
పోలీసులకూ ‘హెల్మెట్ బాదుడు’
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈనెల ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషనర్ మహేందర్‌రెడ్డి పోలీసులు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అలా కాని వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
దీంతో ట్రాఫిక్ పోలీసులు వీరికీ జరిమానాలు విధిస్తున్నారు. గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో హెల్మెట్ ధరించని పోలీసులకూ జరిమానాలు విధించారు. - సాక్షి, సిటీబ్యూరో