
అక్టోబర్ 14 దళిత ‘దీక్షా దినం’
విశ్లేషణ
మహారాష్ట్రలో ఈ ఏడాది ఎప్పటిలా కాక, ఏదో తెలియని కొంత భయం ఆవహించింది. 1925లో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడిన సందర్భంగా ఆ సంస్థ అధి పతి మోహన్ భాగవత్ నాగపూర్ వార్షిక బహిరంగ సభలో ప్రసంగిం చారు. అంతేకాదు, ఉద్ధావ్ థాకరే ముంబైలో జరిగిన మరో బహిరంగ సభలో శివసేన జన్మదినో త్సవం సందర్భంగా ఉపన్యసించారు. రాష్ట్రంలో మరొక భారీ కార్య క్రమం కూడా జరిగింది. అయితే ఎవరూ దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. అది, హిందూ మతపు అవమానకరమైన అంచులలోని ఆరు లక్షల మంది బీఆర్ అంబేడ్కర్ నేతృ త్వంలో బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భాన్ని సంస్మ రిస్తూ జరిగిన కార్యక్రమం. ఆర్‌ఎస్‌ఎస్, శివసేన పుట్టినది విజయ దశమి రోజున. అలాగాక, 1956 అక్టోబర్ 14న ఆ సామూహిక మత మార్పిడి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్ర మమది. ఈ సామూహిక ప్రజాకార్యక్రమాలకు మీడియాలో చోటు లభించింది. కాకపోతే, ఆర్‌ఎస్‌ఎస్, శివసేనలకే అవి చాలా వరకు పరిమితమయ్యాయి. సామూహిక మతమార్పిడి 60వ వార్షిక సంస్మరణ సహా ఈ మూడూ ఒకేసారి వచ్చాయి.
ఈ విషయాన్ని మీడియా ఎలా చూసింది అనే దాని వల్ల, వర్తమాన సందర్భం వల్ల ఈ ఏక కాలీనతకు కొంత ప్రాధాన్యం ఉంది. మొదటి రెండిటికీ లైవ్ టీవీ కవరేజీ సైతం లభించింది. అయితే ఎప్పటిలాగే భారీగా తరలి వచ్చిన దళిత సమ్మేళనానికి మాత్రం పాద సూచిక మాత్రపు చోటు మాత్రమే ఇచ్చారు. బౌద్ధ దీక్షా దినమూ, ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి ఉపన్యాసమూ ఒకే నగరం-నాగపూర్‌లో జరిగాయి. అయినా దళిత కార్యక్ర మాన్ని పట్టించుకోలేదు. మీడియా అలా చెయ్యాలని ముందే అనుకుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మీడియా దేన్న యినా విస్మరించిందంటే ఆ కార్యక్రమం తక్కువ సందర్భోచి తమైనదనో లేదా దాని ఉద్దేశం, సామీప్యత, లేదా పాఠక జనం ఆసక్తి రీత్యా ఆసక్తికరమైనది కాదనో అర్థం. లేదా అందులో కొత్తదనమేమీ లేకపోయి ఉండాలి. అంబేడ్కర్ అంతటివారు కానీ, అలాంటి వారు కానీ ప్రస్తుతం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయినా ఒక తరం నవ బౌద్ధులు, ఆ తదుపరి తరాల వారు తాము ‘మహామానవుడు’ అని పిలుచుకునే వ్యక్తిని స్మరించుకోవడానికి అక్కడకు వచ్చారు.
దళితులు ఎప్పుడూ గమనంలోకి తీసుకోవాల్సిన సమస్య గానే ఉన్నారు. దళితులు అనే ఆ పద మే బౌద్ధానికి వెలుపల ఉన్నవారితో సహా అగ్ర కులాల వేధింపులకు గురయ్యే వారికం దరికీ వర్తిస్తుంది. గతంలో అంబేడ్కర్ కాలంలో జరిగినట్టు గానే, అణచివేస్తున్న కులాల వారిది మోసకారితనమని చెప్పా లని అనుకున్నందుకు ఈ ఏడాది వారు అధ్వాన స్థితిని ఎదు ర్కొంటున్నారు (గుజరాత్‌లో చూసినట్టుగా). గ్రామాల్లోని పశు కళేబరాలను తీసుకుపోవడం లేదా వాటి చర్మాలను వలవడం చేయరాదని వారు నిశ్చయించుకున్నారు. ఉనాలో గోసంరక్ష కులు తమపై దాడి చేసిన తర్వాతనే అలా చేశారు. ఆ తదుపరి వార్తా నివేదికలు వెల్లువెత్తాయి.
పశు కళేబరాలను తొలగిం చడం ఆపేశాక ఆ దళితుల జీవనోపాధి పరిస్థితి ఏమవు తోంది? లేదా రాజుకునే గ్రామాల్లో పరిస్థితి ఏలా ఉంది తెలి యదు. పట్టణం లేదా నగరంలోనైతే మత ఉద్రిక్తతలు రాజు కోడానికి మీడియా ప్రేరేపణ కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా అతి తేలిగ్గా ఉద్రిక్తతలు రాజుకునే గ్రామాల్లో వివిధ మతస్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయమూ అంతే. నీచమైనదిగా చూసినా, దళితుల సంప్రదాయక బాధ్య తను వారు బహిష్కరిస్తుండటం వల్ల నెలకొన్న పరిస్థితితో అగ్ర కులాలు ఎలా వ్యవహరిస్తున్నాయో.. అగ్రకులాల దృష్టి కోణం నుండైనా తెలుసుకోవాలని బాహ్య ప్రపంచం కోరుకుంటోంది. అదీ తెలియడం లేదు.
ఒక మరాఠా బాలికపై దళితులు అని ఆరోపిస్తున్నవారు జరిపిన అత్యాచారాన్ని ట్రిగ్గర్‌గా వాడుకుని మరాఠాలు హఠా త్తుగా ప్రజా ఆందోళనకు దిగారు. తమకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ మొదలుపెట్టిన వారు.. మెల్లగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల (నిరోధక) చట్టం, 1989ని నీరుగార్చాలని అన సాగారు. ఆ విషయాన్ని మీడియా చాటింది. ప్రకాష్ అంబే డ్కర్ వంటి దళిత నేతలు ప్రతి ఆందోళనకు దిగకుండా వారిం చినా, దళితులు, ఆదివాసులలో అశాంతి రగులుతోంది. వారు మిలిటెంటు ఆందోళనకు దిగి, అమీతుమీ తేల్చుకోడానికి దిగొచ్చు. అయితే ఆ చట్టాన్ని మరాఠాలు ఆరోపిస్తున్నట్టు ‘‘దుర్వినియోగం కాకుండా నివారించడం కోసం’’ నీరుగార్చే యడం అంత తేలికేం కాదని వారు గ్రహిస్తున్నారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించకపోయినా అత్యా చారాల చట్టం వారి పాత సమస్య కాబట్టి ఏవో కొన్ని తాయి లాలు లభించినంత మాత్రాన మరాఠాలు సంతోషపడక పోవచ్చు. 1980లలో మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును అంబేడ్కర్ వర్సిటీగా మార్చడాన్ని మరాఠాలు అంత తేలికగా ఏం తీసుకోలేదు. దళితులు ఆ విముఖతను తమ సొంత అస్తిత్వపు గుర్తింపు కోసం చేస్తున్న కృషికి అడ్డంకిగా చూశారు. రెండు వర్గాల మధ్య విభజన అప్పుడు ముందుకు వచ్చింది. అయితే అది అప్పటి నుంచి లోలోపల రాజుకుంటూనే ఉంది.
అందువల్ల ముందు ముందు కొంత సంఘర్షణ తలెత్త నుంది. కానీ అన్ని విషయాల్లోలాగే ఏ సామాజిక సమస్య లోనైనా రాజకీయాలు కలగలిసిపోతాయి. మరాఠాల కోటా డిమాండు లేదా అత్యాచారాల చట్టాన్ని నీరుగార్చడం కావచ్చు లేదా అత్యాచారాల చట్టం కింద తమ ఫిర్యాదులను అధికా రులు విస్మరిస్తున్నారనడం కావచ్చు.. చాలా కాలంగా ఇలా ఆరోపిస్తున్న దళితులు నేడు హఠాత్తుగా తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడం కావచ్చు.. ఏ సామాజిక సమస్యలోనైనా రాజ కీయాలు కలగలిసి పోవాల్సిందే. ఎందుకంటే సామాజిక సమ స్యలను సాధనంగా వాడుకోవడానికి తప్ప రాజకీయాలకు సామాజిక సమస్యలతో ఎలాంటి సంబంధమూ లేదు.
మహేష్ విజాపుర్కార్
సీనియర్ పాత్రికేయులు
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com