశ్నలను సున్నితంగా రూపొందించే ఇతర మార్గాలూ ఉన్నాయి. జర్నలిస్టులమైన మనం మన ప్రభుత్వానికి అధికార ప్రతినిధులమని, ఇతరుల నైతికతా పరిరక్షకులమని, మాతృభూమి రక్షణ కోసం పోరాడే సైనికులమని భావించడం ఎప్పడు ప్రారంభమైంది? ఇదేదో బ్రెజ్నెవ్ పాలనలోని సోవియట్ రష్యా ప్రభుత్వం అన్నట్టు జాతీయ భద్రతాపరమైన, విదేశాంగ విధానపరమైన సమస్యలను ప్రశ్నించ డాన్ని నిలిపి వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాం? చాలామంది పాత్రికేయులు-మన సీనియర్ సహా-మన దేశం గురించి మాట్లాడేటప్పుడు ‘‘మేం,’’ ‘‘మన,’’ ‘‘మనం’’ అనే పదాలను వాడటాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు ఎందుకని? మన విదేశాంగ, భద్రతా విధానాలను ఎందుకు ప్రశ్నిం చడం లేదు? ‘‘మీ అమెరికన్లకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం సంక్లిష్టమైన దని, అది మాకు హానికరమని మాకు తెలుసు. అయినా మీ ఆందోళనల పట్ల మేం సున్నితంగా ఉంటామని మీరు ఆశించజాలరు’’ ఇలా మాట్లాడుతు న్నారు. భారత జర్నలిజంలో వచ్చిన ఈ మలుపుతో మనం తప్పును చూడటం మానేసి సమష్టి అధికారిక వ్యవస్థలో భాగంగా మారిపోయాం. నిష్ఠుర నిజాలు చెప్పే వారేరి? విదేశాంగ, సైనిక విధానాలకు సంబంధించి భారత పాత్రికేయులు మరింత ఎక్కువ అధికారపక్షవాదంతో ఉంటారని పాకిస్తాన్ పాత్రికేయులు ఎప్పుడూ అంటుంటారు. అతి తరచుగా పాక్ పాత్రికేయులు ధైర్యంగా అధికారిక విధానాలను ప్రశ్నిస్తుంటారు. కశ్మీర్ విధానం, ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించడం, పౌర-సైనిక సంబంధాలు వంటి సమస్యలు సైతం అలా వారు ప్రశ్నించే వాటిలో ఉన్నాయి. అందుకుగాను కొందరు పాత్రికేయులు ప్రవా సంలో గడపాల్సి వస్తోంది (రజా రూమి, హస్సెన్ హఖాని), లేదా జైలు పాలు కావాల్సి వస్తోంది (నజామ్ సేథి). భారత మీడియా గుడ్డిగా అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థిస్తుందని ఎవరూ అనరు. ఎల్టీటీ యీకి సైనిక శిక్షణను, ఆయుధాలను ఇచ్చి ప్రోత్సహించడాన్ని మన మీడియా ప్రశ్నించింది. అలాగే ఆ తర్వాతి కాలంలో భారత శాంతి భద్రతా దళాలను (ఐపీకీఎఫ్) పంపి శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్నీ భారత పాత్రికేయులు ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి బస్తర్, కశ్మీర్ లోయల వరకు సైన్యాన్ని ప్రయోగించడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ధోరణి మారుతోంది. ఇది కేవలం ఉడీ ఉగ్రదాడి తదుపరి మాత్రమే మొదలైంది కాదు. తేలికపాటి ఆయుధాలు ధరించిన నలుగురు సైనికేతరులు (పాక్ ఉగ్రవాదులు) ఒక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ భద్రతా వలయాలన్నిటినీ ఛేదించుకుని అధీన రేఖ దాటి దాదాపు రెండు కిలోమీటర్లు లోపలికి ఎలా చొచ్చుకు పోగలిగారని ఒకే ఒక్క టీవీ జర్నలిస్టు కరన్ థాపర్ ‘ఇండియా టు డే’లో ప్రశ్నించారు. విస్పష్టమైన ఈ వైఫల్యంపై విమర్శనాత్మకమైన అంచ నాను వేసిన గౌరవనీయులైన రిటైర్డ్ జనరల్ ఒకే ఒక్కరు.. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ థిల్లాన్. ఆయన 1987లో ఇదే అక్టోబర్ రోజుల్లో జాఫ్నాలోకి పోరా డుతూ చొచ్చుకుపోయిన ఐదు బ్రిగేడ్లలో ఒక దానికి నేతృత్వం వహించారు. ఆయన బ్రిగేడ్ అతి వేగంగా, తక్కువ నష్టాలతో జాఫ్నాకు చేరింది. ఆయన వ్యర్థ ప్రలాపాలు చేయని, పాత కాలపు సైనికుడు. నేటి తెల్ల మీసాల ప్రైమ్ టైమ్ కమెడియన్లకు అయన ఒక మినహాయింపు. ఈ మార్పు కార్గిల్‌తో ప్రారంభమైందని నేను అంటున్నాను. కార్గిల్‌తోనే మొదలైన పతనం కార్గిల్ కథనం లేదా యుద్ధం మూడు వారాల సార్వత్రిక ఖండనలతో మొద లైంది. పాకిస్తానీలు తామక్కడ లేమని ఖండించారు, మన సైన్యం వారు అంత లోతుగానూ, అంత విస్తృతంగానూ ఏమీ చొరబడలేదంటూ ఖండిం చింది. రక్షణ శాఖ సహా ప్రభుత్వం ఆ ఘర్షణ పర్యవసానాలను గ్రహించ లేదు. అందువల్లనే సీనియర్ జనరల్స్ కంటే ముందుగా మీడియా ప్రతిని ధులే అక్కడికి వెళ్లారు. ఇది అనుద్దేశపూర్వకంగానే ప్రత్యక్ష సైనిక చర్యల్లో పాలొంటున్న సైనిక బలగాలతో మీడియా ప్రతినిధులు భాగం కావడానికి దారి తీసింది. ఎవరూ పథకం పన్నకుండానే వారి మధ్య వ్యక్తిగతమైన, వృత్తిపరమైన బంధం అభివృద్ధి చెందింది. దాని ఫలితం ఉపయోగకరమై నదే... స్వతంత్ర పాత్రికేయులను, సెన్సార్‌షిప్‌లేని మీడియాను అనుమతి స్తోంది కాబట్టి భారత్ విశ్వసనీయత పెరిగింది. మన సైన్యం ప్రదర్శిం చిన నమ్మశక్యంకాని పరాక్రమం గురించిన కథనాలు దేశానికంతటికీ చేరడం వల్ల సైన్యం లాభపడింది. పాత్రికేయులకు కూడా ఆ ప్రతిష్ట కొంత అంటుకుంది. ఆ క్రమంలో కీలకమైన ఒక కథనానికి హాని జరిగినా ఎవరికీ పట్టలేదు... అంతమంది పాకిస్తానీలు అంత లోలోతులకు ఎలా చొచ్చుకు వచ్చి, పాతు కుపోయి కూర్చున్నారు? అది తెలుసుకోడానికి మనకు అంత ఎక్కువ కాలం ఎందుకు పట్టింది? విచారణ బృందాలను మనం అంత అర్థ మనస్కంగా (కాబట్టే చిన్న గస్తీ బృందాలు) ఎందుకు పంపినట్టు? భుజంపై నుంచి పేల్చే క్షిపణులకు అందే వైమానిక బలాన్ని పంపి రెండు విమానాలను ఎందుకు కోల్పోయాం? గుడ్డిగా నెలల తరబడి పాక్ చొరబాటును నిలువరించడంలో విఫలమైంది ఎవరు? ఈ చొరబాటు తీవ్రతను గ్రహించడంలో విఫలమైన వారంతా ఎవరు? ఇవేవీ పట్టని ఫలితంగానే, ఎవరి స్థానాలకూ ముప్పు రాలేదు. మన యువ సైనికాధికారులు, సైనికుల ప్రతాపాన్ని గురించి చెప్పే హక్కు మనకుంది. అయితే మన సైనిక వ్యవస్థ సైనిక విధులను నిర్లక్ష్యం చేయకపోయినా... అది చూపిన బ్రహ్మాండమైన అసమర్థతకు సంబంధించిన కథనం వెలుగు చూడకుండా పోయేలా చేయడానికి రాజకీయ, సైనిక వ్యవ స్థను మనం అనుమతించడం తప్పు. అర్హులైన పలువురు కార్గిల్ యువ సైనిక యోధులకు గాలంట్రీ అవార్డులు లభించాయి. కానీ ఉన్నత స్థానాలలో ఉండి తప్పు చేసిన వారు చాలా వరకు తప్పించుకున్నారు. ఈలోగా భారత మీడి యాకు చెందిన మనం బలాన్ని ద్విగుణీకృతం చేయగలవారంగా కీర్తించ బడ్డాం. ఆ ఆనందంలో మునిగిపోయాం. అదే సమయంలో మనం, జర్నలి స్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, బలాన్ని హెచ్చింప జేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజా నికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్‌పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్‌గా మార్చే యడం ద్వారా మాత్రం జరగదు. ఎప్పుడూ కాస్త సంయమనాన్ని చూపే టీవీ చానళ్లు సైతం ‘‘మళ్లీ కాలుదువ్విన పాకిస్తాన్’’ అంటూ కశ్మీర్ హెడ్‌లైన్స్‌ను చూపాల్సిన దుస్థితి. ‘‘శత్రు’’ ప్రతినిధులుగా ఖండిస్తున్నా లెక్కచేయకుండా నిష్టుర నిజాలను చెపే సిరిల్ అల్మెడాలు, ఆయేషా సిద్దీఖాలు (ఇద్దరూ పాక్ పాత్రికేయులే) మనకు లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మన జర్నలిజం స్వీయ వినాశం... భారత టీవీ స్టార్లు (చాలావరకు) స్వచ్ఛందంగా తమను తామే కమెడియన్లుగా కాకున్నా ప్రచారకర్తలుగా దిగ జార్చేసుకోడానికి సంబంధించిన కథనంలో పెద్ద భాగం. వాణిజ్యపరంగా అది ఫలప్రదమైనదనేది, ప్రతిదాన్ని ప్రశ్నించే సంశయవాదాన్ని తుడిచిపెట్టే యడం వారిని ఊరిస్తుంది. లేదంటే ఊహాత్మకతతో మిఠాయి లాంటి ఫార్ము లాను కనిపెట్టి ఎన్నటికీ మరువలేని పాత గబ్బర్ సింగ్ (షోలే)కు సమాన మైన నేటి టీవీ యుద్ధ యోధుని అవతారమెత్తి ‘‘కిత్నే పాకిస్తానే థే?’’ అనొచ్చు. జర్నలిస్టులను ‘బలాన్ని బహుళంచేసే గుణకం’’గా నిర్వచించడాన్ని కీలక వ్యాపార అంశంగా (కేఆర్ఏ) అంగీకరించడంతో ఇక సందేహానికి లేదా ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. పాత కాలపు అశ్విక యోధునిలా ఇష్ట మొచ్చినట్టు వాగొచ్చు. అయితే అది శత్రువు ఉపగ్రహ కనెక్షన్‌కు అవతల ఉండగా ఇవతల సుఖప్రదంగా స్టుడియోలో కూచుని చేయొచ్చు. రెండుగా చీలిన పాత్రికేయ ప్రపంచం ఉడీ, తదుపరి ఘటనలే ఈ వాదనకు ప్రేరేపణ అనేది స్పష్టమే. అది మీడి యాను అత్యంత అసమానంగా చీలిపోయేట్టు చేసింది. ఒకటి, బాగా ఆధి క్యతను ప్రదర్శించే పక్షం. వారు ఏ ప్రశ్నలూ అడగకపోవడమే కాదు, ప్రభు త్వాన్ని, సైన్యాన్ని దాటేసి వారెన్నడూ చేయని ప్రకటనలను సైతం చేసేస్తారు. కాల్పనికమైన కమాండోల రాత్రి విన్యాసాల ‘‘ప్రాతినిధ్య’’ వీడియోలను వాటికి అండగా చూపిస్తారు, ఏ ఒక్కరికీ, నిజంగానే ఏ ఒక్కరికీ ఎలాంటి సాధికారతతో లేదా స్పష్టతతో మూడు వారాల క్రితం ఏం జరిగిందో తెలియదు. రహస్యాలను కాపాడటంలో ప్రభుత్వం ఆరితేరిపోయిందో లేక పాత్రి కేయులు లీకుల గురించి వెతకడం మానేశారో గానీ ఇది నిజం. ఎందుకో మీరే చూడొచ్చు. మరోవైపున, చిన్నది, కుచించుకుపోతున్న మరో భాగంగా ఉన్న వారు నిత్య సందేహులు. ప్రభుత్వం చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే దాన్ని కొట్టిపారేస్తారు. వాస్తవాలు లేనిదే వారు వెల్లడించే కథనాలూ ఉండవు. ప్రభుత్వం, తను చెప్పేదానికి ఆధారాలు చూపాలని వారు కోరుతారు. ప్రభు త్వాలు వాస్తవాలను దాస్తాయని, పాత్రికేయులు వాటిని కనిపెట్టాలని జర్న లిజం స్కూలుకు వెళ్లిన ప్రతివారికీ బోధిస్తారు. అత్యంత ఉదారవాదులు, ఉత్తమ విద్యావంతులు, ప్రతిష్టగల, సుప్రసిద్ధ సెలబ్రిటీ పాత్రికేయులు అంతా ఈ నిత్య సందేహుల జాగాలో ఉన్నారు. ఆధారాలు లేకుండానే గరం గరం వార్తలు తేకుండా, పత్రికా సమావేశాలను కోరుతున్నారు. అవతలి పక్షం మన శత్రువు కాబట్టి మీరు చెప్పేదానికన్నా ఎక్కువ నేను నమ్ముతాను, నాకు ఆధారాలు అవసరం లేదు అంటోంది ఒక పక్షం. మరో పక్షం.. మీరు చెబుతున్న ఆ సైనిక చర్యను బహిర్గతపరచండి లేదా మీరు అబద్ధం ఆడుతు న్నారంటాం అంటోంది. భారతీయ జర్నలిజం స్వీయ వినాశనానికి ఎందుకు పాల్పడింది? అని నేను ఇక అడగాల్సిన పనే లేదు. శేఖర్ గుప్తా twitter@shekargupta -
జీవోపై కోర్టుకెక్కింది వీరే
న్యాల్కల్: 123 జీవో కోర్టు తీర్పు మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్లో భూ బాధితులు, కూలీల్లో ఆనందాన్ని నింపింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు పెద్ద ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇక్కడ కూడా 123 జీవో ప్రకారం భూసేకరణకు దిగగా, రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. నిమ్జ్ భూ బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాలని తీర్పు వెలువరించడంతో రైతులు, కూలీలతోపాటు అఖిల పక్షం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. న్యాల్కల్ మండలంలోని 14 గ్రామాలతోపాటు ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాల పరిధిలో 12,635 ఎకరాలు నిమ్జ్ పేరుతో భూములను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణరుుంచారుు. మొదటి విడతగా ఝరాసంగం మండలం బర్దీపూర్, ఎల్గోరుు, చీలపల్లి, చీలపల్లి తండాతో పాటు న్యాల్కల్ మండలం ముంగి, ముంగి తండా, రుక్మాపూర్, రుక్మాపూర్ తండాలను ఎంపిక చేశారు. అధికారులు ఆయా గ్రామాల పరిధిలోని పట్టా, అసైన్ ్డ భూముల వివరాలను సేకరించారు. పట్టా భూములకు ఎకరానికి రూ:5.80 లక్షలు, అసైన్ ్డ భూమికి ఎకరాకు రూ.3 లక్షల పైచిలుకు చెల్లించారు. అరుుతే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూములు సేకరిస్తుందని నిమ్జ్ భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. 123 జీఓను రద్దు చేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ రైతు కూలీ సంఘం నాయకులు మోహన్ , రాజు, తుక్కమ్మ తదితరులు గత జూన్ లో హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తీర్పు రైతులకు, కూలీలకు అనుకూలంగా రావడంతో బాధిత రైతులు, కూలీల్లో సంతోషం వ్యక్తమైంది. -
బదిలీల్లో రాజకీయ పైరవీలు
విద్యుత్ శాఖలో ఇష్టారాజ్యం లేఖ ఉంటే కోరిన చోటుకు జిల్లాలో 64 మందికి స్థానచలనం తిరుపతి రూరల్: విద్యుత్ శాఖ బదిలీల ప్రక్రియలో ఇష్టారాజ్యంగా పైరవీలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం బదిలీలకు అర్హత లేకపోయినా కొందరు అధికారులు అధికార పార్టీ నేతల లేఖలను పట్టుకుని కోరిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు సర్కిల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం గల్లీ నేతల సిఫారసులకు సలాం కొడుతున్నారు. 64 మందికి స్థాన చలనం ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్(జిల్లా) పరిధిలో సదరన్ డిస్కం మార్గదర్శకాల ప్రకారం అధికారులు లెక్కలు తీశారు. ఆ మేరకు జిల్లాలో డీఈల-4, ఏడీఈ-5, ఏఈ-27, సబ్ ఇంజినీర్లు-24, ఎస్‌ఏవో-1, ఏవో-2, ఏఏవో-2 ఇలా మొత్తం 64 మంది ఉన్నట్లు వారి జాబితాను ప్రకటించారు. జాబితాలో ఉన్న వారు బుధవారం సాయంత్రంలోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా ఇవ్వాలని సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీరు హరనాథరావు సూచించారు. బుధవారం సాయంత్రానికి దాదాపు 26 వినతులు వచ్చినట్లు సమాచారం. లేఖలదే పైచేయి.. ఏళ్ల తరబడి వివిధ స్థాయిలో పాతుకుపోయిన అధికారులు మళ్లీ అదే స్థానాల్లో పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. చంద్రగిరి నుంచి గతేడాది దూరంగా బదిలీ అయినా మాజీ మంత్రి ద్వారా తిరుపతిలో తిష్టవేసిన తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఓ ఏడీఈ మళ్లీ చంద్రగిరి సబ్ డివిజన్‌కు వచ్చేందుకు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. తన సొంత గ్రామం పరిధిలోని సబ్ డివిజన్‌కు వచ్చేందుకు పుదిపట్లకు చెందిన ఓ చోటా నాయకుడికి ముడుపులు ముట్టజెప్పి సంపాధించిన మాజీ మంత్రి లేఖను ఇప్పటికే అధికారులకు అందించినట్లు తెలిసింది. బదిలీ కోసం సదరు ఏడీఈ తొక్కని అడ్డదారులు లేవు. తనను కోరిన చోటకు బదిలీ చేయిస్తే సర్పంచ్ అయిన తన సొంత తమ్ముడు, మరో రెండు ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను పార్టీలో చేర్చుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. పీలేరు, మదనపల్లి, చిత్తూరు, పుత్తూరు డివిజన్లలో ఈ సిఫారసు లేఖల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నిబంధనల ప్రకారమే.. నిబంధనల ప్రకారమే జిల్లాలో బదిలీలు జరుగుతున్నాయి. ఎక్కడా అతిక్రమించడం లేదు. బదిలీలకు అర్హులైన వారి జాబితాను ఇప్పటికే ప్రకటించాం. -హరనాథరావు, సూపరింటెండింగ్ ఇంజినీరు, తిరుపతి సర్కిల్, ఎస్పీడీసీఎల్ -
అధికారుల ‘పచ్చ’ అజెండా
రూ.73 లక్షల పనులను విభజిస్తూ టెండర్లు కలెక్టర్ చెప్పారంటూ నిబంధనలకు తూట్లు మినిట్స్‌లో ఎక్కడా కనిపించని కలెక్టర్ మాటలు ఇదీ చిత్తూరు కార్పొరేషన్లో అధికారుల నిర్వాకం చిత్తూరు కార్పొరేషన్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. కమీషన్లకు కక్కుర్తిపడి టెండర్ల ప్రక్రియనే మార్చేశారు. కలెక్టర్ చెప్పారంటూ రూ.73 లక్షల పనులను ఏడు విభాగాలుగా విడగొట్టి కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చే విధంగా ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో పాలన గాడి తప్పింది. ఇక్కడ టీడీపీ నాయకులు చెప్పిందే చెలామణి అవుతోంది. లోటుపాట్లను చెప్పాల్సిన అధికారులే నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇదిగో సాక్ష్యం చిత్తూరు నగరంలోని చర్చివీధిలో కాలువ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు రోడ్డు ఆక్రమణలను సైతం తొలగించారు. అయితే చర్చివీధిలోని రోడ్డుకు రెండు వైపులా ఫుట్‌పాత్ (నడక దారి) నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. దీనిపై గత నెల మొత్తం రూ.73 లక్షల వ్యయంతో అంచనాలు రూపొదించారు. అయితే ఒకేసారి రూ.73 లక్షల పనులకు టెండర్లు పిలిస్తే బయటి ప్రాంతల నుంచి కాంట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉందని, దీంతో ఇక్కడున్న కాంట్రాక్టర్లు నష్టపోతారని భావించిన అధికారులు ఈ పనులకు రూ.40 లక్షలుగా ఒకటి, రూ.33 లక్షలుగా మరొకటిగా విడదీశారు. ఈ పనులు చేపట్టడానికి ఈనెల 11న కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిచింది. అయితే సమావేశం పూర్తయిన తరువాత మొత్తం రూ.73 లక్షల విలువైన పనులను రూ.10 లక్షల చొప్పున విభజిస్తూ 7 పనులుగా విడగొట్టారు. వాస్తవానికి రూ.15 లక్షల విలువైన పనులు చేయడానికి నెల్లూరులోని సూపరింటెండ్ ఇంజినీరు (ఎస్ఈ), రూ.15 లక్షలకు పైబడ్డ పనులకు రాష్ట్ర ఇంజినీరింగ్ అండ్ చీఫ్ (ఈఎన్సీ) ఆమోదం తప్పనిసరి. కేవలం చిత్తూరులో అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు కొమ్ము కాయడానికి చర్చివీధిలో రూ.73 లక్షల పనులను విభజించి అధికారులు అవినీతికి తెరతీశారు. ఏప్రిల్ 1న ఈ పనులకు టెండర్లు జరగనున్నాయి. పేరు కలెక్టర్‌ది.. ఇటీవల ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో జరిగిన కార్పొరేషన్ అభివృద్ధి సమావేశంలో నామినేషన్ పద్ధతిన కలెక్టరేట్ పనులను ఇవ్వమన్నారని చెబుతున్నారు. రూ.73 లక్షల పనులు పెద్ద కంపెనీ దక్కించుకుంటే నాణ్యతతో పాటు పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అలా కాకుండా కలెక్టర్ పనులను విడగొట్టమన్నారని అధికారులు దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి సంబంధించి అధికారులు రాసుకున్న తీర్మానం (మినిట్స్)లో ఎక్కడా కలెక్టర్ ఈ ప్రస్తావన చేసినట్లు రికార్డు కాకపోవడం విశేషం. ప్రజల అవసరం దృష్ట్యా చర్చివీధిలో పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ చెప్పారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పనులు చేయాలంటే ఎస్ఈ, ఈఎన్సీ వద్దకు వెళ్లాలని పనులను విడగొట్టాం. అది కూడా స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకే. పారదర్శకంగా ఉండటానికే ఆన్లైన్లో టెండర్లు నిర్వహిస్తున్నాం. - భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, చిత్తూరు కార్పొరేషన్ -
రేషన్‌కు కొత్త మెలిక
ఈ-పోస్ మెషీన్లో వేలిముద్రలు నిక్షిప్తం 40 లక్షల మంది ముందుగా నమోదుచేస్తేనే ఏప్రిల్ సరుకులు అందజేత ఆందోళనలో కార్డుదారులు, డీలర్లు మచిలీపట్నం : జిల్లాలో తెల్లకార్డుపై రేషన్ సరుకులు తీసుకోవాలంటే ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. కార్డులో పేర్లున్నవారంతా ఈ నెలలో రేషన్ తీసుకునే డిపో వద్దకు వెళ్లి అక్కడి ఈ-పోస్ మెషీన్లో తమ వేలిముద్రలను నమోదుచేయాలి. వచ్చే నెల నుంచి కుటుంబంలో ఎవరైనా వెళ్లి సరుకు లు తెచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వేమూరి రవికిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపుల్లోని ఈ-పోస్ మెషీన్లకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడం, కొందరి వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం వంటి ఇబ్బందులు ప్రతినెలా ఎదురవుతున్నాయి. దీంతో కార్డుదారులకు సరుకుల పంపిణీలో ఆలస్యమవుతోంది. ఒక కార్డులో నలుగురు సభ్యుల పేర్లుంటే వారంతా కచ్చితంగా రేషన్ షాపు వద్దకు వెళ్లి తమ వేలిముద్రలను ఈ-పోస్ మెషీన్లో ఇస్తేనే ఏప్రిల్ నెలకు సంబంధించిన సరుకులు అందుతాయని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కార్డులో పేర్లు ఉన్న వారి నుంచి వేలిముద్రలను సేకరించాలని అధికారులు ఇప్పటికే రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికి పూర్తయ్యేను! జిల్లాలో తెల్ల కార్డులు 10,62,444, అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డులు 67,359, అన్నపూర్ణ కార్డులు 494.. మొత్తం 11,30,297 కార్డులున్నాయి. 2,160 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా సరుకులు అందజేస్తున్నారు. ఇవికాక గులాబీ కార్డులు 1,63,691 ఉన్నాయి. తెల్ల కార్డులు ఇచ్చే సమయంలో సంబంధిత కార్డులోని సభ్యుల వేలిముద్రలు సేకరించలేదు. ఆధార్ కార్డులు మంజూరు చేసినప్పుడు ఆయా కుటుంబాల్లోని సభ్యుల వేలిముద్రలను సేకరించి రేషన్ కార్డులకు వీటిని అనుసంధానం చేశారు. ఇప్పటివరకు రేషన్ షాపునకు కుటుంబసభ్యుల్లో ఒకరు వెళ్లి వేలిముద్ర వేస్తే సరుకులు ఇస్తున్నారు. ఈ విధానాన్ని ప్రస్తుతం మార్పుచేశారు. తెల్ల కార్డులు 11 లక్షలకు పైగా ఉండగా దాదాపు 40 లక్ష ల మంది ఈ-పోస్ మెషీన్లో వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సి ఉంది. వీరంతా ఎప్పటికి రేషన్ షాపులకు వస్తారు, ఎప్పటికి ఈ ప్రకియ పూర్తవుతుందో అధికారులకే తెలియాల్సిఉంది. వేలిముద్రల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సరుకులు ఇస్తామనే నిబంధన విధిస్తే పేదలు ఇబ్బందులు పడ తారనే వాదన వినిపిస్తోంది. వృథా అయిన డీడీలు జిల్లాలోని 2,160 రేషన్‌పాపుల ద్వారా ప్రతినెలా 10, 15 తేదీల్లోగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక మరుసటి నెలకు సంబంధించి సరుకుల కోసం డీలర్లు 15లోగా డీడీలు తీయాల్సి ఉంది. పాత పద్ధతిలోనే డీలర్లు ఈ నెలలో డీడీలు తీశారు. అయితే అవి చెల్లుబాటు కావని, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు బ్యాంకు ఖాతాకు నగదును జమ చేయాలని పౌర సరఫరాలశాఖ అధికారులు చెప్పారు. ఈ విషయం ముందుగానే చెబితే తాము జాగ్రత్తపడేవారమని డీలర్లు అంటున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి సరుకుల కోసం డీడీలు తీసి అధికారులకు అందజేశామని, వాటినలా ఉంచి మళ్లీ సరుకుల కోసం నగదు చెల్లించాలని అధికారులు చెబుతుండడంతో తమపై ఆర్థికభారం పడుతోందని డీలర్లు వాపోతున్నారు. -
పన్ను భారం రూ. 1.50 కోట్లు
రేపు మహాధర్నా సవరించిన నిబంధనలతో రెట్టింపైన ఆస్తి పన్ను పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించి పన్ను నిర్ధారణ కాలపరిమితి ఆరు నెలలకు తగ్గింపు ఆందోళన బాటలో అఖిలపక్షం పరకాల: పరకాల నగర పంచాయతీలో సవరించిన ఆస్తిపన్ను కారణంగా పట్టణ ప్రజలపై రూ.1.50కోట్ల భారం పడుతోంది. గతంలో ఉన్న పన్నులు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పన్ను వసూలు చేయగా.. ఇప్పుడు ఆరు నెలల కాలానికి తగ్గించారు. అమాంతం పెరిగిన ఆస్తి పన్నుతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పరకాల 2011 ఆగస్టులో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ కాకముందు ఇళ్లు, వ్యాపార సంస్థలకు ఒకే తరహాలో ఆస్తి పన్ను ఉంది. ఇప్పుడు ఏరియా, ఇళ్లను బట్టి పన్ను వసూలు చేస్తున్నారు. పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలని వివిధ పార్టీలు ‘ఇంటి పన్ను వ్యతిరేక పోరాట కమిటీ’ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారుు. పన్ను విధింపు కోసం మూడు జోన్లుగా విభజన నగర పంచాయతీలో ఆస్తి పన్ను విధింపు కోసం పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఈ ఏడాది బెల్లంపల్లి మునిసి పాలిటీకి చెందిన అధికారి మల్లారెడ్డి డిప్యూటేషన్‌పై వచ్చి పట్టణంలో ఉన్న ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను సర్వే చే శారు. పట్టణంలో 7369 ఇళ్లు ఉండగా 66 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. 620 వ్యాపార, వాణిజ్య సంస్థలున్నాయని నిర్ధారించారు. 3960 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 140 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. ఏరియాను బట్టీ పన్ను.. ఈ మూడు జోన్లులో ఒక్కో రేటును నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల రకాలు, వ్యాపార సమూదాయాలను బట్టి పన్ను విధించారు. ఉదాహరణకు మొదటి జోన్లో నివాస గృహాలకు చదరపు మీటరుకు రూ.14, రెండవ జోన్లో రూ.12, మూడో జోన్లో రూ.10 చొప్పున ఆస్తిపన్ను వసూలు చేయనున్నారు. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్‌లకు మొదటి జోన్లో చదరపు మీటరుకు రూ.40, రెండవ జోన్లో రూ.35, మూడో జోన్లో రూ.30 చొప్పున విధించారు. గతంలో ఇంటి పన్నుల ద్వారా నగర పంచాయతీకి ఏడాదికి రూ.50లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు పెరిగిన పన్నుతో ఏటా రూ.1.50కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. పెరిగిన పన్నులతో పట్టణవాసులకు మరింతగా ఆర్థికభారం పడుతుంది. రేపు మహాధర్నా.. పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇంటి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం మహా ధర్నా జరగనుంది. నగర పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఇంటి యజమానులు పాల్గొననున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కమిటీ సభ్యులు కోరారు. నేడు, రేపు జాతీయస్థాయి వర్క్‌షాప్ మామునూరు : గ్రేటర్ వరంగల్ ఐదో డివిజన్ పరిధిలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయస్థారుు వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు పి. ప్రసాద్‌రావు, ప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యుడ్ కొప్టెర్స్ అనే అంశంపై కేరళకు చెందిన ఏరో స్పోర్ట్స్ సంస్థ సహకారంతో తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా వాగ్దేవి కళాశాలలో వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక నిపుణులు క్యుడ్ కొప్టెర్ డిజైనింగ్ నమూనాపై ప్రసంగిస్తారని తెలిపారు. -
పోలీసులకూ ‘హెల్మెట్ బాదుడు’
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈనెల ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషనర్ మహేందర్‌రెడ్డి పోలీసులు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అలా కాని వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వీరికీ జరిమానాలు విధిస్తున్నారు. గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో హెల్మెట్ ధరించని పోలీసులకూ జరిమానాలు విధించారు. - సాక్షి, సిటీబ్యూరో -
’నేతాజీ’ మరణంపై భ్రిటన్ వెబ్సైట్ కథనం
-
పాన్ నిబంధనలు మార్చండి..
► రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచండి ► బంగారం దిగుమతి సుంకాన్ని 2 శాతం చేయాలి ► జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అభ్యర్థన న్యూఢిల్లీ: ఆభరణాల కంపెనీల సమాఖ్య ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్)... కొత్తగా తెస్తున్న పాన్ నిబంధనలను తప్పుపట్టింది. రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనలు జ్యుయలరీ రంగానికి ప్రతికూలమని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని, రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కోరింది. ‘‘పాన్ తప్పనిసరి చేయడం వల్ల జ్యుయలరీ విక్రయాలు తగ్గొచ్చు. ప్రత్యేకంగా గ్రామాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది’’ అని తెలియజేసింది. మెట్రో పట్టణాల్లో కూడా బంగారు ఆభరణాల విక్రయాలు 50% మేర తగ్గే అవకాశముందని పేర్కొంది. బంగారం దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10% నుంచి 2%కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఒకేసారి సాధ్యపడకపోతే దశలవారీగా తగ్గించాలని సూచించింది. జనవరి 1 నుంచి రూ.2 లక్షలపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేస్తే.. జ్యుయలరీ పరిశ్రమ నాశనమయ్యే ప్రమాదముందని జీజేఎఫ్ చైర్మన్ జి.వి.శ్రీధర్ చెప్పారు. పాన్ తప్పనిసరి వల్ల బంగారం కొనుగోళ్లు వ్యవస్థీకృత మార్కెట్ నుంచి అవ్యవస్థీకృత మార్కెట్వైపునకు మళ్లే అవకాశం ఉందని, తద్వారా ప్రస్తుతం 20-25 శాతంగా ఉన్న వ్యవస్థీకృత మార్కెట్ వాటా తగ్గే ప్రమాదముందని చెప్పారు. తాజా నిబంధనలను గ్రామాల్లో అమలుచేయడం కష్టమన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత జ్యుయలరీ మార్కెట్ వాటా 70 శాతంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ పాన్ కార్డుల మంజూరు సంఖ్య స్వల్పంగానే ఉందని చెప్పారు. కొత్త నిబంధనలు జ్యుయలరీ పరిశ్రమను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఫెడరేషన్ మాజీ చైర్మన్ అశోక్ మీనావాలా చెప్పారు. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 6 కోట్ల మంది ఆధారపడ్డారని తెలిపారు. రూ.10 లక్షలు దాటిన కొనుగోళ్లకే పాన్ తప్పనిసరి చేయాలన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకున్న ఈ చర్యను తాము తప్పుపట్టడం లేదన్నారు. ‘‘ఇది ఆచరణాత్మకమైనదికాదు. దీనివల్ల పాన్ కార్డులు లేని, పన్ను పరిధిలోకి రాని కొనుగోలుదారులున్న 70% గ్రామాల్లో జ్యుయలరీ మార్కెట్‌ను వివక్షకు గురిచేసినట్లవుతుంది’’ అన్నారాయన. 1000 టన్నులకు పసిడి దిగుమతులు! న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు 2015లో వెయ్యి టన్నులకు చేరుతాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (ఏఐజీజేటీఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే గతేడాది దిగుమతులకన్నా (900 టన్నులు) ఇది 11% అధికం. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుతుండడం దీనికి కారణమని సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీధర్ చెప్పారు. ఈ ఏడాది స్మగ్లింగ్ ద్వారా దాదాపు 100 టన్నుల పసిడి దిగుమతి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య దేశం 850 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది. గతేడాది ఇదే కాలంలో దిగుమతులు 650 టన్నులు. ధరల తగ్గుదల కారణంగా కొనుగోళ్లు భారీగా ఉండడంతో పసిడికి 2015 కలిసొస్తోందని చెప్పారు. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
నగరంపాలెం(గుంటూరు) : జిల్లాలో శనివారం నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలుచేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఉపరవాణా కమిషనరు జీసీ రాజరత్నం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి భద్రత, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ వినియోగం తక్షణమే అమల్లోకి తీసుకొని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారన్నారు. నవంబరు మొదటి తేదీ నుంచే హెల్మెట్లు తప్పనిసరి అని నిర్ణయం తీసుకోవటంతో గత మూడు నెలలుగా జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ద్విచక్రవాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ నిబంధన తక్షణమే అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. శనివారం నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదుచేసి జరిమానాతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు రవాణా శాఖకు సహకరించాలని డీటీసీ రాజరత్నం కోరారు. -
కండ్లు తెరిసే లోపే...
కొద్దిసేపటి క్రితం అవి నీటి అడుగున ఉండె కొద్దిసేపటి క్రితం నీటిపైకి వచ్చినవి కొద్దిసేపటి క్రితం గుంపులు గుంపులుగా పూసతాడునుంచి పై పందాడు దాక నీళ్ల మధ్యలో వల మెరిసిన బంగారు పరదా కొద్దిసేపటి క్రితం నా గుండెల నిండుగా పండుగ ఎవరినీ తక్కువేమీ చేయలేదు అందరూ విందులోనే వున్నారు కొద్దిసేపటి క్రితం వల తలలోనే వుండిపోయింది చెరువులో చుక్కనీరు లేదు. మునాస వెంకట్, 9948158163 -
జోనల్ వ్యవస్థ రద్దు!
-
జోనల్ వ్యవస్థ రద్దు!
371 (డి) తొలగింపునకు కసరత్తు రాష్ట్రమంతటినీ ఒకే ఫ్రీ జోన్‌గా చేసే యోచన జోనల్ వ్యవస్థ రద్దుతో సమ న్యాయానికి తూట్లు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వారికి ఉద్యోగ, విద్యా రంగాల్లో తీరని అన్యాయం విద్యారంగ నిపుణులు, అధికార వర్గాల్లో ఆందోళన హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోనల్ విధానం రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోనల్ విధానంతో పాటు 371 (డి) నిబంధనను కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకాగా విభజన అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్లు ఉన్నాయి. ఈ పద్ధతిని రద్దు చేసి రాష్ట్రమంతటినీ కలిపి ఒకే ఫ్రీ జోన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం తనను కలిసిన విలేకరులకు సూచన ప్రాయంగా దీన్ని వెల్లడించారు. జోనల్ వ్యవస్థ రద్దు, 371 డి నిబంధన తొలగింపు యోచనపై విద్యారంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వారికి ఉద్యోగ, విద్యా రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల వ్యవస్థను, 371 డి నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆలోచన చేయడంపై విస్మయం వ్యకమవుతోంది. నాలుగు జోన్లూ కలిపి ఒకే ఫ్రీ జోన్! ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నాలుగు జోన్ల వ్యవస్థ కొనసాగుతోంది. జోన్-1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు, జోన్-2 కింద తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలుండగా.. జోన్-4 కింద చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలున్నాయి.జోనల్ వ్యవస్థ అమల్లో ఉంటే ఉద్యోగ నియామకాలు రాష్ట్ర, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా జరుగుతాయి. ఆయా జోన్ల పరిధిలోని జిల్లాల వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒకే ఫ్రీ జోన్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటి పరిస్థితుల్లో 371 (డి) తీసుకువచ్చారని, దీన్ని ఇప్పుడు రద్దు చేసి జోనల్ విధానాన్ని తొలగించాల్సి ఉందని మంత్రి యనమల అభిప్రాయపడ్డారు. ఫ్రీ జోన్ వల్ల నష్టమేంటి..? ప్రస్తుతం ఏపీలో ఉన్న 4 జోన్ల విధానాన్ని రద్దు చేసి, రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా చేస్తే జోనల్, జిల్లా స్థాయి పోస్టుల్లో స్థానిక జిల్లాలు, జోన్ల వారికి అన్యాయం జరగక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక స్థితిగతులు, పరిస్థితులు ఇతర కారణాల వల్ల సహజంగానే అన్ని జిల్లాల వారు సమాన తెలివితేటలు, సామర్థ్యాలు కలిగి ఉండరన్నది వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో జోనల్ విధానాన్ని ఎత్తివేస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల వారికి అన్యాయం జరుగుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. స్థానిక కోటాలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల్లో ఆయా జిల్లాల విద్యార్థులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని, విద్య, ఉద్యోగ అవకాశాలు దాదాపు పూర్తిగా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సామాజికంగా ఉన్నతస్థానంలో ఉన్న జిల్లాల వారికే ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ తరహాలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమం తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రద్దు సాధ్యమేనా..?: జోనల్ వ్యవస్థ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీని రద్దు సాధ్యమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. తిరిగి రాష్ట్రపత్తి ఉత్తర్వుల ద్వారానే జోనల్ వ్యవస్థను రద్దు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇది సమన్యాయాన్ని దెబ్బతీస్తుందని, వెనుకబడిన జిల్లాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. అన్ని జిల్లాలకు, జోన్లకు సమ న్యాయం జరగాలంటే జోనల్ వ్యవస్థ, 371 (డి) కొనసాగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన కీలకమైన అంశం కాబట్టే కేంద్రం రాష్ట్ర పునర్విభజన చట్టంలో సైతం దీనిని పొందుపరిచిందని గుర్తు చేస్తున్నారు. 371 (డి) ఏం చెబుతోంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ల కల్పనకుగాను 1973లో రాజ్యాంగ సవరణతో 371 (డి) నిబంధనను తీసుకువచ్చారు. 1974లో ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రాతిపదికన 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీటి ద్వారా జోనల్, మల్టీ జోనల్, జిల్లా యూనిట్‌తో కూడిన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. వీటి ప్రకారం.. ►జిల్లా స్థాయి ఉద్యోగ నియామకాల్లో 80 శాతం స్థానికులకే కేటాయించాలి. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ టు ఆల్ కింద మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ►జోనల్ పోస్టుల్లో... 70 శాతం పోస్టులను సంబంధిత జోన్‌కు చెందిన వారికే కేటాయించాలి. మిగితా 30 శాతం పోస్టులను ఆ జోన్‌లోని వారితో సహా రాష్ట్రంలోని అన్ని జోన్లకు చెందిన వారికి ఓపెన్ టు ఆల్ కింద మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలి. ►మల్టీ జోనల్ పోస్టుల్లో (రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు) స్థానికులకు 60 శాతం పోస్టులు కేటాయిస్తారు. మిగతా జిల్లాల వారు ఓపెన్ టు ఆల్ కింద 40 శాతంలో ఎంపిక కావొచ్చు. -
శిక్ష తగ్గింపు సబబు!
‘రా’ మాజీ అధికారి రామన్ అభిప్రాయం న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ను భారత్‌కు తీసుకొచ్చే యత్నాలు సాగుతున్నప్పుడు భారత్ విదేశీ నిఘా విభాగం(రా-రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి నేతృత్వం వహించిన బి. రామన్.. మెమన్‌కు ఉరిశిక్ష విధించడంపై 2007లో ఒక ఆంగ్ల వార్తాబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఆయన 2013లో మృతిచెందారు. రామన్ వ్యాసంలోని ముఖ్యాంశాలు. * ఈ వ్యాసం రాయాలా? వద్దా? అని చాలా రోజులు మథనపడ్డాను. కానీ అన్యాయంగా ఉరిశిక్షకు గురవుతున్న వ్యక్తిని కాపాడటం ముఖ్యమని భావించి రాయాలనే నిర్ణయించుకున్నాను. ఈ కేసులో ముంబై పోలీసులు, సీబీఐ, ఐబీ గొప్ప పనితీరు చూపాయి. కానీ, మెమన్ శిక్ష తగ్గింపునకు అవకాశమున్న కీలకాంశాలను ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. మెమన్‌కు ఉరిశిక్ష విధింపజేయాలని ఆత్రుతగా ఉన్న ప్రాసిక్యూషన్.. శిక్ష విధింపు సమయంలో కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరలేదు. * పాక్ ఐఎస్ఐ తన కుటుంబసభ్యులపై పెట్టిన అనవసర నిఘాపై విసుగుచెందిన యాకూబ్.. భారత్ అధికారులకు లొంగిపోవాలనుకుని లాయరైన బంధువు సలహా కోసం కఠ్మాండూ వెళ్లాడు. లొంగుబాటు ప్రమాదకరమని, కోరుకున్న న్యాయం జరగకపోవచ్చని లాయర్ చెప్పడంతో మళ్లీ కరాచీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, నేపాల్ పోలీసులకు చిక్కాడు. వారిసాయంతో భారత అధికారులు మెమన్ను ఢిల్లీ తరలించి, అక్కడ అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని నేనే సమన్వయం చేశాను. * దర్యాప్తు అధికారులకు మెమన్ పూర్తిగా సహకరించారు. భారత్ తిరిగివచ్చేందుకు మెమన్ కుటుంబంలోని పలువురిని ఆయనే ఒప్పించారు. మెమన్ శిక్ష తగ్గింపునకు ఈ రెండు అంశాలు కీలకం. పేలుళ్లలో మెమన్, ఆయన కుటుంబసభ్యుల పాత్రపై అనుమానం లేదు. ఐఎస్ఐ సాయంతో మెమన్ చేసిన పని ఉరిశిక్షకు అర్హమైనదే. కానీ కఠ్మాండూలో అదుపులోకి తీసుకున్నప్పట్నుంచి ఆయన తీరు, దర్యాప్తు అధికారులకు సాయపడ్డ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే మరణశిక్షపై రెండో ఆలోచన చేయొచ్చు. -
ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి?
ఇండియన్ పాలిటీ భారత రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి. ఈయన గురించి నిబంధన 52 నుంచి 62 వరకు తెలియజేస్తాయి. అధికరణ 52: భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. వీరు దేశంలో అత్యున్నత వ్యక్తి. అధికరణ 53: రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్య నిర్వహణ అధికారి, ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అని తెలియజేస్తుంది. రాష్ట్రపతి పేరుమీదే పరిపాలన కొనసాగుతుంది. ఈయనకు సహాయ పడేందుకు అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుంది. అధికరణ 58: రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతల గురించి తెలియజేస్తుంది. అవి: 1. భారతీయ పౌరుడై ఉండాలి. 2. 35 ఏళ్లు నిండి ఉండాలి. 3. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. 4. ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యుల్లో కనీసం 50 మంది బలపర్చాలి. 5. రూ. 15000 డిపాజిట్‌గా చెల్లించాలి. అధికరణ 54: రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ఎలక్ట్రోరల్ కాలేజ్ నైష్పత్తిక ప్రా తినిధ్య పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో పార్లమెంట్‌కు ఎన్నికైన ఉభయ సభ సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు ఎన్నికైన విధాన సభ సభ్యులు ఉంటారు. కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులకు 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును కల్పించారు. ఓటుహక్కు ఉన్న ఎంపీలు 776 (లోక్‌సభ 543 + రాజ్యసభ 233) ఓటుహక్కు ఉన్న ఎమ్మెల్యేలు 4120 (రాష్ట్రాలు 4020 + కేంద్ర పాలిత ప్రాంతాలు 100) అధికరణ 55: ఓటు విలువను ప్రత్యేక పద్ధతి ద్వారా లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓటు విలువ = రాష్ట్ర జనాభా/ఎమ్మెల్యేల సంఖ్య * 1/1000 ఈ ఓటు విలువ అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ (208), తమిళనాడు (176), మహారాష్ట్ర (175) రాష్ట్రాలకు, అతి తక్కువగా సిక్కిం (7), అరుణాచల్ ప్రదేశ్ (8), నాగాలాండ్ (9) రాష్ట్రాలకు ఉంది. దీన్ని 1971 జనాభా లెక్కల ఆధారంగా లెక్కిస్తారు. ఎంపీ ఓటు విలువ = మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ/ ఎంపీల సంఖ్య. {పస్తుతం ఎంపీ ఓటు విలువ 708. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10,98,882. వీటిలో మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,478. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408. రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటివరకు పద్నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నిక 1952లో, పద్నాలుగో ఎన్నిక 2012లో జరిగింది. అధికరణ 56: రాష్ట్రపతి పదవి కాలం 5 ఏళ్లు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. పదవిలో కొనసాగేందుకు ఇష్టం లేకపోతే రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించి తప్పుకోవచ్చు. అధికరణ 57: దీని ప్రకారం ఒక వ్యక్తి రాష్ర్టపతి పదవికి ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ రెండుసార్లు పదవి నిర్వహించారు. మూడోసారి కూడా బలపర్చినప్పటికీ పోటీ చేయకుం డా రెండుసార్లు మాత్రమే పోటీ చేసే సాం ప్రదాయాన్ని నెలకొల్పారు. రాష్ట్రపతిగా ఎక్కువ కాలం రాజేంద్రప్రసాద్, తక్కువ కాలం జాకీర్ హుస్సేన్ పని చేశారు. అధికరణ 59: రాష్ట్రపతి జీతభత్యాల గురించి వివరిస్తుంది. దీన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుత వేతనం రూ. 1,50,000. జీతభత్యాలను తగ్గించే వీలులేదు. వీటికి ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది. అధికరణ 60: సుప్రీంకోర్ట ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని సందర్భంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించే సందర్భంలో ఉపరాష్ట్రపతి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. అధికరణ 61: దేశ ద్రోహానికి పాల్పడిన, రాజ్యాంగాన్ని ధిక్కరించిన సందర్భాల్లో రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంట్ పదవి నుంచి తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు. దీన్ని 1/4 సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేసి ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానాన్ని 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రెండో సభకు వెళుతుంది. రెండో సభ కూడా 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి కోల్పోతారు. ఒక సభ ఆమోదించి, మరోసభ వ్యతిరేకిస్తే తీర్మానం రద్దవుతుంది. ఈ తీర్మానంపై నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 1971లో వి.వి.గిరికి నోటీస్ జారీ చేసి విరమించుకున్నారు. అధికరణ 62: ఏదైనా కారణంతో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే, ఆరు నెలల్లోపు నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి. అధికరణ 71: రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎలక్ట్రోరల్ కాలేజ్‌లోని సభ్యుడు ఎన్నిక వివాదాలపై పిటిషన్ వేయవచ్చు. పిటిషన్‌ను ఎన్నిక ముగిసిన 30 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఎన్నిక వివాదంపై కోర్టులో స్వయంగా హాజరైన రాష్ట్రపతి వి.వి.గిరి. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. భారత రాష్ట్రపతులు 1. డాక్టర్ రాజేంద్రప్రసాద్ (1950-62): బీహార్‌కు చెందినవారు. ఎక్కువ కాలం రాష్ట్రపతిగా కొనసాగారు. రెండుసార్లు రాష్ట్రపతి గా పనిచేసిన ఏకైక వ్యక్తి. హిందూకోడ్ బిల్లును పునఃపరిశీలన కోసం పంపారు. ఈయన ప్రధాన రచన ‘ఇండియా డివెడైడ్’. 2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962-67): తమిళనాడుకు చెందినవారు. విదేశీ రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా పని చేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన ప్రధా న రచనలు ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’. 3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1967-69): తక్కు వ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు. పదవి లో కొనసాగుతూ మరణించిన మొదటి రాష్ట్రపతి. ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 4. వి.వి.గిరి (1969-74): ఈయన ఒడిశాకు చెందినవారు. అతి తక్కువ మెజార్టీతో ఓటు బదలాయింపు ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కార్మిక సంఘాల నాయకుడిగా పనిచేశారు. 5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1974-77): ఈయన అసోంకు చెందినవారు. పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి. అంతరంగిక అత్యవసర సమయంలో రాష్ట్రపతిగా పనిచేశారు. 6. నీలం సంజీవరెడ్డి (1977-82): రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. మిగతావారితో పోలిస్తే తక్కువ వయసు (62 ఏళ్లు)లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 7. జ్ఞానీ జైల్ సింగ్ (1982-87): రాష్ట్రపతి అయిన ఏకైక సిక్కు వ్యక్తి. ఈయన పంజాబ్‌కు చెందినవారు. ఈయన కాలంలోనే ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ జరిగింది. ‘పాకెట్ విటో’ అధికారాన్ని ఉపయోగించుకున్న ఏకైక రాష్ట్రపతి. 8. ఆర్. వెంకట్రామన్ (1987-92): ఈయన తమిళనాడుకు చెందినవారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే అతిపెద్ద పార్టీ నాయకున్ని ఆహ్వానించడం ప్రారంభించింది ఈయనే. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల పెంపు బిల్లు పునఃపరిశీలన కోసం పంపించారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఈయన ప్రధాన రచన ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స’. 9. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ (1992-97): ఈయన మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వివాదాస్పద దళిత క్రైస్తవుల రిజర్వేషన్ బిల్లును వెనక్కి పంపారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. 10. కె.ఆర్. నారాయణన్ (1997 - 2002): అత్యధిక మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికైనవారు. ఏకైక దళిత రాష్ట్రపతి. రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. అమెరికా ప్రభుత్వం నుంచి ‘బెస్ట్ స్టేట్స్‌మ్యాన్’ అవార్డు పొందారు. ఈయన కేరళకు చెందినవారు. 11. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002-07): రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తి. ఈయన తమిళనాడుకు చెందినవారు. 2006లో లాభదాయక బిల్లును పునఃపరిశీలనకు పంపారు. ఈయన ప్రధాన రచన ‘వింగ్‌స ఆఫ్ ఫైర్’. 12. {పతిభాపాటిల్ (2007-12): ఏకైక మహిళా రాష్ట్రపతి. మహారాష్ట్రకు చెందినవారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. 13. {పణబ్ ముఖర్జీ (2012): పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. తీవ్రవాదులైన కసబ్, అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించారు. 1969లో వి.వి.గిరి, మహ్మద్ హిదాయతుల్లా; 1977లో బీ.డి. జెత్తి తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేశారు. రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన మొదటి మహిళ లక్ష్మీ సెహగల్. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు: 1. రాజేంద్రప్రసాద్, 2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 3. నీలం సంజీవరెడ్డి, 4. జ్ఞానీ జైల్ సింగ్, 5. అబ్దుల్ కలాం, 6. ప్రతిభా పాటిల్, 7. ప్రణబ్ ముఖర్జీ. -
అవిరామ, అసిధారావ్రతం
ఇది కొత్త అధ్యాయం. సరికొత్త వేదికపై అక్షరవిన్యాసం. అసిధారావ్రతం. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో కనిపిస్తున్న ధోరణులను సామాన్య ప్రజల పక్షాన నిలబడి గమనిస్తూ కార్యకారణ సంబంధాలను చర్చించే మేధో మథనం. వెరసి తెలుగు పాఠకలోకానికి వినమ్రంగా సమర్పిస్తున్న మరోకాలమ్. దాదాపు నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో పాఠకులతో సాగిస్తున్న సంభా షణ, సమాలోచనల కొనసాగింపు. ఆంధ్రప్రభలో రకరకాల శీర్షికలు. ఉదయంలో వీక్షణం. వార్తలో వార్తావ్యాఖ్య. ఆంధ్రజ్యోతిలో సకాలం, హన్స్ ఇండియాలో థర్స్ డే థాట్స్. ఇప్పుడు ’త్రికాలమ్’. వర్తమాన పరిణామాలను అధ్యయనం చేసి వ్యాఖ్యానించే విశ్లేషకుడికి గతం తెలిసి ఉండాలి. వర్తమానం గురించి క్షుణ్ణమైన అవగాహన అవసరం. భవిష్యత్తును ఊహించి చెప్పగల దార్శనికత కావాలి. గతం విస్మరించిన వాడు వర్తమానాన్ని సవ్యంగా అర్థం చేసుకోలేడు. భవిష్యత్తుకు సరైన బాటలు చూపించలేడు. ‘త్రికాలమ్’ లో గతాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమాన పరిణామాలను పరిశీలించి అవి భవిష్యత్తులో ఏ తీరాలకు దారితీయగలవో అంచనా వేసే ప్రయత్నం చేయాలని సంకల్పం. జరుగుతున్న చరిత్రకు భాష్యం చెప్పడం కత్తిమీద సాము. నిష్పక్ష పాతంగా, నిర్వికారంగా, సమదృష్టితో, న్యాయబద్ధంగా చేయవలసిన క్రతువు. జనజీవనంలో సంభవిస్తున్న పరిణామాలను విశ్లేషించి వివరిస్తే సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం ప్రజలకు ఉన్నదనే విశ్వాసంతో సాగిస్తున్న ప్రయాస. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కనుక మంచిచెడులను వారికే విన్నవించాలన్న తాపత్రయం. అక్షరం ద్వారా ప్రజాసేవను కొనసాగించా లన్న ఆకాంక్ష. అరవై ఎనిమిదేళ్ళ స్వాతంత్య్రంలో మనం ఏమి సాధించాం? వివిధ రంగాలలో అనేక విజయాలు నమోదు చేశాం. ఇటీవల అంగారక గ్రహం కక్ష్యలోకి ఉపగ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టడం జాతి యావత్తూ గర్వించవలసిన అద్భుతమైన ఘనకార్యం. పరాజయాలూ అదే స్థాయిలో చవిచూశాం. ఇప్పటికీ ప్రపంచంలోని పేదలలో సగం మంది మన దేశంలోనే ఉండటం, మహిళలపైన అత్యాచారాలు సాగడం, వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరం సిగ్గుతో తలవంచుకోవలసిన చేదునిజాలు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మంథన్ సంవాద్ కార్యక్రమం జరిగింది. అజయ్ గాంధీ, కాకి మాధవరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మేధోమథనానికి వేయిమందికి పైగా మేధావులు హాజరైనారు. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అరుణ్ మైరా ఈ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని మోదీ అమెరికా యాత్ర గురించి ప్రస్తావించారు. మూడు ‘డీ’ల కారణంగా భారత్ సత్వరం అభివృద్ధి చెందుతుందని మోదీ న్యూయార్క్‌లోని మాడిసన్ గార్డెన్లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో చెప్పారని గుర్తుచేశారు. మొదటి డి: డెమోక్రసీ (ప్రజాస్వామ్యం). రెండవ డి: డెమోగ్రఫీ (జనాభా), మూడవ డి: డిమాండ్ (అవసరం). కానీ తన దృష్టిలో మరో డి ఉన్నదనీ, అది డైవర్సిటీ (వైవిధ్యం) అనీ అరుణ్ చాలా చక్కగా చెప్పారు. అదే సభలో ఒక సభికుడు లేచి ఐదో డి అత్యవసరమని నొక్కిచెప్పారు. అదే డిసిప్లిన్ (క్రమశిక్షణ). వీటన్నిటిలోకీ అత్యంత ప్రధానమైనది ముమ్మాటికీ ప్రజాస్వామ్యమే. ఐదేళ్ళకోసారి శాంతియుతంగా ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చుకోగలుగుతున్నాం. పొరుగున ఉన్న పాకిస్థాన్ ప్రజల కంటే, ప్రపంచంలోని అనేక ఇతర దేశాల ప్రజలకంటే మనం ఎంతో అదృష్టవంతులం. ప్రజా స్వామ్యం ప్రసాదించే స్వేచ్ఛను కాపాడుకోవాలంటే నిరంతర నిఘా అత్యవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు చర్చ ప్రాణం. మంథన్ సంవాద్‌లో ప్రసంగించిన ఇతర ప్రముఖులు అందరూ చర్చ ద్వారానే, హేతుబద్ధమైన సంవాదం ద్వారానే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవాలనీ, ప్రగతికి బాటలు వేయాలనీ హితవు చె ప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పుణ్యమా అని ఉన్నత పదవులు అధిష్టించినవారు ఈ ఆప్తవాక్యాన్ని మనసులో నిలుపు కోవాలి. ప్రజలతో నిమిత్తం లేకుండా, చర్చ, సమాలోచనలు లేకుండా, జనహితం పట్టించుకోకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులలో ఉన్నవారికి తగదు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరం. అంతిమంగా ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టు. ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి సుమారుగా నాలుగు నెలలు. నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు తమదైన తీరులో పరిపాలన సాగిస్తున్నారు. మోదీ గొప్ప ప్రజా ప్రభంజనం సృష్టించి సార్వత్రిక ఎన్నికలలో అపూర్వమైన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఒకప్పటి నిరుపేద చాయ్ వాలా. ఇటువంటి అద్భుతం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యం. గుజరాత్ ముఖ్యమంత్రిగా పదేళ్ళు చక్రం తిప్పిన మోదీ ఢిల్లీ సింహాసనం అధిష్టించే క్రమంలో తన కత్తికి ఎదురు లేకుండా చేసుకునే ప్రయత్నంలో అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పూర్వపక్షం చేయడమే కాకుండా తనకు నమ్మిన బంటు అమిత్ షాకు పార్టీ పగ్గాలు అప్పగించే విధంగా వ్యూహరచన చేశారు. మోదీ ఎంత ఎత్తు ఎదిగారంటే ఆయనతో విభేదించేవారు భారతీయ జనతా పార్టీలో కనిపించరు. వినిపించరు. ప్రధానిగా మోదీ శక్తిమంతంగా, సమర్థంగా వ్యవహరిస్తు న్నారు. కానీ నూటికి నూరు పాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. అమెరికా పర్యటనకు ముందు కానీ తర్వాత కానీ, పాకిస్థాన్‌తో చర్చల ప్రతిపాదనను రద్దు చేసుకునే సమయంలో కానీ ఇతర ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలలో కానీ ప్రధాని మరొకరితో చర్చించినట్టు కానీ సమాలోచనలు జరిపినట్టు కానీ, ఇతరుల సలహా ఆలకించి తన నిర్ణయం మార్చుకున్నట్టు కానీ దాఖలా లేదు. మోదీని ఆరాధిస్తున్న ఇంగ్లిష్ చానళ్ళకూ, పత్రికలకూ ఇది ఆక్షేపణీయంగా తోచడం లేదు. తాను ముందు నిర్ణయం తీసుకొని అనంతరం చర్చ నిర్వహించే నేర్పు చంద్రబాబు నాయుడిది. అది 2009 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు నిర్ణయమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడను రాజధాని చేయాలన్నా అదే పద్ధతి. రాజధాని ఎక్కడో నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులతో నిమిత్తం లేకుండా, శాసనసభలో ప్రతిపక్షానికి ఈ అంశంపైన ప్రశ్నించే, చర్చించే అవకాశం ఇవ్వకుండా సంఖ్యాబలంతో తీర్మానం చేయించారు. ఇక చంద్రశేఖరరావు ఎవరిని సంప్రదిస్తున్నారో, ఆయనకు సలహా చెప్పే చొరవ ఎవరికున్నదో, ఆయన అభీష్టానికి భిన్నంగా మాట్లాడే సాహసం ఎవరికున్నదో తెలియదు. ముగ్గురూ సమర్థులైన పాలకులే కావచ్చు. కానీ సమష్టి నాయకత్వంలో అందరినీ కలుపుకొని పరిపాలన సాగించాలనీ, సంఖ్యాబలం లేనివారి వాదనలో హేతు బద్ధత ఉన్నట్లయితే ఆ వాదనను అంగీకరించాలనీ, కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాధ్యమైనంత విస్తృతంగా సంప్రదింపులు జరపాలనీ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిర్దేశిస్తున్నది. ప్రవృద్ధ ప్రజాస్వామ్య దేశాలు ప్రజాస్వామ్య సూత్రాలను అక్షరాలా పాటిస్తాయి. ఇటీవల గ్రేట్‌బ్రిటన్‌లో స్కాట్లండ్ లో జరిగిన రెఫరెండం, దానికి ముందు రెండు మాసాలపాటు శాంతియుతంగా జరిగిన చర్చ ఇందుకు నిదర్శనం. రెఫరెండం జరిపించడం బ్రిటిష్ ప్రభుత్వ ప్రజాస్వామ్య స్పృహ అయితే ఆ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ భవిష్యత్తును స్కాట్లండ్ ప్రజలు నిర్ణయించుకున్న పద్ధతి ప్రశంసనీయం. స్కాట్లండ్ పార్లమెంటు ఎన్నికలలో 52 శాతం, బ్రిటిష్ పార్లమెంటు (వెస్ట్‌మినిస్టర్) ఎన్నికలలో 72 శాతం ఓటర్లు పాల్గొంటే రిఫరెండంలో స్కాట్లండ్ ఓటర్లలో 85 శాతం మంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం స్థిరపడిన దేశాలలో ప్రజల ప్రమేయంతో నిర్ణయాలు తీసుకోవడం రివాజు. విజయవాడ రాజధాని కావాలంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పుకాకపోవచ్చు. కానీ నిర్ణయం తీసుకున్న విధానం ఆక్షేపణీయం. చంద్రశేఖర రావుకు కొన్ని మీడియా సంస్థల పట్ల ఆగ్రహం కలగడంలో తప్పు లేకపోవచ్చు. కానీ దాన్ని వ్యక్తం చేసిన తీరు అభ్యంతరకరం. వీరిద్దరికంటే మోదీ జాగ్రత్తగా వ్యవహ రిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన ఇంతవరకూ మాట తూలిన సందర్భం కానీ సంఖ్యాబలంతో ఏకపక్షంగా వ్యవహరించిన ఘట్టం కానీ లేదు. మోదీని అదుపు చేయగల శక్తి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఉంది. మోన్శాంటో, మరికొన్ని బహుళజాతి కంపెనీలు తయారు చేసిన వరి, జొన్న, తదితర వంగడాల క్షేత్ర ప్రయోగాలను యూపీఏ ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్డీఏ సర్కార్ రాగానే ఈ ప్రయోగాలను అనుమతిం చాలని నిర్ణయించింది. బీజేపీకి అనుబంధ సంస్థ భార తీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో నిర్ణ యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను అదుపు చేసే అంకుశం ఏదీ లేదు. తమ ముఖ్యమంత్రి పనితీరును కానీ, నిర్ణయాలను కానీ తప్పు పట్టి వారితో వాదించే స్థాయి గలవారు తెలుగుదేశం పార్టీలో కానీ తెరాసలో కానీ ఎవ్వరూ లేరు. అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన పార్టీలలోనే అటువంటి దిద్దుబాటు వ్యవస్థ ఉంటుంది. పార్టీ శ్రేణుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఒత్తిడి వచ్చే అవకాశం లేదు కనుక ప్రజలకు వాస్తవాలు తెలియ జెప్పి, ప్రభుత్వ నిర్ణయాల బాగోగులను వివరించవలసిన బాధ్యత పత్రికలమీదా, టీవీ న్యూస్ చానళ్ళ మీదా, ఇతర పౌరవ్యవస్థల మీదా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పుణ్యమా అని ఉన్నత పదవులు అధిష్టించిన వారు ఈ ఆప్తవాక్యాన్ని మనసులో నిలుపుకోవాలి. ప్రజలతో నిమిత్తం లేకుండా, చర్చ, సమాలోచనలు లేకుండా, జనహితం పట్టించుకోకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులలో ఉన్నవారికి తగదు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరం. అంతిమంగా ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టు. కె. రామచంద్రమూర్తి -
చిదంబరం వాగాడంబరం
విశ్లేషణ, వి.హనుమంత రావు గత సంవత్సరంలో జపాన్ ప్రధాని షింబో ఆబె ఎన్నికై ద్రవ్యోల్బణంపై దృష్టి కేంద్రీకరించారు. తన పాలన మొదటి వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఆయన ఎన్నికల్లో ఒకే ఒక వాగ్దానం చేశారు- ‘నాకు ఓటు వేయండి! ద్రవ్యోల్బణం మెడలు వంచుతాను.’ అని. జనం ఓట్ల వర్షం కురిపించారు. మరి చిదంబరం ఏం చేశారు? కొద్ది వారాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మాంద్య పరిస్థితిలో ఇరుక్కుపోయింది. కార్మికులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. కొద్దిమాసాల క్రితమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మె చేశారు. నిన్నకాక మొన్ననే ఓ రాష్ట్రంలో బ్యాంకు అధికారులు కూడా రెండు దినాల సమ్మె చేశారు. పారిశ్రామిక రంగాన్ని చూస్తే తయారీ రంగం కునికిపాట్లు పడుతూనే ఉంది. బొగ్గు, చమురు, గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ (కోర్ పరిశ్రమలు) ఇలా ఏ రంగంలో చూసినా మాంద్యం, కొరతలతో సతమతమవుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని చూస్తే కార్పొరేట్లు, విదేశీ సంస్థలు, వ్యవసాయ భూములను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆక్రమిస్తున్నాయి. చిన్న రైతులు, వ్యవసాయ కూలీల వలసలు, వ్యవసాయోత్పత్తుల ధరవరలు షరా మామూలే. ఆత్మహత్యలు సరేసరి. ఈ సంవత్సరం పంటలు బాగా ఉండబోతున్నాయనుకుంటే వరదలు, తుపానుల్లో ఆశలు కొట్టుకుపోయాయి. దేశ ద్రవ్య పరిస్థితి మాంద్యంలో కొట్టుకుపోతుంటే ఆర్థికమంత్రికి ఇవేమీ పట్టడం లేదు. కరెంట్ ఎకౌంట్లో నుంచి (క్లుప్తంగా అర్థం చెప్పాలంటే దేశంలోకి వచ్చే/పోయే విదేశీ నిధుల మధ్య తేడా) జీడీపీలో 4.6 శాతాన్ని సాధించబోతున్నాం అని ప్రకటించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు. మధ్య తరగతినీ పట్టించుకోలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల విభజించి పాలించే విధానంతో ఆ తరగతిలో ఉన్నత మధ్య తరగతి వర్గాన్ని సృష్టించి వాళ్లకు బ్యాంకు రుణాల సరళీకరణ చేసి పబ్బం గడుపుతోంది. ఈ మధ్య తరగతి కింద స్థాయి కార్మికులతో చేతులు కలపలేదు. తమ తరగతిలోనూ ఇమడలేదు. భూమ్యాకాశాల మధ్య వేలాడుతుంటుంది (ఇటీవలి కాలంలో కొంత మార్పు కనిపిస్తోంది). పైన ఉదహరించిన ఉన్నత మధ్య తరగతికి విదేశీ వస్తువులపై మోజు పెరుగుతున్నది. కార్లు, ఫ్రిజ్‌లు లాంటి విలాస వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అనుమతి లభిస్తోంది. కార్లు తయారు చేసే విదేశీ సంస్థలకు ధారాళంగా అనుమతినిస్తుంటే కార్ల ఉత్పత్తి పెరుగుతోంది. పెట్రోల్ దిగుమతులు వంటి వాటితో ఎగుమతులకు, దిగుమతులకు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇది ఒక ఉదాహరణే అయినా, మన ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయడానికి ఇదొక్కటి చాలు. కార్పొరేట్ల సేవలో... 122 కోట్ల ప్రజల బాగోగులు పట్టించుకోకుండా, కార్పొరేట్టకూ విదేశీ పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ ద్రవ్య పరిస్థితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి, ఐ.ఎం.ఎఫ్ బడ్జెట్ సలహాదారు ఎ.రంగాచారి విమర్శించారు. ప్రజల రాష్ట్రాదాయం(జీడీపీ), ధరల పెరుగుదల దేశాన్ని పట్టిపీడిస్తుండడమే ఈ దుస్థితికి కారణాలని ఆయన అన్నారు. జనాన్ని ఇలా గాలికి వదిలేసిన, ముఖ్యంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన చిదంబరం (ఆయన సంవత్సరానికి ఒక్కసారే, అదీ బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం గురించి ప్రస్తావిస్తారు). ద్రవ్యోల్బణం, జీడీపీ పెరుగుదల, ద్రవ్యలోటు, ధరల పెరుగుదల, ఎగుమతులూ దిగుమతుల గురించి అఖిల భారత స్థాయి విషయాల గురించే మాట్లాడతారు. దేశపాలనలో ఇవన్నీ ముఖ్యమే కానీ వీటన్నింటికీ మూలం ప్రజలు, వారి బాగోగులు. అంటే పునాదుల్లేని భవన నిర్మాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్నమాట. పోనీ ఆ కేంద్రంలోనైనా ఏమైనా వెలగబెట్టారా? జీడీపీ ఈ శతాబ్దంలోనే తొమ్మిది శాతం పెరుగుదల చూపగా, చిదంబరం అయిదు శాతం కన్నా తక్కువకు తీసుకురావడంలో గొప్ప విజయం సాధించారు. ధరల తగ్గింపును పట్టించుకునేవారు లేరు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును సంవత్సరానికి అయిదు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్లకు ధారబోశారు. కుదేలైన ప్రపంచ బ్యాంకు కార్పొరేట్లు ప్రతి సంవత్సరం తామెంత పన్ను కట్టాలో, ఆ మొత్తంలో కొంత అడ్వాన్సుగా చెల్లించాలి. సంవత్సరం ఆఖరున నికరంగా ఎంత చెల్లించాలో లెక్కలు తయారవుతాయి. చెల్లించాల్సిన సొమ్ము కన్నా ఎక్కువ చెల్లించిన పక్షంలో ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి అలా చెల్లించని మొత్తం రూ. 37365 కోట్లు కక్కాల్సి వచ్చింది (2006-07, 2010-11 మధ్య). ఇదీ చిదంబరం నిర్వాకం. ఈ ‘దోపీడీ’లో ప్రణబ్ ముఖర్జీ నిర్వాకం కూడా ఉంది. ఇక్కడ కేంద్రం చేసిన నిర్వాకాలు ఎన్నయినా చెప్పవచ్చు. ఉదాహరణకు మిలియన్లు, బిలియన్ల డాలర్ల రుణాలిచ్చిన ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అస్తవ్యస్త ద్రవ్య విధానాలను చూసి, దాని నెత్తిన మేకు కొట్టింది. లేకపోతే తానిచ్చిన రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి మాట అటుంచి బంగాళాఖాతంలో మునిగిపోతుందని గ్రహించి ఊజీటఛ్చి ఖ్ఛటఞౌటజీఛజీజ్టీడ ్చఛీ ఆఠఛీజ్ఛ్ట క్చ్చజ్ఛఝ్ఛ్ట అఛ్టి ను పార్లమెంటులో ఆమోదింపజేసింది. దీనినే రాష్ట్రప్రభుత్వాలు కూడా అమలు పరచాలని కేంద్రం ఆదేశించింది. దీని ప్రకారం ద్రవ్యలోటు జీడీపీలో మూడు శాతం మించరాదు. 2013లో ఆమోదించిన ఈ చట్టాన్ని ఈ రోజు వరకు ఏ సంవత్సరంలోనూ అమలు చేయలేదు. అంటే ద్రవ్యపరిస్థితి అదుపులోకి తీసుకొనిరావడంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు విఫలమయ్యారు. ఇటు ప్రజల గోడూ పట్టించుకోలేదు. అటు దేశ ద్రవ్యపరిస్థితిని అదుపులోనూ పెట్టలేదు. మరి ప్రపంచ బ్యాంకు ఊరుకుందా? ఆ బ్యాంకు లక్ష్యం వేరు, తానిచ్చిన రుణం తిరిగి తీసుకోవటం కన్నా, దాని మీద వచ్చే వడ్డీ అంటే దానికి ముద్దు. అమెరికాలో వడ్డీరేటు 2-3 శాతం మాత్రమే. ఇంకా ఎక్కువ సంపాదించటం దాని లక్ష్యం. అంతేకాదు: ఇండియా రాజకీయ పిలక ప్రపం చ బ్యాంకు ద్వారా అమెరికా చేతుల్లో, అక్కడి బిలియనీర్ల చేతుల్లో ఉంటుంది. అన్నీ వైఫల్యాలే ద్రవ్యోల్బణం మన దేశ ప్రజలకు మొదటి శత్రువు. రిజర్వు బ్యాంకు గవర్నరుగా సుబ్బారావు ఉన్నప్పుడు ద్రవ్యలోటు తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించారు. చిదంబరానికీ ఆయనకూ మధ్య సంబంధాలు ఎప్పుడూ సరిగ్గా లేవు. దీనికన్నా వడ్డీ రేట్లు తగ్గించాలనేది చిదంబరం వాదన. ఇక్కడ జపాన్ ఉదాహరణ- గత సంవత్సరంలో జపాన్ ప్రధాని షింబో ఆబె ఎన్నికై ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించారు. తన పాలన మొదటి వార్షికోత్సవం బ్రహ్మాం డంగా జరుపుకున్నారు. ఆయన ఎన్నికల్లో ఒకే ఒక వాగ్దానం చేశారు- ‘నాకు ఓటు వేయండి! ద్రవ్యోల్బణం మెడలు వంచుతాను.’ అని. జనం ఓట్ల వర్షం కురిపించారు. మరి చిదంబరం ఏం చేశారు? ఆప్రశ్నకు జవాబు మీ దగ్గరే ఉంది. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వైఫల్యాలు కోకొల్లలు. ఉదాహరణకు ద్రవ్య పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థికశాస్త్రవేత్తలు సూక్తులు చెబుతుంటారు. ప్రభుత్వం పదిశాతం ఖర్చులు తగ్గించుకోమని ఆదేశిస్తుంది. కానీ, ఈ ఆదేశం అమలు పరిచాం, ఇంత మేరకు ఖర్చులు తగ్గించుకొన్నామని ఎవరూ చెప్పిన దాఖలాలు లేవు. లేకపోగా, తాజా తాత్కాలిక బడ్జెట్లో సామాజిక సంక్షేమానికి కేటాయించిన మొత్తంపై కోత విధించారు చిదంబరం. ఇటు మానవాభివృద్ధి లేదు, అటు ఆర్థికాభివృద్ధి లేదు. కాంగ్రెస్, బీజేపీ, రెండు ప్రభుత్వాలు ఒక వర్గం ప్రతిని ధులే. చిదంబరానికీ కార్పోరేట్ రంగానికీ ఎలాంటి పేగు బంధం ఉందో, మోడీకి అంతే. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా మన గతి ఇంతే. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
సాక్షి, బళ్లారి : జిల్లాలోని అన్ని గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పరమేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు విచ్చేసిన ఆయన నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బళ్లారికి మంచినీటిని అందించే అల్లీపురం రిజర్వాయర్‌లో నీటి సేకరణ తక్కువగా ఉన్నందున భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారికి సూచనలు ఇచ్చామన్నారు. కుడితిని, మించేరి గ్రామాల్లోని చెరువు పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదని, గ్రామ పంచాయతీల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నీటి సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టికల్-371(జే) త్వరలో అమల్లోకి వస్తుందని,దీంతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాలోని ఆరు తాలూకాల్లో కరువు నివారణ పనులు చేపట్టి కూలీలు వలసలు నివారించి జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. అల్లీపురం రిజర్వాయర్ స్థితిగతులపై మంత్రికి ఎస్‌యూసీఐ వినతి: ఇదిలా వేసవిలో బళ్లారిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌యూసీఐ ప్రముఖులు సోమశేఖర్, మంజుల, దేవదాసు, ప్రమోద్ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కుదించుకుపోయిన అల్లీపురం రిజర్వాయర్ రక్షణ గోడ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 7.5 మీటర్లకుగాను 4.5 మీటర్లు మాత్రమే నీటిని నిల్వ చేశారని, దీంతో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని మంత్రికి వివరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్య రాకుండా చూస్తానని, ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అల్లీపురం రిజర్వాయర్ పరిశీలన : ఎనిమిది నెలల క్రితం గట్టు కుప్పకూలిన అల్లీపురం రిజర్వాయర్‌ను జిల్లా ఇన్చార్జ మంత్రి పరమేశ్వరనాయక్ గురువారం మొదటిసారిగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదిత్య అమ్లాన్ బిస్వాస్, సంబంధిత అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గట్టుకు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టి మంచినీటి సమస్య రాకుండా చూస్తామన్నారు. నీటి మట్టం 2.5 మీటర్లు తక్కువ ఉన్నందున డిసెంబర్ 26 వరకు రిజర్వాయర్‌లోకి నీరు పంప్ చేసి ఏప్రిల్ నుంచి నీరు సరఫరా చేస్తామన్నారు. అంతవరకు మోకా కాలువ ద్వారా నగరానికి మంచినీరు అందిస్తామన్నారు. నగర కమిషనర్ చిక్కణ్ణ, కాంగ్రెస్ నాయకులు రాంప్రసాద్, కార్పొరేటర్ వెంకట రమణ పాల్గొన్నారు.