ప్రతీకారం తీర్చుకుంటాం : చోటా షకీల్ | Yakub hanging: There will be consequences, warns Dawood aide Chhota Shakeel | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకుంటాం : చోటా షకీల్

Published Fri, Jul 31 2015 12:59 PM | Last Updated on Mon, Aug 27 2018 8:24 PM

దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ - Sakshi

దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్

న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరి తీయడంపై అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు చోటా షకీల్ మండిపడ్డారు. స్వదేశానికి వచ్చి లొంగిపోతే ఉరి శిక్ష వేయమంటూ యాకుబ్కు ప్రమాణం చేసి నమ్మక ద్రోహనికి పాల్పడిందని ఆయన భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మెమన్ ఉరి తీయడం భారత ప్రభుత్వం చట్టపరంగా చేసిన హత్య అని షకీల్ అభివర్ణించారు. అందుకు తగ్గ పరిణామాలు ఉంటాయని భారత ప్రభుత్వాన్ని చోటా షకీల్ హెచ్చరించారు. టైగర్ మెమన్ చర్యలకు గాను అతడి సోదరుడిని శిక్షించారన్నారు. యాకుబ్ మెమన్ అమాయకుడు అని గుర్తు చేశారు. అలాంటి వాడిని ఉరి తీసి భారత ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. ఈ మేరకు చోటా షకీల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

1993లో ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు యాకుబ్ మెమన్ నిందితుడని కోర్టు తెల్చింది. దాంతో అతడికి ఉరి శిక్ష వేసింది. దీంతో ఉరిశిక్షను రద్దు చేయాలంటూ యాకుబ్ పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు.  ఆ క్రమంలో జులై 30 మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో యాకుబ్ మెమన్ కు ఉరిశిక్షను అమలు చేశారు. దీనిపై చోటా షకీల్ పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement