తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. అతడి ఉరిశిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. దీంతో గురువారం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. తనకు విధించిన మరణశిక్షను అడ్డుకునేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకున్నప్పటికీ మెమన్ కు ప్రాణభిక్ష దక్కలేదు. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. రాష్ట్రపతి కూడా దాన్ని తిరస్కరిస్తే ఇక ఉరి తీయడం ఖరారవుతుంది.