
'కేంద్రం ఇటువంటి నిబద్ధతే చూపించాలి'
1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్కి విధించిన తరహా శిక్ష ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారికి అనువర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆకాంక్షించారు.
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్కి విధించిన తరహా శిక్ష ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారికి అనువర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆకాంక్షించారు. ఇలాంటి ఉగ్రవాదుల దాడికి పాల్పడిన వారిపై ఇటువంటి శిక్షలు అమలు చేసేందుకు నిబద్ధతే చూపించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
దాడికి పాల్పడిన వారు ఎవరైనా వారి కులం, మతం, ప్రాంతం అనేవి పట్టించుకోకుండా ప్రభుత్యం, న్యాయస్థానాలు ఇలానే వ్యవహారిస్తాయని దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్కు గురువారం ఉదయం 7.00 గంటలకు నాగపూర్ జైలులో ఉరి తీశారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.