
హెల్మెట్ వినూత్న ప్రచారం
మలేసియా టౌన్‌షిప్: ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు మెదక్ జిల్లా జయదేవ్‌పూర్‌కు చెందిన నాగరాజు. ‘హెల్మెట్ ధరించండి... సీటు బెల్ట్ ధరించండి...మద్యం సేవించి వాహనం నడపవద్ద’నే సూత్రాలను తన శరీరంపై రాసుకొని శుక్రవారం వివిధ చౌరస్తాల్లో ప్రచారం చేశాడు.
ఇలా స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చిన అతడిని పోలీసులు అభినందించారు. ముఖ్యమైన సందర్భాలలో ఇలా తన శరీరంపై రాసుకొని ప్రచారం చేయడం ఆయన హాబీ అని పోలీసులు తెలిపారు.