ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం | SC dismisses curative petition of sole death row convict Yakub Abdul Razak Memon | Sakshi
Sakshi News home page

ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం

Published Tue, Jul 21 2015 3:16 PM | Last Updated on Sat, Sep 15 2018 2:58 PM

ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం - Sakshi

ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం

ముంబై: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరశిక్ష దాదాపు ఖరారైంది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ  అతడు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో ముంబై పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష అమలు ఖాయమైంది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను ఆ తర్వాత సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. ఈ నేపథ్యంలో జూలై 30న యాకూబ్ ను ఉరితీయనున్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను అమలుచేసేందుకు రంగం సిద్ధం చేశామని ఇటీవలే  మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలుకానుంది. ప్రస్తుతం ఉరి శిక్ష కోసం ఎదురుచూస్తున్న ఏకైక ఖైదీ మెమన్ మాత్రమే. తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా గతంలో రాష్ట్రపతికి పెట్టుకున్న తిరస్కరించడంతో అతని మరణశిక్ష అమలు రూఢీ అయింది.

కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ  సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన  టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది.  మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు  తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement