క్షమాభిక్షపైనే మెమన్ చివరి ఆశలు
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా కోరారు. క్షమాభిక్ష పిటిషన్ ను బుధవారం సాయంత్రం హోంశాఖను పంపించారు. యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష తిరస్కరించాలని రాష్ట్రపతికి హోంశాఖ సలహా ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా రాష్ట్రపతిని కలిసి విన్నవిస్తారని సమాచారం.
హోంశాఖ సూచనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. క్షమాభిక్ష తిరస్కరిస్తే గురువారం యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష అమలు చేస్తారు. మరోవైపు రాష్ట్రపతి క్షమాభిక్షపైనే మెమన్ చివరి ఆశలు నిలుపుకున్నాడు. ఈ రాత్రికి నిర్ణయం వెలువడే అవకాశముంది.