
ఉరిశిక్షపై అనవసర రాజకీయాలా?
మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనవసరంగా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రాజకీయం చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ మండిపడింది.
మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనవసరంగా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రాజకీయం చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ మండిపడింది. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల దోషి అయిన మెమన్ను ఈనెల 30న ఉరితీయనున్న విషయం తెలిసిందే. కోర్టులు తీర్పు చెప్పేముందు ఎప్పుడూ దోషుల మతం చూబోవని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు.
ముంబై పేలుళ్లలో హిందూ ముస్లింలు ఇద్దరూ మరణించారని, యాకూబ్ మెమన్ రెండు మతాల వాళ్లనూ చంపారని ఆయన చెప్పారు. ఈ నేరాన్ని హిందూ- ముస్లిం దృక్కోణంలో చూడటం సరికాదని అన్నారు. ఒవైసీ అనవసరంగా ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. యాకూబ్ మెమన్ ముస్లిం కావడం వల్లే అతడిని ఉరి తీస్తున్నారంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.