
'కంటతడి పెట్టిన యాకూబ్ మెమన్'
ఉరికంబం ఎక్కడానికి ముందు యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడని నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు.
నాగపూర్: ఉరికంబం ఎక్కడానికి ముందు యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడని నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు. దగ్గర బంధువులను చూడగాడనే కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలిపారు. బుధవారం తనను కలవడానికి వచ్చిన సోదరుడు సులేమాన్ ను చూసి కంటతడి పెట్టాడని వెల్లడించారు. అలాగే జైల్లో సహచర ఖైదీలకు చివరిసారిగా వీడ్కోలు చెప్పాడని, తాను ఏమైనా పొరపాట్లు చేసివుంటే మన్నించాలని వారిని కోరాడని చెప్పారు.
ఉరికంబం ఎక్కడానికి ముందు మెమన్ వైద్య పరీక్షలు చేయించుకోలేదు. తాను ఫిట్ గా ఉన్నానని, వైద్య పరీక్షలు అవసరం లేదని జైలు డాక్టర్లతో చెప్పాడు. తెల్లవారుజామున ఖురాన్ చదివాడని జైలు అధికారులు వెల్లడించారు. నాగపూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం మెమన్ కు అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు.