Tiger Memon
-
టైగర్‌ను అరెస్ట్ చేశారంటూ..
కరాచీ: పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి టైగర్ మెమన్ను కరాచీలో అరెస్ట్ చేసినట్టుగా ఓ వార్త బుధవారం కాసేపు హల్చల్ చేసింది. ముంబై పేలుళ్ల కేసులో టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ మెమన్ను ఉరి తీసిన నెల రోజుల తర్వాత వెలువడ్డ ఈ వార్తకు భారతీయ మీడియా చాలా ప్రాధాన్యం ఇచ్చింది. మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకునేందుకు పాక్‌కు ఫోన్లు చేశారు. అయితే అరెస్టయిన వ్యక్తి టైగర్ మెమన్ కాదని, అతని పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడుతున్న మరో వ్యక్తి అంటూ పాకిస్థాన్ సస్పెన్షన్‌కు తెరదించింది. విషయమేంటంటే.. కరాచీలో ఫర్గన్ అనే వ్యక్తి తాను టైగర్ మెమన్ అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాల ద్వారా అమ్మాయిలను వేధించేవాడు. ఈ విషయం పోలీసులకు దృష్టికిరావడంతో ఫర్గన్ను అరెస్ట్ చేశారు. దీంతో కరాచీ పోలీసులు అసలైన టైగర్ మెమన్ను అరెస్ట్ చేశారంటూ వార్త బయటకువచ్చింది. భారత్ మీడియా ప్రతినిధులు ఈ వార్తను నిర్ధారించుకునేందుకు ఫోన్లు చేయగా పాక్ అధికారులు అసలు విషయం చెప్పారు. భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో టైగర్ మెమన్ ఉన్న సంగతి తెలిసిందే. 1993లో ముంబై పేలుళ్లలో 257 మరణానికి కారణమైన టైగర్ దేశం విడిచి దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు వచ్చి తలదాచుకుంటున్నట్టు సమాచారం. -
తమ్ముడి ఉరితీతపై రగిలిపోతున్న అన్న
-
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు
చంపుతామంటూ ఆగంతకుల లేఖ.. జడ్జి ఇంటి వద్ద భద్రత పెంపు న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో జడ్జి ఇంటి వెనుక ద్వారం గుండా ఆగంతకులు బెదిరింపు లేఖను వదిలివెళ్లారు. జడ్జిని చంపుతామంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద పోలీసుబలగాలను పెంచి భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడ పారామిలటరీ బలగాలనూ మోహరించి, మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేశారు. తనిఖీలూ చేపట్టారు. ఉగ్రవాద నిరోధక భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. 1993 ముంబై బాంబుదాడుల కేసులో మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయడం తెలిసిందే. బెదిరింపు లేఖ వదిలివెళ్లే ముందు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద ఆగంతకులు రెక్కీ చేసి ఉంటారని భావిస్తున్నారు. జడ్జి ఇంటి వెనుక దట్టమైన చెట్లు ఉండడంతో ఆగంతకుల ఛాయాచిత్రాలు సీసీటీవీల్లో రికార్డు కాలేదని చెబుతున్నారు. జస్టిస్ మిశ్రాకు గట్టి భద్రత కల్పించాలని సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు అధికారులను ఆదేశించారు. -
ప్రతీకారం తీర్చుకుంటా : టైగర్ మమన్
-
మెమన్ ఉరితీత ఉత్తర్వులిచ్చిన జడ్జికి బెదిరింపు లేఖ
-
టైగర్ మెమన్ను పీఓకేలో కలిశా
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మజీద్ శ్రీనగర్: 1993 ముంబై బాంబు పేలుళ్ల అనంతరం అదే ఏడాది టైగర్ మెమన్ను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో రెండుమూడుసార్లు కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మిలిటెంట్ ఉస్మాన్ మజీద్ శుక్రవారం తెలిపారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లోని తమ కార్యాలయానికి టైగర్ వచ్చేవాడన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం, తర్వాతి అల్లర్లకు ప్రతీకారంగానే తానీ మారణకాండకు పాల్పడినట్లు టైగర్ చెప్పాడన్నారు. పేలుళ్లకు ప్రణాళిక వేసి, ఆయుధాలు సమకూర్చి, కుట్ర అమలు చేసింది ఐఎస్ఐ అని తెలిపాడన్నారు. యాకూబ్ మెమన్ లొంగిపోయాడనే వార్త వినగానే ఐఎస్ఐ ఎక్కడ తనను చంపేస్తుందోనని టైగర్ భయపడ్డాడని మజీద్ తెలిపారు. ఐఎస్ఐ నుంచి ఇదివరకటి గౌరవం లభించకపోవడం, అనుమానంతో చూడటంతో చంపేస్తారని భయపడి టైగర్ దుబాయ్‌కి పారిపోయాడని వివరించారు. అయితే టైగర్ కూడా లొంగిపోతాడేమోనని ఐఎస్ఐ అతన్ని పాక్‌కు రప్పించుకుందన్నారు.