కష్టాల కల్యాణం | To draw cash with the rules of the pelican | Sakshi
Sakshi News home page

కష్టాల కల్యాణం

Published Sat, Nov 26 2016 3:57 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

కష్టాల కల్యాణం

కష్టాల కల్యాణం

పెళ్లిళ్లపై పెద్దనోట్ల ప్రభావం
నగదు విత్‌డ్రాకు నిబంధనల అడ్డు
దిక్కుతోచని వధూవరుల తల్లిదండ్రులు

వ్యక్తి పేరు దుర్వాసులు. ఈయన కూతురు చందు ప్రియకు ఈనెల 27న వివాహం. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఒక్కగానొక్క కూతురికి ఘనంగా పెళ్లి చేయాలని బంధువులందరికీ ఆహ్వానాలు పంపారు. అరుుతే ఒక్కసారిగా పెద్దనోట్ల ప్రకటన రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పుచేసి తెచ్చుకున్న డబ్బు నిరుపయోగంగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లికోసం రూ.2.5 లక్షల నగదు ఇస్తామని చెప్పినా నవంబర్ 8వ తేదీకి ముందు డిపాజిట్ చేసిన వారికే అని షరతు మరిన్ని అగచాట్లకు గురిచేస్తోంది.

చిత్తూరు, సాక్షి: పెద్ద నోట్ల రద్దుతో పెళ్లి ఇంట కష్టాలు మొదలయ్యాయి. నగదు డ్రా చేసే విషయంలో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టడంతో పెళ్లిపనులు ముందు కు సాగడం లేదు. ఈ పరిస్థితి మరో 40 రోజులు ఉండటంతో తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారానికి రూ.24 వేల దాకా డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రకటన వెలువడిన మొదట్లో రోజుకు రూ.2 వేలు, వారానికి రూ.24 వేలు డ్రా చేసుకునే నిబంధన ఉండేది. అరుుతే దీనిపై పెద్ద ఎత్తున వి మర్శలు వెల్లువెత్తడంతో ఒకేసారి రూ.24 వేలు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది ఆర్బీఐ. పెళ్లి, ఇతర శుభకార్యాలకుకూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ డబ్బుతో పెళ్లిళ్లు ఎలా జరపాలో తెలపాలని వధూవరుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

రూ.2.5 లక్షల నిబంధన ఊసేలేదు..
వివాహ వేడుకల నిమిత్తం రూ.2.5 లక్షల నగదు ఉపసంహరణకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. దీనికి కఠిన నిబంధనలు విధించింది. అరుునా జిల్లాలో బ్యాంకర్లు ఎక్కడా అమలు చేయకపోవడం గమనార్హం. ఆర్బీఐ గైడ్‌లైన్‌‌స ఇప్పటివరకు తమకు అందలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రధాని ప్రకటన వెలువడిన తరువాత బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికే నగదు ఇస్తారని వార్తలు వస్తుండటంతో.. వడ్డీ వ్యాపారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిదగ్గర కూడా సరిపడినంత నగదు             నిల్వలు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. పెళ్లి బట్టలు, బంగారం, కేటరింగ్, పురోహిత ఖర్చులు, మండపం బుకింగ్ వంటి వాటికి డబ్బు లేకపోవడంతో వధూవరుల తల్లిదండ్రులు తంటాలు పడుతున్నారు.

ఎవరికి ఎంత ఇస్తారో చెప్పండి
పెళ్లి ఖర్చులకు బ్యాంకులకు డబ్బులు ఇచ్చినా ఎవరెవరికి ఎంతిస్తారో చెప్పాలని నిబంధన విధించింది. దీనికితోడు నవంబర్ 8కి ముందు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు మాత్రమే తీసుకోవాలని మరో నిబంధన మరిం త ఆందోళనకు దారితీస్తోంది. ఇది కూడా డిసెంబర్ 30 లోపు జరిగే పెళ్లిళ్లకు మాత్రమే అని మరో మెళిక పెట్టింది. ఈ గడువు కంటే ముందు పెళ్లిళ్లకు మాత్రమే డబ్బు ఇవ్వాలని షరతు విధించింది. తల్లిదండ్రులు, పెళ్లి చేసుకునే వ్యక్తి ఖాతా నుంచి మాత్రమే డబ్బు డ్రా చేసుకోవాలని నిబంధన ఉండటంతో బ్యాంకు ఖాతా లేనివారి పరిస్థితి దయనీయంగా మారింది. దీనికితోడు పెళ్లి ఖర్చులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆర్బీఐ ప్రకటించడంతో.. పెళ్లికి ఇన్ని నిబంధనలా అంటూ ప్రజలు అవాక్కవుతున్నారు. తమ డబ్బులు ఇవ్వడానికి ఎందు కు ఇన్ని షరతులు అని ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

పురోహితులు, కేటరింగ్.. ప్చ్..
పెద్దనోట్ల రద్దు వధూవరుల తల్లిదండ్రులతోతో పాటు కేటరింగ్, ఫంక్షన్ హాల్, డెకరేషన్ తదితర వ్యాపారస్తులకు కూడా ఖేదాన్ని మిగులుస్తోంది. పాత పెద్ద నోట్లు తీసుకోడానికి వీరు వెనకడుగు వేస్తున్నారు. అప్పులు చేద్దామంటే.. పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో కుదరని పని అని.. ఒకవేళ తేడా వస్తే పరిస్థితి దిగజారుతుందని వెనకడుగు వేస్తున్నారు. దీంతో వ్యాపారం కూడా డల్‌గా ఉందని వాపోతున్నారు. ఈ సీజన్ తమకు కన్నీళ్లనే మిగులుస్తోందని ఆందోళన చెందుతున్నారు.

ముహూర్తాలు డిసెంబర్ 30 వరకే..
మంచి ముహూర్తాలు కూడా వచ్చే నెల చివరి వరకే ఉండటం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. డిసెంబర్ 1, 3, 4, 5, 8, 9, 10, 12, 14 తేదీల్లోనే అధికంగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. జాతకాలు, రాశిఫలాల ప్రకారం డిసెంబర్ 30 వరకు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నారుు. ఎంత లేదన్నా జిల్లాలో 500 వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement