యాకూబ్ మెమన్ ఉరితీతకు ఉత్తర్వులిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆకాశరామన్న ఉత్తరం ఒకటి న్యాయమూర్తికి వచ్చిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ''మీరు ఎంత భద్రత కల్పించుకున్నా సరే.. మేం మిమ్మల్ని చంపి తీరుతాం'' అని ఆ లేఖలో ఉన్నట్లు చెబుతున్నారు. ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ను జూన్ 30వ తేదీ తెల్లవారుజామున ఉరి తీసిన వెంటనే.. జస్టిస్ మిశ్రాతో పాటు ధర్మాసనంలో ఉన్న మరో ఇద్దరు న్యాయమూర్తులకు కూడా భద్రతను పెంచారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 3 గంటలకు తెరిచి.. తెల్లవారు జాము వరకు విచారణ కొనసాగించిన తర్వాత మెమన్ను ఉరి తీయాల్సిందేనని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. జస్టిస్ మిశ్రా, జస్టిస్ అమితవ్ రాయ్, జస్టిస్ ప్రఫుల్ల పంత్ ముగ్గురికి భద్రత పెంచారు.
Published Fri, Aug 7 2015 12:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement