'రాష్ట్రపతి గారూ.. క్షమాభిక్ష ప్రసాదించండి'
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ ఏర్పడింది. ఉరిశిక్ష రద్దు చేయాలంటూ యాకూబ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారిస్తోంది. బుధవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తోంది. కాగా తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని యాకూబ్ ఇదే రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నివించాడు. యాకూబ్ గతంలో కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.
ఈ నెల 30న యాకూబ్ను ఉరితీయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రేపు నాగ్పూర్ జైల్లో యాకూబ్ను ఉరితీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో యాకూబ్ పిటిషన్పై సుప్రీం కోర్టు స్టే ఇస్తుందా? లేక రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది.