పచ్చ పైత్యం
స్కూళ్లు, వంటషెడ్లు పసుపుమయం
పచ్చనేతల అత్యుత్సాహం
చోద్యం చూస్తున్న అధికార గణం
పచ్చ రంగు కాదని బుకాయింపు
విశాఖపట్నం : సొమ్ము సెంటర్‌ది.. సోకు చంద్రబాబు పార్టీది.. అంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. నిబంధనలకు తిలోదకాలిచ్చి టీడీపీ నాయకులు చేస్తున్న ఓవరాక్షన్ చూస్తే ఎంత తెగువని విస్మయం కలుగుతుంది. కేంద్రం నిధులతో నిర్మిస్తున్న భవనాలకు పసుపు
రంగు పులుముతున్న వైనం చూస్తే నివ్వెరపాటు కలుగుతుంది. దాంతో ఇక్కడా అక్కడా అని లేకుండా ఎటు చూసినా పచ్చ రంగు కనిపిస్తోంది. విద్యాలయాలకే కాదు.. మధ్యాహ్న భోజన పథకం వంటశాలలకూ పసుపు రంగు పూస్తున్న వైనం విస్తుగొలుపుతోంది.
సర్వశిక్షా అభియాన్ పథకంలో పాఠశాలల భవనాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. ఈ సొమ్ముతో పాఠశాలల భవనాలు, వాటి మరమ్మతులు, మధ్యాహ్న భోజన పథకం వంట షెడ్ల నిర్మాణం వంటివి చేపడ్తారు.
వాటికి లేత క్రీమ్ (గోపీ కలర్) రంగును వేస్తారు. సర్వశిక్షా అభియాన్ ఏర్పాటైన దాదాపు 15 ఏళ్ల నుంచి అన్నిచోట్లా ఆ రంగునే వేయిస్తున్నారు. కానీ విశాఖపట్నం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఓ అడుగు ముందుకేసి పాత రంగుకు తిలోదకాలిస్తూ పసుపు రంగు వేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను తలదన్నేలా రంగు మార్చేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్‌లో పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో 984 వంటశాలలు మంజూరయ్యాయి. మొదటి దశలో నిర్మాణం